hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • Low Lying Placenta arrow
  • లో లయింగ్ ప్లాసెంటా (జారిపోయిన మాయ) అంటే ఏమిటి: కారణాలు, లక్షణాలు, చికిత్సా విధానం, ప్రమాద కారకాలు, ప్రయాణ ఆంక్షలు arrow

In this Article

    లో లయింగ్ ప్లాసెంటా (జారిపోయిన మాయ) అంటే ఏమిటి: కారణాలు, లక్షణాలు, చికిత్సా విధానం, ప్రమాద కారకాలు, ప్రయాణ ఆంక్షలు

    Low Lying Placenta

    లో లయింగ్ ప్లాసెంటా (జారిపోయిన మాయ) అంటే ఏమిటి: కారణాలు, లక్షణాలు, చికిత్సా విధానం, ప్రమాద కారకాలు, ప్రయాణ ఆంక్షలు

    3 November 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    ప్లాసెంటా (మాయ) అనేది స్త్రీలలో ఒక ముఖ్యమైన మరియు తాత్కాలిక అవయవం. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో బిడ్డకి అవసరమైన రక్తం మరియు ఆక్సిజన్ వంటి పోషకాలను అందిస్తుంది. ఇది పిండం నుంచి వ్యర్థాలను కూడా తొలగిస్తుంది. సాధారణంగా ప్లాసెంటాను అల్ట్రాసౌండ్ ద్వారా గర్భం ప్రారంభ రోజుల్లోనే గుర్తించవచ్చు. ప్లాసెంటా అనేది గర్భాశయ లైనింగ్​కు జత చేయబడి ఉంటుంది. ఇది అనుబంధం నుంచి ఎటూ కదలదు. గర్భం పెరిగే కొలదీ ప్లాసెంటా పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది.

    లో లయింగ్ ప్లాసెంటా అంటే ఏమిటి?

    ప్లాసెంటా అనేది యోని కింది భాగంలో గర్భాశయానికి దగ్గర్లో అటాచ్ చేయబడి ఉంటే.. దానిని లో లయింగ్ ప్లాసెంటా అని అంటారు. (శిశువు బయటకు వచ్చే గర్భాశయం దిగువ భాగం), లో లయింగ్ ప్లాసెంటా అనేది అల్ట్రాసౌండ్​లో కనుగొనబడుతుంది. గర్భం నిర్ధారణ అయిన 12 వారాల తర్వాత లో లయింగ్ ప్లాసెంటాను కనుక్కోవడానికి ట్రాన్స్​వెజైనల్ స్కానింగ్ అవసరం. అయినప్పటికీ ప్లాసెంటా తర్వాతి రోజుల్లో పైకి కదలొచ్చు. దీని వలన ప్రసవం మరియు గర్భధారణలో ఎటువంటి సమస్యలు లేవు. కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో ప్లాసెంటా అనేది గర్భాశయ ముఖద్వారాన్ని కప్పి ఉంచుతుంది. పిండం జనన మార్గాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డుకుంటుంది. ఈ పరిస్థితినే ప్లాసెంటా ప్రీవియా అని అంటారు. ప్లాసెంటా ప్రీవియా డెలివరీ సమయంలో ప్రమాదాలను కలిగిస్తుంది. గర్భాశయ గోడ ముందు భాగంలో ప్లాసెంటా స్థిరంగా ఉన్నపుడు దానిని లో లయింగ్ ప్లాసెంటా అని పిలుస్తారు. ఇదే పరిస్థితి గర్భాశయం వెనుక గోడలో కూడా సంభవిస్తే దానిని పోస్టిరియర్ అని అంటారు. ఇటువంటి సందర్భాల్లో వైద్యులు మీకు గర్భధారణ జర్నీలో సహాయం చేస్తారు. చాలా అధ్యయనాల ప్రకారం లో లయింగ్ ప్లాసెంటా సంభవిస్తే మగ శిశువు అని అర్థం.

    లో లయింగ్ ప్లాసెంటాకు గల కారణాలు ఏమిటి?

    వివిధ కారణాల వల్ల లో లయింగ్ ప్లాసెంటా ఏర్పడుతుంది.

    ● గర్భవతిగా ఉన్న సమయంలో పొగ తాగడం, డ్రగ్స్ తీసుకోవడం వలన లో లయింగ్ ప్లాసెంటా ఏర్పడే అవకాశం ఉంది.

    ● గర్భాశయ అవయవాలలో మరియు చుట్టుపక్కల ముఖ్యమైన శస్త్రచికిత్సలు ప్లాసెంటాను ప్రభావితం చెయ్యవచ్చు.

    Article continues below advertisment

    ● 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వ్యక్తులు గర్భధారణ సమయంలో ప్లాసెంటాను కలిగి ఉండవచ్చు.

    ● గతంలో గర్భస్రావం (మిస్ క్యారేజ్) సంభవించినపుడు ప్లాసెంటా ఏర్పడవచ్చు.

    ● అంతకు ముందు బిడ్డ సిజేరియన్ ద్వారా జన్మనిచ్చినపుడు తర్వాత గర్భధారణ సమయాల్లో ఇటువంటి సమస్యలు రావొచ్చు.

    ● గర్భం దాల్చేందుకు ఫర్టిలిటీ చికిత్సలు (ఇన్​ –విట్రో ఫర్టిలైజేషన్ మొదలైనవి) ఈ పరిస్థితి యొక్క అవకాశాలను ప్రభావితం చెయొచ్చు.

    ● తల్లి రెండవసారి గర్భవతిగా ఉన్నా లేదా ట్విన్స్​ను కలిగి ఉన్నా లేదా రెండు పిండాలు ఉన్నా కానీ ప్లాసెంటా ఉండే అవకాశం ఉంటుంది.

    Article continues below advertisment

    గర్భధారణ సమయంలో ఈ పరిస్థితి ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. కిందికి లో లయింగ్ ప్లాసెంటాను మేనేజ్ చేసుకోవచ్చు(నిర్వహించుకోవచ్చు). ప్లాసెంటా గురించి, చికిత్స గురించి మరింత తెలుసుకునేందుకు మీరు మీ వైద్యుడిని సంప్రదించవచ్చు.

    లో లయింగ్ ప్లాసెంటా లక్షణాలు ఏమిటి?

    లో లయింగ్ ప్లాసెంటా కింది లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ లక్షణాలలో ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు కనిపిస్తే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

    ● గర్భధారణ ప్రారంభ రోజుల్లో తీవ్ర ఇబ్బంది కలగడం గర్భధారణ సంకేతం కావచ్చు. రక్తస్రావం అనేది రెండు, మూడవ త్రైమాసికాల్లో కూడా కొనసాగితే అయితే ఇది ప్లాసెంటా ప్రీవియాకు సంకేతం.

    ● గర్భం లోపల ఉన్న శిశువు సాధారణంగా మూడో త్రైమాసికంలో (30 నుంచి 34 వారాల మధ్యలో) నిమగ్నమై (బిజీ, ఎంగేజ్​) ఉంటుంది. కానీ లో లయింగ్ ప్లాసెంటాతో ఉన్న తల్లుల శిశువులు ఎప్పటికీ అసౌకర్యంగానే ఉంటారు. ముందు వారాల్లో ఉన్నట్లుగా.

    ● రుతుక్రమం సమయంలో అసౌకర్యంగా అనిపించే తిమ్మిర్లు తరచూ వస్తుంటాయి. దీనితో పాటుగా రక్తస్రావం కూడా జరుగుతుంది.

    Article continues below advertisment

    ● గర్భధారణ సమయంలో మీ బ్లడ్, షుగర్ లెవల్స్​ను మానిటర్ చేయడం చాలా అవసరం. తక్కువ ప్లాసెంటల్ స్థానాల్ని కలిగి ఉన్న స్త్రీలు ఎక్కువ బీపీని (ప్రీ క్లాంప్సియా) అనుభవిస్తారు.

    లో లయింగ్ ప్లాసెంటా ప్రమాద కారకాలు ఏమిటి?

    లో లయింగ్ ప్లాసెంటా ప్రమాదకారకాలు

    ● నెలలు నిండకుండానే శిశువులకు జన్మనివ్వడం

    ● శిశువుల పెరుగుదల తక్కువగా ఉండొచ్చు.. లేదా వారు పుట్టుకతోనే వైకల్యంతో ఉండొచ్చు.

    ● అదనంగా తల్లి కొన్నిసార్లు తీవ్రమైన రక్తస్రావాన్ని అనుభవించొచ్చు. ఇది గర్భాశయ చికిత్స(తల్లి గర్భం నుంచి శిశువును తొలగించడం) జరగొచ్చు.

    Article continues below advertisment

    ● కొన్నిసార్లు ఇంటర్నల్ Os (గర్భాశయ మధ్యభాగం) కి దగ్గరగా ఉంటుంది. అందువల్ల ప్రసవం కష్టతరమవుతుంది.

    ● లో లయింగ్ ప్లాసెంటా వలన వచ్చే మరో ప్రమాదం ఏమిటంటే తల్లికి ఎక్కువగా ఆందోళన ఉండవచ్చు మరియు తను ప్రొసీజర్లకు సహకరించలేకపోవచ్చు.

    లో లయింగ్ ప్లాసెంటాకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి ప్రయాణ పరిమితులు పాటించాలి?

    వైద్యులు మరియు మందులు ( మెడికేషన్స్) అనేవి ప్లాసెంటా సంభవించకుండా నిరోధించలేనప్పటికీ వారి సూచనలతో పిండం మరియు తల్లి సురక్షితంగా ఉంటారు. సురక్షిత ప్రసవం పొందుతారు.

    ● వైద్యులు కూడా ప్రసవ సమయంలో రక్తమార్పిడి కోసం సిద్ధం అయి ఏర్పాట్లు చేసుకుని ఉంటారు.

    ● ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు హెల్తీ లైఫ్ స్టైల్​ను కలిగి ఉండడం వలన ప్రెగ్నెన్సీ సమయంలో రక్తహీనతను నివారించవచ్చు.

    Article continues below advertisment

    ● కలయిక తర్వాత రక్తస్రావం అవుతున్నట్లు అనిపిస్తే మిమ్మల్ని కలయికకు దూరంగా ఉండమని మీ వైద్యుడు సలహా చేయవచ్చు.

    ● ఎక్కువ అలసట కలిగించే వ్యాయామాలకు దూరంగా ఉండడం, రోజూవారీగా చెక్ చేసుకోవడం వలన మీరు ఎల్లప్పుడూ పాజిటివ్​గా ఉంటారు.

    ● లో లయింగ్ ప్లాసెంటాతో ప్రయాణాలను తగ్గించుకోవడం తెలివైన పని. విమాన ప్రయాణాలను కూడా మానుకోండి.

    ● 32 వారాల తర్వాత ఇతర మార్గాల్లో సుదూర ప్రయాణాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.

    ● ప్లాసెంటా ప్రీవియా ప్రభావాలను ఎదుర్కొనేందుకు మీరు ఎంత సేపు విశ్రాంతి (బెడ్ రెస్ట్) తీసుకోవాలో మీ డాక్టర్ మీకు తెలియజేస్తారు.

    Article continues below advertisment

    ● ఒక వేళ ప్లాసెంటా ఎడమ వైపుకు ఉంటే మీరు కుడివైపుకు పడుకోవాలని వైద్యులు సూచిస్తారు. ఇలా చేయడం వలన సిరలపై ఒత్తిడి ఉండదని మెరుగైన రక్తసరఫరా ఉంటుందని సజెస్ట్ చేస్తారు.

    ● లో లయింగ్ ప్లాసెంటా ఉన్న వారికి కూర్చొనే స్థానానికి సంబంధించి ఎటువంటి పరిమితులు లేవు. కానీ ఎక్కువ సేపు కూర్చోవడం తగ్గించుకుంటే మంచిది.

    లో లయింగ్ ప్లాసెంటాకు ఉన్న చికిత్సలు ఏమిటి?

    మీరు తరచూ స్కాన్​ల కోసం ఆసుపత్రిని సందర్శించాల్సిందిగా అభ్యర్థించబడతారు. ఉదాహరణకు మీ అల్ట్రాసౌండ్ 20 వారాలకు తక్కువగా ఉన్న ప్లాసెంటాను చూపిస్తే మరలా మీరు 32 వారాలకు స్కానింగ్ కోసం షెడ్యూల్ చేయబడతారు. 36 వారాల్లో కూడా మీ గర్భాశయ మూసుకుపోయిన ( బ్లాకేజ్) సమస్యలు కనిపిస్తే మీకు చాలా ముందుగానే డెలివరీ చేసేందుకు డాక్టర్ ప్లాన్ చేస్తారు. ఇది తల్లి మరియు పిండం భద్రతను నిర్ణయిస్తుంది. ఒక వేళ మీకు ప్రసవం ముందుగా జరిగితే పిండం ఊపిరితిత్తుల పరిపక్వతకు సహాయపడేందుకు మీకు 34 వారాల సమయంలో స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఇస్తారు.

    కొన్నిసార్లు విషయాలు మనం ముందుగా ప్లాన్ చేసుకున్న విధంగా జరగవు. డెలివరీకి ముందు అధిక రక్తస్రావం జరిగినపుడు తదుపరి ప్రమాదాలను నివారించేందుకు డాక్టర్ మీకు C-సెక్షన్ డెలివరీని రెఫర్ చేయొచ్చు. లో లయింగ్ ప్లాసెంటాకు స్థిరమైన పర్యవేక్షణ అవసరం. కావున మీరు మీ స్కానింగ్​లను మరియు డాక్టర్ సంప్రదింపులను మానేయకూడదు. మీ శిశువు ఆరోగ్యం గురించి మరింత తెలుసుకునేందుకు మీ డాక్టర్​ను ప్రశ్నలు అడగండి. ముందస్తు రోగనిర్ధారణ మరియు సరైన వైద్యనిర్ణయాలతో మీరు ఆరోగ్యమైన ప్రసవాన్ని పొందొచ్చు.

    సారాంశం

    ● కిందికి జారిపోయిన మాయ అనేది గర్భాశయం దిగువన యోనిని కప్పి ఉంచుతుంది.

    Article continues below advertisment

    ● ఇది పొగతాగడం లేదా డ్రగ్స్, గర్భస్రావం లేదా ముసలి వయసులో గర్భధారణ పొందడం వలన ఏర్పడుతుంది.

    ● చాలా సందర్భాల్లో 30 వారాల గర్భధారణ తర్వాత మాయ అనేది అనుకూలంగా మారొచ్చు.

    ● మూడో త్రైమాసికంలో మాయ కిందకు జారిపోయి ఉన్నట్లయితే అది రక్తస్రావం, ప్రసవంలో ఇబ్బంది, అకాల ప్రసవాలకు కారణం అవుతుంది.

    ● అటువంటి సందర్భాలలో వైద్యులు ముందుగా లేదా సిజేరియన్ ప్రసవాన్ని సిఫారసు చేయవచ్చు.

    ● ఆరోగ్యకరమైన జీవన విధానం, తరచూ హెల్త్ చెకప్ లు చేయించుకోవడం, గర్భధారణ సమయాల్లో ప్రయాణ పరిమితులను గురించి గుర్తుంచుకోవడం చాలా అవసరం.

    Article continues below advertisment

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.