Raise A Happy & Healthy Baby
Get baby's growth & weight tips
Join the Mylo Moms community
Get baby diet chart
Get Mylo App
Want to raise a happy & healthy Baby?
Diet & Nutrition
13 September 2023 న నవీకరించబడింది
గర్భధారణ సమయంలో చామదుంప తినడం మంచిదేనా కాదా అన్న అంశంపై మహిళలకు అనేక సందేహాలు ఉంటాయి. చామదుంపను అర్బీ, టారో రూట్ అని కూడా పిలుస్తారు. ఇది అనేక సంస్కృతుల్లో సంప్రదాయ వంటకం. అయితే గర్భధారణ సమయంలో చామదుంప తినవచ్చా అని గర్భవతుల్లో కొన్ని సందేహాలు ఉంటాయి. గర్భధారణ సమయంలో చామదుంప తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, కలిగే దుష్ప్రభావాల గురించి ఈ బ్లాగ్‌లో వివరిస్తాం. చామదుంపలోని పోషక విలువలతో పాటు, మీ శిశువు అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా చర్చిస్తాం. అంతేకాదు.. దీని వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి, చామదుంప తినాలనుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాల గురించి కూడా వివరిస్తాం. చివరగా గర్భధారణ సమయంలో అనవసరమైన ఇబ్బందులు తెచ్చుకోకుండా, చామదుంపను ఎలా తినాలో కూడా వివరిస్తాం.
దక్షిణాసియాలో భూమి లోపల పండే కూరగాయల్లో చామదుంప కూడా ఒకటి. దీన్నే టారో రూట్, కోలోకాసియా రూట్, ఎడ్డో అని పిలుస్తారు. ఇందులో పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్, క్యాల్షియం, పొటాషియం చామదుంపలో లభిస్తాయి. ఇక ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియంట్స్‌తో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. చామదుంపలోని పోషక విలువల్ని పరిగణలోకి తీసుకుంటే గర్భవతులకు మంచి ఆహారంగా భావించవచ్చు. ఇక ఇందులో పీచు పదార్థాలు ఎక్కువ స్థాయిలో ఉన్నందున.. గర్భవతులకు సాధారణంగా వచ్చే మలబద్ధక సమస్యను నివారించడానికి చామదుంపలు ఉపయోగపడతాయి. ఇక చామదుంపలోని యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీసి, పలు రకాల వ్యాధులకు దారితీస్తుందన్న సంగతి తెలిసిందే.
అయితే ప్రతీ ఆహార పదార్థం లాగానే, గర్భవతిగా ఉన్నప్పుడు చామదుంప తినే విషయమై వైద్య నిపుణులను సంప్రదించి వారి సలహాలు తీసుకోవాలి. అయితే గర్భవతులు చామదుంప తినడం సురక్షితమా, కాదా అన్న అంశంపై ఖచ్చితమైన సమాధానం లేకపోయినప్పటికీ.. చాలామంది నిపుణులు చామదుంప తినడం సురక్షితమేనని నమ్ముతుంటారు. చామదుంపలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉంటుంది. ఇవి గర్భవతులకు చాలా అవసరం. పీచుపదార్థం గర్భవతుల జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అయితే ఇందులో ఉండే ఆక్సలేట్స్ కిడ్నీలో రాళ్లు పెరిగేందుకు కారణం అవుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి. గర్భవతిగా ఉన్నప్పుడు నేను చామదుంప తినొచ్చా అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ముందుగా మీ డాక్టర్‌ను సంప్రదించాలి. భూమిలో పండే ఈ కూరగాయను మీరు తినొచ్చా లేదా అన్న విషయంపై వైద్యులు స్పష్టత ఇస్తారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భిణీ స్త్రీ ఫోలిక్ యాసిడ్ ఎప్పుడు తీసుకోవాలి?
చామదుంప ఆసియాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా వినియోగించే కూరగాయల్లో ఒకటి. ఇందులో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. చామదుంపలో పీచుపదార్థం ఉంటుందని చెప్పుకున్నాం. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి గర్భవతులకు అవసరం. ఇక చామదుంపలో కేలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. గర్భవతులకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థంగా ఇది లిస్ట్‌లో ఉంటుంది. చామదుంపలో విటమిన్ సీ కూడా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో.. కణజాలాన్ని పెంచడంలో విటమిన్ సీ బాగా పనిచేస్తుంది. చామదుంపలో ఉండే పొటాషియం శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటంతో పాటు, కాళ్లల్లో వచ్చే తిమ్మిరిని నివారిస్తుంది. ఇక ఇందులో ఉండే క్యాల్షియంతో ఎముకలు, పళ్లు ధృడంగా మారతాయి. గర్భవతులు చామదుంప తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తల్లితో పాటు కడుపులో పెరుగుతున్న శిశువు అభివృద్ధికీ మేలు చేస్తుంది.
అయితే గర్భవతులు చామదుంప తినడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
గర్భవతిగా ఉన్నప్పుడు చామదుంప తినడం సురక్షితమే. కానీ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో గ్యాస్ & ఉబ్బరం సమస్యలతో డీల్ చేయడం
చామదుంపలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గర్భవతులు తినొచ్చు. ఇందులో విటమిన్స్, ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే గర్భధారణ సమయంలో మితంగానే చామదుంప తీసుకోవాలన్న విషయం గుర్తుంచుకోండి. ఇతర పండ్లు, కూరగాయల ద్వారా లభించే పోషకాలకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ఎందుకంటే ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ గర్భధారణ సమయంలో చామదుంప తినడంపై మీకు ఏవైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే, వైద్యుల్ని సంప్రదించడం మంచిది. సరైన ప్రణాళికతో కాబోయే తల్లులు చామదుంపను తినొచ్చు. లక్షలాది మంది తల్లిదండ్రులు వారి నవజాత శిశువుల అవసరాల కోసం మైలో ఫ్యామిలీని విశ్వసిస్తున్నారు.
References
1. Mitharwal S, Kumar A, Chauhan K, Taneja NK. (2022). Nutritional, phytochemical composition and potential health benefits of taro (Colocasia esculenta L.) leaves: A review. Food Chem.
2. Li F, Sun H, Dong HL, Zhang YQ, Pang XX, Cai CJ, Bai D, Wang PP, Yang MY, Zeng G. (2022). Starchy vegetable intake in the first trimester is associated with a higher risk of gestational diabetes mellitus: a prospective population-based study. J Matern Fetal Neonatal Med.
Is arbi safe during pregnancy in Telugu, What are the benefits of arbi during pregnancy in Telugu, what are the risks of arbi during pregnancy in Telugu, Arbi In Pregnancy: Is It Safe Or Not in English, Arbi In Pregnancy: Is It Safe Or Not in Hindi, Arbi In Pregnancy: Is It Safe Or Not in Tamil, Arbi In Pregnancy: Is It Safe Or Not in Bengali
Yes
No
Written by
swetharao62
swetharao62
మీ బేబీ బాటిల్ స్టెరిలైజర్ క్లీనింగ్ గురించి ఈ విషయాలు తెలుసా? తప్పకుండ తెలుసుకోండి (Do You Know These Things About Your Baby Bottle Sterilizer in Telugu!)
గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తినొచ్చా?: ప్రయోజనాలు, అపోహలు | Coconut in Pregnancy: Benefits & Myths in Telugu
గర్భధారణ సమయంలో క్వినోవా - ప్రయోజనాలు, మార్గదర్శకాలు | Quinoa During Pregnancy Benefits & Guidelines in Telugu
మీ బిడ్డకు హాని కలిగించే ఆహారాలు| Foods Which Can be Harmful for Your Baby in Telugu
శిశువు మొదటి దంతాలు: తల్లిదండ్రులు తెలుసుకోవలసిన 5 వాస్తవాలు (Baby’s First Tooth: 5 Facts Parents Should Know in Telugu)
గర్భధారణ సమయంలో చేపలు: ప్రయోజనాలు మరియు రిస్కులు | Fish in Pregnancy: Benefits & Risks in Telugu
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Skin brightening | Acne & Blemishes | Skin hydration | Dark Circles | Blackheads & Pimples | Skin Moisturizer | Skin Irritation | Shop By Ingredient | Kumkumadi | Ubtan | Vitamin C | Tea Tree | Aloe Vera | Rose Water | Skin - Hair | SHOP BY CONCERN | Hairfall | Dry and Damaged Hair | Hair Growth | Shop By Ingredient | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |