

Pregnancy
18 December 2025 న నవీకరించబడింది
గర్భం దాల్చడం ప్రతి అమ్మాయి కల. అయితే గర్భం దాల్చిన అమ్మాయికి తప్పనిసరిగా తన కుటుంబ సభ్యుల అవసరం ఎంతో ఉంటుంది. ముఖ్యంగా నెలలు నిండిన తరువాత అన్ని పనులను తనంతట తానే చేసుకోవడం కష్టతరం అవుతుంది. ఈ పరిస్థితులలో ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు తోడుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా భర్త ఈ సమయంలో ఆమెకు తోడుగా నిలవాలి. ఆమె అవసరాలను తీర్చడమే కాకుండా మానసికంగా కూడా ఎంతో సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. గర్భం దాల్చినప్పుడు, అలాగే బిడ్డని కన్న తరువాత మహిళలు మానసిక పరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటుంటారు. అందుకే.. ఈ సమయంలో వారికి బాసటగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
గర్భిణీ స్త్రీలు తినే తిండి, వారి మానసిక పరిస్థితులు బిడ్డ ఎదుగుదలపై చూపిస్తుంది. కొంతమంది పిల్లలు శాంత స్వరూపులుగా ఉంటారు. మరికొంతమంది పిల్లలు చిరాకుగా కోపంగా ఉంటారు. దీనికి అసలు కారణం ఇదే. గర్భవతిగా ఉన్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇబ్బందులు ఉండవు. ఈ సమయంలో హార్మోన్ల సమతుల్యత సరిగా ఉండదు. అందుకే భర్తలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. తల్లి మానసిక పరిస్థితి ప్రశాంతంగా ఉంటె.. పుట్టబోయే శిశువు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతి అమ్మాయి తన భర్త ఆదరణని కోరుకుంటుంది. గర్భం దాల్చిన సమయంలో మరింత ఎక్కువగా ఆశిస్తుంది. అందుకే ప్రతి భర్త తన భార్య పట్ల ఎక్కువ కేరింగ్ ని చూపించాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ఎమోషనల్ వెల్ బీయింగ్ అంటే ఏమిటి | దాని ప్రాముఖ్యత & లక్షణాలను అర్థం చేసుకోవడం
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల నెరవేరిందా? మీరు తల్లి తండ్రులుగా మారబోతున్నారా? అయితే మీ ఇంట్లో నెలకొన్న ఆహ్లాద వాతావరణాన్ని ఎల్లప్పుడూ కొనసాగేలా చూసుకోండి. అయితే.. గర్భం దాల్చిన సమయంలో మీరు తీసుకోవాల్సిన డైట్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెడిసిన్స్ ఇలా అన్నిటి విషయంలో కచ్చితంగా ఉండాలి. ప్రతిదీ సమయానికి తీసుకోవాలిసిన అవసరం ఉంటుంది. అందుకే.. వీటిని మర్చిపోకుండా ఒక డైరీ లో రాసుకోవడం అలవాటు చేసుకోండి. ప్రెగ్నన్సీ సమయంలో డైరీని మైంటైన్ చేయడం చాలా మంచిది.
గర్భధారణ సమయంలో ఆహారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే.. మీరు తీసుకునే ఆహారాన్ని బట్టే మీ శిశువు ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. అందుకే మీ వైద్యుల సలహా మేరకు ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్-డి, విటమిన్-ఎ, విటమిన్-సి వంటి పోషకాలతో కూడుకున్న ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి. ఒక్కొక్కరిలో కొన్ని రకాల పోషకాహార లోపం ఉండే అవకాశం ఉంటుంది. కానీ, గర్భధారణ సమయంలో మాత్రం పోషకాలతో కూడుకున్న సమతుల ఆహరం తీసుకోవడం చాలా అవసరం.
ఒకవేళ పోషకాహార లోపం ఉంటె.. దానికి మీ వైద్యులు విటమిన్-బి12, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, ఒమేగా-3 సప్లిమెంట్లను సూచించే అవకాశం ఉంటుంది. కాబట్టి భర్తలు ఈ విషయమై వైద్యులతో సంప్రదించి మీ భర్త అవసరమైన సప్లిమెంట్లను సమయానికి తీసుకునే విధంగా చూడాల్సి ఉంటుంది. వీటికి మీ భార్యని మానసికంగా సంసిద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది. గర్భవతిగా ఉన్న సమయంలోను, డెలివరీ అయ్యిన తరువాతా స్త్రీలు మానసికంగా ఎంతో సంఘర్షణకి లోను అవుతూ ఉంటారు. అయితే.. భర్తలు వారి ఆలోచనలను తెలుసుకుంటూ ఆమె మానసిక పరిస్థితి మాములుగా అయ్యేట్లు గా చేస్తుండాలి. తరచుగా ఆమెతో సంభాషిస్తుండాలి. ఆమెకు కావాల్సిన ఆహరం సమకూర్చడం, ఆమె మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చేయడం వంటివి తప్పనిసరి. తద్వారా ఆమె ప్రశాంతంగా ఉండి మీ పై ప్రేమని మరింత పెంచుకుంటుంది. ప్రతి స్త్రీ తాను గర్భం దాల్చిన సమయంలో భర్త ఎలా చూసుకున్నాడు అన్న విషయాన్నీ జీవితాంతం మర్చిపోదు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భిణీ మహిళల రోజువారీ సమతుల్య ఆహారం: ఏం తినాలి ఇంకా ఏం తినకూడదు
గర్భం దాల్చిన సమయం నుంచి మీ భార్య పై కొంత ఒత్తిడి ఉండడం సహజం. మీ బిడ్డ ఆరోగ్యంగా బయటకు వస్తుందా లేదా? సరియన విధంగా పెరుగుతోందా లేదా? అన్న విషయమై ఆమె నిరంతర సంఘర్షణకు లోనవుతూనే ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆమెకు బాసటగా నిలవాలి తప్ప ఆమె టెన్షన్ పడే విషయాల గురించి మరింతగా చర్చించక పోవడమే మంచిది. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేకపోతే కోపం, చిరాకు, ఒత్తిడి తీసుకునే అలవాట్లు మీ పిల్లలలో వస్తాయి. అందుకే గర్భం దాల్చిన సమయంలో మీ భార్యని ప్రశాంతంగా ఉంచడం చాలా ముఖ్యం. మీ భార్యతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి.
ఇంట్లో గర్భవతి భార్య ఉన్నప్పుడు ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువ అవుతున్నప్పుడు ఆందోళన చెందడం సహజం. ఒకవైపు ఆఫీస్ ఒత్తిడిని తట్టుకుంటూ ఇంట్లో భార్యని చూసుకోవడం కష్టతరమే అవుతుంది. అయితే.. మీ భార్య అవసరాలను చూస్తూ మీ ఆఫీస్ మీటింగ్స్ ను షెడ్యూల్ చేసుకోండి. మీ స్నేహితులతో కొన్ని అవసరంలేని మీటింగ్స్ ను వాయిదా వేయండి. ఖాళీ సమయాల్లో మీ భార్యతో గడపడానికి ప్రయత్నించండి. మీ భార్య సంతోషంగా ఉంటె.. మీ బిడ్డ కూడా సంతోషంగా ఉంటుందని గుర్తుంచుకోండి.
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips











మీ బిడ్డకి వచ్చినది జలుబా లేదా అలెర్జీనా అన్న తేడాని ఎలా కనిపెట్టాలి?

పసిబిడ్డల ఎదుగుదల: పసిపిల్లలలో హఠాత్తు వేగంతో జరిగే ఎదుగుదల దశలు (గ్రోత్ స్పర్ట్స్) ఎప్పుడు వస్తాయి (Baby Growth: When do Growth Spurts Occur in Babies in Telugu) ?

గర్భవతులు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? | Should Pregnant Women Get Flu Shots in Telugu

లాపరోస్కోపిక్ అండాశయ డ్రిల్లింగ్: PCOS-సంబంధిత వంధ్యత్వానికి సురక్షితమైన మరియు ప్రభావవంతమైన పరిష్కారం | Laparoscopic Ovarian Drilling in Telugu

మహిళలు బరువు తగ్గేందుకు డైట్ ప్లాన్

When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |