Feeding Schedule
28 November 2023 న నవీకరించబడింది
మీకు పసిబిడ్డ ఉన్నట్లయితే, వాళ్లకి ఆహారం పెట్టే సమయం కొండని కదిలించినంత పనిలాగా ఉంటుందని మీకు ఈపాటికే తెలిసి ఉంటుంది. వారికి ఏ రకమైన ఆహారం పెట్టాలి, పెట్టే సమయాలు మొదలైనవన్నీ తెలుసుకోవటానికి మీరు ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ఘనాహారాల సంగతికి వస్తే, ఇదంతా మరింత గందరగోళంగా ఉండవచ్చు.
బేబీకి సంబంధించిన ఆహారం, అలాగే వారి ఆహారంలో ఘన పదార్థాలను ఎలా, ఎప్పుడు ప్రవేశపెట్టాలనే దానిపై చాలా విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారా పసిపిల్లల ఆహారానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఇంకా ఆహారం పెట్టే సమయంలో అనుసరించాల్సిన ఉత్తమ మార్గదర్శకాలను కూడా ఈ కథనం మీకు అందిస్తుంది.
మొదటి ఆరు నెలలు పసిపిల్లలకు తల్లి పాలు మాత్రమే ఆహారంగా ఇవ్వాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) సిఫార్సు చేస్తోంది. ఆ తరువాత, మీరు ఘన పదార్థాలను ఆహారంగా పరిచయం చేయవచ్చు. అయితే, ప్రతి బిడ్డ అవసరాలు భిన్నంగా ఉంటాయి. కొందరు పిల్లలు ఆరు నెలల కంటే ముందుగానే ఘన పదార్థ ఆహారాలకు సిద్ధంగా ఉండవచ్చు, మరికొందరు ఆరు నెలల అయ్యాక కూడా సిద్ధంగా ఉండకపోవచ్చు.
మీ బేబీ సిద్ధంగా ఉందో లేదో మీకు ఇంకా కచ్చితంగా తెలియకపోతే, మీరు గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఘన పదార్థాలకు సిద్ధంగా ఉన్న చాలామంది పసిపిల్లలు కొంచెం సపోర్టుతో కూర్చోగలుగుతారు. అలాగే వారి తల కదలికలపై మంచి నియంత్రణను కలిగి ఉంటారు. వారు తమ నాలుకను ముందుకు వెనుకకు కదిలించగలుగుతూ ఆహార పదార్థాలను రుచి చూడటంలో ఆసక్తిని కనబరుస్తారు.
మీ బిడ్డకి ఘన పదార్థాలను ఆహారంగా తినిపించడం మొదలుపెట్టడం ఒక ఉత్సాహకరమైన మైలురాయి! ఇది మీ చిన్నారులకు కొత్త రుచులు, ఇంకా ఆహార పదార్థాలను అందించే అవకాశం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించే అవకాశం కూడా ఇస్తుంది.
ఘన పదార్థాల ఆహారాన్ని మొదలుపెట్టడం వలన మీ బిడ్డకు, అలాగే తల్లిదండ్రులుగా మీకు కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముందు, ఇది మీ బేబీకి ఆరోగ్యకరమైన ఆకలి, అలాగే నిద్ర ఉండేలా సహాయపడుతుంది. ఇంకా వారిలో సరైన ఎదుగుదల, అభివృద్ధికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. అలాగే, నిజానికి, మీ బిడ్డతో బంధం ఏర్పరుచుకోవటానికి ఇంకా ప్రత్యేక జ్ఞాపకాలను సృష్టించి పదిలంగా దాచుకోవటానికి ఇది మీకు గొప్ప అవకాశం.
మీ పసిబిడ్డకి ఘన పదార్థాలని తినిపించడం ప్రారంభించే ముందు పిల్లల వైద్య నిపుణులతో మాట్లాడండి. వారు మీ బేబీకి ఎప్పుడు ఘన పదార్థాలు మొదలుపెట్టవచ్చు? ఇంకా ఏ ఆహార పదార్థాలు మంచివి? అనేవి తెలుసుకోవటంలో సహాయపడతారు.
మొదట్లో, మీరు రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు, ఒకటి లేదా రెండు చెంచాల పరిమాణంలో మాత్రమే ఆహారాన్ని తినిపించండి. మీ బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు అలాగే ఘన పదార్థాల ఆహారాన్ని తినడం అలవాటు చేసుకున్నాక, మీరు ఆహార పరిమాణాన్ని ఇంకా ఎన్నిసార్లు తినిపించాలి అన్నది పెంచవచ్చు.
మీ బేబీ చేసే సంకేతాలపై దృష్టి పెట్టడం కూడా చాలా ముఖ్యం. వారిని చూసినప్పుడు ఆకలితో ఉన్నట్లు అనిపిస్తే, ఎక్కువ ఆహారాన్ని పెట్టండి. వారు తలని అవతలకి తిప్పేసుకుంటే లేదా తినడానికి పదేపదే నిరాకరిస్తే, వారి కడుపు నిండిందని గుర్తు. మీ బేబీ శరీర భాషను గమనించండి. అలా వారిని కావలసినంత ఎక్కువ లేదా తక్కువ తిననివ్వండి. బిడ్డకి భోజనం పెడుతున్నప్పుడు ఈ కింది సూచనలను గుర్తుంచుకోండి.
1. ఘన పదార్థాలను మొదలుపెట్టినా వాటితోపాటు పాలు కూడా పట్టడం కొనసాగించండి. అంటే రోజుకి నాలుగు నుండి ఆరు పాలిచ్చే సెషన్లు ఉండాలి. పాపాయికి రోజూ దాదాపుగా ఒక లీటరు పాలు అవసరం ఉంటాయి.
2. నెమ్మదిగా ఘన పదార్థాలకు మారే ప్రక్రియని మెత్తని, పాక్షికంగా ఘన పదార్థంగా ఉండే తృణధాన్యాలు లేదా పండ్లు/కాయగూరల గుజ్జులతో మొదలుపెట్టండి.
3. ఈ గుజ్జుల వంటి ఘన పదార్థాలు వారికి అలవాటయ్యాక, మీరు వారికి మాంసం అలాగే చేపల వంటి ప్రోటీన్లను చిన్న చెంచాల మొత్తాలలో తినిపించవచ్చు. మీరు పెట్టే ప్రోటీన్ తేలికగా అరిగేలా, అలాగే సరిగ్గా ముక్కలుగా చేసి, చూసుకుని పెట్టండి.
4. క్యారెట్ ముక్కలు లేదా వేరుసెనగ వంటి పెద్ద ఆహార పదార్థాలని పెట్టవద్దు. ఇవి పసిపిల్లలలో ఊపిరి తీసుకోనివ్వకుండా అడ్డంపడి పొలమారవచ్చు. పెట్టే ఆహార పదార్ధం మెత్తనిదే అయినా, మీ పాపాయి దానిని నమలకుండా మింగే ప్రమాదం ఉంది.
5. మొదట్లోనే ఆవు పాలను భోజనంలో భాగంగా తాగించాల్సిన అవసరం లేదు. తల్లి పాలనే మరికొన్ని నెలలపాటు కొనసాగించడం మంచిది. అయితే, మీరు కొద్ది పరిమాణాలలో పెరుగు అలాగే మెత్తని చీజ్ వంటి పాల ఉత్పత్తులను ప్రారంభించవచ్చు.
6. 6 నుండి 8 నెలల వరకూ, ఘన పదార్థాలకి సంబంధించి మూడు పూటలా బేబీకి ఆహారం పెడుతూ పాలుపట్టే దినచర్య కొనసాగించటం ఉత్తమం. ఆ సమయంలో పండ్లు, కూరగాయలు అలాగే తృణధాన్యాలతోసహా ఘన పదార్థాలు ఉండే భోజనం 4 నుండి 9 చెంచాలు పెట్టవచ్చు.
పసిబిడ్డకి పాలుపట్టే విధానం బేబీ నిద్ర సమయాలు, అలాగే ఆకలిపై ఆధారపడి ఉంటుంది. 6 నెలల వయస్సులో, చాలావరకు పసిపిల్లలు రోజుకు 12 నుండి 15 గంటలు నిద్రపోతారు. ప్రతిసారీ వారు పడుకునే సమయం 3 గంటలపాటు ఉంటుంది.
7. ఎక్కువసేపు పడుకున్నాక పసిబిడ్డలకి ఆకలి వేయవచ్చు. మీ బేబీ పాలసీసాని లేవగానే వారికి అందించండి.
8. పడుకునే సమయానికి ముందు మీ పసిపాపలకి పాలు పడితే, వారు ఎక్కువసేపు పడుకుంటారు.
9. తల్లిపాలని క్రమం తప్పకుండా మీరు ఇస్తూ ఉండాలి. అదే సమయంలో బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజన సమయాలలో ఘన పదార్థాలని కూడా పరిచయం చేయవచ్చు.
10. వారి నిద్ర దినచర్యని బట్టి మీరు తల్లిపాలని నిద్రపోయే ముందు, తర్వాత ఇస్తూ ఉండవచ్చు.
చివరిగా చెప్పాలంటే, మీ బిడ్డకి వారి వయస్సుకి తగ్గట్టుగా సరైన మొత్తాలలో ఆహారం అందించటం చాలా ముఖ్యం. 6-నెలల వయస్సున్న బేబీకి, ప్రతిరోజూ 2 నుండి 3సార్లు భోజన సమయాలలో ఘన పదార్థాలు పెట్టవలసి ఉంటుంది. మీకు ఏవైనా ప్రశ్నలున్నా లేదా ఆందోళనలు ఉన్నా మీ పిల్లల డాక్టరుని సంప్రదించి చర్చించండి.
పసిపిల్లల సంరక్షణ గురించి మరిన్ని గొప్ప చిట్కాల కోసం, మైలో కుటుంబాన్ని ఫాలో అవ్వండి.
6 months baby diet in telegu, solid foods for 6 months baby diet in telegu, baby feeding in telegu, How Much & How Often Should You Feed Solids to Your 6-Month-Old In English, How Much & How Often Should You Feed Solids to Your 6-Month-Old In Hindi, How Much & How Often Should You Feed Solids to Your 6-Month-Old In Telugu, How Much & How Often Should You Feed Solids to Your 6-Month-Old In Bengali
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips
పుట్టినప్పటి నుండి 1 ఏడాది వరకు మీ పసిబిడ్డకి ఆహారంగా ఏం పెట్టాలి (What to Feed Your Baby from Birth to 1 Year in Telugu)
శిశువుల వెయిట్ చార్ట్ ఇదీ: పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు | Ideal Baby Weight Chart: Birth to 1 Year in Telugu
మహిళల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఏది సహాయపడుతుంది? | What Helps in Improving Women's Mental Health in Telugu
చిన్ననాటి రుగ్మతలు అనగానేమి? ఇవి ఎలా ఉంటాయి? వీటికి కారణాలు, చికిత్స ఏమిటి? | Childhood Disorders: Meaning, Symptoms & Treatment in Telugu
మెటర్నల్-ఫిటల్ మెడిసిన్ యొక్క ప్రాముఖ్యత? ప్రమాదకర గర్భాలకు ఈ టాబ్లెట్ ఎందుకు సూచించబడుతుంది |Importance of Maternal - Fetal Medicine in High Risk Pregnancies in Telugu
The Ultimate Guide to Consuming Turmeric Milk During Pregnancy
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |