Health Tips
25 May 2023 న నవీకరించబడింది
గర్భధారణ కోసం ఫోలిక్ యాసిడ్ ముఖ్యంగా హీమోగ్లోబిన్ రకం కొత్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ తీసుకోనివారిలో ఫోలేట్ డెఫీషియెన్సీ అనీమియా డిసార్డర్ వస్తుంది. శరీరం కావాల్సినంత ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయలేదు కాబట్టి ప్రెగ్నెన్సీ కోసం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అవసరం. ఎర్రరక్తకణాలు తక్కువగా ఉంటే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్‌ను కూడా సరఫరా చేయలేదు. దెబ్బతిన్న అవయవాల పనితీరుపైనా ప్రభావం చూపిస్తుంది. తల్లి కావాలనుకునే మహిళ ప్రెగ్నెన్సీ కన్నా ముందు నుంచే అదనంగా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. గర్భంలో శిశువు పెరుగుదలకు, అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా పిల్లలు జన్మించే సమయంలో ఉండే సమస్యలైన స్పైనా బిఫిడా, అనెన్స్‌ఫాలీ లాంటి న్యూరల్ ట్యూబ్ డిసార్డర్స్‌ని నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది.
స్పైనా బిఫిడా అంటే వెన్నెముకకు మద్దతుగా ఉండే వెన్నుపూస పూర్తిగా కలసిపోకపోవడం వల్ల పుట్టుకతో వచ్చే వైకల్యం. పిల్లల ఎదుగుదల, కదలిక, శ్రేయస్సు లాంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. ఒకవేళ పుట్టిన శిశువుకు అనెన్సఫలి ఉంటే మెదడు పూర్తిగా లేకపోవడం లేదా మెదడు అభివృద్ధి చెందకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. దీని వల్ల గర్భంలోనే లేదా పుట్టిన వెంటనే ప్రాణాంతక పరిణామాలు తలెత్తవచ్చు ప్రెగ్నెన్సీ కోసం మంచి ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ సమయంలో ముందుగా ప్రసవం చెందడం, ప్లాసెంటా ఏర్పడటంలో తలెత్తే సమస్యల్ని తగ్గించవచ్చు. దీంతోపాటు పుట్టుకతో వచ్చే వైకల్యాలు, గుండె జబ్బులు, క్లెఫ్ట్ ప్యాలెట్ లాంటి సమస్యల్ని కూడా తగ్గించవచ్చు.
త్వరగా గర్భం రావడానికి ఫోలిక్ యాసిడ్ విటమిన్స్‌ని ఆహార పదార్థాల్లో సహజంగా లభించే ఫోలిక్ యాసిడ్ ద్వారా తయారు చేస్తారు. ఆహారంలో అధిక మొత్తంలో ఫోలేట్ తీసుకోవడం అసాధ్యం. ఫోర్టిఫైడ్ తృణధాన్యాల లాంటివి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అవుతాయి. డైట్ ద్వారా లభించే ఫోలేట్‌ను పర్యవేక్షించాల్సిన అవసరం లేదు. కానీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్‌ని మాత్రం పర్యవేక్షించాలి. అనేక ప్రీనాటల్ సప్లిమెంట్స్, మల్టీవిటమిన్స్‌లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఎక్కువగా విటమిన్స్ తీసుకునేవారు ఒక రోజులో 1,000 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువ ఫోలిక్ యాసిడ్ తీసుకోకూడదు. ఫోలిక్ యాసిడ్ లోపం లేదా అధికంగా తీసుకోవడం ఎలుకల్లో మెదడు అభివృద్ధి చెందడంపై ప్రభావం చూపిందని 2020లో ఓ పరిశోధనలో తేలింది. 5మిల్లీ గ్రాముల ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ అవసరమా లేదా అన్నదానిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో కాఫీ: ప్రభావాలు & తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Yes
No
Written by
kakarlasirisha
kakarlasirisha
ప్రెగ్నెన్సీలో డబుల్ మార్కర్ టెస్ట్: ఇది ఎందుకు అవసరం & మీరు దీన్ని ఎప్పుడు చేయించుకోవాలి?
5 వారాల తర్వాత గర్భస్రావం జరిగితే మీరు ఎంత తర్వగా గర్భం కోసం ప్రయత్నించాలి?
వాడిన డైపర్లను పారవేయడం ఎలా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే
వెసెక్టమీ రివర్సల్ అంటే ఏమిటి? దీని వలన ఉపయోగాలు ఏమిటి? ఇది చేయడం వలన ఎదురయ్యే రిస్క్స్ ఎలా ఉంటాయి?
శిశువు మెదడును అభివృద్ధి చేసే ఆహారాలు ఏవో తెలుసా? ఓ లుక్ వేయండి!
బేబీ మౌత్ థ్రష్ సాధారణమేనా? దీనిని ఎలా తొలగించాలి?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Mylo is a master brand offering solutions through it's subsidiaries - Mylo Care and Mylo Baby.
Mylo Care offers science backed, expert led solutions across multiple health concerns.
Mylo Baby is a one stop solution for young parents for all their baby's needs.
Aloe Vera Range For Hair | Coconut | Neelibrigandi | Skin - Bath & Body | By Ingredient | Skin - Pregnancy & New Mom | Skin - Health & Wellness | Digestive Health | Lactation | Pain management | By Ingredient | Saffron | Shatavari | Nivarini | Skin - Weight | Weight Management | By Ingredient | Wheatgrass | Apple Cider Vinegar | Skin - Fertility |