hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • Diapering arrow
  • వాడిన డైపర్‌లను పారవేయడం ఎలా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే ! (How to Throw Away Disposable Diapers : All You Need to Know in Telugu!) arrow

In this Article

    వాడిన డైపర్‌లను పారవేయడం ఎలా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే ! (How to Throw Away Disposable Diapers : All You Need to Know in Telugu!)

    Diapering

    వాడిన డైపర్‌లను పారవేయడం ఎలా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే ! (How to Throw Away Disposable Diapers : All You Need to Know in Telugu!)

    3 November 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    తల్లిదండ్రులు తమ పిల్లలకు వాడిన డైపర్లను ఎలా పారవేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వాడిన డైపర్లను పారవేయడం కాస్త చిక్కైన పనే. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్వీయ పరిశుభ్రతను పాటిస్తూ పర్యావరణ పరిరక్షణ గురించి కూడా ఆలోచించాలి. పసిపిల్లలు రోజుకు సుమారుగా పదిసార్లు మూత్ర విసర్జన చేస్తారు. చాలామంది తల్లిదండ్రులు సగటున రోజుకు 8 నుంచి 10 డైపర్లను తమ పిల్లలకు వాడుతున్నారు. పిల్లలకు వాడిన డైపర్లను ఎలా పారవేయాలి? అనే విషయంలో తల్లిదండ్రులకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా పర్యావరణహితంగా డైపర్లను పారేయడం గురించి సందేహం ఉంటుంది. కొంత మంది తల్లిదండ్రులు క్లాత్ డైపర్లను వాడుతుంటారు. వారికి ప్రత్యామ్నాయాలు చాలా ఉంటాయి. శిశువులకు డైపర్లు వినియోగించే తల్లిదండ్రులు పారవేయడానికి వీలుగా, పర్యావరణానికి హాని కలిగించని విధంగా మంచి ఎంపిక చేసుకోవాలి. చిన్నారులకు వాడిన డైపర్లను పర్యావరణానికి హాని కలిగించకుండా ఏ విధంగా పారవేయాలి అనే విషయంపై ఇది ఓ గైడ్‌గా మీకు ఉపయోగపడుతుంది.

    డిస్పోజబుల్ డైపర్స్ గురించి మీరేం తెలుసుకోవాలి? (What do You Need to Know about Disposable Diapers in Telugu?)

    మనకు అందుబాటులో ఎన్నో రకాలైన డైపర్లు ఉన్నాయి. వాటిని పారవేయడానికి కూడా వేరువేరు పద్ధతులు అనుసరించాలి. బట్టలతో తయారు చేసిన డైపర్లను తమ పిల్లలకు వాడేవారు వాటిని శుభ్రపరచుకుని మళ్ళీ వాడవచ్చు. లేదా డస్ట్ బిన్‌లో పారేయొచ్చు. కానీ డిస్పోజబుల్ డైపర్స్ వాడే వారు వాటిని సరిగ్గా మడిచి చెత్తబుట్టలో పడేయాలి. తల్లిదండ్రులు పిల్లలకు వాడుతున్న డైపర్లు పర్యావరణానికి హాని కలిగించని పెయిల్ డిజైన్‌తో రూపొందించిన డైపర్స్ తీసుకోవాలి. ఈ తరహా డైపర్స్ క్రిమి కీటకాలను దూరంగా ఉంచడంతో పాటు, దుర్వాసనల్ని తగ్గిస్తాయి. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించకుండా, సురక్షితంగా పారెయ్యడానికి ఓ మార్గం ఉంది. వాడిన డైపర్లను చుట్టి ప్రైవేట్ సెప్టిక్ లేదా పబ్లిక్ మురుగు నీటిలో పారవేయడం ద్వారా సూక్ష్మ క్రిమి కీటకాలు రాకుండా, కలుషితం చేయకుండా ఉండవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: పసి పిల్లలకు పాటీ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? అందుకోసం కొన్ని టిప్స్!

    వాడిన డైపర్లను సరైన పద్ధతిలో పారవేయడం ఎలా? (How to Throw Away Used Diapers in Telugu?)

    వాడిన డైపర్‌లను సరైన పద్ధతిలో ఏ విధంగా పారవేయడానికి ఈ కింద ఐదు సూచనలు గుర్తుంచుకోండి.

    1.వాడిన డైపర్లను టాయిలెట్‌లోనే పారవేయడం: (Throwing Diapers in Toilets)

    మొదటి దశలో డైపర్లలోని ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు బాత్‌రూమ్‌లోనే పడేయాలి. పరిసరాల పరిశుభ్రతను పాటించినట్లు అవుతుంది. ఎటువంటి దుర్వాసన రాకుండా నివారించవచ్చు.

    Article continues below advertisment

    2. వాడేసిన డైపర్లను సరైన పద్ధతిలో చుట్టి పెట్టడం: (Packing Used Diapers in a Correct Way)

    ఒకవేళ డైపర్లను పారవేయాల్సి వస్తే వాటిని బిగుతుగా ఉండే సంచిలో చుట్టి పాడేయడం వల్ల డైపర్‌లోని మలినాలు బయటికి రాకుండా ఉంటాయి. అందులోని ద్రవ, ఘన పదార్థాలు బయటకు రావు. అలాగే దుర్వాసనలు రాకుండా, కాలుష్యం కాకుండా చేయవచ్చు.

    3. డైపర్లను గాలి దూరని కంటైనర్లలో ఉంచడం: (Keep Diapers in Air Tight Boxes)

    ఇంట్లోకి సూక్ష్మ క్రిమి కీటకాలు, దుర్వాసనలు రాకుండా ఉండేందుకు డైపర్లను గాలి దూరని కంటైనర్లలో భద్రపరచుకోవాలి. ఒకవేళ బట్టతో తయారు చేసిన డైపర్లు వాడుతున్నట్టైతే, వాడే ముందు అవి శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆ తర్వాతే వాడాలి. డైపర్లను స్టోర్ చేయడానికి తల్లిదండ్రులు ఈ కింది కంటైనర్లను ఉపయోగించవచ్చు:

    • డైపర్ పెయిల్స్ (Diaper Pails): ఇది డైపర్లను భద్రపరచడానికి చక్కటి ఎంపిక. ఎందుకంటే వీటిలో డైపర్లను ఉంచడం వల్ల ఏ సూక్ష్మ క్రిమికీటకాలు దరిచేరవు. పెద్దగా ఉండే స్పెషలైజ్డ్ కంటైనర్ ఎటువంటి చెడు వాసనలను రాకుండా తడిసిన డైపర్లను స్టోర్ చేయవచ్చు.
    • డాగీ బ్యాగ్స్ (Doggy Bags): ఇవి చూడ్డానికి చిన్న పరిమాణంలో ఉంటాయి. వాడిన డైపర్లు వేయడానికి వీలుగా ఉండే సంచీలు ఇవి. వివిధ పరిమాణాలలో లభిస్తాయి. ఇవి సెల్ఫ్-సీలింగ్ క్లోజర్‌తో వస్తాయి. డైపర్లను నిల్వ చేయడానికి అనువైన ఎంపిక.
    • ప్లాస్టిక్ కిరాణా బ్యాగ్స్(Plastic Kirana Bags) : ప్రయాణ సమయాలలో ఈ ప్లాస్టిక్ కిరాణా సంచులలో డైపర్లను ఉంచడం ఒక చక్కటి ఎంపిక. ఇవి తేలికగా ఉంటాయి. మీ డైపర్ బ్యాగులోనే తీసుకెళ్లవచ్చు.
    • ఎయిర్ సిక్ సంచులు: ఎయిర్ సిక్ సంచులు సాధారణంగా వాంతులు చేసుకున్నప్పుడు ఉపయోగిస్తుంటారు. డైపర్లను పారవేయడానికి ఇవి కూడా ఉపయోగించవచ్చు. టైట్ ఫిట్టింగ్ మూతతో ఇవి వివిధ సైజులు, డిజైన్స్‌లో లభిస్తాయి.
    • పేపర్ బ్యాగులు (Paper Bags): పేపర్ బ్యాగులు ప్రయాణ సమయాల్లో డైపర్లను స్టోర్ చేయడానికి మంచి ఆప్షన్. ఇవి చాలా తేలికగా ఉంటాయి. డ్రైపర్లను సురక్షితంగా ఉంచవచ్చు.

    4. డైపర్లను నిర్దేశించిన డబ్బాలలో మాత్రమే పాడవేయడం: (Throwing Used Diapers to Correct Dustbin in Telugu)

    ఇంట్లో అయినా, బయట ఎక్కడైనా వాడిన డైపర్లను మిగతా చెత్తతో పాటు పారెయ్యకుండా.. వాటికోసం నిర్దేశించిన డబ్బాలలో మాత్రమే వీటిని పాడేయడం మంచిది. పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుంది. పరిసరాలలో క్రిమి కీటకాలు దుర్వాసనలు రాకుండా నివారించవచ్చు.

    5. సాధ్యమైనచోట రీసైకిల్ చేయడం: (Recycling If Possible)

    రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేసిన డిస్పోజబుల్ డైపర్లను ఎంచుకోవడం లాంటి గ్రీన్ ఆల్టర్నేటీవ్స్ చూడండి. రీసైక్లింగ్ ల్యాండ్‌ఫిల్‌లోకి వెళ్లే వ్యర్థాల పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గిస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం తల్లిదండ్రులు డైపర్లను సరైన పద్ధతిలో, సురక్షితంగా పారవెయ్యడం అవసరం. పైన చెప్పిన పద్ధతుల్ని పాటించడం ద్వారా.. తల్లిదండ్రులు పర్యావరణానికి మేలు చేయొచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: Cloth Diapering Myths: క్లాత్ డైపరింగ్ అపోహలు!

    Article continues below advertisment

    సరైన పద్ధతిలో వాడిన డైపర్లను పారెయ్యక పోతే వచ్చే అనారోగ్య సమస్యలు (Health Issues If You Dont Throw Used Diapers in Proper Way in Telugu)

    డైపర్లు బాధ్యతాయుతంగా పారవేయడం చాలా అవసరం. లేకపోతే ఇది అంటువ్యాధులు, ఇతర వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతుంది. డైపర్లను, బేబీ వైప్స్‌ని బాధ్యతాయుతంగా పారెయ్యడం ద్వారా ఇన్ఫెక్షన్లను, వ్యాధులను తగ్గించవచ్చు. డైపర్లను సరిగ్గా పారెయ్యకపోతే ఈ కింద వివరించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది:

    • ఇన్ఫెక్షన్స్
    • బ్యాక్టీరియా వృద్ధి
    • వ్యాధుల వ్యాప్తి
    • అలెర్జిక్ రియాక్షన్స్

    పిల్లలకు వాడిన డైపర్లను కాల్చవచ్చా? (Can We Fire the Used Disposable Diapers in Telugu?)

    డైపర్‌లను కాల్చడం వల్ల మానవులకు, పర్యావరణానికి హాని కలిగించే విష వాయువులను విడుదల చేస్తుంది. డైపర్‌లను కాల్చడం వల్ల విషపూరిత రసాయనాలు గాలిలోకి విడుదలవుతాయి. మంటలు వ్యాపిస్తాయి. ఇవి నియంత్రించలేని స్థాయికి వెళ్లొచ్చు. అందువల్ల.. డైపర్‌లను బాధ్యతాయుతంగా పారవేయడం, కంపోస్టింగ్ లేదా రీసైక్లింగ్ వంటి ప్రత్యామ్నాయాలను పరిగణించడం చాలా అవసరం. చివరగా.. పర్యావరణ ప్రమాదాలను తగ్గించడానికి, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు డైపర్‌లను సరిగ్గా పారవేయడం చాలా అవసరం. ఈ ఆర్టికల్‌లో వివరించిన దశలను అనుసరించి, తల్లిదండ్రులు తమ పిల్లల డైపర్‌లను సురక్షితంగా, బాధ్యతాయుతంగా పారవేయాలి.

    Tags:

    disposable diapers in telugu, diaper disposing in telugu, how dispose diapers in telugu, can be diapers through away in telugu, diapers dust bin in telugu, dispose diapers in telugu.

    Article continues below advertisment

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.