Vaginal Bleeding
19 May 2023 న నవీకరించబడింది
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% మంది గర్భిణులకు గర్భం దాల్చిన మొదటి 8 వారాల్లో యోని నుంచి రక్తస్రావం అవుతుంది. త్వరగా గుర్తించడంతో పాటు సరైన చికిత్స అందించడం తల్లీబిడ్డల ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
8 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావానికి అనేక కారణాలు ఉన్నాయి:
● సబ్ కోరియోనిక్ రక్తస్రావం: కోరియోన్ అనేది పిండం చుట్టూ ఉండే పొర. అది చివరికి ప్లాసెంటాను తయారుచేస్తుంది. కోరియోన్, గర్భాశయం యొక్క గోడ మధ్య రక్తస్రావం జరగొచ్చు. ఇది తీవ్రమైన కడుపు నొప్పి, అలాగే యోని రక్తస్రావానికి దారితీస్తుంది.
● గర్భాశయ ముఖద్వారంలో మార్పులు: ప్రెగ్నెన్సీ సమయంలో గర్భాశయ ముఖద్వారానికి రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో పాప్ పరీక్ష జరిపేటప్పుడు గర్భాశయ ముఖద్వారానికి తగిలే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు 8 వారాల గర్భిణుల్లో రక్తస్రావం జరుగుతుంది.
● మోలార్ ప్రెగ్నెన్సీ: ఈ స్థితిలో పిండం లోపల సాధారణ కణజాలాలు ఏర్పడటానికి బదులుగా గర్భాశయంలో అసాధారణ కణజాలాలు పెరుగుతాయి. ఈ కణజాలం కొన్నిసార్లు క్యాన్సర్‌గా మారి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని గర్భధారణ ట్రోఫోబ్లాస్టిక్ వ్యాధి అంటారు. దీని లక్షణాలు 8 వారాల గర్భిణుల్లో వికారం, వాంతులతో పాటు గోధుమ రంగులో యోని నుంచి స్రావాలు వెలువడుతాయి.
● గర్భస్రావం: గర్భం దాల్చిన 8 వారాల్లో గర్భ స్రావం జరిగే అవకాశాలు ఉన్నా రక్తస్రావం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ ద్వారా మొదటి దశలోనే రోగ నిర్ధారణ చేయొచ్చు. డాక్టర్ శిశువు హృదయ స్పందనను గుర్తించగలిగితే గర్భస్రావం ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.
● ఇన్ఫెక్షన్: క్లామిడియా, గనేరియా, యోని లేదా గర్భాశయ ఇన్ఫెక్షన్ల వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధుల వల్ల కూడా గర్భిణీ స్త్రీలలో 8 వారాల్లో రక్తస్రావం జరిగే అవకాశం ఉంది.
● ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ: కొన్ని సందర్భాల్లో పిండం గర్భాశయంలో బదులు ఫాలోపియన్ ట్యూబ్‌లో అభివృద్ధి చెందుతుంది. ఈ అసాధారణమైన పెరుగుదల కారణంగా ఫాలోపియన్ ట్యూబ్ పగిలిపోతుంది. ఫలితంగా తల్లికి ప్రాణ హాని కలగొచ్చు. యోని నుంచి రక్తస్రావం జరగడం, పొత్తికడుపులో నొప్పిగా ఉండడం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ యొక్క లక్షణాలు.
8 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో యోని నుంచి రక్తస్రావానికి కారణాలను గుర్తించేందుకు పరీక్షలు చేయించుకోవాలని గైనకాలజిస్టులు సూచిస్తారు.
● పరీక్ష: యోని భౌతిక పరీక్ష
● ఇమేజింగ్ పరీక్షలు: యోనిని, శిశువు పరిమాణాన్ని పరిశీలించేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉపయోగపడుతుంది. శిశువు హృదయ స్పందన రేటును డాప్లర్ స్కాన్ ద్వారా కొలుస్తారు.
● రక్త పరీక్షలు: ఇది హ్యూమన్ కోరియోనిక్ గొనడోట్రాపిన్ (HCG) గాఢతను పరీక్షిస్తుంది. HCG ఎక్కువ మొత్తంలో ఉంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీలు లేదా మోలార్ ప్రెగ్నెన్సీని సూచిస్తుంది. తక్కువ స్థాయి HCG ఉంటే గర్భ స్రావం లేదా ఎక్టోపిక్ గర్భాన్ని సూచిస్తుంది.
8 వారాల గర్భిణీ స్త్రీలు ఈ కింది లక్షణాల్లో దేనినైనా గమనిస్తే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
● 8 వారాల గర్భవతి తుడవడం వల్ల ప్రకాశవంతమైన ఎరుపు రంగులో రక్తస్రావం ఒక్క రోజు కంటే ఎక్కువ కాలం గుర్తించినట్టయితే.
● కండరాల నొప్పి, జ్వరం లేదా వణుకు రావడంతో పాటు మోస్తరు నుంచి భారీ రక్తస్రావం జరిగినప్పుడు.
● టిష్యూకు తెలుపు డిశ్చార్జి అంటడాన్ని గుర్తిస్తే
● టిష్యూకు గోధుమ రంగులో నుంచి స్రావం ఏర్పడినప్పుడు (గర్భ స్రావం జరుగుతుందని సూచన)
● పసుపు రంగు స్రావం గమనిస్తే..
● జిగట వంటి స్రావం వచ్చినప్పుడు
8 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావాన్ని గమనిస్తే మహిళలు ఈ కింది చర్యలు తీసుకోవాలి.
1. యోని నుంచి రక్తస్రావం (ప్రకాశవంతమైన ఎరుపు లేదా గోధుమ రంగు స్రావాలు, పలుచటి రక్తం లేదా గడ్డలు) పరిమాణం, స్వభావాన్ని అంచనా వేయడానికి శానిటరీ ప్యాడ్ ఉపయోగించండి.
2. రక్తస్రావంతో పాటు ఏదైనా కణజాలం గుర్తిస్తే తప్పనిసరిగా సేకరించి, వ్యాధి నిర్ధారణ కోసం వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి.
3. రక్తస్రావం జరుగుతున్నప్పుడు మెన్‌స్ట్రువల్ కప్స్ లేదా టాంపాన్స్ వాడొద్దు.
5. విపరీతమైన జ్వరం, చలి, తీవ్రమైన కడుపు నొప్పి, యోని నుంచి రక్తస్రావం జరిగినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
గర్భస్రావం లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ యొక్క సంకేతాలను వైద్యులు గమనిస్తారు. రక్తస్రావం ఆపడానికి లేదా గర్భాశయం నుంచి కణజాలాలను తొలగించడానికి డాక్టర్ మందులను సూచిస్తారు. అదనపు కణజాలాన్ని తొలగించడానికి శస్త్రచికిత్సా విధానాన్ని సూచించొచ్చు.
8 వారాల ప్రెగ్నెన్సీ కలిగి ఉన్న స్త్రీలు అధిక రక్తస్రావం, కణజాలం సహా అసాధారణమైన వైట్ డిశ్చార్జ్ లేదా బ్రౌన్ డిశ్చార్జ్ గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సాధారణంగా, 8 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావం హానికరం కాదు. కానీ అధిక రక్తస్రావం ఎక్టోపిక్ గర్భం లేదా గర్భస్రావానికి సంకేతాలు కావొచ్చు.
1. 8 వారాల గర్భిణీల్లో ఏ ఇన్ఫెక్షన్లు అధిక రక్తస్రావం కలిగిస్తాయి?
యోని లేదా గర్భాశయం ఇన్ఫెక్షన్లు, హెమరాయిడ్స్, క్యాన్సర్ 8 వారాల గర్భిణీ స్త్రీలలో అధిక రక్తస్రావం కలిగిస్తాయి.
2. ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావాన్ని ఎలా నివారించాలి?
ఎదుగుతున్న పిండానికి పోషకాహారాన్ని అందించడానికి గర్భిణులు వైద్యులు సూచించిన ఐరన్, విటమిన్ సప్లిమెంట్లను నిరంతరం తీసుకోవాలి. రక్తస్రావం ప్రమాదాన్ని నివారించేందుకు, వారు బరువైన పనులకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మలబద్దకం నుంచి ఉపశమనం పొందడానికి తప్పనిసరిగా పీచు పదార్థాలు ఉన్న ఆహారం, ఆకు కూరలను తీసుకోవాలి.
3. 8 వారాల గర్భిణీ స్త్రీలలో గర్భాశయ ముఖద్వారపు పాలిప్ ఎలా రక్తస్రావం కలిగిస్తుంది?
గర్భాశయ ముఖ ద్వార పాలిప్ లేదా గర్భాశయంలో క్యాన్సర్ కాని కణజాల పెరుగుదల వల్ల స్త్రీలలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావం అవుతుంది.
Yes
No
Written by
swetharao62
swetharao62
9 వారాల ప్రెగ్నెన్సీలో బ్రౌన్ డిశ్చార్జ్ - ఇది సాధారణమా?
ప్రెగ్నెన్సీ 6వ నెలకు ఆరోగ్యకరమైన డైట్ మరియు మీల్ ప్లాన్
ఫీటల్ డాప్లర్ స్కాన్.. గుండె స్పందనలు గుర్తించే పరీక్ష గురించి సమగ్ర వివరాలు
9వ వారం గర్భం సమయంలో ఏమి తినకూడదు.
9 వారాల గర్భధారణలో అల్ట్రాసౌండ్: ఏమి ఊహించాలి మరియు చెడు శకునాలు ఏంటి
మైలోమెనింగోసెల్: లక్షణాలు, కారణాలు మరియు చికిత్స
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Mylo is a master brand offering solutions through it's subsidiaries - Mylo Care and Mylo Baby.
Mylo Care offers science backed, expert led solutions across multiple health concerns.
Mylo Baby is a one stop solution for young parents for all their baby's needs.
Onion | Aloe Vera Range For Hair | Coconut | Neelibrigandi | Skin - Bath & Body | By Ingredient | Skin - Pregnancy & New Mom | Stretch Marks | Skin - Health & Wellness | Digestive Health | Lactation | Pain management | By Ingredient | Saffron | Shatavari | Nivarini | Skin - Weight | Weight Management | By Ingredient | Wheatgrass |