hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • గర్భంలో ఉన్న బిడ్డ జనన అవయవాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి? (When Do Sex Organs Develop During Pregnancy in Telugu?) arrow

In this Article

    గర్భంలో ఉన్న బిడ్డ జనన అవయవాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి? (When Do Sex Organs Develop During Pregnancy in Telugu?)

    Pregnancy

    గర్భంలో ఉన్న బిడ్డ జనన అవయవాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి? (When Do Sex Organs Develop During Pregnancy in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    మీకు సోనోగ్రఫీ చేయబోతున్నారా? మీరు బిడ్డ గురించి, బిడ్డ ఎదుగుదల గురించి మరింత తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నారా? నిజానికి, సోనోగ్రామ్ డాక్టర్‌కి పుట్టబోయే బిడ్డను పర్యవేక్షించడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా, డాక్టర్ గర్భంలో ఏమైనా అసాధారణ పరిస్థితులు ఉన్నా, సమస్యలు ఉన్నా గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీలోని ఈ దశలో అందరికీ అత్యంత ఆసక్తిగా ఉండే విషయం ఏంటంటే, అబ్బాయి పుడతాడా? లేదంటే అమ్మాయి పుడుతుందా? అని తెలుసుకోవాలనే ఉత్సుకత. కానీ మన దేశంలో పిల్లల లింగాన్ని ముందుగా తెలుసుకోవడం చట్టవిరుద్ధం. అంతే కాకుండా, బిడ్డ ఎదుగుదల గురించి మరింత బాగా తెలుసుకోవడానికి గైనకాలజిస్ట్ మీకు ఫీటల్ గ్రోత్ చార్ట్‌ (బిడ్డ ఎదుగుదల గురించిన చార్టు) కూడా అందించవచ్చు. అంతేకాకుండా, సోనోగ్రామ్ పక్రియలో డాక్టర్ పుట్టబోయే బిడ్డ జననేంద్రియాలను కూడా దాచవచ్చు.

    కడుపులో ఉన్న మగ, ఆడ బిడ్డ మధ్య తేడాను వైద్యులు ఎలా గుర్తించగలరు? (How Doctors Recognise Male and Female Babies in Telugu?)

    గర్భం దాల్చిన 7- 8 వారాలలో జననేంద్రియ అవయవం కనిపిస్తుంది. గర్భం లోపల స్త్రీ, పురుష లైంగిక అవయవాల అభివృద్ధిని వైద్యులు సులభంగా గుర్తించవచ్చు. స్త్రీల అండాలలో X క్రోమోజోమ్‌లు ఉంటాయి, అయితే పురుషుల వీర్య కణాలలో X లేదా Y క్రోమోజోమ్‌లు ఉంటాయి. 23వ జత క్రోమోజోములు బిడ్డ లైంగిక అవయవాన్ని అభివృద్ధి చేస్తాయి. XX క్రోమోజోమ్‌లు కలిస్తే ఆ బిడ్డ ఆడ బిడ్డ అని అర్థం. XY క్రోమోజోమ్‌లు కలిస్తే మగ బిడ్డ అని అర్థం. ప్రెగ్నెన్సీలో మొదటి కొన్ని వారాల వరకు, బిడ్డ జననేంద్రియ నిర్మాణం అంతర్గతంగాను, బాహ్యంగాను కూడా ఒకే విధంగా ఉంటుంది. బిడ్డ లైంగిక అవయవాల పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్లను బిడ్డ ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. బిడ్డ బీజకోశాలు చివరికి మారి, తరువాత వృషణాలుగా గానీ అండాశయాలుగా గానీ మారుతాయి.

    ఫాలస్ పురుషాంగం లేదా స్క్రోటమ్‌గా గానీ క్లిటోరిస్ లేదా లేబియాగా గానీ మారుతుంది. ప్రెగ్నెన్సీలోని 14వ వారంలో, బిడ్డ మూత్ర వ్యవస్థ, ఇతర అవయవాలు గర్భాశయం లోపల సరిగ్గా పనిచేస్తాయి. బిడ్డ బాహ్య జనన అవయవాలు గర్భం 20వ వారంలో పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. బిడ్డ పెరిగేకొద్దీ, తల్లికి తన శరీరం కొంచెం బరువుగా అనిపిస్తుంది. అందువల్ల, ఫీటల్ వెయిట్ చార్ట్ (బిడ్డ బరువుకు సంబంధించిన చార్టు) బిడ్డ పెరుగుదలను ట్రాక్ చేయడంలో సహాయపడవచ్చు! 9వ వారం నాటికి, అబ్బాయిలలో, జననేంద్రియం చివరిభాగం ఏర్పడటం, పురుషాంగం పొడవు పెరగడం ప్రారంభమవుతుంది. 10 వ వారం నాటికి ప్రోస్టేట్ ఏర్పడుతుంది. బిడ్డ పురుషాంగం మూడవ త్రైమాసికం వరకు పెరుగుతూనే ఉంటుంది. 11వ, 12వ వారం నాటికి, జననేంద్రియ శిఖరం అండాశయాలుగా అభివృద్ధి చెందుతుంది. బాలికలలో దాదాపు 70 లక్షల ప్రాథమిక అండాలు ఉంటాయి. ఈ అండాలు నెమ్మదిగా తగ్గుతాయి. ఆడబిడ్డ పుట్టే నాటికి దాదాపు 20 లక్షల అండాలు ఉంటాయి.

    బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతోందో? లేదో? తెలుసుకోవడానికి చేయాల్సిన పరీక్షలు ఏంటి? (What Tests Required to Check Unborn Baby's Health in Telugu?)

    ప్రెగ్నెన్సీలో మూడవ నెల నాటికి, పారామెసోనెఫ్రిక్ నాళాలు ఫ్యూజ్ అయినప్పుడు బిడ్డ గర్భాశయం, యోని పూర్తిగా ఏర్పడుతుంది. బిడ్డ అద్భుతమైన ఆరోగ్యంతో పెరుతుతోందని నిర్ధారించడానికి వివిధ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ సిఫార్సు చేస్తారు. అవి:

    1. 3D అల్ట్రాసౌండ్- దీనిలో డాక్టర్ బిడ్డ జెండర్ త్వరగా గుర్తించగలుగుతారు. 3D అల్ట్రాసౌండ్ అనేది ఒక అధునాతన సాంకేతికత. ఇంతకుముందు 2D అల్ట్రాసౌండ్‌లో, డాక్టర్ బిడ్డ లింగాన్ని గుర్తించలేకపోయేవారు.

    2. అమ్నియోసెంటెసిస్- ఈ పరీక్ష గర్భం దాల్చిన 18-20 వారాల మధ్య జరుగుతుంది. ఇది బిడ్డ లింగాన్ని గుర్తించడమే కాకుండా బిడ్డలో పుట్టుకతో వచ్చే వైకల్యాలు లేదా జన్యుపరమైన లోపాలు ఉన్నట్లయితే గుర్తిస్తుంది. గర్భిణికి 35 ఏళ్లు నిండితే, ఆమె ఈ పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ సిఫార్సు చేస్తారు.

    3. కోరియోనిక్ విల్లస్ శాంప్లింగ్ (CVS)- గర్భం దాల్చిన 10-12 వారాలలో ఈ పరీక్ష జరుగుతుంది. ప్రధానంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీలో ఈ పరీక్ష చేస్తారు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ఎల్ఎంపీ, అల్ట్రాసౌండ్ స్కాన్ మధ్య తేడాలు

    అల్ట్రాసౌండ్ స్కాన్‌ చేయిస్తే ఏవైనా కొత్త ఇబ్బందులు ఉంటాయా? (Is There Any Side Issues to Perform Ultrasound Scan in Telugu?)

    అల్ట్రాసౌండ్ స్కాన్‌ వల్ల దుష్ప్రభావాలు ఉండవు. హానికరమైన రేడియేషన్‌ ప్రభావం లేకపోవడమే దీనికి కారణం. అయినప్పటికీ, CT స్కాన్‌లతో పాటూ కొన్ని స్కాన్‌లలో రేడియేషన్ ఉండవచ్చు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసే సమయంలో తల్లికి కొద్దిగా అసౌకర్యంగా ఉండవచ్చు, లేదా లేకపోవచ్చు. సాధారణంగా ప్రక్రియలో ఉపయోగించే ప్రోబ్‌ పొట్టలోకి కొంచెం లోతుగా చొచ్చుకుపోతుంది. అంతర్గతంగానైనా లేదా బాహ్యంగానైనా అల్ట్రాసౌండ్ స్కాన్‌లు ఏవైనా సంబంధిత ఇబ్బందులను కలిగించవచ్చు. నిజానికి, వాటివల్ల ఏ మాత్రం నొప్పిఉండదు. అంతర్గత స్కాన్‌ని ఎంచుకున్నప్పుడు, రబ్బరు అలెర్జీలతో బాధపడుతుంటే డాక్టర్‌కి తెలియజేయాలి. అప్పుడు డాక్టర్ లేటెక్స్ కవర్ లేని ప్రోబ్‌ని ఎంచుకోవచ్చు. ఇవి కాకుండా, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్‌కి పరీక్షలు అసౌకర్యంగా ఉంటాయి. అంతేకాకుండా, అవి గొంతు నొప్పి, ఉబ్బరంతో పాటు కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాయి. అంతర్గత రక్తస్రావంతో బాధపడే ప్రమాదం కూడా ఉండవచ్చు.

    అల్ట్రాసౌండ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? (What are the Benefits of Ultrasound Scan in Telugu)

    అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవడం ద్వారా, ముఖ్యంగా కింది ప్రయోజనాలు కలుగుతాయి..

    • పరీక్షలో ఎలాంటి సూదులు లేదా కోతలు ఉండవు.
    • హానికరమైన రేడియేషన్‌కు గురికారు.
    • పుట్టబోయే బిడ్డను పర్యవేక్షించడానికి ఈ పరీక్ష సహాయపడుతుంది.
    • X-రే ద్వారా చూడటం కష్టంగా ఉండే అవయవాల వివిధ చిత్రాలను కూడా అల్ట్రాసౌండ్ స్కాన్ సంగ్రహిస్తుంది.
    • వేరే వాటితో పోలిస్తే అవి మరింత అందుబాటులో ఉంటాయి అలాగే చవక కూడా!

    చివరిగా (Conclusion:)

    పరీక్షకు వెళ్లేటప్పుడు సులువుగా తొలగించి, తొడుక్కునేలా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిది. కొన్నిసార్లు, అల్ట్రాసౌండ్ చేసే డాక్టర్ దుస్తులు తీయనవసరం లేకుండానే మీ శరీరంలోని వివిధ భాగాలను పరీక్ష చేయవచ్చు. అంతే కాకుండా, డాక్టర్ మీకు తెలియడం కోసం ఎస్టిమేటేడ్ ఫీటల్ వెయిట్ చార్ట్‌ను (బిడ్డ బరువు అంచనా చార్టును) కూడా అందించవచ్చు. దీంతో బిడ్డ ఎదుగుదలని మెరుగ్గా ట్రాక్ చేయగలుగుతారు. అల్ట్రాసౌండ్ పరీక్ష అరగంట నుంచి 60 నిమిషాల మధ్య ఎంతసేపైనా ఉండవచ్చు. పరీక్ష సమయంలో స్పృహలోనే ఉంటారు. కాబట్టి తల్లి కొంచెం అసౌకర్యంగా ఉండవచ్చు. తరచుగా, సోనోగ్రామ్ సమయంలో వారు ఏమి చూడగలరో డాక్టర్ తెలియజేస్తారు. గైనకాలజిస్ట్‌తో ఫలితాన్ని చర్చించడానికి మొత్తం ప్రక్రియ ముగిసే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

    Tags:

    Ultrasound during pregnancy in telugu, Benefits of ultra sound scan during pregnancy in telugu, Sex organs developing in baby during pregnancy in telugu, Tests required to check baby health in telugu, sex organs development in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Topics

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.