Diet & Nutrition
14 September 2023 న నవీకరించబడింది
గర్భవతిగా ఉన్నప్పుడు పాస్తా తినాలన్న కోరిక మహిళల్లో ఎక్కువగా ఉండటం సహజమే. కానీ పాస్తా తినొచ్చా లేదా అన్న ఆందోళన వారిని వెంటాడుతూ ఉంటుంది. సాధారణంగా ఇంట్లో తయారుచేసిన పాస్తాను గర్భవతిగా ఉన్నప్పుడు మితంగా తీసుకోవచ్చు. ఎలాంటి హాని ఉండదు. కానీ పాస్తా తినాలనుకుంటే ముందుగా పాస్తా నాణ్యతపై దృష్టిపెట్టాలి. ఉదాహరణకు, హోల్ వీట్ పాస్తా లాంటి ఆరోగ్యకరమైన ఆప్షన్ ఎంచుకోవాలి. పాస్తా మితంగా తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు.. పాస్తా శక్తిని ఇస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రక్తహీనతపై పోరాడుతుంది. ఒకవేళ పాస్తా అతిగా తింటే పోషకాలను సరిగ్గా గ్రహించకపోవడం లేదా ఇన్ఫెక్షన్స్ బారినపడటం లాంటి ప్రమాదాలు ఉంటాయి.
అవును, గర్భవతిగా ఉన్నప్పుడు పాస్తా మితంగా తినొచ్చు. పాస్తా మాత్రమే తీసుకోవాలి. స్టోర్స్‌లో దొరికే రెడీమేడ్ స్పఘెట్టీ లాంటివి తీసుకోకూడదు. అవి అనారోగ్యకరమైనవి. ఇక పాస్తా ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.
పాస్తా రుచికరమైన, అద్భుతమైన వంటకం. కాబోయే తల్లులు పాస్తా తినాలనుకుంటే ముందుగా వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ఏది తినాలి, ఏది తినకూడదు అన్న అవగాహన పెంచుకోవాలి.
రెగ్యులర్ పాస్తా రిఫైన్డ్ గోధుమ పిండితో తయారు చేస్తారు. శుద్ధీకరణ ప్రక్రియలో బయటి పొర, లోపలి జెర్మ్ పొర తీసివేస్తారు. పిండి ఎండోస్పెర్మ్‌ను వదిలివేస్తుంది.
హోల్ గ్రెయిన్ పాస్తాలో గోధుమ కెర్నల్‌లోని మూడు పోషక పొరలను కలిగి ఉంటుంది. తవుడు, జెర్మ్, ఎండోస్పెర్మ్ ఉంటాయి. వీటిలో సూక్ష్మపోషకాలు, పీచుపదార్థం ఉంటాయి. రెగ్యులర్ పాస్తాతో పోలిస్తే, ఈ పాస్తా తింటే ఎక్కువ సంతృప్తి కలుగుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. రక్తపోటును తగ్గించడంతో పాటు, టైప్ 2 డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధి లాంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది.
వైట్ బ్లెండ్, హోల్ వీట్ పాస్తా పేరులో ఉన్నట్టే ప్రాసెస్ చేసిన గోధుమ పిండి, సంపూర్ణ గోధుమలతో చేసిన పిండిని కలిపి తయారు చేస్తారు. ఇవి పూర్తిగా తృణధాన్యాలతో తయారు చేయబడిన రకాల కంటే తక్కువ నమలితే చాలు. స్టాండర్డ్ వైట్ పాస్తా కన్నా పోషకాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. సాంప్రదాయ రకం నుంచి సంపూర్ణ గోధుమలకు మారడానికి ఇది ఉపయోగపడుతుంది.
పాస్తా సంక్లిష్ట పిండి పదార్థాలకు మూలం. శక్తిని ఆలస్యంగా విడుదల చేస్తూ స్థాయిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది.
పాస్తాలో లో-గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఫలితంగా.. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్‌ని నియంత్రిస్తుంది. గర్భధారణ మధుమేహం నివారణలో సహాయపడుతుంది.
రక్తపోటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాస్తాలో ఉప్పు చాలా తక్కువగా ఉంటుంది. అది రక్తపోటుపై ప్రభావం చూపించదు.
గర్భవతిగా ఉన్నప్పుడు హెమరాయిడ్స్, మలబద్ధకాన్ని నివారించడంలో గోధుమ పాస్తా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి.
పాస్తాలో ఐరన్ ఉంటుంది కాబట్టి గర్భవతులు రక్తహీనతపై పోరాడవచ్చు.
విటమిన్ బీ పొందడానికి పాస్తా ఉపయోగపడుతుంది. గర్భంలోని పిండం అభివృద్ధికి విటమిన్ బీ అవసరం.
గర్భస్థ శిశువు ఎదుగుదలలో అసాధారణతలు లేకుండా ఉండేందుకు, గర్భవతులకు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ పాస్తాలో ఉంటుంది.
పాస్తాలో విటమిన్ ఏ కూడా ఉంటుంది. శ్లేష్మ పొర సమగ్రతను కాపాడటానికి ఇది తోడ్పడుతుంది. గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది.
గర్భధారణ సమయంలో ఆకలి వేసినప్పుడు తినడానికి పాస్తా మంచి ఆప్షన్ అయినా.. తరచూ పాస్తా తినడం మంచిది కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. పాస్తాను అతిగా తీసుకోవడం వల్ల ఈ కింది సమస్యలు రావొచ్చు-
గర్భవతిగా ఉన్నప్పుడు పాస్తా తినాలన్న కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా పాస్తాపై ఆధారపడకుండా మీ ఆకలిని తీర్చడానికి ఆరోగ్యకరమైన ఆప్షన్స్ గురించి ఆలోచించాలి. ఉదాహరణకు.. చిన్న ప్లేట్‌లో పాస్తా, సోడియం తక్కువగా ఉన్న టమాటా కెచప్‌తో తీసుకోవచ్చు. చక్కెర, కేలరీలు ఎక్కువగా లేకుండా.. మీ ఆకలిని సంతృప్తిపర్చవచ్చు. పాస్తా తినాలన్న కోరికలు మరీ ఎక్కువగా ఉంటే, ఓసారి వైద్యులతో మాట్లాడి వారి సలహా తీసుకోవాలి. పాస్తా కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. కడుపులోని పిండం అభివృద్ధికి మంచిది. కానీ ఏదైనా అతిగా తీసుకుంటే మంచిది కాదు. పాస్తా విషయంలోనూ అంతే. మితంగా తీసుకోవడం మంచిది.
References
1. Chen X, Zhao D, Mao X, Xia Y, Baker PN, Zhang H. (2016). Maternal Dietary Patterns and Pregnancy Outcome. Nutrients.
2. Ito M, Maruyama-Funatsuki W, Ikeda TM, Nishio Z, Nagasawa K, Tabiki T, Yamauchi H. (2012). Evaluation of fresh pasta-making properties of extra-strong common wheat (Triticum aestivum L.). Breed Sci.
Can I eat Pasta during pregnancy in Telugu, Types of Pasta in Telugu, What are the benefits of pasta during pregnancy in Telugu, What are the risk of eating pasta during pregnancy in Telugu, Pasta craving during pregnancy in Telugu, Pasta During Pregnancy | Benefits & Risks in English, Pasta During Pregnancy | Benefits & Risks in Hindi, Pasta During Pregnancy | Benefits & Risks in Tamil, Pasta During Pregnancy | Benefits & Risks in Bengali
Yes
No
Written by
kakarlasirisha
kakarlasirisha
గర్భవతులకు ఉసిరి: లాభాలు, భద్రత, మరిన్ని వివరాలు | Amla In Pregnancy: Benefits, Safety & More in Telugu
గర్భవతిగా ఉన్నప్పుడు చామదుంప తినడం మంచిదా? కాదా? | Arbi In Pregnancy: Is It Safe Or Not in Telugu
మీ బేబీ బాటిల్ స్టెరిలైజర్ క్లీనింగ్ గురించి ఈ విషయాలు తెలుసా? తప్పకుండ తెలుసుకోండి (Do You Know These Things About Your Baby Bottle Sterilizer in Telugu!)
గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తినొచ్చా?: ప్రయోజనాలు, అపోహలు | Coconut in Pregnancy: Benefits & Myths in Telugu
గర్భధారణ సమయంలో క్వినోవా - ప్రయోజనాలు, మార్గదర్శకాలు | Quinoa During Pregnancy Benefits & Guidelines in Telugu
మీ బిడ్డకు హాని కలిగించే ఆహారాలు| Foods Which Can be Harmful for Your Baby in Telugu
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Blackheads & Pimples | Skin Moisturizer | Skin Irritation | Shop By Ingredient | Kumkumadi | Ubtan | Vitamin C | Tea Tree | Aloe Vera | Rose Water | Skin - Hair | SHOP BY CONCERN | Hairfall | Dry and Damaged Hair | Hair Growth | Shop By Ingredient | Onion | Coconut | Skin - Fertility | By Concern | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |