hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Yoga arrow
  • గర్భధారణ సమయంలో బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్ | 11 Benefits of Butterfly Exercise in Pregnancy in Telugu arrow

In this Article

    గర్భధారణ సమయంలో బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్ | 11 Benefits of Butterfly Exercise in Pregnancy in Telugu

    Yoga

    గర్భధారణ సమయంలో బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్ | 11 Benefits of Butterfly Exercise in Pregnancy in Telugu

    3 November 2023 న నవీకరించబడింది

    మహిళ జీవితంలో గర్భధారణ కాలం సంతోషకరమైన సందర్భం. ఎంతో ఉత్సాహంతోపాటు, నిరీక్షణ ఉంటుంది. చాలామంది మహిళలకు ఈ సందర్భంలో ఒత్తిడి, ఆందోళన కూడా ఉంటుంది. ఇలాంటి అనుభవం ఎదుర్కొంటున్న మహిళల్లో గర్భవతిగా ఉన్నప్పుడు చేసే ప్రీనేటల్ ఎక్సర్‌సైజ్‌లు, యోగా మేలు చేస్తాయి. ఆందోళనల్ని, ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రసవం కోసం వారి శరీరాన్ని, మనస్సును సిద్ధం చేస్తాయి.

    గర్భవతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వ్యాయామాన్ని ప్రీనేటల్ ఎక్సర్‌సైజ్ అని అంటారు. సహనం, ఫ్లెక్సిబిలిటీ, శక్తిని పెంపొందించుకోవడం ద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు ప్రీనేటల్ ఎక్సర్‌సైజ్ ఉపయోగపడుతుంది. గర్భవతిగా ఉన్నప్పుడు బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్ చేస్తే కాబోయే తల్లికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ హెల్త్ బ్లాగ్‌లో బటర్‌ఫ్లై వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకోండి.

    బటర్‌ఫ్లై భంగిమ ఎలా చేయాలి? (How to perform the butterfly pose in Telugu)

    కాబోయే తల్లులకు స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా బటర్‌ఫ్లై భంగిమను సూచిస్తుంటారు వ్యాయామ నిపుణులు. గర్భధారణ సమయంలో తుంటి, పొత్తికడుపు, గజ్జ ప్రాంతాలు బిగువుగా మారతాయి. స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్‌తో వీటిని వదులుగా చేయొచ్చు. అదనంగా, బటర్‌ఫ్లై భంగిమ రక్తప్రసరణను మెరుగుపర్చి, వెన్ను నొప్పిని తగ్గిస్తుంది.

    బటర్‌ఫ్లై యోగా భంగిమ చేయాలనుకునే మహిళలు తప్పనిసరిగా ఈ స్టెప్స్ ఫాలో కావాలి:

    • కింద కూర్చొని, కాళ్లు ముందుకు చాచి, వెన్నును నిటారుగా ఉంచాలి.
    • మీ మోకాళ్లు వంచుతూ, కాలి మడమల్ని ముందుకు తీసుకురావాలి.
    • మీ చేతులతో పాదాలను లేదా చీలమండలను పట్టుకోవాలి.
    • మీ తొడలను నేలకు ఆనించడానికి కిందకు ఒత్తిడి కలిగించాలి.
    • లోపలి తొడలు, పొత్తికడుపు విస్తరించినట్టు అనిపించాలి.
    • సాధారణ స్థితికి రావడానికి ముందు ఈ భంగిమలో 30 నుంచి 60 సెకండ్లపాటు ఉండాలి.
    • ఇదే వ్యాయామాన్ని కొన్నిసార్లు రిపీట్ చేయాలి.
    • మీకు ఏది సౌకర్యంగా అనిపిస్తే అది మాత్రమే చేయాలి. మీ శరీరంపై దృష్టి పెట్టాలి.

    బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్‌తో కలిగే 11 ప్రయోజనాలు (11 Butterfly Exercise Benefits In Pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో బటర్‌ఫ్లై భంగిమ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:

    1. నార్మల్ డెలివరీ (Normal delivery)

    బటర్‌ఫ్లై భంగిమతో పొత్తి కడుపు చుట్టూ ఉన్న కండరాలు, స్నాయువులను బలోపేతం చేయడం ద్వారా, నార్మల్ డెలివరీకి శరీరం సిద్ధమవుతుంది.

    2. విశ్రాంతి (Relaxation)

    గర్భధారణ సమయంలో, బటర్‌ఫ్లై పోజ్ విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడి తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆందోళనను తగ్గించి, శ్రేయస్సుతో ఉన్నామన్న అనుభూతిని కలిగిస్తుంది.

    3. రక్తప్రసరణ పెంచుతుంది (Improved circulation)

    గర్భవతుల కాళ్లు, పాదాల్లో వాపు వస్తుంటుంది. బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా రక్తప్రసరణ పెరిగి, వాపును తగ్గిస్తుంది.

    4. వెన్నునొప్పి తగ్గిస్తుంది (Reduces back pain)

    సాధారణంగా గర్భవతులకు ఉండే నడుము నొప్పి, బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్‌తో తగ్గుతుంది.

    5. ఒత్తిడి తగ్గుతుంది (Reduces stress)

    రిలాక్స్ అవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి బటర్‌ఫ్లై భంగిమ బాగా ఉపయోగపడుతుంది. ఆందోళనను తగ్గించడంలో తోడ్పడుతుంది.

    6. ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది (Enhances flexibility)

    గర్భధారణ సమయంలో పొత్తికడుపు, తుంటి బిగుతుగా మారుతుంటాయి. బటర్‌ఫ్లై పోజ్‌తో వీటిని వదులుగా చేయొచ్చు.

    7. అవగాహనను పెంచుతుంది (Increases awareness)

    అంతర్గత జ్ఞానాన్ని పెంపొందించడానికి, ధ్యానం చేసే సమయంలో ఎక్కువసేపు కూర్చోవడానికి మీ శరీరాన్ని సిద్ధం చేయాలంటే బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్ ట్రై చేయండి. ఎక్కువసేపు అదే భంగిమలో ఉండటం ద్వారా, అవిశ్రాంతంగా ఉన్నామన్న భావనను తగ్గించవచ్చు.

    8. రిలాక్స్ కావొచ్చు (Reduces pressure)

    మీ నడుము, తుంటి, లోపలి తొడలు మరింత సరళంగా ఉంటాయి కాబట్టి, బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్‌తో నొప్పిని తగ్గించుకోవచ్చు. రిలాక్స్ కావొచ్చు. ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు. తగ్గించుకోవచ్చు.

    9. డిప్రెషన్ తగ్గిస్తుంది (Helps with depression)

    స్ట్రెచింగ్ వ్యాయామాల రొటీన్‌లో భాగంగా, బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల మీలో ఉత్సాహం పెరుగుతుంది. డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.

    10. కండరాలను బలోపేతం చేస్తుంది (Strengthens the muscles)

    గర్భధారణ సమయంలో దెబ్బతినే పొత్తికడుపు కండరాలు, బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్‌తో బలపడతాయి. తుంటి, కటి, గజ్జ ప్రాంతం గర్భధారణ సమయంలో బిగుతుగా మారతాయి. బటర్‌ఫ్లై వ్యాయామంతో వదులుగా చేయొచ్చు.

    11. గ్యాస్ నుంచి ఉపశమనం (Relieves gas)

    జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే, గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించడానికి, జీర్ణక్రియను మెరుగుపర్చడానికి బటర్‌ఫ్లై భంగిమ ఉపయోగపడుతుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో మీ వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడే 13 మార్గాలు

    బటర్‌ఫ్లై భంగిమల్లో పలు రకాలు (Various butterfly poses variations in Telugu)

    బటర్‌ఫ్లై భంగిమల్లో పలు రకాలు ఉన్నాయి. మీరు వీటిని వేర్వేరుగా లేదా కలిపి వ్యాయామం చేయొచ్చు.

    1. ముందుకు వంగే బటర్‌ఫ్లై భంగిమ (Bending to the front Butterfly Position)

    మీ నుదిటికి లేదా మీ శరీరానికి సపోర్ట్ ఇవ్వడానికి, మీరు బ్లాక్‌లు, కుషన్‌లను ఉపయోగించవచ్చు.

    2. వెల్లకిలా పడుకొని బటర్‌ఫ్లై పోజ్ (Butterfly Pose while lying down)

    మీ వెన్నెముక లేదా మీ భుజాల కింద, కుషన్ లేదా బోల్‌స్టర్ సపోర్ట్‌గా పెట్టుకోవచ్చు. వంపుల దగ్గర సపోర్ట్ కోసం కుషన్స్, బ్లాక్స్ ఉపయోగించవచ్చు.

    3. కాళ్లు గోడకు ఆనిస్తూ బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్ఈ (Butterfly Pose with the Legs Up the Wall)

    తరహా బటర్‌ఫ్లై వ్యాయామంతో మీ వెన్నుకు సపోర్ట్ లభిస్తుంది. వెన్ను దిగువ భాగంలో నొప్పి ఉన్నవారికి ఈ వ్యాయామం అద్భుతంగా పనిచేస్తుంది.

    బటర్‌ఫ్లై భంగిమతో నార్మల్ డెలివరీ సాధ్యమా ? (Does the butterfly pose aid in labor induction in Telugu)

    మొదట సంకోచాలు ప్రారంభం కాగానే నార్మల్ డెలివరీ అయ్యేందుకు బటర్‌ఫ్లై వ్యాయామాలు సహాయపడతాయి. ఇతరులు కాస్త ఎక్కువ నొప్పులు భరించాల్సి వస్తుంది.

    బటర్‌ఫ్లై భంగిమ సాధన చేస్తే ఆరోగ్యకరమైన డెలివరీ సాధ్యమా? (Does practicing the butterfly pose benefit a healthy delivery)

    తరచూ వ్యాయామం చేయడం ద్వారా నార్మల్ డెలివరీ అవుతుందని చెబుతుంటారు నిపుణులు. అందుకే వాకింగ్‌తో పాటు ప్రీనేటల్ వ్యాయామం కూడా మీ రోజువారీ దినచర్యలో భాగం కావాలి. ముందునుంచే ఈ వ్యాయామాలు చేస్తుంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కటి ప్రాంతానికి రక్తప్రసరణ పెరుగుతుంది. అదనంగా ఇది హిప్ జాయింట్ మొబిలిటీని పెంచుతుంది. తొడల్ని, పిరుదుల్ని బలపరుస్తుంది. అయితే మీరు వ్యాయామం చేయాలనుకుంటే ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి, మీరు ఎలాంటి వ్యాయామాలు చేయాలనుకుంటున్నారో వివరించాలి. మీకు సరైన వ్యాయామాలు ఏవో అడిగి తెలుసుకోవాలి.

    References

    1. Rakhshani A, Nagarathna R, Mhaskar R, Mhaskar A, Thomas A, Gunasheela S. (2015). Effects of yoga on utero-fetal-placental circulation in high-risk pregnancy: a randomized controlled trial. Adv Prev Med.

    2. Curtis K, Weinrib A, Katz J. (2012). Systematic review of yoga for pregnant women: current status and future directions. Evid Based Complement Alternat Med.

    Tags

    Butterfly pose in pregnancy in Telugu, What are the benefits of butterfly exercise in pregnancy in Telugu, Butterfly poses variation in Telugu, 11 Benefits Of Butterfly Exercise In Pregnancy in English, 11 Benefits Of Butterfly Exercise In Pregnancy in Hindi, 11 Benefits Of Butterfly Exercise In Pregnancy in Tamil, 11 Benefits Of Butterfly Exercise In Pregnancy in Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.