Want to raise a happy & healthy Baby?
Pregnancy
3 November 2023 న నవీకరించబడింది
గర్భవతి కావడం విభిన్నమైన అనుభవం. అనేక ఫీలింగ్స్ వస్తుంటాయి. ఆరోగ్యం విషయానికి వస్తే నిద్రపోవడం, కునుకు తీయడం అవసరమే. శిశువు సంపూర్ణ ఆరోగ్యానికి ఇవి కారణం అవుతాయి. గర్భవతిగా ఉన్నప్పుడు కునుకు తీయడం ఎంత అవసరమో, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కాబోయే తల్లులు, వారి సంరక్షణ చూసుకునేవారు, కొత్తగా కుటుంబాన్ని ప్రారంభించాలనుకునేవారు ఈ బ్లాగ్‌లో తెలుసుకోవచ్చు.
గర్భవతి అయిన ప్రారంభంలో నిద్రపోవడంలో ఉండే సమస్యలు, గర్భవతిగా ఉన్నన్ని రోజులు కొనసాగుతుంది. మరో కొత్త ప్రాణాన్ని తన కడుపులో మోయడం అంత సులువైన విషయమేమీ కాదు. నిద్రలేకపోవడం వల్ల రోజంతా అలసిపోయినట్టు ఉంటారు. ఆవలింతలు తీస్తుంటారు. అందుకే చాలామంది గర్భవతులు పగలు నిద్రపోతుంటారు. ఇలా కునుకు తీయడంపై వేర్వేరు మహిళలకు వేర్వేరు అభిప్రాయాలు, ప్రశ్నలు ఉంటాయి. గర్భవతిగా ఉన్నప్పుడు కునుకు తీయడం మంచిదా? గర్భవతులు ఎంతసేపు కునుకు తీయాలి? ప్రెగ్నెన్సీ సమయంలో మధ్యాహ్నం కునుకు తీయడం మంచిదా? పగటి పూట నిద్రపోవడం మంచిదా కాదా? తల్లి కాబోయే మహిళల్లో ఈ ప్రశ్నలు సర్వసాధారణం.
మొదటి ట్రమిస్టర్ అంటే మొదటి మూడు నెలల్లో మహిళల్లో హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గుల కారణంగా అలసిపోతుంటారు. రెండో ట్రమిస్టర్‌లో ఈ పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉంటుంది. రెండో ట్రమిస్టర్‌లో నిద్రపోలేకపోతున్నామని చాలామంది మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇక చివరి 90 రోజులకు చేరుకునే సరికి మహిళల్లో వారి శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. బిడ్డ పెరుగుతుండటం వల్ల కడుపు బరువవుతుంది. వెన్ను నొప్పి వస్తుంది. కడుపులోని పిండం రాత్రంతా మూత్రాశయం మీద నొక్కడం కారణంగా రాత్రి సమయంలో నిద్ర కష్టంగా మారుతుంది. కాబోయే తల్లుల నుంచి ఎక్కువగా వినే సమస్యలు ఇవి. ఫలితంగా, వాళ్లు రోజంతా అలసిపోయినట్టు కనిపిస్తారు. ఇది కాస్తా వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపి, వారి దినచర్యకు ఆటంకంగా మారుతుంది.
చాలామంది మహిళలు ఏమని ఫిర్యాదు చేస్తారంటే- నేను 37 వారాల గర్భవతిని. అస్సలు నిద్రపోలేకపోతున్నా. గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఎందుకు కునుకు తీస్తాను? ఇందుకు కారణం ఏంటంటే మూడో ట్రమిస్టర్‌లో గర్భవతులు ఎక్కువగా నిద్రపోలేరు. నిద్రలేని రాత్రులు వారు ఎక్కువగా అలసిపోవడానికి కారణం అవుతాయి. నిద్రమత్తు ఉంటుంది. రాత్రి నిద్రపోలేని సమయాన్ని పగటిపూట కునుకు తీయడం ద్వారా భర్తీ చేయాలని వారి శరీరం కోరుకోవడం సహజమే. నిజానికి, ఇలాంటి సమయంలో కునుకు తీయడం చాలా మంచిది. గర్భవతులు 30 నిమిషాల పాటు కునుకు తీస్తే బిడ్డ ఆరోగ్యం, అభివృద్ది బాగుంటుందని 2018లో జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. పిల్లలు తక్కువ బరువుతో పుట్టడాన్ని ఇది తగ్గిస్తుంది.
కాబోయే తల్లులు 20 నుంచి 30 నిమిషాల పాటు తీసే కునుకు అద్భుతంగా పనిచేస్తుందని అంటే నమ్మరు. వారికి మంచి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. అయితే అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోతే రాత్రి సమయంలో నిద్ర, విశ్రాంతి లేకుండా పోవచ్చు. చాలావరకు అధ్యయనాలను బట్టి, 20 నుంచి 30 నిమిషాల కన్నా ఎక్కువ కునుకు తీస్తే, వారికి విశ్రాంతి లభించినట్టు కాకుండా కళ్లు తిరిగినట్టు, మసకగా అనిపించే అవకాశం ఉంది. రోజులో ఎక్కువ సేపు నిద్రపోతే, పూర్తిగా నిద్రలోకి జారుకునే అవకాశం ఉంది. ఇది మంచిది కాదు.
ముందురోజు రాత్రి సరిగ్గా నిద్రపోలేనప్పుడు, తగ్గిన ఆ సమయాన్ని కునుకు ద్వారా భర్తీ చేయడం మంచిది. అయితే దీన్ని సరిగ్గా చేయడమే ముఖ్యం. గర్భవతిగా ఉన్నప్పుడు మంచి నిద్ర కోసం ఇంటి చిట్కాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు. చాలానే ఉన్నాయి. చదవండి
కునుకు తీసిన తర్వాత రిఫ్రెషింగ్‌గా అనిపించడానికి ఈ ఇంటి చిట్కాలు పాటించండి.
నిద్రపోవడానికి మంచి స్థలాన్ని ఎంచుకోవడం చాలా కీలకం. గర్భవతులు సోఫాలపై లేదా మంచంపై పడుకోవాలని అనుకుంటారు. అయితే సరైన స్థలం, వాతావరణంలో కునుకు తీస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అందుకే కునుకు తీయడం కోసం సౌకర్యవంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి.
2. కునుకు తీయడం కన్నా ముందు లిక్విడ్స్ తీసుకోవద్దు (Avoid having liquids before snoozing off is a good idea!)
మంచి నిద్రలో ఉన్నప్పుడు టాయిలెట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇబ్బందే. అందుకే కాబోయే తల్లులు కునుకు తీసేముందు నీళ్లు లేదా ఇతర లిక్విడ్స్ తీసుకోకూడదు.
3. ప్రెగ్నెన్సీ పిల్లో ఉపయోగించండి (Use a pregnancy pillow)
గర్భవతులు నిద్రపోవడానికి సరైన పొజిషన్‌లోకి రావడానికి కష్టంగా ఉంటుంది. కడుపులో బిడ్డ పెరుగుతున్నకొద్దీ ఈ సమస్య ఎక్కువవుతుంది. అందుకే ప్రెగ్నెన్సీ పిల్లో కొనడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
4. ఎడమవైపు తిరిగి నిద్రపోండి (Sleep on the left side is recommended)
గర్భవతులు ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిది. కడుపులో పెరుగుతున్న పిండానికి కూడా ఇది మంచిది. నిద్రపోతున్నప్పుడు అసౌకర్యాన్ని కూడా తొలగిస్తుంది.
5. మీ నిద్రను చెడగొట్టే వాటి నుంచి దూరంగా ఉండండి (Keep all distractions at bay to get better sleep)
నిద్రపోయేప్పుడు నిద్రను చెడగొట్టే వాటికి దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు ఇది తప్పనిసరి. కాబట్టి మహిళలు నిద్రపోయేందుకు గదిని చీకటిగా మార్చాలి. డోర్ లాక్ చేసుకోవాలి. మొబైల్ ఫోన్స్ కూడా ఆఫ్ చేయాలి. ఇక ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
గర్భవతుల ఆరోగ్యం కోసం నిద్రపోవడం చాలా ముఖ్యం. అందుకే రాత్రివేళలో సరిగ్గా నిద్రపోలేనివాళ్లు పగటి సమయంలో కునుకుతీయడం మంచిది.
Sleeping during pregnancy in telugu, nap during pregnancy in telugu, how much time a nap should be during pregnancy in telugu, why sleeping is important during pregnancy in telugu.
Yes
No
Written by
Kakarla Sirisha
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
UTIs & Infections | Diapers & Wipes | Disposable Diapers | Baby Wipes | Cloth Diapers | Diapers & Wipes - Baby Care | Hair | Skin | Bath & Body | Diapers & Wipes - Baby Wellness | Diaper Rash | Mosquito Repellent | Anti-Colic | Diapers & Wipes - Baby Gear | Stroller | Dry Sheets | Bathtubs | Potty Seats | Carriers | Diaper Bags | Maternity dresses | Stretch Marks Kit |