Want to raise a happy & healthy Baby?
Placental Abruption
4 April 2023 న నవీకరించబడింది
గర్భాశయంలో ఉండే మాయ ను ప్లాసెంటా అని కూడా పిలుస్తారు. ఇది 500 నుండి 600 గ్రాముల బరువుతో 10 అంగుళాల పొడవు, 1 అంగుళం మందంతో ఉంటుంది. అసలు మాయ అంటే ఏమిటి? మాయ వల్ల ఉపయోగం ఏమిటి, గర్భం దాల్చిన సమయంలో మాయ ప్రమాదకరంగా మారే అవకాశాలు ఏంటి? అన్న విషయాలు ఈ ఆర్టికల్ లో చర్చించబడ్డాయి.
గర్భం ధరించిన తరువాత ప్రతి శిశువుకి తల్లి తీసుకునే ఆహరం నుంచే పోషకాలు అందుతూ ఉంటాయి. అందుకే ప్రతి గర్భిణీ సమయానికి తగినంత ఆహరం తీసుకుంటూ ఉండాలి. అయితే.. తల్లి తీసుకున్న ఆహరం నుంచి బిడ్డకు పోషకాలు ఎలా అందుతాయో తెలుసా? తల్లి గర్భంలో ఉండే మాయ ద్వారా అందుతాయి. తల్లికి, తల్లి గర్భంలో పెరిగే శిశువుకు మధ్య ఉండే లింక్ "మాయ". ఈ మాయ గర్భధారణ సమయంలో గర్భాశయ లైనింగ్ నుంచి అభివృద్ధి చెందుతుంది. బిడ్డకు ఆహరం అందించడంలోనే కాకుండా.. పిండం రక్తంలోని వ్యర్ధాలను శుభ్రపరచడంలో కూడా సాయం చేస్తుంది.
ప్లాసెంటా అనేది ఎల్లప్పుడూ శరీరంలో ఉండే అవయవం కాదు. కేవలం గర్భధారణ సమయంలో మాత్రమే స్త్రీలలో ఈ అవయవం ఏర్పడుతుంది. పిండం గర్భంలోకి ప్రవేశించిన తరువాత 8 నుంచి 10 వారాల సమయంలో ప్లాసెంటా పూర్తిగా ఏర్పడుతుంది. బిడ్డ పుట్టేవరకు ఇది గర్భాశయంలోనే ఉంటుంది.
బిడ్డకు అవసరమైన పోషకాలను తల్లి తీసుకునే ఆహరం ద్వారా అందించడంలో ప్లాసెంటా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే.. ప్లాసెంటా కారణంగా ఏర్పడే కొన్ని పరిస్థితులు గర్భధారణ సమయంలో కొన్ని సమస్యలను కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్లాసెంటా, బొడ్డు తాడు శిశువు గర్భంలో ఉన్నప్పుడు కీలక పాత్రని పోషిస్తాయి. గర్భంలో ఉన్న బిడ్డకి ప్లాసెంటా ఆక్సిజెన్, అవసరమైన పోషకాలను అందిస్తూ ఉంటుంది. అలాగే.. శిశువుకి ఇబ్బంది కలిగించే కార్బన్ డై యాక్సయిడ్ ను తొలగించి రక్త ప్రసరణను కూడా సులభతరం చేస్తుంది. బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే హార్మోన్లను తయారు చేయడంలో కూడా ప్లాసెంటా కీలక పాత్ర పోషిస్తుంది. ప్లాసెంటా గర్భాశయానికి ఒక చివరగా మొదలవుతుంది. అలాగే శిశువు బొడ్డుకు కనెక్ట్ అయి ఉంటుంది.
ప్లాసెంటా కారణంగా కూడా కొన్ని సార్లు అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనినే ప్లాసెంటా అబార్షన్ అని పిలుస్తారు. యోని నుంచి రక్తస్రావం అవ్వడం అనేది ప్లాసెంటాల్ అబార్షన్ యొక్క ప్రాధమిక కారణం. అయితే అందరిలోనూ ఈ రక్తస్రావం లక్షణాలు కనిపించకపోవచ్చు. గర్భాశయ కుహరంలో ప్లాసెంటా అభివృద్ధి చెందితే శిశువుకు పోషకాలను అందించడం కష్టమవుతుంది. ఇలాంటి సిట్యుయేషన్ లో సిజేరియన్ చేయాల్సి వస్తుంది.
శిశువు బయటకు వచ్చేసిన తరువాత ప్లాసెంటా తన పని తీరుని నిలిపేస్తుంది. దానికదే క్షీణించబడుతుంది. అలాగే.. సి సెక్షన్ సమయంలో దీనిని తీసివేస్తారు. శిశువు గర్భం నుంచి వేరు చేయబడుతుంది. గర్భాశయం లోపల ఎక్కడైనా ప్లాసెంటా పెరిగే అవకాశం ఉంది. అయితే.. గర్భాశయ ముఖ ద్వారం వద్ద మాత్రం ప్లాసెంటా పెరిగితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Yes
No
Written by
Swetha Rao
గర్భధారణ సమయంలో పిండం పెరుగుదల మరియు అభివృద్ధి
గర్భధారణలో బరువు తగ్గడం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి?
గర్భధారణ సమయంలో హైడ్రోక్సీప్రొజెస్టెరోన్ ఇంజెక్షన్: మీరు తెలుసుకోవలసిన విషయాలేంటి?
గర్భధారణ సమయంలో UTIలను ఎలా ఎదుర్కోవాలి: నివారణ, చికిత్సలు మరియు చిట్కాలు
గర్భిణీ స్త్రీ ఫోలిక్ యాసిడ్ ఎప్పుడు తీసుకోవాలి?
గర్భధారణ సమయంలో సపోటా తినడం సురక్షితమేనా?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Fertility For Him | By Ingredient | Chamomile | Shatavari | Ashwagandha | Myo-inositol | Skin - Pregnancy & New Mom | By Concern | Stretch Marks Cream | Maternity Wear | Lactation | Maternity Gear | Shop By Ingredient | Dhanwantaram | Shea Butter | Skin - Daily Wellness | By Concern | Digestive Health | Immunity | By Ingredient | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |