hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy arrow
  • గర్భధారణ ప్రారంభంలో మలబద్ధకం arrow

In this Article

    గర్భధారణ ప్రారంభంలో మలబద్ధకం

    Pregnancy

    గర్భధారణ ప్రారంభంలో మలబద్ధకం

    3 November 2023 న నవీకరించబడింది

    మలబద్ధకం అంటే అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తికి స్పష్టమైన, క్రమమైన మరియు తక్షణమైన ప్రేగు కదలికలు ఉండవు. శరీరానికి అవసరం లేని వృధా ఆహారం మలంగా బయటకు వెళ్లడానికి బదులుగా ప్రేగు అని పిలువబడే జీర్ణవ్యవస్థ యొక్క దిగువ భాగంలో ఘనీభవిస్తుంది. గర్భధారణకు దారితీసే హార్మోన్లు కూడా మలబద్ధకానికి దారితీస్తాయి. ఇది ఆహ్లాదకరమైన పరిస్థితి కాదు. కొన్నిసార్లు మహిళలు గర్భం ప్రారంభంలో మలబద్ధకంతో బాధపపడతారు. ఇది గర్భధారణ సమయంలో కనిపించే సాధారణ సమస్య. ప్రెగ్నెన్సీ మలబద్ధకం అనేది ఒక మహిళకు ఒక వారంలో మూడు కంటే తక్కువ ప్రేగు కదలికలు ఉన్న పరిస్థితి, ఇది కొంచెం సమస్యాత్మకమైనది.

    గర్భధారణ సమయంలో మలబద్ధకం ఉండటం అనేది సాధారణం. ఈ సమస్యను పరిష్కరించేందుకు మలాన్ని మృదువుగా చేసే డాకుసేట్ సోడియం మరియు డోకుసేట్ కాల్షియం వంటివి మలవిసర్జన జరిగేందుకు సహాయపడతాయి. ఇది సురక్షితమైన ప్రక్రియ. ఇందుకు సురక్షితమైన పదార్థాలను ఉపయోగించడం వల్ల అభివృద్ధి చెందుతున్న శిశువుకు హాని కలిగించదు. కొన్నిసార్లు ఒక భేదిమందు డాక్టర్ చే సూచింపబడుతుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లేదా మెగ్నీషియం సిట్రేట్ అని పిలువబడే సెలైన్ భేదిమందులు, బిసాకోడిల్ వంటి ఉద్దీపనలు, చోలాక్ వంటి లాక్టులోజ్, కాన్‌స్టిలాక్ వంటి కొన్ని బల్క్-ఫార్మింగ్ లాక్సిటివ్‌లు సైలియం మరియు పాలికార్బోఫిల్ గర్భధారణ సమయంలో ఉపయోగించడం సురక్షితంగా పరిగణించబడుతుంది.

    గర్భధారణ సమయంలో మలబద్ధకం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

    మలబద్ధకం అనేది గర్భధారణ సమయంలో శరీరంలో హార్మోన్ స్థాయిలు పెరిగినప్పుడు ప్రారంభం అవుతుంది. గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో రెండవ లేదా మూడవ నెలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

    గర్భధారణ మలబద్ధకం ఏర్పడకుండా నిరోధించే కొన్ని జీవనశైలి మార్పులు:-

    1. గర్భిణీ స్త్రీ ద్రవాలను ఎక్కువగా, ముఖ్యంగా నీరు మరియు కొన్ని పండ్ల రసాలను త్రాగాలి.
    2. గర్భిణీ స్త్రీ తన దినచర్యలో కొంత శారీరక శ్రమను చేర్చుకోవాలి. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
    3. గర్భిణీ స్త్రీ ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండాలి. ఆమె ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు బీన్స్ వంటి ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకోవాలి. ఆమె తన వైద్యుడిని సంప్రదించిన తర్వాత మెటాముసిల్ వంటి ఫైబర్ సప్లిమెంట్‌ను కూడా ఎంచుకోవచ్చు. గర్భధారణ సమయంలో మలబద్దకానికి దారితీసే ఐరన్ సప్లిమెంట్లను డాక్టర్‌ను సంప్రదించిన తర్వాత ఆమె తీసుకోవాలి.

    గర్భధారణలో మలబద్ధకం: ఇది ఒక సాధారణమైన విషయమేనా?

    దాదాపు 39% మంది స్త్రీలు గర్భధారణ సమయంలో మలబద్ధకం బారిన పడతారు. మూడవ త్రైమాసికంలో పిండం బరువుగా ఉన్నప్పుడు వారు ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది ప్రేగుపై గరిష్ట ఒత్తిడిని కలిగిస్తుంది. కొన్నిసార్లు మలబద్ధకం మూడు త్రైమాసికాల్లో కూడా సంభవించవచ్చు. శిశువు ప్రసవించిన తర్వాత కూడా కొనసాగవచ్చు.

    గర్భధారణ సమయంలో మలబద్ధకం యొక్క కారణం

    గర్భధారణ సమయంలో హార్మోన్లలో మార్పులు మరియు రోజువారీ అలవాట్లు మలబద్ధకం యొక్క అవకాశాలను పెంచుతాయి. దాని కారణాలు కొన్ని:-

    1. ప్రొజెస్టెరాన్ - గర్భం దాల్చినప్పుడు శరీరం ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ ప్రేగులను రిలాక్స్ చేస్తుంది. తద్వారా శరీరం నుండి మలాన్ని బయటకు నెట్టడానికి అవి కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ రిలాక్సేషన్ వల్ల శరీరం తినే ఆహారం నుండి ఎక్కువ పోషకాలు మరియు నీటిని గ్రహించడానికి సహాయపడుతుంది. ఆహార పదార్ధం ఎక్కువ కాలం ప్రేగులో ఉంటే పెద్దప్రేగు దానిని గ్రహించడానికి ఎక్కువ సమయం పడుతుంది.
    2. పిండం-పెరుగుతున్న పిండం గర్భాశయాన్ని భారీగా చేస్తుంది. ఈ అదనపు బరువు ప్రేగుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. దాని వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడం కష్టతరం అవుతుంది.
    3. ప్రినేటల్ విటమిన్లలోని ఐరన్ కంటెంట్ - ప్రినేటల్ విటమిన్లలో ఐరన్ ఉంటుంది. ఇది తల్లి మరియు బిడ్డ ఇద్దరి శరీరాల్లో ఆక్సిజన్ ప్రసరణకు అవసరమైన రక్తాన్ని ఉత్పత్తి చేయడానికి శరీరానికి సహాయపడుతుంది. కానీ ఈ ఐరన్ ఎక్కువైతే పేగులోని బ్యాక్టీరియా ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం కష్టతరం చేస్తుంది. అంతే కాకుండా తగినంత నీరు త్రాగకపోవడం వల్ల తగినంత హైడ్రేట్ కాకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. ఈ వ్యర్థాలు పేరుకుపోయి మలబద్ధకం కలిగేలా చేస్తాయి.
    4. జీవనశైలి సమస్యలు-మలబద్ధకం అనేది ఒకరి ఆహారపు అలవాట్లు లేదా ఆహారం, రోజూ తీసుకునే ద్రవం పరిమాణం మరియు రోజూ చేసే వ్యాయామం స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎవరైనా ఈ అలవాట్లను సరిగ్గా పాటించకపోతే వారికి మలబద్ధకం మరియు సంబంధిత సమస్యలు వస్తాయి.

    గర్భధారణ ప్రారంభంలో మలబద్ధకం ఎలా అనిపిస్తుంది?

    గర్భిణీ స్త్రీకి మలబద్ధకం ఉందని ఈ క్రింది లక్షణాల వల్ల తెలుస్తుంది:-

    1. ఆమె వారానికి కొన్ని సార్లు మాత్రమే మలవిసర్జన చేయగలగడం.
    2. కడుపు గ్యాస్‌తో ఉబ్బినట్లు అనిపిస్తున్నందువల్ల ఆమె మలవిసర్జన చేసేందుకు ఒత్తిడి చేయాలి.
    3. ఆమె విసర్జించినప్పుడు మలం ముద్దగా, గట్టిగా ఉంటుంది. అది బయటకు వెళ్లడం వలన ఆమెకు నొప్పి కలుగుతుంది.

    గర్భధారణ సమయంలో మలబద్ధకం:

    ఎప్పుడు ఆందోళన చెందాలి

    గర్భధారణ సమయంలో మలబద్ధకం హెమోరాయిడ్స్ మరియు అనల్ ఫిషర్స్ కారణంగా మరింత తీవ్రంగా మారుతుంది.

    గర్భధారణ సమయంలో మలబద్ధకం నిర్ధారణ

    ఆరోగ్య సంరక్షణ ప్రదాత స్త్రీ ఎంత మలమూత్రం చేస్తుంది, ఆమె మలం యొక్క రూపాన్ని తెలుసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని నిర్ధారించవచ్చు. అప్పుడు వారు సమస్యకు కారణం అయినా లేదా సమస్యను తీవ్రతరం చేస్తున్న కారణాన్ని కనుగొనేందుకు ఆమె రోజువారీ అలవాట్ల గురించి ఆమెను అడగవచ్చు. ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటోంది. ఆమె రోజూ ఎంత ద్రవం తీసుకుంటుంది. ఆమె ఎంత వ్యాయామం చేస్తోంది మరియు ఆమె ఏ మందులు, సప్లిమెంట్లు తీసుకుంటోంది అని వైద్యుడు అడగవచ్చు.

    గర్భధారణ సమయంలో మలబద్ధకం నుండి వెంటనే ఉపశమనం పొందడం ఎలా?

    ప్రారంభ గర్భధారణ సమయంలో మలబద్ధకం యొక్క అసహ్యకరమైన పరిస్థితిని నివారించడానికి కొన్ని మార్గాలు:-

    1. ప్రతిరోజూ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి-గర్భిణీ స్త్రీ తన మలాన్ని మృదువుగా విసర్జన చేసేందుకు సహాయపడే ఫైబర్-రిచ్ ఫుడ్స్ తినాలి. పండ్లు, కూరగాయలు, బీన్స్, కాయధాన్యాలు మరియు తృణధాన్యాలలో ఫైబర్స్ ఉంటాయి.
    2. రోజూ ఎక్కువ నీరు త్రాగాలి- గర్భిణీ స్త్రీ సులభంగా మలవిసర్జన అయ్యేందుకు రోజు కనీసం 8 గ్లాసుల వరకు నీరు త్రాగాలి. టీలు, స్మూతీలు మరియు జోడించిన చక్కెరలు లేకుండా తక్కువ కొవ్వు పాలు కూడా ప్రయత్నించవచ్చు
    3. మితంగా రోజూ వ్యాయామం చేయండి-గర్భిణీ స్త్రీ మితంగా వ్యాయామం చేయాలి.
    4. గర్భం కటి ప్రాంతం మరియు కీళ్లపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇవి సులభంగా కదలికను పరిమితం చేయడానికి ప్రయత్నిస్తాయి. ఆమె కడుపులో ప్రేగులను కదిలించడానికి సహాయపడే వ్యాయామాల గురించి తెలుసుకోవడానికి ఆమె తన వైద్యుడిని సంప్రదించవచ్చు.
    5. మీ ప్రినేటల్ విటమిన్‌లను మార్చుకోండి-గర్భిణీ స్త్రీ ఆమె ప్రస్తుతం వాడుతున్న ప్రీ నేటల్ విటమిన్స్‌ని మార్చాల్సి రావచ్చు. ఇది జీర్ణవ్యవస్థ తీసుకునేందుకంటే చాలా ఎక్కువ ఇనుము కలిగి ఉండవచ్చు. జీవనశైలిలో మార్పులు చేయకపోతే డాక్టర్ ఆమెకు భేదిమందులు మరియు ఫైబర్ సప్లిమెంట్లను అందించవచ్చు. ఆమె మినరల్ లేదా కాస్టర్ ఆయిల్స్ వంటి ఇంటి నివారణలకు దూరంగా ఉండాలి.

    ముగింపు

    గర్భిణీ స్త్రీ చాలా ఆరోగ్యకరమైన దినచర్యను అనుసరించకపోతే గర్భధారణ సమయంలో మలబద్ధకం అనేది అసాధారణమైన విషయం కాదు. సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆమె సరిగ్గా తినాలి, పెద్ద మొత్తంలో ద్రవాలు త్రాగాలి, వ్యాయామాలు చేయాలి మరియు సరైన మందులు తీసుకోవాలి. మంచి అలవాట్లను పాటించడం ద్వారా ఆమె మలవిసర్జన చేసేందుకు ఒత్తిడికి గురికావడం వంటి అసహ్యకరమైన క్షణాలను నివారించవచ్చు. అంతే కాదు. ఆమె ఒక అందమైన బిడ్డకు జన్మనిస్తున్నందువల్ల ఆనందకరమైన శ్రేయస్సును కలిగించే మంచి విషయంపై దృష్టి పెట్టవచ్చు.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.