hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • జుట్టు చిక్కులు విడదీయడానికి ఆనియన్ హెయిర్ సీరమ్ ఉపయోగపడుతుందా? arrow

In this Article

    జుట్టు చిక్కులు విడదీయడానికి ఆనియన్ హెయిర్ సీరమ్ ఉపయోగపడుతుందా?

    జుట్టు చిక్కులు విడదీయడానికి ఆనియన్ హెయిర్ సీరమ్ ఉపయోగపడుతుందా?

    Updated on 3 November 2023

    జుట్టు పొడువుగా ఉన్నా, చిన్నగా ఉన్నా, కర్లీ హెయిర్ అయినా, స్ట్రెయిట్ హెయిర్ అయినా చిక్కులు పడటం సాధారణమైన సమస్యే. చిక్కులు పడ్డ జుట్టును మేనేజ్ చేయడం సమయంతో కూడుకున్నది. అంతేకాదు వెంట్రుకలు తెగిపోవడం, చివర్లు చీలిపోవడం లాంటి సమస్యలొస్తాయి. కర్లీ హెయిర్, ఫిజ్జీ హెయిర్ లాంటి శిరోజాలు త్వరగా చిక్కులు పడుతుంటాయి. అసలు జుట్టు ఏం కోరుకుంటుందో పట్టించుకోకుండా, అందరూ మంచి స్కిన్ ప్రొడక్ట్ కోసం డబ్బు, సమయం ఖర్చు చేస్తుంటారు. హెయిర్ సీరమ్ ఉపయోగించడం వల్ల శిరోజాల సంబంధమైన సమస్యల్ని తగ్గించి, చిక్కులు పడకుండా సాలిడ్‌గా ఉంచుతుంది.

    శిరోజాల చిక్కులు విడదీయడానికి మార్గం

    1. కండీషనర్ :

    చిక్కులు పడే జుట్టుకు మంచి కండీషనర్ ఉపయోగించడం మేలు చేస్తుంది. కండీషనర్‌తో జుట్టు మృదువుగా మారడమే కాకుండా పోషణ లభిస్తుంది. చిక్కుల్ని తగ్గిస్తుంది.

    2. హెయిర్ డీట్యాంగ్లింగ్ స్ప్రే

    తడి జుట్టుమీద ఉపయోగించినప్పుడు, డీట్యాంగ్లింగ్ స్ప్రే జుట్టు ముడులు పడకుండా చూస్తుంది. శిరోజాల రాపిడి తగ్గించి, చిక్కులు తీసేప్పుడు ఒత్తిడి కలగకుండా చూస్తుంది.

    3. హెయిర్ ఆయిల్

    తరచూ శిరోజాలకు నూనె రాయడం జుట్టుకు పోషణ అందించడమే కాకుండా, పొడిబారకుండా చేస్తుంది.

    4. పెద్ద పళ్లున్న దువ్వెన

    జుట్టు చిక్కులు పడ్డా, ముడులు పడ్డా పెద్ద పళ్లున్న దువ్వెన వాడితే శిరోజాలు రాలిపోకుండా జాగ్రత్తపడొచ్చు.

    5. హెయిర్ మాస్క్

    జుట్టు చిక్కులు పడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి శిరోజాలు పొడిబారడటమే. హెయిర్ మాస్క్ అప్లై చేయడం వల్ల జుట్టు మెత్తబడుతుంది. చిక్కులు తీయడానికి ఉపయోగపడుతుంది.

    6. హెయిర్ సీరమ్

    సీరమ్ అప్లై చేస్తే జుట్టు మెత్తబడి, ఎలాంటి డ్యామేజ్ లేకుండా చిక్కులు తీయడం సులువవుతుంది. తడి జుట్టుపై సీరమ్ ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మార్కెట్లో చాలా రకాల సీరమ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆనియన్ సీరమ్ ఉత్తమమనే చెప్పాలి. దీంతో శిరోజాలకు అనేక రకాల ప్రయోజనాలుంటాయి. అవేంటంటే.

    ఆనియన్ హెయిర్ సీరమ్ అంటే ఏంటీ?

    ఆనియన్ సీరమ్, ఉల్లిపాయల్లో సమృద్ధిగా లభించే సల్ఫర్‌తో ఉంటుంది. ఇది శిరోజాలను బలపర్చడమే కాకుండా, రాలిపోకుండా, జుట్టు డ్యామేజ్ కాకుండా సహాయపడుతుంది. మైలో కేర్ ఆనియన్ హెయిర్ సీరమ్ పొడిబారిన, చిక్కులు పడ్డ జుట్టును మేనేజ్ చేయడంలో ఉపయోగపడుతుంది. జుట్టు చిక్కుల సమస్యల్ని తగ్గించి మంచి హెయిర్‌స్టైల్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఉల్లిపాయలు, అవకాడో, అర్గన్, కొబ్బరి నూనె లాంటి సహజ పదార్థాలు జుట్టుకు పోషణ అందిస్తాయి. శిరోజాల కుదుళ్లను పటిష్టం చేసి, వెంట్రకలు చిట్లకుండా మృదువుగా, మెరిసే శిరోజాలను అందిస్తాయి. జుట్టుకు ఆనియన్ సీరమ్ ఉపయోగిస్తే తేమ నుంచి కాపాడటమే కాకుండా, మెరిసే, ప్రకాశవంతమైన శిరోజాలను అందిస్తుంది. దీంతో పాటు కాలుష్యం నుంచి జుట్టును కాపాడుతుంది. మంచి సత్ఫలితాలను పొందడం కోసం తల స్నానం చేసే సమయంలో సీరమ్ ఉపయోగించాలి. జుట్టు పెరిగేందుకు మైలో కేర్ ఆనియన్ సీరమ్ ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్ని రకాల శిరోజాలకు దీన్ని ఉపయోగించవచ్చు. గర్భవతులు, పాలిచ్చే తల్లులు కూడా ఉపయోగించడం సురక్షితం.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో జుట్టు రాలడం: కారణాలు మరియు చికిత్స

    ఆనియన్ సీరమ్‌తో ప్రయోజనాలు

    • చిక్కులు పడకుండా, పొడిబారకుండా కాపాడుతుంది.
    • జుట్టును మృదువుగా మార్చి, మెరిసేలా చేస్తుంది.
    • శిరోజాల్లో సరళతను పెంచుతుంది.
    • చిక్కుల్ని తగ్గిస్తుంది.
    • యూవీ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది.

    ఆనియన్ హెయిర్ సీరమ్ ఉపయోగించడం వల్ల అదనపు ప్రయోజనాలు:

    1. జుట్టు పెరుగుదల

    ఆనియన్ హెయిర్ గ్రోత్ సీరమ్‌లో శిరోజాల మూలాలకు రక్తప్రవాహాన్ని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫలితంగా, జుట్టును పెంచడంతో పాటు, మెరిసే జుట్టు కోసం హెయిర్ ఫోలికల్స్ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

    2. మెరిసే జుట్టు

    ఇందులో సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో జుట్టు మెరుస్తుంది.

    3. డాండ్రఫ్ కంట్రోల్

    సీరమ్‌లో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు తలపై ఉండే చర్మం ఇన్ఫెక్షన్స్‌కి గురి కాకుండా చేయడంతో పాటు చుండ్రును నివారిస్తుంది.

    4. హెయిర్ కండీషన్

    తరచూ ఆనియన్ హెయిర్ సీరమ్ ఉపయోగించడం వల్ల జుట్టుకు మంచి కండీషన్ లభించడంతో పాటు, పొడిబారకుండా, చిక్కులు పడకుండా చేస్తుంది. జుట్టును పెరిగేలా చేస్తుంది.

    5. తెల్ల జుట్టు సమస్యకు చెక్

    ఆనియన్ హెయిర్ గ్రోత్ సీరమ్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో త్వరగా జుట్టు నెరవకుండా ఉపయోగపడుతుంది. శిరోజాల్లో pH లెవెల్స్‌ని నియంత్రిస్తుంది.

    6. హెయిర్ టెక్స్చర్‌ను మెరుగుపరుస్తుంది

    తరచూ ఆనియన్ సీరమ్ ఉపయోగించడం వల్ల జుట్టు మెరుస్తూ, మృదువుగా, చిక్కులు లేకుండా కనిపిస్తుంది.

    శిరోజాల పెరుగుదల కోసం హెయిర్ సీరమ్ ఎలా అప్లై చేయాలి?

    • అరచేతుల్లోకి కొన్ని చుక్కల ఆనియన్ సీరమ్ తీసుకోవాలి.
    • తల స్నానం చేసి, టవల్‌తో ఆరబెట్టిన జుట్టుపై ఆనియన్ సీరమ్ అప్లై చేయాలి.
    • శిరోజాల మొదళ్ల నుంచి మధ్యలోకి నెమ్మదిగా అప్లై చేయాలి.
    • ఆ తర్వాత సీరమ్‌ను తలపై అప్లై చేయాలి.
    • శిరోజాలు జిడ్డుగా మారకుండా ఉండేందుకు, సీరమ్‌ను కుదుళ్లకు అప్లై చేయకూడదు.

    ఆనియన్ హెయిర్ గ్రోత్ సీరమ్‌ను రోజూ ఉపయోగించవచ్చా?

    రోజూ ఆనియన్ సీరమ్ ఉపయోగించకూడదు. తల స్నానం చేసిన రోజు సీరమ్ ఉపయోగించడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది.

    శిరోజాలు చిక్కులు పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు

    జుట్టు పొడిగా, రఫ్‌గా ఉంటే వెంటనే చిక్కులు పడుతుంది. ఫలితంగా జుట్టు డ్యామేజ్ అవుతుంది. జుట్టు చిక్కులు పడనివ్వకుండా ఉంచేందుకు ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.

    • జుట్టు తడిగా ఉన్నప్పుడు నిద్రపోకూడదు.
    • తల స్నానం చేసేముందు తల దువ్వుకోవాలి.
    • షాంపూను మాడుపై అప్లై చేయాలి. జుట్టుకు కాదు.
    • జుట్టు ఆరేందుకు టవల్ చుట్టి ఉంచకూడదు.
    • జుట్టును కవర్ చేయకూడదు.
    • జడ వేసుకొని నిద్రపోకూడదు.

    చివరగా

    ఆనియన్ బేస్డ్ సీరమ్ ఉపయోగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పొడిగా, గరుకుగా, చిక్కులతో ఉన్న జుట్టును మేనేజ్ చేయొచ్చు. చిక్కులు పడ్డ జుట్టు నుంచి స్వేచ్ఛను గ్యారెంటీగా అందించే మైలో కేర్ ఆనియన్ హెయిర్ సీరమ్ మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ప్రొడక్ట్. కాబట్టి ఈ రోజే ఈ ప్రొడక్ట్ ను సొంతం చేసుకోండి.

    Anti-Hairfall Onion Hair Serum - 50 ml

    Strengthens Hair | Eases Detangling | Keeps Hair Healthy | Nourishes Hair

    ₹ 159

    4.3

    (101)

    6369 Users bought

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.