చాలా మంది మహిళలు తమ గర్భధారణ సమయంలో అజీర్ణంతో బాధపడతారు. ఇది ఎంతో బాధను, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఏదైనా తాగిన తర్వాత లేదా తిన్న తర్వాత పొత్తి కడుపు పైభాగంలో నొప్పి లేదా అసౌకర్యంగా అనిపిస్తుంది. అయితే గర్భందాల్చిన కొంత కాలం తర్వాత ఇది సంభవించవచ్చు. గుండెల్లో మంట వస్తే మీ గుండెకు సంబంధించిన అనారోగ్యం అని అర్థం కాదు. ద్రవ పదార్థాలు లేదా ఆమ్ల ఆహారాలు అన్నవాహిక వరకు కదిలినపుడు మీ గొంతులో లేదా రొమ్ము వెనుక భాగంలో మండుతున్నట్లు అనిపిస్తుంది. అన్నవాహిక అనేది గొంతు, కడుపు (పొట్ట) ను కలిపే ఒక గొట్టం. హార్మోన్ల మార్పులు, శిశువు పెరుగుతున్నపుడు పొత్తికడుపుపై ఒత్తడి పడటం వల్ల కూడా ఈ మంట వస్తుంది. గర్భధారణ సమయంలో అజీర్ణం ఎప్పుడైనా సంభవించవచ్చు. కానీ గర్భధారణ మూడో త్రైమాసికంలో ఇది ఎక్కువవుతుంది. కొన్ని రకాల మందులు, జీవనశైలిలో మార్పులు, సరైన ఆహార విధానాల సహాయంతో అజీర్ణాన్ని తగ్గించుకోవచ్చు.
మీకు అజీర్ణం లేదా గుండెల్లో మంట ఉంటే.. మీరు ఉబ్బరంగా ఫీల్ అవుతారు. మీ నోటిలో పుల్లని రుచి, ఛాతిలో మంటగా అనిపించవచ్చు. ముఖ్యంగా తిన్న తర్వాత వాంతులు, తీవ్రమైన తలనొప్పి, పాదాలు, చేతులు అకస్మాత్తుగా ఉబ్బడం సంభవించవచ్చు.
అజీర్ణానికి గల కారణాలు
- టమాటాలు, నారింజలు, ద్రాక్ష వంటి సిట్రస్ (పుల్లటి పదార్థాలు) ఆహారాలకు దూరంగా ఉండండి. గుండెల్లో మంట, అజీర్ణానికి ఇవి దారి తీస్తాయి. టమాటలను చాలా తక్కువగా తినాలి. టమాటాలు, టమాటా ఉత్పత్తులు సిట్రిక్ యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఇవి కడుపులో ఎక్కువగా గ్యాస్ట్రిక్ యాసిడ్లను ఉత్పత్తి చేస్తాయి. మీ కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ స్థాయిలు అన్నవాహికపై ఒత్తిడి చేస్తాయి. ఆరెంజ్ (నారింజ) పండ్ల రసాలు కూడా గుండెల్లో మంటకు కారణం అవుతాయి. అవి ఆస్కార్బిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. దీనిని పెద్ద మొత్తంలో తీసుకుంటే.. అజీర్ణం సమస్య పెరుగుతుంది.
- కెఫిన్, సోడా తగ్గించాలి: వీటిని తీసుకోవడం మానేయండి. కెఫిన్ అనేది మీ రక్తపోటు, హృదయ స్పందన రేటును కూడా ప్రోత్సహించే ఒక కారకం. గర్భం అనేది అభివృద్ధి చెందుతున్నపుడు మన శరీరం కెఫిన్‌ను విచ్ఛిన్నం చేయలేదు. ఇది నిద్రలేమి, గుండె మంటకు దారి తీస్తుంది. గర్భవతిగా ఉన్నపుడు సోడా వంటి చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలి. వీటిల్లో ఎటువంటి పోషక విలువలు లేని కేలరీలు, అనేక రసాయనాలు ఉంటాయి. ఇది పిండానికి కూడా ప్రమాదకరం. సోడాలో కార్బోనేటెడ్ వాటర్ ఉంటుంది. ఇది రక్తపోటు పెరిగేందుకు దారి తీస్తుంది. అందుకే సోడాలను తరచుగా తీసుకునే వారికి ఊబకాయంతో ఉన్న శిశువులు పుడతారు. లేదా గర్భస్రావం అవుతూ ఉంటుంది.
- ఫ్రైడ్ (నూనెలో వేయించిన), కొవ్వు పదార్థాలు: ఇవి కూడా అజీర్ణానికి దారి తీస్తాయి. ఎందుకంటే అవి జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. తద్వారా మీ కడుపు మరిన్ని ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు మీకు ఉబ్బరంగా అనిపిస్తుంది. కొవ్వు పదార్థాల్లో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అధికంగా బరువు పెరిగేందుకు ఇది దారి తీస్తుంది. అధిక మొత్తంలో సంతృప్త (ఒక రకమైన అనారోగ్యకరమైన కొవ్వు) కొవ్వును తినడం వల్ల కూడా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. గుండె జబ్బులు రావడానికి ఇది దారి తీస్తుంది. అలాగే కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల లోపాలతో ఉన్న శిశువు జన్మించే అవకాశం కూడా ఉందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
- హార్మోన్ల మార్పులు: గర్భధారణ హార్మోన్లు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ప్రొజెస్టిరాన్.. దీనిని ప్రెగ్నెన్సీ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది కండరాల రిలాక్సర్ (ఉపశమనాన్ని పెంచే డ్రగ్) గా పని చేస్తుంది. మీరు గుండె మంటతో బాధపడుతున్నపుడు ఈ హార్మోన్ కండరాన్ని వదులుచేస్తుంది. తద్వారా అన్నవాహిక మీ కడుపును మూసివేస్తుంది. ఇది తరచుగా కడుపు, చిన్న పేగు, పెద్ద పేగుల్లో జీర్ణక్రియ మందగించేందుకు దారి తీస్తుంది. గర్భం మొదటి త్రైమాసికంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వలన వికారం ఎక్కువ అవుతుంది. అలాగే శిశువు పెరిగే కొద్ది విస్తరించిన గర్భాశయం పొత్తి కడుపుపై ఒత్తిడి చేస్తుంది. తద్వారా పొత్తి కడుపు ఆమ్లాలనుపైకి నెట్టివేస్తుంది. చాలా తక్కువ సందర్భాల్లో పిత్తాశయ రాళ్లు కూడా గుండెల్లో మంటకు అజీర్ణానికి కారణం అవుతాయి.
- చాక్లెట్: ఖాళీ కడుపుతో (ఎంప్టీ స్టమక్) చాక్లెట్ తినడం మానేయండి. చాక్లెట్ తినడం పరిమితం చేయండి. అయితే, డార్క్ చాక్లెట్‌తో అనేక ప్రయోజనాలు ఉంటాయి. పిండానికి అది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రెండు కారణాల కోసం చాక్లెట్లను అతిగా తినడం మానేయాలి. చాక్లెట్ మీకు తక్కువ ఆకలి కలిగేలా చేస్తుంది(ఆకలిని చంపేస్తుంది) తద్వారా మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినలేరు. ఇది మీ ఆహార సమతుల్యాన్ని దెబ్బ తీస్తుంది. రెండోది చాక్లెట్ కెఫిన్‌ను కలిగి ఉంటుంది. గర్భవతులు కెఫిన్‌ను తక్కువగా తీసుకోవాలి. ప్రతి రోజు 200 మి.గ్రా లోపు కెఫిన్ మాత్రమే తీసుకోవాలి. కెఫినేటెడ్ పానీయాలతో (కొన్ని రకాల కూల్ డ్రింక్స్) కలిపి చాక్లెట్ తీసుకోవడం మంచిది కాదు. ఇది మీరు రోజూ తీసుకోవాల్సిన కెఫిన్ లిమిట్‌ను పెంచుతుంది. రక్తం వల్ల చక్కెర స్థాయిల్లో అసమతుల్యత, గర్భధారణ మధుమేహం, అధిక బరువు సమస్యలు ఉంటే చాక్లెట్‌కు దూరంగా ఉండాలి.
- ఆల్కహాల్: మొత్తం గర్భధారణ సమయంలో ఇది సమస్యలను కలుగజేస్తుంది. గర్భవతిగా ఉన్న మొదటి త్రైమాసికంలో ఆల్కహాల్ తీసుకోవడం వలన కడుపులో ఉన్న శిశువు ముఖ లక్షణాలు వికృతంగా తయారవుతాయి. ఆల్కహాల్ తాగడం వల్ల గుండె జబ్బులు, పుట్టుకకు ముందు, పుట్టిన తర్వాత శిశువు పెరుగుదల తక్కువగా ఉండడం, కండరాల బలహీనత, గర్భస్రావం, గడువు తేదీకి ముందు డెలివరీ అయ్యే ప్రమాదాలు ఉంటాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో నిమ్మకాయ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు & ప్రమాదాలు
గర్భధారణ సమయంలో వచ్చే అజీర్ణాన్ని సహజంగా ఎలా ఎదుర్కోవాలి
యాసిడ్ ఉత్పత్తిని నివారించడంలో, అసౌకర్యాన్ని తగ్గించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
- 3 సార్లు ఎక్కువగా తినడానికి బదులు రోజంతా చిన్న మొత్తాల్లో తినండి. నెమ్మదిగా తినండి.
- గుండెల్లో మంటను నివారించేందుకు ఫ్రై చేసిన (వేయించిన), కొవ్వుతో ఉండే, మసాలాలు ఉండే ఆహారాలను తినడం మానేయండి.
- భోజనం చేసేటపుడు నీటిని తాగడం మానేయండి. ఇలా చేయడం వలన యాసిడ్ రిఫ్లక్స్ (వెనకకు మరలా ప్రవేశించేది) సంభవించి గుండె మంటకు దారి తీస్తుంది. మీరు తిన్న కొన్ని నిమిషాల తర్వాత నీటిని తాగొచ్చు.
- గర్భవతిగా ఉన్నపుడు బిగుతుగా ఉండే బట్టలు ధరించడం మానుకోండి. ఎందుకంటే బిగుతుగా ఉన్న బట్టలు మీ పొట్ట మీద ఒత్తిడిని పెంచుతాయి.
- తిన్న తర్వాత వెంటనే పడుకోవడం మానుకోండి. మీరు తిన్న ఆహారం జీర్ణం అయ్యే వరకు అటూ ఇటూ నడవండి.
- మీరు తీసుకునే ఆహారంలో మంచి ఫైబర్ కంటెంట్ ఉండేలా చూసుకోండి. ఇవి జీర్ణవ్యవస్థ రిలాక్స్ కావడానికి సహాయపడతాయి.
- దీర్ఘ శ్వాస (డీప్ బ్రెత్), ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయండి. లేదా మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు యోగా చేయండి. మంచి జీవనశైలిని ఏర్పరచుకోండి.
- గమ్ (తీపిగా ఉండే పదార్థం), క్యాండీలను తినడం మానుకోండి. అవి కృతిమ తీపిదనాన్ని కలిగి ఉంటాయి. మీ కడుపులో ఆసిడిటీని (ఆమ్లతను) కలిగిస్తాయి.
- తినేటపుడు మంచి భంగిమ (పొజిషన్) మెయింటేన్ చేయండి. మీ జీర్ణవ్యవస్థ సాఫీగా పని చేసేందుకు తినేటపుడు ఎల్లప్పుడూ నిటారుగా కూర్చోండి.
- ఒత్తిడిని ఫీల్ అవకండి. ఖాళీ సమయాల్లో మంచి పుస్తకం చదవడం, మీ స్నేహితులతో సమయం గడపడం ద్వారా మిమ్మల్ని మీరు కంఫర్ట్‌గా ఉంచుకోండి.
- మద్యపానం, ధూమపానం మానుకోండి.
- నిద్రించేందుకు ముందు ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి. ఎందుకంటే అప్పుడు ఆమ్లాలు సాఫీగా పైకి వెళ్తాయి. ఇది జీర్ణసమస్యలకు దారి తీస్తుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో బ్రౌన్ రైస్: తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అజీర్ణన్ని నివారించేందుకు ఉపయోగిపడే ద్రవాలు
జీర్ణక్రియను మెరుగుపర్చి అజీర్ణాన్ని తగ్గించేందుకు ఇక్కడ కొన్ని రకాల పానీయాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మీకు రోజంతా చాలా హాయిగా ఉంటుంది. మీ బిడ్డకు కూడా ఇవి ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.
- పాలు చాలా పోషక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. తల్లి, పుట్టబోయే బిడ్డ అభివృద్ధికి పాలు సహాయపడతాయి. పాలు కాల్షియంతో నిండి ఉంటాయి. తద్వారా తల్లి, పిండం ఎముకల అభివృద్ధికి ఇవి సహాయపడతాయి.
- కొబ్బరి నీరు గర్భధారణ సమయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మలబద్దకం నుంచి ఉపశమనం పొందడంతోపాటు, జీవక్రియను ఇది మెరుగుపరుస్తుంది. పీహెచ్ స్థాయిలను ఇది నియంత్రిస్తుంది. ఇది జీర్ణక్రియతో పోరాడుతుంది. పాలల్లో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో ఇవి సహాయం చేస్తాయి.
- గ్రీన్ టీ, అల్లం (జింజర్) టీ, చమోమిలే టీ వంటి హెర్బల్ టీలను తీసుకోవడం వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి జీర్ణక్రియకు సహాయపడతాయి. మార్నింగ్ సిక్‌నెస్‌ను నయం చేస్తాయి. వీటిని పరిమిత (లిమిటెడ్) పరిమాణంలో తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
- నీరు: గర్భధారణ సమయంలో అండం చుట్టూ అమ్నియోటిక్ ద్రవం ఏర్పడేందుకు, జీర్ణక్రియకు నీరు సహాయపడుతుంది. గర్భవతులు రోజుకు 8 నుంచి 12 గ్లాసుల నీటిని తీసుకోవాలి.
అజీర్ణానికి తీసుకోవాల్సిన మందులు
కొన్ని ఓవర్ ది కౌంటర్ (ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేసేవి) మందులు కూడా అజీర్ణాన్ని తగ్గిస్తాయి.
- మైలాంటా, రోలాయిడ్స్, టమ్స్ వంటి యాంటీ యాసిడ్స్ కడుపులోని ఆమ్లాలను మార్చడం ద్వారా గుండె మంట నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
- H2 బ్లాకర్స్ కడుపు నుంచి ఉత్పన్నం అయ్యే ఆమ్లాలను నిరోధించడంలో సహాయపడతాయి. ఇవి 2-3 గంటల్లో పని చేయడం ప్రారంభించి చాలా గంటల వరకు యాసిడ్ ఉత్పత్తిని అణచివేస్తాయి.
- PPIలు ( ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ (నిరోధకాలు)) తరచుగా సంభవించే గుండె మంటకు చికిత్స చేస్తాయి. కానీ పూర్తి ప్రభావం చూపేందుకు 2 నుంచి 3 రోజుల సమయం తీసుకుంటాయి.
ప్రతి ఒక్కరి శరీరం వేర్వేరుగా స్పందిస్తుంది కాబట్టి ఏవైనా మందులు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి. లేబుల్‌పై నిర్దేశించిన దానికంటే ఎక్కువ సమయం పాటు తీసుకోకండి. లక్షణాలు అలాగే కొనసాగితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.
చివరగా..
గర్భధారణ సమయంలో అజీర్ణం చాలా బాధాకరంగా, అసౌకర్యంగా ఉంటుందని మనందరికీ తెలిసినప్పటికీ ప్రసవం తర్వాత ఇది తగ్గిపోతుంది. హార్మోన్ల స్థాయి కూడా సాధారణ స్థితికి వస్తుంది. మీకు గుండెల్లో మంట అధికంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించండి.