hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article continues after adveritsment

  • Home arrow
  • Pregnancy Journey arrow
  • స్ట్రెచ్ మార్క్స్(చర్మంపై చారలు): అవి ఎందుకు కనిపిస్తాయి.. వాటిని ఎలా వదిలించుకోవాలి? (Reason behind Stretch marks & How to cure them?) arrow

In this Article

    స్ట్రెచ్ మార్క్స్(చర్మంపై చారలు): అవి ఎందుకు కనిపిస్తాయి.. వాటిని ఎలా వదిలించుకోవాలి? (Reason behind Stretch marks & How to cure them?)

    Pregnancy Journey

    స్ట్రెచ్ మార్క్స్(చర్మంపై చారలు): అవి ఎందుకు కనిపిస్తాయి.. వాటిని ఎలా వదిలించుకోవాలి? (Reason behind Stretch marks & How to cure them?)

    3 November 2023 న నవీకరించబడింది

    Article continues after adveritsment

    స్ట్రెచ్ మార్క్స్ ఉండటం సర్వసాధారణం! దాదాపు అందరు మహిళలు గర్భధారణ సమయంలో స్ట్రెచ్ మార్క్స్ పొందుతారు. ఈ చర్మం చిట్లిన గుర్తులు హాని చేయనివి. కొ౦తమ౦ది స్త్రీలు వాటిని గౌరవానికి చిహ్నంగా భావిస్తారు. అవి తాము గర్భం ధరించడం ద్వారా తమ శరీరాలు ఎలా మారిపోయాయో సూచిస్తాయి. మరికొ౦త మ౦దికి అవి వికారంగా ఉ౦డవచ్చు. ఈ ఆర్టికల్‎లో స్ట్రెచ్ మార్క్స్‎కు కారణాలు ఏమిటి? గర్భధారణలో స్ట్రెచ్ మార్క్స్‎, నొప్పి, దురదను తగ్గించడానికి ఉత్తమ పద్ధతులు, అలాగే టిప్స్ ఏమిటో మీరు తెలుసుకుంటారు.

    విషయసూచిక పట్టిక

    1. స్ట్రెచ్ మార్క్స్: కనిపించడం, కారణాలు

    2. ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ గురించి 7 వాస్తవాలు

    3. ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ వల్ల కలిగే నొప్పి, దురదను ఎలా తగ్గించాలి

    4. స్ట్రెచ్ మార్క్స్ ను మీరు ఎలా వదిలించుకోవచ్చు?

    5. స్ట్రెచ్ మార్క్స్ లైటనింగ్ క్రీమ్ కోసం ఏ సహజ ఉత్పత్తులను చూడాలి?

    6. స్ట్రెచ్ మార్క్స్ చికిత్సకు సరైన సమయం మరియు సరైన మార్గం ఏమిటి?

    7. గర్భధారణ సమయంలో స్ట్రెచ్ మార్క్స్‌ని నిరోధించడానికి మరియు చికిత్స చేయడానికి ప్రయత్నించేటప్పుడు పాటించాల్సిన టాప్ 11 టిప్స్

    8. ముగింపు

    స్ట్రెచ్ మార్క్స్: కనిపించడం, అందుకు కారణాలు (Reason behind the stretch marks in telugu)

    ఆకస్మిక పెరుగుదల, బరువు తగ్గడం లేదా బరువు పెరగడం సంభవించే ఏదైనా శరీర భాగంలో స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ ఒక సాధారణ సమస్య. పురుషులు, మహిళలు లేదా టీనేజర్లతో సహా ఎవరైనా దీనిని ఎదుర్కోవచ్చు. గర్భధారణ సమయంలో చర్మం ఎదుగుతున్న గర్భాశయంతో సర్దుబాటు చేసుకోలేనప్పుడు మరియు అదే స్థాయిలో సాగదీతకు గురైనప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. దీని వల్ల చర్మంలోని కణజాలం, కొలాజెన్ చిరిగిపోయి స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. ఇంకా గర్భధారణ హార్మోన్లు చర్మంలోని ఫైబర్‌ను బలహీనపరుస్తాయి. ఇది స్ట్రెచ్ మార్క్స్‎ రావడానికి కారణమవుతుంది.

    స్ట్రెచ్ మార్క్స్ చూడటానికి కచ్చితంగా ఎలా కనిపిస్తాయి? (How do stretch marks appear on skin)

    స్ట్రెచ్ మార్ప్స్ సాధారణంగా చేతులు, మొండెం, రొమ్ములు, కడుపు, పిరుదులు మరియు తొడలపై ఎరుపు, తెలుపు లేదా ఊదారంగు చారల నెట్‌వర్క్ మాదిరి కనిపిస్తాయి.

    గర్భధారణ సమయంలో అవి ఎప్పుడు కనిపిస్తాయి? (When do stretch marks appear during pregnancy in telugu)

    గర్భధారణ యొక్క 13 మరియు 21 వారాల మధ్య ఇవి కనిపించడం ప్రారంభిస్తాయి. ఫెయిర్ స్కిన్ ఉన్న మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అవి జన్యుపరంగా కూడా ఉండవచ్చు. అంటే మీ తల్లికి అవి ఉంటే మీకు కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

    ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ గురించి 7 వాస్తవాలు (7 facts about stretch marks in telugu)

    స్ట్రెచ్ మార్క్స్ విభిన్న వ్యక్తులకు విభిన్నంగా ఉండవచ్చు. స్ట్రెచ్ మార్క్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాలు ఇక్కడ పొందుపరిచాం.

    1. స్ట్రెచ్ మార్క్స్ ఉండటానికి మీరు అధిక బరువుతో ఉండాల్సిన అవసరం లేదు: పెరుగుతున్న బొడ్డు పరిమాణం కారణంగా ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి. గర్భవతిగా ఉన్నప్పుడు మీ శరీర బరువుతో దీనికి ఎటువంటి సంబంధం లేదు.

    2. స్ట్రెచ్ మార్క్స్ జన్యుపరమైనవి: గర్భధారణ సమయంలో మీ తల్లికి స్ట్రెచ్ మార్క్స్ ఉన్నట్లయితే, అప్పుడు మీకు కూడా స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది వంశపారంపర్యంగా వస్తుంది.

    3. గర్భధారణ స్ట్రెచ్ మార్క్స్ ఇతర శరీర భాగాలకు వ్యాపించవు: స్ట్రెచ్ మార్క్స్ అంటువ్యాధి కాదు. అవి ఎక్కడ ఉన్నాయో అక్కడ కాకుండా మరే ఇతర శరీర భాగాలకు వ్యాపించవు. అయినప్పటికీ పెరుగుతున్న బొడ్డు పరిమాణంతో అవి తీవ్రంగా మారవచ్చు. అవి కనిపించడం పెరగవచ్చు.

    4. స్ట్రెచ్ మార్క్స్ విభిన్న వ్యక్తులకు విభిన్నంగా కనిపిస్తాయి: స్ట్రెచ్ మార్క్స్ యొక్క రూపం వ్యక్తికి వ్యక్తికి మారవచ్చు. కొంతమందికి మెరూన్ లేదా పర్పుల్ వంటి ముదురు రంగు స్ట్రెచ్ మార్క్స్ ఉండవచ్చు. తేలికపాటి స్కిన్ టోన్‎కు ఇది భిన్నంగా ఉంటుంది.

    5. స్ట్రెచ్ మార్క్స్‎ను నివారించవచ్చు:

    ప్రభావం చూపించే నివారణలు మరియు ఉత్పత్తులతో గర్భధారణ సమయంలో స్ట్రెచ్ మార్క్స్ కనిపించకుండా మీరు నిరోధించవచ్చు. మయిలో స్టోర్‎లో స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ ప్రొడక్ట్‎ల యొక్క ప్రత్యేక శ్రేణి ఉంది.

    6. స్ట్రెచ్ మార్క్స్ నెమ్మదిగా మాయమవుతాయి: మీరు ఆయిల్ మసాజ్‎లను క్రమం తప్పకుండా చేస్తుంటే స్ట్రెచ్ మార్క్స్ చివరికి క్రమంగా మాయమవుతాయి. మీరు స్ట్రెచ్ మార్క్స్ తొలగింపు విధానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తే, సెల్ రెన్యువల్ మరియు రీజనరేషన్ మీ స్ట్రెచ్ మార్క్స్‎ని పోగొడుతుంది.

    7. ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ రాత్రికి రాత్రే పోవు: మీరు మీ స్ట్రెచ్ మార్క్స్‎ని పోగొట్టడానికి శ్రమించాల్సి ఉంటుంది. ఇది రాత్రికి రాత్రి జరగదు. కాబట్టి ఓపికగా ఉండండి. అలాగే రొటీన్‎గా ఫాలో అవ్వండి.

    స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అప్లై చేస్తూ ప్రభావిత ప్రాంతంలో మీరు దానిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే సహాయపడుతుంది. మయిలో కేర్ స్ట్రెచ్ మార్క్స్ డే & నైట్ కిట్ స్ట్రెచ్ మార్క్స్ ని పోగొట్టడానికి ఒక గొప్ప ఎంపిక. ఈ ప్రత్యేకమైన శ్రేణి ఉత్పత్తులు షియా బటర్, సీ బక్‌థార్న్ ఆయిల్, ఎసెన్షియల్ బటర్ మరియు ఆయిల్స్‌తో కూడి ఉంటాయి. వీటి వల్ల పొడి చర్మం తేమగా ఉండడానికి, దురద నుండి ఉపశమనం కలగడానికి, స్ట్రెచ్ మార్క్స్ నివారించడానికి మరియు వాటిని పోగొట్టడానికి వీలవుతుంది.

    ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ వల్ల కలిగే నొప్పి, దురదను మీరు ఎలా తగ్గించవచ్చో చూద్దాం..

    స్ట్రెచ్ మార్క్స్ హానికరం కానప్పటికీ, అలాగే నొప్పిని కలిగించనప్పటికీ.. ప్రభావిత ప్రాంతం పొడిగా మారుతుంది. గీతలు కూడా పడతాయి. మీకు సహాయపడటం కోసం స్ట్రెచ్ మార్క్స్ చుట్టూ దురద మరియు నొప్పిని నిరోధించే కొన్ని నివారణలను మేం పొందుపరిచాం:

    1. ఓట్ మీల్ బాత్ (Oat meal bath):

    ఓట్ మీల్ బాత్ మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే మీ చర్మం యొక్క సహజ నూనెలు పునరుద్ధరించబడేలా చేస్తుంది. అవి దురద నుండి ఉపశమనం ఇస్తాయి. మీ చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‎గా మారుస్తాయి. అలాగే స్నానం చేసేటప్పుడు ఓట్ మీల్ మీ చర్మానికి పోషణను అందిస్తుంది.

    2. ఆయిల్ మసాజ్‎లు (Oil massages):

    ఆయుర్వేద మరియు నేచురల్ నూనెలతో ప్రభావిత ప్రాంతాన్ని మసాజ్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. దాని చుట్టూ ఉన్న దురద పోవడానికి, పొడిబారకుండా ఉండటానికి స్ట్రెచ్ మార్క్స్‎ను మసాజ్ చేయడానికి కొబ్బరి నూనెను ఉపయోగించండి. కొబ్బరినూనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి బాగా ప్రసిద్ధి చెందింది.

    పొడిబారడం కూడా నొప్పిని ప్రేరేపిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్‎ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి దురదను తగ్గించడంలో సహాయపడతాయి. మయిలో కేర్ స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్ అనేది కొబ్బరి నూనె, సీ బ‌క్‌థార్న్ ఆయిల్, అర్గన్ ఆయిల్ మరియు అనేక ఇతర పోషకాలతో సమృద్ధంగా ఉంటుంది. ఇది మీ చర్మం సాగదీయకుండా మరియు దురదకు కారణం కాకుండా నిరోధిస్తుంది.

    3. స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ (Stretch marks cream)

    స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ స్ట్రెచ్ మార్క్స్ యొక్క రూపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మ కణజాలాలను నయం చేయడానికి, పోషణనివ్వడానికి మరియు మరమ్మత్తు చేయడానికి కూడా సహాయపడుతుంది. స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్‎ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం స్థితిస్థాపకత (ఎలాస్టిసిటి)ని మెరుగుపరుస్తుంది. అలాగే చర్మం యొక్క మెరుపును ప్రమోట్ చేయడంలో సహాయపడుతుంది.

    మయిలో నుంచి మీరు స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్‎ని పొందవచ్చు, ఎందుకంటే ఇది 100% సహజమైనది మరియు సమర్థవంతమైనది. ఇది శక్తివంతమైన మరియు సమర్థవంతమైన ఫార్ములాతో సుసంపన్నమై ఉంది. ఇది గర్భధారణ సమయంలో మరియు మీ బిడ్డ పుట్టిన తరువాత కూడా ఉపయోగించడానికి పూర్తిగా సురక్షితం. అయితే ఫలితాలు రావాలంటే మీరు స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్‎ని క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి!

    4. సున్నితంగా శుభ్రపరచడం (Sensitive Cleaning)

    గర్భధారణ సమయంలో, మరీ ముఖ్యంగా మీ స్ట్రెచ్ మార్క్స్‎పై మీ చర్మాన్ని శుభ్రం చేయడం కోసం తేలికపాటి మరియు సున్నితమైన క్లెన్సర్‎ని ఉపయోగించండి. కఠినమైన క్లెన్సర్ మీ స్ట్రెచ్ మార్క్స్‎ని పొడిగా చేస్తుంది. పొడిబారడం వల్ల నొప్పి మరియు దురద వస్తుంది.

    స్ట్రెచ్ మార్క్స్ నుండి ఉపశమనం పొందడానికి మీరు ఏ నివారణి ప్రయత్నించినా, దానినే చేస్తూ ఉండండి. ఉత్తమ ఫలితాలను పొందడానికి, స్ట్రెచ్ మార్క్ దురద మరియు నొప్పి నుండి తొందరగా ఉపశమనం పొందడానికి సాధ్యమైనంత తరచుగా ఉపయోగించండి.

    స్ట్రెచ్ మార్క్స్‎ని మీరు ఎలా వదిలించుకోవచ్చు? (How to get rid off stretch marks in telugu)

    స్ట్రెచ్ మార్క్స్ అదృశ్యం కావు, కానీ సరైన సురక్షిత మరియు సహజ ఉత్పత్తి సహాయంతో కాలక్రమేణా తేలికపడతాయి. మయిలో స్టోర్‌లో ఉన్న క్రీమ్ లాంటి సమర్థవంతమైన స్ట్రెచ్ మార్క్స్ అండ్ స్కార్ లైటనింగ్ క్రీమ్ చర్మానికి పోషణను అందిస్తుంది. అలాగే నయం చేస్తుంది. మరియు రిపేర్ చేస్తుంది. దాని స్థితిస్థాపకత (ఎలాస్టిసిటి)ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా పొడి, దురద చర్మం నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే స్ట్రెచ్ మార్క్స్ క్రమంగా తేలికై అస్పష్టమవడం గమనించవచ్చు.

    స్ట్రెచ్ మార్క్స్ లైటనింగ్ క్రీమ్ కోసం ఏ సహజ ఉత్పత్తులను చూడాలి? (Natural sources for stretch mark lightening cream)

    ఎఫెక్టివ్ స్ట్రెచ్ మార్క్స్ లైటనింగ్ క్రీమ్ అన్ని లేదా కొబ్బరి నూనె వంటి సహజ పదార్ధాల కలయికతో తయారవుతుంది. ఇది చర్మంపై చారల గుర్తులను క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్న షియా బటర్, ఇది చర్మ మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. మరియు కోకుమ్ యొక్క సహజ సారం కొలాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. మరియు ఈ ప్రక్రియలో దానిని నయం చేస్తుంది. మీ చర్మం మచ్చలు, స్ట్రెచ్ మార్క్స్ మరియు దురదను ఎదుర్కోవడంలో సహాయపడటం కోసం కోకుమ్, షియా బటర్, కొబ్బరి నూనె మరియు ఇతర ముఖ్యమైన పోషకాల యొక్క సుగుణాలతో సమృద్ధమైన మయిలో స్టోర్‌లో మయిలో కేర్ స్ట్రెచ్ మార్క్స్ అండ్ స్కార్ లైటనింగ్ క్రీమ్‎ని కొనుగోలు చేయండి.

    స్ట్రెచ్ మార్క్స్‎కి చికిత్స చేయడానికి సరైన సమయం, సరైన మార్గం ఏమిటి? (Best time to treat stretch marks)

    ఇతర విషయాల మాదిరిగానే, స్ట్రెచ్ మార్క్స్ కూడా జీవిత చక్రాన్ని కలిగి ఉంటాయి. అవి కనిపించడం ప్రారంభమైనప్పుడే చికిత్స చేయడం సులభం. కాబట్టి మీరు వాటిని గమనించిన వెంటనే చికిత్స చేయడం చాలా అవసరం. సాధ్యమైనంత వరకు వాటిని నివారించడానికి గర్భధారణ యొక్క 13 వ వారం నుండి స్ట్రెచ్ మార్క్స్ లైటనింగ్ క్రీమ్‎ను అప్లై చేయాలి. స్ట్రెచ్ మార్క్స్ కనిపించే ప్రాంతంపై మీ కోసం మీరు ఎంచుకున్న స్ట్రెచ్ మార్క్స్ లైటనింగ్ క్రీమ్‎ని కావాల్సినంత రోజుకు రెండుసార్లు అప్లై చేయండి. ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఆ గుర్తులు కనిపించకుండా నిరోధిస్తుంది.

    గర్భధారణ సమయంలో స్ట్రెచ్ మార్క్స్‎ని నిరోధించడానికి, చికిత్స చేయడానికి ప్రయత్నించేటప్పుడు పాటించాల్సిన టాప్ 11 టిప్స్

    ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్‎కు ఎలా మరియు ఎప్పుడు చికిత్స చేయాలో మీకు తెలిసినప్పుడు, స్ట్రెచ్ మార్క్స్‎ని నివారించడం మరియు చికిత్స చేయడంలో సహాయపడటానికి గర్భధారణ సమయంలో ఫాలో అవ్వాల్సిన ఈ 11 టిప్స్‎ని నోట్ చేసుకోండి:

    1. గర్భధారణ సమయంలో స్ట్రెచ్ మార్క్స్ నివారించడంలో సహాయపడటం కోసం ప్రతిరోజూ మయిలో కేర్ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అప్లై చేయండి. దీనిలో షియా బటర్, కుంకుమపువ్వు, కొబ్బరి నూనె, కోకుమ్ ఉన్నాయి. ఇవి చర్మానికి పోషణ అందించడం, నయం చేయడం, మరమ్మత్తు చేయడం చేస్తాయి. స్ట్రెచ్ మార్క్స్‎ని తగ్గించడానికి సహాయపడతాయి.

    2. ధన్వంతరం ఆయిల్ మసాజ్ కూడా స్ట్రెచ్ మార్క్స్‎ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది నువ్వులు, చందనం, ఉసిరికాయ, ఆవు పాలు మరియు అశ్వగంధను కలిగి ఉంటుంది. ఇవి మీ చర్మానికి సురక్షితమైనవి మరియు అద్భుతమైనవి.

    3. అలోవెరా జెల్‎ని క్రమం తప్పకుండా అప్లై చేయడం.. మీ శరీరంలోని ప్రభావిత ప్రాంతాన్ని ఉపశమనం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్ట్రెచ్ మార్క్స్‎కు పోషణ అందించడంలో, పొడిబారడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

    4. స్ట్రెచ్ మార్క్స్ రూపాన్ని తగ్గించడానికి విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినండి.

    5. చక్కెర మరియు నిమ్మరసం స్క్రబ్ కూడా స్ట్రెచ్ మార్క్స్‎ను తగ్గిస్తాయి. అలాగే మీ చర్మాన్ని సమం చేస్తాయి.

    6. గర్భధారణ సమయంలో హైడ్రేటెడ్‎గా ఉండటం అనేది మీ చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

    7. మీ బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల గర్భధారణ సమయంలో మీరు స్ట్రెచ్ మార్క్స్‎ని పొందకుండా చూసుకుంటారు.

    8. సహజ పదార్థాలతో తయారు చేసిన సున్నితమైన మరియు తేలికపాటి మాయిశ్చరైజర్‎తో ప్రతిరోజూ మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయండి.

    9. స్ట్రెచ్ మార్క్స్ రూపాన్ని తేలికపరచడానికి ప్రభావిత ప్రాంతంలో కాఫీ స్క్రబ్ ఉపయోగించండి.

    10. జింక్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోండి. ఎందుకంటే అవి చర్మం హీల్ అవడాన్ని పెంచుతాయి. అలాగే మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

    11. బంగాళాదుంప రసాన్ని అప్లై చేయడం వల్ల గర్భధారణ సమయంలో చర్మంపై మార్క్స్ మరియు మచ్చలను తేలికపరచవచ్చు.

    ముగింపు (Conclusion)

    గర్భధారణ సమయంలో స్ట్రెచ్ మార్క్స్ సాధారణం. మీరు వాటిని సులభంగా వదిలించుకోవచ్చు. ఈ నివారణలను క్రమం తప్పకుండా అనుసరిస్తే మీరు స్ట్రెచ్ మార్క్స్‎కి గుడ్ బై చెప్పవచ్చు.

    అన్ని రకాల స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ క్రీమ్‎లు, ఆయిల్స్, బటర్ మరియు కాంబోల కొరకు మయిలో స్టోర్‌లో చూడండి.

    Tags:

    What are stretch marks in telugu, stretch marks cream in telugu, Treatment for stretch marks in telugu, Stretchmarks during pregnancy in telugu, Get rid off stretch marks in telugu, Pregnancy stretch marks in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.