hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Diet & Nutrition arrow
  • గర్భవతులు సోయాబీన్ తినడం వల్ల లాభాలు, నష్టాలు ముఖ్యమైన సలహాలు | Soybean in Pregnancy: Benefits, Risks, and Tips in Telugu arrow

In this Article

    గర్భవతులు సోయాబీన్ తినడం వల్ల లాభాలు, నష్టాలు ముఖ్యమైన సలహాలు | Soybean in Pregnancy: Benefits, Risks, and Tips in Telugu

    Diet & Nutrition

    గర్భవతులు సోయాబీన్ తినడం వల్ల లాభాలు, నష్టాలు ముఖ్యమైన సలహాలు | Soybean in Pregnancy: Benefits, Risks, and Tips in Telugu

    3 November 2023 న నవీకరించబడింది

    సోయ్ బీన్, లేదా సోయా బీన్, తూర్పు ఆసియాకు చెందిన చిక్కుడు జాతికి చెందినది. దీన్ని సాధారణంగా శాకాహారులు మాంసానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది ప్రోటీన్ ను ఎక్కువమోతాదులో కలిగి ఉంటుంది. ఇది మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో యాసిడ్లను కలిగి ఉన్నందున ఇది పూర్తి ప్రోటీన్. సోయాబీన్స్ అనేక రూపాల్లో లభిస్తాయి. అవన్నీ యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైటోన్యూట్రియెంట్లను కలిగి ఉంటాయి. ఇవి బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే.. దీని దుష్ప్రభావాల గురించి కొందరు ఆందోళన చెందుతుంటారు కూడా. ముఖ్యంగా గర్భధారణ సమయంలో సోయాబీన్ - ఇది మంచిదా, చెడ్డదా?

    గర్భధారణ సమయంలో సోయాబీన్స్ తినడం సురక్షితమేనా? (Is it safe to eat soybeans in pregnancy in Telugu)

    అవును. వాటిని మితంగా తీసుకుంటే గర్భధారణ సమయంలో సోయాబీన్ తినడం సురక్షితమే. సోయా బీన్ అనేక రూపాల్లో లభిస్తుంది. అయితే సోయాముక్కలతో (సోయ్ చంక్స్) సహా అన్నింటికీ, ప్రయోజనాలు, నష్టాలుకూడా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలకు సోయాముక్కలు మంచిదా, కాదా అనే సందర్భం వచ్చినప్పుడు - గర్భధారణ సమయంలో సోయాముక్కలు వారికి అవసరమైన ప్రోటీన్ అందించడానికి దోహదపడతాయి. కానీ, వాటిలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచే ఐసోఫ్లేవోనులను అధిక మోతాదులో కలిగి ఉంటాయి. కాబట్టి.. గర్భధారణ సమయంలో సోయాముక్కలను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. టోఫులో ముక్కల కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, కానీ ఎక్కువ టోఫు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. సోయా పాలలో టోఫు కంటే తక్కువ కేలరీలు ఉంటాయి. కానీ ఎక్కువ సోయా పాలు జీర్ణ సమస్యలు మరియు మలబద్దకాన్ని కలిగిస్తాయి. గర్భధారణ సమయంలో సోయాబీన్ సరిగ్గా ఉడికించి మితంగా ఉపయోగిస్తే సురక్షితం.

    సోయాబీన్స్ పోషక విలువలు (Soybeans nutritional value in Telugu)

    సోయాబీన్ లో ప్రోటీన్ ప్రధాన భాగం. ఇందులో ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అవి ఏమిటి?

    1. 100 గ్రాముల ఉడకబెట్టిన సోయాబీన్స్ యొక్క పోషక విలువలు క్రింది విధంగా ఉన్నాయి:
    2. ఇందులో 18.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఉడకపెట్టని సోయాబీన్సులో ప్రోటీన్ కంటెంట్ 36 నుండి 56% వరకు ఉంటుంది.
    3. కార్బోహైడ్రేట్లు సుమారు 8.4 గ్రాములు. ఇది తక్కువ గ్లైసెమిక్ ను కలిగి ఉంటుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగే ప్రమాదం లేకపోలేదు.
    4. ఫ్యాట్ కంటెంట్ 9 గ్రాములు ఉంటుంది. దీనిని 1.3 గ్రాముల శాచురేటెడ్ ఫ్యాట్, 1.98 గ్రాముల మోనోశాచురేటెడ్ ఫ్యాట్ మరియు 5.06 గ్రాముల పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాట్ గా విభజించవచ్చు. సోయాబీన్స్ లో ముఖ్యమైన ఫ్యాట్ - లినోలెయిక్ యాసిడ్.
    5. ఫైబర్ కంటెంట్ 6 గ్రాములు ఉంటుంది. ఇది కరిగే మరియు కరగని ఫైబర్లను కలిగి ఉంటుంది.
    6. చక్కెర సుమారు 3 గ్రాములు ఉంటుంది.
    7. ఇందులో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఒక అర కప్పులో సుమారు 510 మి.గ్రా ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటుంది.
    8. పైన పేర్కొన్నవి కాకుండా, మాంగనీస్, రాగి, ఫోలేట్, థియామిన్, భాస్వరం మరియు విటమిన్ కె 1 వంటి అనేక రకాల ఖనిజాలను కలిగి ఉంటుంది.
    9. 100 గ్రాముల సోయాబీన్స్ లో కేలరీల సంఖ్య 172.

    గర్భధారణ సమయంలో సోయాబీన్ యొక్క ప్రయోజనాలు (Benefits of soybean in pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో సోయా తినడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి.

    • సోయాబీన్ ప్రోటీన్ కు దోహదకారి కాబట్టి, ఇది శిశువుల మెదడుతో సహా అన్ని అవయవాల పెరుగుదలను నిర్ధారిస్తుంది. అంతేకాక, ఇది శిశువులలో రక్తం మరియు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది.
    • సోయాబీన్ లోని ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్సు శిశువు యొక్క మెదడు మరియు రెటీనా యొక్క బిల్డింగ్ బ్లాక్లుగా పనిచేస్తాయి. ముఖ్యంగా సోయాబీన్ పెరినాటల్ డిప్రెషన్ ను నివారిస్తుంది.
    • సోయాబీన్ లోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
    • సోయాబీన్స్ లోని ఖనిజాలు చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి మరియు పిండానికి పోషణను అందిస్తాయి.
    • సోయాబీన్ లోని కార్బోహైడ్రేట్లు శక్తి స్థాయిలను పెంచుతాయి.
    • సోయాబీన్ లోని ఫోలేట్ మరియు జింక్ పుట్టుకతో వచ్చే లోపాలను దూరం చేస్తాయి.

    గర్భధారణ సమయంలో సోయాబీన్ యొక్క ప్రమాదాలు (Risks of soybean during pregnancy in Telugu)

    1. ఐసోఫ్లేవోన్లు (Isoflavones)

    సోయాబీన్ లోని ఐసోఫ్లేవోన్లు ఫైటోఈస్ట్రోజెన్లు మరియు మానవ ఈస్ట్రోజెన్ల మాదిరిగానే లక్షణాలను కలిగి ఉంటాయి. గర్భధారణ సమయంలో సోయాబీన్స్ ఎక్కువగా తీసుకోవడం శిశువు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.

    2. ఫైటిక్ యాసిడ్ (Phytic acid)

    ఇది ఫైటిక్ యాసిడ్ ను కూడా కలిగి ఉంటుంది, అందువల్ల సీసం మరియు పాదరసం వంటి హానికరమైన లోహాలను శరీరంలోనికి చేరకుండా నిరోధిస్తుంది. కానీ అదేవిధంగా, శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, కాల్షియం, ఇనుము మరియు జింక్ వంటి ఖనిజాలను కూడా శరీరం స్వీకరించకుండా నిరోధించగలదు. అవన్నీ గర్భధారణ సమయంలో అవసరమైన ఖనిజాలు. అవి పిండం పెరుగుదలకు సహాయపడతాయి. కాబట్టి వాటిని అడ్డుకోవడం వల్ల తల్లికి, శిశువుకు ఇబ్బంది కలగవచ్చు.

    3. పురుగుమందులు (Pesticides)

    సోయాబీన్స్ లో ఉండే పురుగుమందుల అవశేషాలు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి, అవి గర్భవతులకు మంచిది కాదు. కనుక వండే ముందు బాగా కడగాలి.

    4. ఈస్ట్రోజెన్ (Estrogen)

    సోయా బీన్స్ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతాయి కాబట్టి, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్.

    గర్భధారణ సమయంలో సోయా ముక్కలను ఎక్కువగా తీసుకోవడం హానికరమా? (Is it Harmful to Consume too many Soya Chunks During Pregnancy in Telugu)

    గర్భధారణలో సోయా ముక్కలపై అధ్యయనాలు పూర్తిస్థాయిలో జరగలేదు. కొన్ని అధ్యయనాలు జంతువులు మరియు ఎలుకలపై నిర్వహించబడ్డాయి. కొన్ని అధ్యయనాల నివేదికలు క్రింద చూడవచ్చు. 2012 లో జరిగింది అధ్యయనం సోయాలోని ఫైటోఈస్ట్రోజెన్లు శిశువు యొక్క పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని హెచ్చరించింది. సోయా బీన్స్ అధికంగా తీసుకోవడం వల్ల శిశువులకు హైపోస్పాడియాస్ అని పిలువబడే యూరాలజికల్ డిజార్డర్ వచ్చే ప్రమాదం ఉందని 2013 లో జరిపిన ఒక అధ్యయనం చూపిస్తుంది. 2016 లో ఎలుకలపై చేసిన మరొక అధ్యయనం ఎక్కువ సోయా బీన్స్ శిశువు యొక్క రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని, ముఖ్యంగా ఆడపిల్లలలో. కాబట్టి, గర్భధారణ సమయంలో సోయా ఎక్కువగా తినకుండా ఉండటం మంచిది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణలో ప్రోటీన్ పౌడర్: ప్రయోజనాలు, ప్రమాదాలు & మరిన్ని

    గర్భిణీ స్త్రీ ఎంత సోయా తీసుకోవాలి? (How much soy should a pregnant woman consume in Telugu)

    గర్భిణీ స్త్రీ ఎంత సోయాబీన్స్ తినవచ్చనే దానిపై అధికారిక పరిమితులు లేవు. అయినప్పటికీ, గర్భధారణలో ఒక కప్పు సోయా పాలు లేదా అర కప్పు టోఫు లేదా అర కప్పు సోయా ముక్కలు లేదా అర కప్పు మొత్తం సోయాబీన్సు తీసుకోవచ్చని నిపుణులు సిఫార్సు చేశారు. దీనికంటే మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే.. అది కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో ఎంత సోయా తినాలి అనే దానిపై నిర్దిష్ట సిఫార్సులను పొందడానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది.

    References

    1. Pang X, Cai C, Dong H, Lan X, Zhang Y, Bai D, Hao L, Sun H, Li F, Zeng G. (2022). Soy foods and nuts consumption during early pregnancy are associated with decreased risk of gestational diabetes mellitus: a prospective cohort study. J Matern Fetal Neonatal Med.

    2. Miyake Y, Tanaka K, Okubo H, Sasaki S, Tokinobu A, Arakawa M. (2021). Maternal consumption of soy and isoflavones during pregnancy and risk of childhood behavioural problems: the Kyushu Okinawa Maternal and Child Health Study. Int J Food Sci Nutr.

    Tags

    What is soybean in Telugu, Soybean in pregnancy in Telugu, Is it safe to eat soybean in preganancy in Telugu, Benefits of eating soybean in pregnancy in Telugu, What are the risk of eating soybean in pregnancy in Telugu, Soybean in Pregnancy in English, Soybean in Pregnancy in Hindi, Soybean in Pregnancy in Tamil, ⁠Soybean in Pregnancy in Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.