Early Pregnancy
23 May 2023 న నవీకరించబడింది
ఇది వింతగా అనిపించినప్పటికీ, మీ గర్భం యొక్క మొదటి వారం మీ చివరి పీరియడ్ తేదీని బట్టి నిర్ణయించబడుతుంది. మీరు ఆ సమయంలో గర్భవతి కాకపోయినా, మీ చివరి పీరియడ్ నే గర్భం యొక్క మొదటి వారంగా పరిగణించబడుతుంది. 1 నుండి 4 వారాల వరకు, సెల్యులార్ స్థాయిలో ఏమీ మారదు. ఫలదీకరణ చెందిన గుడ్డు ఒక బ్లాస్టోసిస్ట్ (ద్రవంతో నిండిన కణాల సేకరణ) ను ఉత్పత్తి చేస్తుంది, ఇది శిశువు యొక్క అవయవాలు మరియు శరీర భాగాలుగా అభివృద్ధి చెందుతుంది. ఫలదీకరణం చెందిన తరువాత 10 నుండి 14 రోజులలో (4వ వారం) గర్భాశయ లైనింగ్ అయిన ఎండోమెట్రియం (గర్భకోశపు పొర) లో, బ్లాస్టోసిస్ట్ అమర్చబడుతుంది. ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్( రక్తస్రావం)కి దారితీయవచ్చు, దీన్ని లైట్ పీరియడ్ గా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది అందరికీ జరగదు. ఒకవేళ ఇది జరిగితే, సాధారణంగా మీ పీరియడ్ ప్రారంభమయ్యే సమయానికి ఇది జరుగుతుంది.
ఈ క్రిందివి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ యొక్క కొన్ని లక్షణాలు:
ప్రతి ఎపిసోడ్ గులాబీ, ఎరుపు లేదా గోధుమ రంగులో ఉండవచ్చు.
ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ తరచుగా మీ సాధారణ రుతుస్రావం కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇది తరచుగా తేలికపాటి రక్తస్రావంగా వర్గీకరించబడుతుంది. ఇది ఎప్పుడూ ప్రవాహంగా మారదు మరియు టాంపోన్ ఉపయోగించడం అవసరం కాదు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రతి స్త్రీ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన గర్భధారణ ఇంప్లాంటేషన్ యొక్క సంకేతాలు
ఇందులో అసౌకర్యం సాధారణ పీరియడ్ లో వచ్చే తిమ్మిరి కంటే తక్కువగా ఉంటుంది. ఇది తిమ్మిరిగా మారవచ్చు .ఇవి సాధారణంగా తక్కువగానే ఉన్నప్పటికీ తేలికపాటి, సాధారణంగా లేదా తీవ్రంగా ఉండవచ్చు.
ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ సాధారణంగా మూడు రోజుల కంటే తక్కువ ఉంటుంది మరియు చికిత్స అవసరం ఉండదు. ఇది కొన్నిసార్లు కొన్ని గంటలు మాత్రమే ఉండవచ్చు. అందువల్ల, చాలా మంది మహిళలకు, గర్భధారణ లక్షణాలు నాలుగవ వారం వరకు ప్రారంభం కావు. కానీ ప్రతి స్త్రీ ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి పీరియడ్స్ తప్పిపోయే ముందే కొంతమంది స్త్రీలు కొన్ని ప్రారంభ ప్రెగ్నెన్సీ లక్షణాలను అనుభవించవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: పీరియడ్స్ దాటిపోవడానికి ముందే తెలిసే ప్రెగ్నెన్సీ లక్షణాలు ఏమిటి?
ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ములు పెద్దవిగా, వాపుగా మరియు సున్నితంగా ఉంటాయి. ఈ మార్పులు మీ పీరియడ్స్ వచ్చే ముందు రోజులలో మీరు గమనించిన మార్పులలానే ఉంటాయి. చనుమొన చుట్టూ ఉన్న చర్మం నల్లబడుతుంది మరియు రొమ్ములోని సిరలు ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి మరియు ఈ లక్షణాలు పీరియడ్స్ మిస్ కాకముందు కూడా కనిపించవచ్చు.
"మార్నింగ్ సిక్నెస్ అనేది ప్రెగ్నెన్సీ ప్రాథమిక లక్షణాలలో ఒకటి." "వాంతితో, లేదా వాంతి లేకుండా కూడా వికారం ఉండవచ్చు," అని డాక్టర్ ప్రీతి చెప్పారు. "ఇది సాధారణంగా గర్భం దాల్చిన ఒక నెల తర్వాత ప్రారంభమవుతుంది, అయితే, స్త్రీలు పీరియడ్స్ మిస్ అయ్యే ముందు కూడా ఈ సూచనను అనుభవించవచ్చు."
గర్భం దాల్చిన ప్రారంభంలో అధిక అలసట ఉంటుంది. సెక్స్ హార్మోన్ ప్రొజెస్టెరాన్ గణనీయంగా పెరగడం దీనికి కారణం. ప్రొజెస్టెరాన్ గర్భధారణను కొనసాగించడానికి మరియు శిశువు పెరగడానికి అవసరం, కానీ ఇది మీ జీవక్రియను కూడా తగ్గిస్తుంది.
గర్భధారణ సమయంలో కొన్ని ఆహారాలపై ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శక్తి మరియు కాల్షియం అధికంగా ఉండే భోజన పదార్థాలైన పాలు మరియు ఇతర పాల ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడతారు . అలాగే మీరు ఇష్టపడే విషయాలపై మీరు ఆకస్మికంగా అయిష్టతను కూడా పెంచుకోవచ్చు. కొంతమంది స్త్రీలు మట్టి లేదా కాగితం వంటి ఆహారేతర పదార్థాల రుచిని కూడా ఇష్టపడతారు. దీనిని 'పికా' అని పిలుస్తారు మరియు ఇది విటమిన్ కొరతను సూచించవచ్చు. ఇది కొనసాగితే, దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ కోరికలు (ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్): అవి ఎప్పుడు ప్రారంభమవుతాయి
ప్రెగ్నెన్సీ మొదటి కొన్ని వారాలలో, స్త్రీలు గుండెల్లో మంట లేదా వారి ప్రేగులను కదిలించడంలో ఇబ్బంది పడవచ్చు. పెరుగుతున్న హార్మోన్ స్థాయిలు మీ జీర్ణవ్యవస్థను నెమ్మదిస్తాయి. దాని ఫలితంగా జీర్ణ సమస్యలు వస్తాయి.
మూడ్ స్వింగ్స్ కలిగి ఉండటం కూడా ప్రారంభ ప్రెగ్నెన్సీలో ఒక లక్షణం. కొంతమంది మహిళలు చికాకు వంటి మూడ్ స్వింగ్‌లకు గురవుతారు. ఇతర గర్భిణీ స్త్రీలు ఆనందం యొక్క భావోద్వేగాలను అనుభవిస్తారు. ప్రెగ్నెన్సీ హార్మోన్లు మెదడులోని రసాయనాలను మారుస్తాయి, దాని వల్ల మూడ్ స్వింగ్స్ ఏర్పడుతాయి.
యోని ఉత్సర్గలో పెరుగుదల ఒక సాధారణ గర్భధారణ లక్షణం. మూత్ర విసర్జన సమయంలో చికాకు, అసౌకర్యం, దుర్వాసన లేదా నొప్పితో కూడి ఉంటే అది ఇన్ఫెక్షన్ వల్ల సంభవించిన డిశ్చార్జ్ కావచ్చు. అలాంటి పరిస్థితిలో మీ డాక్టర్ నుండి వైద్య సహాయం తీసుకోండి. గర్భం యొక్క ఈ ప్రారంభ లక్షణాలు రుతుస్రావం తేదీ తప్పక ముందు ప్రతి మహిళలో కనిపించకపోవచ్చు. అంతేకాకుండా ఈ లక్షణాలు ఇతర పరిస్థితుల వల్ల కూడా సంభవించవచ్చు. అందువల్ల ఈ లక్షణాలు మీరు గర్భవతి అని ఖచ్చితంగా సూచించవు. కాబట్టి రుతుస్రావం తప్పిన తర్వాత రోజు వరకు వేచి ఉండి ఆ తర్వాత గర్భధారణ పరీక్షను తీసుకోండి మరియు మీ వైద్యుడిని సంప్రదించండి. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్‌గా ఉంటే, ఆరోగ్యకరమైన గర్భధారణ చక్రం ఉండేలా మొదటి రోజు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు మరియు సప్లిమెంట్లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం తీసుకోవాలి. మద్యం మరియు కెఫిన్‌కు దూరంగా ఉండాలి మరియు ధూమపానం చెయ్యకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీ మొదటి వారం నుండి చివరి రోజు వరకు తల్లి సహనాన్ని మరియు ఓర్పును పరీక్షించే ఒక భయంకరమైన ప్రయాణంతో కూడి చివరకు జీవిత రూపానికి జన్మనిస్తుంది. ఇది చాలా ప్రాథమిక పిండం నుండి పిండం వరకు బహుళ-దశల పరివర్తనలతో కూడిన అందమైన జీవసంబంధమైన అనుభవం.
Yes
No
Written by
dhanlaxmirao
dhanlaxmirao
గర్భం దాల్చిన నాలుగో వారంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి అనుభూతి పొందుతారు?
నాల్గవ వారం ప్రెగ్నెన్సీ స్కాన్ ద్వారా ఏం తెలుస్తుంది?
తెలియకుండా అబార్షన్: దీనికి కారణాలు ఏమిటి? ఈ పరిస్థితి లక్షణాలు ఎలా ఉంటాయి?
అనోరెక్సియా నెర్వోసా: లక్షణాలు, కారణాలు, ప్రమాదాలు & చికిత్స
కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి?
ప్రెగ్నెన్సీ సమయంలో చేయదగిన మరియు చేయకూడని పనుల పెద్ద జాబితా
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Mylo is a master brand offering solutions through it's subsidiaries - Mylo Care and Mylo Baby.
Mylo Care offers science backed, expert led solutions across multiple health concerns.
Mylo Baby is a one stop solution for young parents for all their baby's needs.
Bath & Body | Diapers & Wipes - Baby Wellness | Diaper Rash | Mosquito Repellent | Anti-colic | Diapers & Wipes - Baby Gear | Carry Nest | Dry Sheets | Bathtub | Potty Seat | Carriers | Diaper Bags | Stroller – Lightweight & Compact | Baby Pillow | Diapers & Wipes - Baby Clothing | Wrappers | Winter Clothing | Socks | Diapers & Wipes - Feeding & Lactation | Feeding Bottle |