hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Journey arrow
  • 8 వారాల ప్రెగ్నెంట్ బేబీ యొక్క సైజ్ ఎంత? (8 Weeks Pregnant Baby Size: Tracking Your Baby's Growth in Telugu) arrow

In this Article

    8 వారాల ప్రెగ్నెంట్ బేబీ యొక్క సైజ్ ఎంత? (8 Weeks Pregnant Baby Size: Tracking Your Baby's Growth in Telugu)

    Pregnancy Journey

    8 వారాల ప్రెగ్నెంట్ బేబీ యొక్క సైజ్ ఎంత? (8 Weeks Pregnant Baby Size: Tracking Your Baby's Growth in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    ఈ సమయంలో మీ కడుపులోని బిడ్డ వేగంగా ఎదుగుతుంది. ఇది మీ గర్భధారణ చక్రంలో ఇది ముఖ్యమైన దశ. మీరు గత వారం లక్షణాలనే ఈవారంలోనూ అనుభవించొచ్చు. మీ దుస్తులు బిగుతుగా అనిపించొచ్చు. 75 శాతం మంది ప్రెగ్నెంట్ వుమెన్స్ వలే మీరు కూడా మార్నింగ్ సిక్​నెస్​ను అనుభవించొచ్చు. 8 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో మీ బిడ్డ రోజుకు మిల్లీమీటర్ చొప్పున పెరుగుతుంది. పెదవులు, ముక్కు, కనురెప్పలు అభివృద్ధి చెందుతాయి.

    8-వారాల ప్రెగ్నెంట్ బేబీ సైజ్ (What is Normal 8 Weeks Pregnant Baby Size in Telugu?)

    మీ చిన్నారి ఇప్పటికే అర​అంగుళం లేదా 11 నుంచి 14 మిల్లీమీటర్ల పొడవు ఉండొచ్చు. 0.4 ఔన్సుల బరువు ఉంటుంది. మీ బేబీ సుమారుగా చిక్కుడు గింజ పరిమాణంలో ఉంటుంది. బేబీ ఈ సమయంలో పెరిగే విధానం ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంతర్గత అవయవాలు, రక్తనాళాలు ఏర్పడతాయి. ప్రసరణ వ్యవస్థ పని చేయడం ప్రారంభిస్తుంది.

    8-వారాల శిశువు పరిమాణం (8 Week Baby Size in Telugu)

    • మీ బేబీ కింది విధంగా ఉంటుంది.
    • తల నుంచి కింది వరకు ఎంబ్రియో (పిండం) సైజ్ 1.2 సెం.మీ పొడవు ఉంటుంది.
    • చర్మం పొర కింద కళ్లు ఏర్పడతాయి. ముక్క ఏర్పడడం మనం చూడొచ్చు.
    • నోటి అప్పర్ జా (దవడ) పైకప్పు కలిసి వస్తున్నాయి. నాలుక మరియు లోపలి చెవి అభివృద్ధి చెందుతాయి.
    • వేళ్లు రూపుదిద్దుకోవడం ప్రారంభిస్తాయి.
    • బేబీ పునరుత్పత్తి అవయవాలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ ఇప్పుడే బేబీ గర్లా? లేక బేబీ బాయా? అని తెలుసుకోవడం సాధ్యం కాదు.
    • పిండానికి ఉండే తోక మాయం అవుతుంది.

    8 వారాల ప్రెగ్నెన్సీ లక్షణాలు (8 Week Pregnancy Symptoms in Telugu)

    మీరు 8 వారాల ప్రెగ్నెంట్ వుమెన్ అయితే మీకు ప్రెగ్నెన్సీ లక్షణాలు కొత్తేం కాదు. మీరు అనుభవిస్తున్న లక్షణాలు ఈ వారం కూడా కంటిన్యూ అవుతాయి. మరియు కొన్ని కొత్త లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు మీ ప్రెగ్నెన్సీ 8వ వారంలో మీరు ఈ కింది లక్షణాలను అనుభవించొచ్చు.

    మార్నింగ్ సిక్​నెస్ (Morning sickness)

    దీనిని మార్నింగ్ సిక్​నెస్ అని పిలుస్తున్నప్పటికీ చాలా మంది ప్రెగ్నెన్సీ స్త్రీలు రోజంతా వికారాన్ని అనుభవిస్తారు. మీ శరీరంలో కెమికల్స్ లెవెల్స్ పెరగడం వలన మార్నింగ్ సిక్​నెస్ వస్తుంది. వికారం అనేది అసాధారణంగా మారితే మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి.

    అలసట (Fatigue)

    ఇంతకు ముందు రోజుల్లో మీరు డ్రెయిన్​గా ఉన్నట్లు ఉండే ఫీలింగ్ బాగుంటుంది. అధిక ప్రొజెస్టిరాన్ కెమికల్ లెవల్స్, బేబీ కోసం అధిక రక్తప్రవాహం కారణంగా ఈ వారంలో మీకు అలసటగా అనిపించొచ్చు. అవసరమైనపుడు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని సింపుల్ యాక్టివిటీలను చేయండి. సరైన డైట్ ఉండే విధంగా ఆహారం తీసుకోండి. ఇవి మీ శరీరానికి శక్తిని అందజేస్తాయి.

    నిద్ర పోవడంలో సమస్యలు (Problems in sleeping)

    మీరు ఎంతలా హార్డ్ వర్క్ చేసినా కానీ సాయంత్రం సమయానికి మీ పనిని ముగించుకుంటారు. కెమికల్స్, మూత్రవిసర్జన చేయడం, అజీర్ణం, వికారం ఇతర ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో విశ్రాంతి తీసుకోవడం కుదరకపోవచ్చు. కాబట్టి మీరు నిద్ర వేళకు ముందు ఎలక్ట్రానిక్ గాడ్జెట్​లను ఉపయోగించకపోవడం మంచిది. ప్రెగ్నెన్సీ అనేది అడ్వాన్స్ అయ్యే కొలదీ మీ నిద్ర వ్యవధి తగ్గుతూ ఉంటుంది.

    యోని స్రావం (Vaginal discharge)

    ప్రెగ్నెన్సీ సమయంలో యోని ఉత్సర్గ పరిమాణం పెరగడం కామన్. జీర్ణవ్యవస్థ మూసివేయడం వల్ల అజీర్తి ఏర్పడుతుంది. అజీర్తి అనేది ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్లే ఏర్పడుతుంది. ఇది మీ రక్త ప్రసరణ పోషణను నిలుపుకుని మీ బేబీకి అందజేస్తుంది.

    తరచూ మూత్రవిసర్జన (Frequent urination)

    ప్రెగ్నెన్సీ కెమికల్స్ మీ కిడ్నీలకు ఎక్కువ పని చెబుతాయి. అవి ఎక్కువగా వ్యర్థాలను ప్రొడ్యూస్ చేస్తాయి. మీరు ఎక్కువ సార్లు వాష్ రూమ్ వెళ్లినట్టు మీకు అనిపిస్తే మీరు తాగే కెఫిన్ పరిమాణాన్ని తగ్గించుకోవాలి. మీరు రాత్రి నిద్రించే సమయంలో కూడా వాష్ రూమ్​కు పోవడం వలన నిద్రలో మీకు డిస్టబెన్స్ ఉండదు. ఎంత సమయం సేపు మీరు మూత్రవిసర్జన చేయకుండా ఉంటారో కూడా తెలుస్తుంది.

    శరీర పరిమాణంలో మార్పులు (Changes in body)

    ప్రెగ్నెన్సీ సమయంలో మీ బ్రా అనేది చాలా చిన్నదిగా మారిందని, అది మీకు సరిపోవడం లేదని మీకు అనిపిస్తుంటుంది. అంతే కాకుండా మీకు మరింత సౌకర్యవంతమైన బట్టలు కూడా అవసరం కావొచ్చు. ఈ సమయాన్ని మీరు ప్రత్యేకంగా నోటీస్ చేయాలి. ఉదాహరణకు మీకు మీ పాత టైట్ జీన్స్ పట్టకపోతే.. మీరు లూజ్ ఫిట్టింగ్ క్లాత్స్ కోసం షాపింగ్ చేయాలి. మెటర్నటీ వేర్ కోసం ప్రత్యేకించి ఉండే దుస్తుల షాప్స్​ను సందర్శించడం మంచి ఆలోచన. చాలా రకాల దుస్తులు ప్రెగ్నెన్సీ మధ్యలో చివర సమయానికి సరిపోవు. కొన్ని బేబీ పుట్టిన తర్వాత కూడా సరిపోవు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఒక గర్భం నుంచి మరో గర్భానికి చాలా రకాల తేడాలు ఉంటాయి. మీకు ఏదైనా విషయంలో అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే మీరు మీ డాక్టర్​ను సంప్రదించండి. వారి నుంచి సలహాలు తీసుకోండి.

    8వ వారం ప్రెగ్నెన్సీకి ఆహార మార్గదర్శకాలు (Food Guide to 8th Week of Pregnancy in Telugu)

    మీ ప్రెగ్నెన్సీ రెండో నెల కోసం ఇక్కడ కొన్ని ఆహార సిఫార్సులు ఉన్నాయి

    • మీరు సరైన సమయంలో సరైన పద్ధతిలో తిన్నట్లయితే మీరు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. పండ్లు, పాలు, కూరగాయలు, తృణ ధాన్యాలు మొదలైన వాటితో ఉండే అల్పాహారాన్ని తినేందుకు ప్రయత్నించండి. కొద్దిగా రిచ్ (ఎక్కువ విటమిన్లు ఉండే బ్రేక్​ఫాస్ట్) బ్రేక్​ఫాస్ట్ మీకు బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది ఆహారాన్ని జీర్ణం చేసేందుకు మీకు ఎక్కువ సమయాన్ని ఇస్తుంది.
    • సలాడ్స్, గుడ్లు మరియు ఇతర లైట్ ఫుడ్స్ మీ మధ్యాహ్న భోజనంలో ఉండేలా చూసుకోండి. లంచ్​లో సలాడ్ తినడం వలన మీరు లైట్​గా మరియు ఎనర్జిటిక్​గా ఫీల్ అవుతారు. మీరు మధ్యాహ్న భోజనంలో ఉడికించిన కోడిగుడ్లను కూడా తినొచ్చు. చపాతీలు, ఉడికించిన కూరలు, అన్నం మరియు పప్పుతో కూడిన డిన్నర్ మీకు శక్తినిస్తుంది.
    • మీరు మీ ప్రెగ్నెన్సీ మొదటి, కీలక త్రైమాసికంలో సిక్‌నెస్ ఎదుర్కొంటారు. కాబట్టి మీరు తేలికపాటి భోజనం తీసుకోండి. తేలికపాటి ఆహారాన్ని తినడం వలన మీ పొట్ట చాలా లైట్​గా ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా ఇది అజీర్తిని అరికడుతుంది. వండిన కూరగాయలు, ఆకుకూరలను రాత్రి భోజనంలో తినాలి.
    • చపాతీలు, ఉడికించిన కూరలు, పప్పుతో కూడిన అన్నం ఈ సమయంలో మీకు మేలు చేస్తుంది. మీ గర్భం యొక్క ప్రధాన త్రైమాసికంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకోసం మీ ఆహారం తేలికగా ఉండేలా ప్లాన్ చేయండి. లైట్ వెయిట్ ఉన్న ఆహారం తీసుకోవడం వలన పొట్ట నిండుగా, ఆనందంగా ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్​ను అరికట్టవచ్చు.

    మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి మీ పోషకాహారం నిర్ణయించబడుతుంది. కాబట్టి చాలా తెలివిగా ఎంచుకోండి. చక్కెర, వేయించిన మరియు అధిక కేలరీల ఆహారాన్ని పరిమితం చేయండి. ఎందుకంటే అవి మీ శిశువుకు పోషకాహారాన్ని అందిచవు. ఎదుగుతున్న మీ బేబీ సమతుల ఆహారం అయిన హోల్ గ్రెయిన్స్, పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్స్, మరియు ఆరోగ్యకరమైన కొవ్వుల నుంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని స్వీకరించేందుకు చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. మీకు మీ బిడ్డకు అవసరమైన దాన్ని అందించేందుకు చాలా రకాల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మీ ఆహారపు అలవాట్ల గురించి మీ డాక్టర్​కు తెలియజేయండి. అందుకు తగిన విధంగా మీ గైనకాలజిస్ట్ మీకు సప్లిమెంటేషన్ ప్లాన్ అందజేస్తారు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ఎనిమిదవ వారంలో గర్భాశయంలో మీ కవలల అభివృద్ధి నుండి ఏమి ఆశించాలి

    8 వ వారంలో ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ కోసం యాక్టివిటీ (Activities for Healthy Pregnancy in 8th Week)

    మీరు 8వ వారం ప్రెగ్నెన్సీలోకి ప్రవేశించినపుడు మీ బేబీ చాలా వేగంగా ఎదుగుతుంది. కాబట్టి కింది విషయాలను గుర్తుంచుకోండి.

    • మీ మొదటి ప్రినేటల్ అపాయింట్​మెంట్ తీసుకోవడం
    • ఆరోగ్యకరమైన ఆహారం (మీ వైద్యుడు వద్దన్న ఆహారాలకు దూరంగా ఉండడం)
    • రోజూవారి ఫిజికల్ యాక్టివిటీ
    • మద్యం మరియు ధూమపానానికి దూరంగా ఉండడం

    Tags:

    8th week of pregnancy in telugu, 8th week pregnancy symptoms in telugu, 8th week pregnancy bump in telugu, baby size during 8th week of pregnancy in telugu, food requirements for 8th week of pregnancy in telugu.

    8 Weeks Pregnant Baby Size in English, 8 Weeks Pregnant Baby Size in Bengali, 8 Weeks Pregnant Baby Size in Tamil

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.