Pregnancy Tests
8 November 2023 న నవీకరించబడింది
మీరు ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు అని భావిస్తుంటే, బహుశా గర్భనిరోధక వైఫల్యం లేదా అసురక్షిత సెక్స్ తరువాత, మీరు ఎప్పుడు ప్రెగ్నెన్సీ కోసం చెక్ చేసుకోవాలో తెలుసుకునేందుకు మీకు ఈ వ్యాసం ఉపయోగపడుతుంది.ఈ ప్రశ్న ఎప్పుడూ గందరగోళానికి గురి చేస్తుంది. కానీ దీనికి సమాధానం చాలా సులభమైనది. మీరు పరీక్ష (ప్రెగ్నెన్సీ టెస్టు)ను ఎంత ఆలస్యంగా చేసుకుంటే ఫలితం అంత ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఈ వ్యాసం తదుపరి భాగంలో వివరించబడింది.
రెండు వారాల నిబంధన (Two week rule)
ఈ ప్రశ్నకు సమాధానం ఈ రెండు-వారాల నిభందనలోనే ఉంది. కలయిక తర్వాత రెండు వారాల వరకు వేచి ఉండి.. ప్రెగ్నెన్సీ టెస్టు చేసుకోవాలని దాని అర్థం. 28 రోజులకి సరిగ్గా నెలసరి (మెనుస్ట్రువల్ (మంత్లీ) సైకిల్) వచ్చే మహిళలకు ఈ విధానం చాలా ఖచ్చితంగా పని చేస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి... ప్రస్తుత తరుణంలో చాలా మంది మహిళలకు 28 రోజుల్లో నెలసరి అనేది రావడం లేదు. గర్భనిరోధక చర్యలు, హార్మోన్ల మార్పులు,ఒత్తిడి, మరియు వివిధ రకాల మందులు వాడటం వలన ఇలా జరుగుతోంది.
నెలసరి తప్పిపోయిన తర్వాత (After missing period)
మీ నెలసరి మొదలవ్వాల్సిన రోజు లేదా మీ ఋతు క్రమం ఆలస్యం అవుతుందని మీకు అనిపించినప్పుడు మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు కూడా పరీక్ష గందరగోళ ఫలితాలను చూపిస్తే.. మీరు మరుసటి రోజు మరోసారి పరీక్ష చేసుకోవాలి. రోజు మొత్తంలో ఉదయం మీరు నిద్ర లేచిన తర్వాత పరీక్ష చేసుకునేందుకు ఉత్తమమైన సమయం. ఎందుకంటే ఆ సమయంలో hCG హార్మోన్ ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది. మీకు ఇప్పటికీ ప్రతికూల ఫలితం వస్తే... మరో రెండు రోజులు వేచి చూసి మళ్ళీ గర్భధారణ పరీక్ష చేస్కోండి. గర్భధారణ ప్రారంభ సమయంలో hCG హార్మోన్ల సంఖ్య రెండు రెట్లు వేగంగా పెరుగుతూ ఉంటుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రణాళిక లేకుండా గర్భం దాల్చటానికి కారణాలు ఏమిటి? ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి?
మహిళలు తరుచుగా ముందుస్తుగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని, వారు ప్రెగ్నెంట్ కాదనే నిర్ణయానికి వచ్చేస్తారు. మొదటి త్రైమాసికంలో మీకు రక్తస్రావం జరిగితే మీరు మరింత గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. అదనంగా.. మీ తర్వాతి నెలసరికి ముందు లేదా కలయిక తర్వాత రెండు వారాలకు టెస్ట్ చేసుకోవడం అనేది తప్పుడు ప్రతికూల ఫలితానికి దారి తీస్తుంది.
అపోహలు, మరియు అనవసరమైన చింతల నుంచి దూరంగా ఉంచేందుకు మేము మీకు ఖచ్చితమైన గర్భపరీక్షప్రక్రియ గురించి వివరించాం.
ఇంటి వద్దే టెస్టు చేసుకునే కిట్ (Home testing kit)
ప్రతీ మందుల దుకాణంలో ఈ సులహమైన ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అందుబాటులో ఉంటుంది.
టెస్టు చేసుకునేందుకు మీరు చేయాల్సిందేమిటి అంటే..
● ఒక కప్పులో మూత్రాన్ని సేకరించండి..
● టెస్టింగ్ కిట్ కొనను ఆ కప్పులో ఉంచండి.
● కొన్ని క్షణాల పాటు అలాగే పట్టుకుని ఉండండి.
● రెండు ఎరుపు గీతలు కనుక వస్తే మీకు సానుకూల ఫలితం వచ్చినట్టు..
● అలా కాకుండా ఒక ఎరుపు గీత వస్తే... మీకు ప్రతికూల ఫలితం వచ్చినట్టు..
మరో రకమైన టెస్ట్ కిట్‌లో మీ మూత్ర ప్రవాహానికి దగ్గరగా ఒక చిన్న పళ్ళెం ఉంచేలా ఉంటుంది. ఇది మీ మూత్రాన్ని గ్రహించి ఫలితాన్ని చూపుతుంది. ప్లస్ గుర్తు వస్తే పాజిటివ్ అని, మైనస్ గుర్తు వస్తే నెగటివ్ అని అర్థం.
టెస్ట్ రిజల్ట్ అనేది నెగటివ్ వస్తే.. మీరు ప్రెగ్నెంట్ కాకపోవచ్చు. కానీ అది అప్పుడప్పుడూ నిజం కాకపోవచ్చు. మీరు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది. అది ఎప్పుడంటే
● మీరు చేసుకున్న టెస్ట్ కిట్ గడువు ముగిసిపోయినప్పుడు.
● మీరు తప్పుగా టెస్టు చేసుకుని ఉన్నప్పుడు.
● మీరు చాలా ముందుగా టెస్టు చేసుకుని ఉంటే.
● మీరు టెస్టు చేసుకునే ముందు చాలా ద్రవాలను తీసుకోవడం వలన మీ మూత్రం పలచబడి ఉంటే.
● మీరు ఏమైనా మందులను వాడుతూ ఉంటే కనుక అవి ఫలితాన్ని తప్పుగా చూపి ఉండొచ్చు.
సురక్షితం కాని సెక్స్ తర్వాత మరియు మీ నెలసరి తప్పే ముందు, మీకు ఈ కింది లక్షణాలు కనిపించొచ్చు. ఇవి ప్రెగ్నెన్సీ అవకాశాన్ని సూచిస్తాయి.
● తిమ్మిర్లు (Cramps)
ప్రెగ్నెన్సీ మొదటి వారాల్లో మీకు మీ పొట్ట భాగంలో తిమ్మిర్లు వచ్చినట్లు అనిపిస్తుంటుంది. మీకు నెలసరి వచ్చే ముందు ఎలా అనిపిస్తూ ఉంటుందో అలా ఉంటుంది. కానీ అది ఆ కారణం వలన కాదు.
● రొమ్ముల్లో నొప్పులు (Brest pain)
మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో, మీ శరీరం ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్ హార్మోన్లను ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేస్తుంది. ఇవి కడుపులోని బిడ్డ పెరుగుదలకు తోడ్పడతాయి. అందువలన మీ రొమ్ములు లేతగా అనుభూతి చెంది, రక్తప్రవాహం పెరగడం వలన సాధారణ పరిమాణం కంటే కాస్త ఎక్కువగా పెరిగినట్టు మీకు అనిపిస్తుంది. అంతే కాకుండా రొమ్ముల్లోని సిరలు ముదురు రంగులో కనిపిస్తాయి మరియు మీ ఉరుగుజ్జులకు కాస్త నొప్పిగా అనిపించవచ్చు.
● అశాంతి (అన్-ఈజీ ఫీలింగ్) (Un-easy Feeling)
మీకు వికారంగా, అలసటగా,ఆహారం పట్ల విముఖతగా అనిపించవచ్చు. అతిగా మూత్రం రావడం, ఇంకా కొన్ని రకాల ఒళ్ళు నొప్పులు రావడం ఇలా మరి కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు.
సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఉండే స్త్రీలు పైన చెప్పిన సంకేతాలు కనిపిస్తే వెంటనే హోమ్ కిట్ ద్వారా టెస్ట్ చేసుకోవాలి. వారు సంతానోత్పత్తి సమయంలో కనుక ఉంటే, ప్రెగ్నెన్సీ అనేది ప్రతి నెలా సంభవిస్తుంది. మీకు ప్రెగ్నెన్సీ అని అనుమానంగా అనిపిస్తే, టెస్ట్ చేసుకోవడం అనేది ఉత్తమమైన ఎంపిక. కానీ రక్తపరీక్ష ద్వారా నిర్దారించుకోవడం తప్పనిసరి. డాక్టర్‌ను కలవడం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇంట్లో పదే పదే టెస్టు చేసుకుని కంగారు పడే బదులు డాక్టర్ వద్ద టెస్టు చేయించుకోవడం ఉత్తమం. హోమ్ కిట్ ద్వారా వచ్చిన ఫలితం గర్భధారణను నిర్ణయించదు. సెక్స్ తర్వాత ప్రెగ్నెన్సీని ఎప్పుడు చెక్ చేసుకోవాలో మీకు తెలుసుకోవాలని ఉంటే, మీరు గైనకాలజిస్ట్‌ను లేదా ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించండి. రక్త లేదా మూత్ర పరీక్ష, ఇంకా అల్ట్రా సౌండ్ ద్వారా మీరు ప్రెగ్నెన్సీని నిర్దారించుకోవచ్చు.
Tags:
Home testing kit in telugu, Pregnancy testing kit in telugu, positive pregnancy symptoms in telugu, how do i know im pregnant in telugu, when to do pregnancy test in telugu, negative pregnancy result in telugu, how to test for pregnancy in telugu.
Pregnancy Test After Sex in English, Pregnancy Test After Sex in Hindi, Pregnancy Test After Sex in Bengali, Pregnancy Test After Sex in Tamil
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips
గర్భధారణ ప్రారంభ దశలో తక్కువ హెచ్‌సిజి స్థాయిలకు కారణం ఏమిటి మరియు ఆహారం ద్వారా గర్భధారణ సమయంలో హెచ్‌సిజి స్థాయిలను ఎలా పెంచాలి
సంవత్సరాల తర్వాత సి-సెక్షన్ మచ్చలు ఎందుకు సమస్యగా ఉన్నాయి మరియు దాని గురించి మీరు ఏమి చేయవచ్చు? | Why are C-section scars a problem years later and what can you do about it in Telugu
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |