Scans & Tests
25 July 2023 న నవీకరించబడింది
మీరు గర్భవతిగా ఉన్నపుడు లేదా మీకు తెలిసిన వారు గర్భవతి అయినపుడు ఫెటల్ డాప్లర్ స్కాన్ అనే పదాన్ని వింటూ ఉంటారు. ప్రతి గర్భవతి పరిస్థితులు వేరుగా ఉంటాయని మనందరికీ తెలుసు. ఒక స్త్రీ ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వాలంటే గర్భధారణ సమయంలో ఎన్నో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో శిశువు పెరుగుదలను తనిఖీ చేసేందుకు వైద్యులు తరుచుగా డాప్లర్ స్కాన్ నివేదికను అడుగుతారు. గర్భధారణ సమయంలో చేసే ఈ డాప్లర్ స్కాన్ అంటే ఏమిటో మనలో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఈ స్కాన్ చేయించుకోమని వైద్యులు చెప్పినపుడు మనం అయోమయంలో పడతాం. మిమ్మల్ని మరింత అయోమయంలో పడేసేలా దీని మీద పుకార్లు కూడా ఉన్నాయి. ఈ ఆర్టికల్ గర్భధారణ సమయంలో డాప్లర్ స్కాన్ గురించి ప్రతి ఆంశం వివరిస్తుంది. కాబట్టి దీనిని పూర్తిగా చదవండి.
డాప్లర్ స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్‌తో సమానంగా ఉంటుంది. ఇది రక్తప్రవాహ దిశతో పాటు వేగాన్ని కూడా సరిగ్గా గుర్తించేందుకు అధిక పౌన:పున్యం (హై ఫ్రీక్వెన్సీ) గల తరంగాలను ఉపయోగించుకుంటుంది. పిండం ఎదుగుదల సరిగ్గా ఉందో? లేదో? కణజాలాలు తగినంత రక్తాన్ని పోషక విలువలను చేరవేస్తున్నాయా? లేదా? అని దీని ద్వారా తనిఖీ చేస్తారు. ఈ పరికరం కణజాలాలు, ఎముకలను బౌన్స్ చేసి అల్ట్రాసౌండ్ను జెనరేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం మైక్రోఫోన్ ద్వారా రికార్డ్ అవుతుంది. ఈ ప్రక్రియ నొప్పి లేకుండా ఉంటుంది. చేతిలో ట్రాన్స్‌డ్యూసర్ అనే మిషన్‌ను చేతిలో పట్టుకుని వైద్యులు ఈ స్కాన్ చేస్తారు. ఈ ప్రక్రియలో ఒక జెల్‌ను బొడ్డు ప్రాంతం మీద రాస్తారు. తర్వాత జెల్ రాసిన ప్రాంతంలో ట్రాన్స్‌డ్యూసర్ పట్టుకుని నెమ్మదిగా ప్రెస్ చేస్తారు. సాధారణంగా చేసే అల్ట్రాసౌండ్ స్కాన్‌తో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది. కలర్ డాప్లర్ స్కాన్ రక్తనాళాల్లో ప్రవాహాన్ని గుర్తించడం, రక్తప్రవాహ వేగాన్ని అంచనా వేయడం, రక్తప్రవాహ దిశను గుర్తించడం, రక్తం గడ్డలను గుర్తించడం, వంటి వాటిల్లో ప్రభావవంతంగా పని చేస్తుంది. నేటి రోజుల్లో అల్ట్రాసౌండ్ పరికరాలు డాప్లర్ ఫీచర్‌తో వస్తున్నాయి. వీటితో అల్ట్రాసౌండ్ స్కాన్, డాప్లర్ స్కాన్ రెండూ నిర్వహిస్తారు.
వివిధ రకాల డాప్లర్ స్కాన్స్ ఉన్నాయి. రోగుల శారీరక స్థితి, వారి గత ఆరోగ్య చరిత్ర ప్రకారంగా వైద్యులు రోగులకు వివిధ రకాల డాప్లర్ స్కాన్లను సూచిస్తారు. ఏమి గుర్తించాలనే విషయంపై ఆధారపడి సూచించే మూడు రకాల డాప్లర్ స్కాన్లు ఉన్నాయి. అవి..
ఈ ప్రక్రియలో రక్తప్రవాహం అధిక వేగాన్ని ఖచ్చితంగా కొలవడానికి నిరంతర ప్రసారాన్ని, అల్ట్రాసౌండ్ తరంగాల స్వీకరణను ఉపయోగిస్తుంది. కానీ అది రక్తప్రవాహం దిశను లేదా రక్తప్రవాహం స్థానాన్నిగుర్తించదు. ఇది కేవలం వేగాన్ని మాత్రమే కొలుస్తుంది. ఈ డాప్లర్ స్కాన్‌ను గర్భధారణ సమయంలో ఎక్కువగా సజెస్ట్ చేస్తారు.
ఇది చుట్టు పక్కల అవయవాలతో పాటుగా రక్తనాళాల చిత్రాన్ని కూడా రూపొందిస్తుంది. అదే సమయంలో ఇది రక్తప్రవాహం వేగాన్ని కూడా కొలుస్తుంది.
కలర్ డాప్లర్ స్కాన్ డూప్లెక్స్ డాప్లర్ స్కాన్‌తో సమాన పోలికలను కలిగి ఉంటుంది. కానీ స్కాన్ చేసిన ఏరియా యొక్క విజువలైజేషన్‌ను బెటర్‌గా అందిస్తుంది. ఈ ప్రక్రియలో పరిసర కణజాలంతో పాటుగా రక్తనాళం యొక్క చిత్రంపై రక్తప్రవాహాన్ని వర్ణించే రంగు చిత్రాలను కూడా కంప్యూటర్ ఓవర్ ల్యాప్ చేస్తుంది. వివిధ రంగులు రక్తనాళాల వేగాన్ని, దిశను చూపుతాయి. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు, సాలిడ్ ఆర్గాన్స్‌లో రక్తప్రవాహ వేగాన్ని కొలిచేందుకు పవర్ డాప్లర్‌ను ఉపయోగిస్తారు.
చాలా మంది గర్భవతులకు రెండు అల్ట్రాసౌండ్ స్కాన్స్ అవసరమవుతాయి. మొదటి త్రైమాసికంలో శిశువుల సంఖ్య, పెరుగుదల, బేబీ సైజ్, గడువు తేదీని గురించి అంచనా వేసేందుకు ఒక స్కాన్ చేయాలి. రెండో త్రైమాసికంలో పిండానికి ఏవైనా అసాధారణతలు ఉన్నాయా? అని తెలుసుకునేందుకు రెండో స్కాన్ చేస్తారు. శిశువు సాధారణంగా పెరుగుతోందని నిర్ధారించేందుకు వైద్యులు ఈ స్కాన్ చేస్తారు. సాధారణ అల్ట్రాసౌండ్ పరీక్షలో పిండం అసాధారణ పరిస్థితులతో ఉన్నట్లు వస్తే.. మెరుగైన పరిశోధన కోసం డాప్లర్ స్కాన్ నిర్వహిస్తారు. ఈ స్కానింగ్ ప్లాసెంటల్ రక్తప్రవాహాన్ని, పిండం రక్తప్రవాహాన్ని, గుండె మరియు మెదడులోని రక్తప్రవాహాన్ని తనిఖీ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ విషయాలు పిండం సాధారణ పరిస్థితులలో పెరుగుతుందని నిర్ధారిస్తాయి. రక్తప్రవాహ మార్గంలో ఏదైనా అడ్డంకి ఉంటే వైద్యులు కారణాన్ని గుర్తించగలరు. దానిని తగ్గించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటారు.
పిండంలో రక్తప్రవాహాన్ని నియంత్రించడం లేదా తగ్గించడం వలన పిండం బరువు తగ్గడం, అభివృద్ధి లోపించడం, సైజ్ తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. కేవలం ఇది కాకుండా స్పెషల్ టైప్ డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కాన్ అయిన ట్రాన్సాక్షనల్ డాప్లర్‌ను చేయించమని సలహా ఇస్తారు. ఇది శిశువులలో స్ట్రోక్స్ ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. సాధారణంగా గర్భంలో ఉన్న పిల్లలు సికిల్ సెల్ అనిమియా వంటి వాటితో బాధపడుతుంటే ఇది గుర్తిస్తుంది. గర్భవతులకు డాప్లర్ స్కాన్ అవసరమయ్యే అనేక రకాల పరిస్థితులు ఉన్నాయి... అవి..
సాధారణ అల్ట్రాసౌండ్ స్కాన్లలో వివిధ అసాధారణతలు, కాంప్లికేషన్లను గుర్తించినప్పుడు డాక్టర్లు డాప్లర్ స్కాన్ చేయించుకోమని సలహా ఇస్తారు. ఈ టెస్టులు గర్భవతిగా ఉన్న మహిళకు గర్భధారణ సమయంలో అదనపు రక్షణను అందిస్తాయి. ఇది కాకుండా వైద్యులు కింది కారణాల వల్ల డాప్లర్ పరీక్షలను సూచించవచ్చు.
తల్లి ఒక్కరికంటే ఎక్కువ మంది పిల్లలను మోస్తున్నట్లయితే ఆ గర్భం హై-రిస్క్‌గా మారుతుంది. కాబట్టి ఆ గర్భాన్ని నిశితంగా పరిశీలించడం అవసరం. మెరుగైన పర్యవేక్షణ కోసం ఫెటల్ డాప్లర్ స్కాన్ నిర్వహించడం చాలా అవసరం. ఈ రకమైన గర్భం TTTS, IUGR, బొడ్డుతాడు చిక్కుకోవడం వంటి అనేక సమస్యలను తెస్తుంది. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే ప్రమాదం పెరిగి తల్లికి మరియు బిడ్డకు ప్రమాదరకంగా మారొచ్చు. ఏవైనా అసాధారణతలు లేదా సంక్లిష్టతలు ఉంటే గుర్తించేందుకు డాప్లర్ స్కాన్ ఉపయోగపడుతుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: కవలలతో కూడిన ప్రెగ్నెన్సీని పొందడం ఎలా
గర్భంలో తల్లి నుంచి బిడ్డకు రక్తం, పోషకాలు, ఆక్సిజన్‌ను సరఫరా చేసే ప్లాసెంటా ఉంటుంది. శిశువు సహజంగా ఎదిగేందుకు ప్లాసెంటా నుంచి ఆరోగ్యకరమైన రక్తప్రసరణ అనేది అవసరం. పిండంలో ఏదైనా అసాధారణతలు ఉంటే ఏ వారంలో డాప్లర్ స్కాన్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం అని చాలా మంది అడుగుతారు. సాధారణంగా రెండో త్రైమాసికంలో అనోమలి డిటెక్షన్ స్కాన్‌ను చేయించుకోమని సిఫారసు చేస్తారు. ఒకవేళ రిపోర్టులో పిండం కదలిక నెమ్మదిగా ఉందని వస్తే అందుకు గల కారణాన్ని గుర్తించి అవసరమైన సాయాన్ని చేస్తారు. ప్లాసెంటా ప్రివియా విషయంలో కూడా ఇదే రకమైన స్కాన్‌ను తల్లులకు సూచించవచ్చు. ఈ స్కాన్ల ద్వారా ప్లాసెంటా స్థానాన్ని గుర్తించడం సులభం అవుతుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: అనోమలి (2వ అల్ట్రాసౌండ్) స్కాన్ ఉద్దేశం ఏమిటి?
తల్లి సమగ్ర ఆరోగ్య పరిస్థితి పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం చూపుతుంది. ప్లాసెంటా, బొడ్డు ధమనుల్లో రక్తప్రసరణ వేగాన్ని గుర్తించేందుకు డాప్లర్ స్కాన్ ఉపయోగపడుతుంది. తల్లి కొన్ని తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నపుడు రక్తప్రసరణ ధమనులకు వెళ్లదు. ఇటువంటి సందర్భాల్లో సరైన ఆక్సిజన్, పోషకాలు పిండానికి అందవు. తల్లి అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడుతుంటే ఆ ప్రెగ్నెన్సీ మరింత క్లిష్టంగా మారుతుంది.
ఇంతకు ముందు చేసిన అల్ట్రాసౌండ్ పరీక్షలో పిండం పెరుగుదల రేటు సంతృప్తికరంగా లేకుంటే.. మరింత లోతైన విశ్లేషణ కోసం డాప్లర్ స్కాన్ చేయించుకోమని డాక్టర్ సూచించవచ్చు. ఫెటల్ డాప్లర్ స్కాన్ పరీక్ష ధర రెగ్యులర్ అల్ట్రాసౌండ్ పరీక్షతో పోలిస్తే కాసింత ఖరీదైనదిగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ పరీక్షను తక్కువ ధరలో చేసేందుకు అనేక ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. పిండం ఆరోగ్యపరిస్థితి సరిగ్గా లేకుంటే మాత్రమే డాక్టర్ డాప్లర్ పరీక్షను సూచిస్తాడని చాలా మంది భావిస్తూ టెన్షన్ పడతారు.
డాక్టర్ ఈ పరీక్షను సూచిస్తే చాలా మంది గర్భిణులు, వారి కుటుంబసభ్యలు ఆందోళన చెందుతారు. ఏదైనా అల్ట్రాసౌండ్ స్కాన్ వలే ఇది చాలా సులభం. తల్లిబిడ్డలకు చాలా సురక్షితమైనది. డాప్లర్ స్కాన్‌ను శిక్షణ పొందిన, అధీకృత వైద్యులు చేసినపుడు ఇది చాలా సురక్షితం. సోనోగ్రాఫర్ మార్గదర్శకాలను అనుసరించి తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలుసుకోవడానికి స్కాన్ చేస్తారు. ఈ ప్రక్రియలో తక్కువ మొత్తంలో వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ మిషన్‌లో వేడిని తనిఖీ చేసేందుకు థర్మల్ ఇండెక్స్ డిస్ప్లే ఉంటుంది. సాధారణంగా ఈ యంత్రాలు ‘లో థర్మల్ ఇండెక్స్’తో వస్తాయి. వీటిల్లో ఇతర అనేక అవుట్‌పుట్ సెట్టింగ్స్ కూడా ఉంటున్నాయి. గర్భధారణ దశలోని వివిధ దశల్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ స్కాన్‌కు 30 నిమిషాల సమయం పట్టవొచ్చు. ఈ పరీక్ష తల్లి, బిడ్డకు ఎటువంటి హాని కలిగించదు.
డాప్లర్ స్కాన్ పరీక్ష (ఒబెస్టెట్రిక్ డాప్లర్ స్కాన్ లేదా స్క్రోటల్ డాప్లర్ స్కాన్ లేదా కలర్ డాప్లర్ స్కాన్) చేయించుకునే ముందు మీరు ఇవి తెలుసుకోవాలి. కానీ ఖచ్చితమైన స్కాన్ టెస్ట్ రిపోర్ట్ పొందేందుకు సరైన డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఖరారు చేసే ముందు మీరు మీ ప్రాంతంలో ఉన్న ప్రముఖ డయాగ్నోస్టిక్ సెంటర్లను నిశితంగా గమనించాలి. వాటిపై సమీక్షలు చదవాలి. తర్వాత సరైన పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవాలి. ధృవీకరన ఉన్న, నిపుణులు, అధునాతన పరికరాలు, సరైన పద్ధతులు, పూర్తి భద్రత ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్‌ను మీరు ఎంచుకోవాలి. గర్భధారణ సమయంలో డాప్లర్ స్కాన్ అనేది చాలా సాధారణ విషయం. మీ అల్ట్రాసౌండ్ స్కాన్‌లో అసాధారణతలు ఉంటేనే ఈ స్కాన్ సూచిస్తారని అర్థం కాదు. లోతైన విశ్లేషణ కోసం వైద్యులు ఈ స్కాన్‌ను సూచిస్తున్నారు. ఈ పరీక్ష పూర్తిగా సురక్షితమైనది.
What is Doppler Scan in telugu, Purpose of Doppler Scan in telugu, What you will know with Doppler Scan in telugu, Benefits of Doppler Scan in telugu, When you need to get Doppler Scan done in telugu.
Yes
No
Written by
dhanlaxmirao
dhanlaxmirao
మీ పిల్లలకు నులిపురుగులు(నట్టలు) ఉన్నాయో లేదో తెలుసుకోవడమెలా? (How to Know If Your Baby Has Worms in Telugu?)
మీ పిల్లల అభివృద్ది కోసం ముఖ్యమైన గేమ్స్, యాక్టివిటీస్ (Games and Activities that are Essential for Your Little One's Development in Telugu)
న్యూ బార్న్ ట్విన్స్ (నవజాత కవలలు)ను పెంచడం గురించి మీకు తెలియని 7 విషయాలు (7 Things You Didn't Know About Raising Newborn Twins in Telugu)
అప్పుడే పుట్టిన పసిబిడ్డలలో కండ్లకలక (పింక్-ఐ) (Conjunctivitis (Pink-eye) in New-Borns in Telugu)
గర్భధారణ సమయంలో మామిడిపండు
ప్రసూతి ప్రయోజనానికి ఎవరు అర్హులు? (Who Is Eligible For Maternity Benefit in Telugu?)
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Dark Circles | Blackheads & Pimples | Skin Moisturizer | Skin Irritation | Shop By Ingredient | Kumkumadi | Ubtan | Vitamin C | Tea Tree | Aloe Vera | Rose Water | Skin - Hair | SHOP BY CONCERN | Hairfall | Dry and Damaged Hair | Hair Growth | Shop By Ingredient | Onion | Coconut | Skin - Fertility | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |