This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

పసి పిల్లలకు పాటీ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? అందుకోసం కొన్ని టిప్స్!

Potty Training
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
పసి పిల్లలకు పాటీ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? అందుకోసం కొన్ని టిప్స్!
Likes4 Likes|
Read time5 min

పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు మోకాళ్లలోతు డైపర్లలో మునిగిపోయి ఉంటారు. ప్రస్తుత కాలంలో డైపర్లు శిశువుల జీవితంలో భాగమైపోయాయి. తల్లిదండ్రులు డైపర్లను ఇంట్లో నిల్వ ఉంచే పరిస్థితి వచ్చింది. క్రిబ్‌లో డైపర్లు దాచడం దగ్గర్నుంచి, బ్యాగులో న్యాపీస్ తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. పిల్లలు కాలకృత్యాలు తీర్చుకొని తమని తాను శుభ్రం చేసుకునే రోజు ఎంతో దూరంలో ఉందని తల్లిదండ్రులకు అనిపిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు కాలకృత్యాలు తీర్చుకునే ఆరోగ్యకర అలవాటును చేయించడం ఒక మైలురాయి లాంటిది. కన్నవారుగా పిల్లలు మలమూత్ర విసర్జనకు శిక్షణ అందించేలా చేయడానికి తమ సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. పిల్లలకు రెండేళ్ల వయస్సు వచ్చేసరికి పాటీ ట్రైనింగ్ ప్రారంభించడం ముఖ్యం. అయితే ప్రతీ పసిబిడ్డ భిన్నంగా ఉంటారు. కాబట్టి వారిని ఇతర చిన్నారులతో పోల్చడం మంచిది కాదు.

పసిపిల్లలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తల్లిదండ్రులు తెలుసుకోవడం ఎలా?

పిల్లలకు తమ మూత్రశయంపై, పేగులపై నియంత్రణ వచ్చినప్పటి నుంచి, వారు తమని తాము తడి లేకుండా, పొడిగా ఉంచాలనుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. చాలామంది పిల్లలు ముందుగా మలవిసర్జన కదలికలపై నియంత్రణను అభివృద్ధి చేసుకుంటారు.

  • మొదటి సంవత్సరం- చాలామంది పిల్లలు రాత్రిపూట పడుకున్నప్పుడు మలవిసర్జన చేయడం ఆపేస్తారు.
  • రెండో సంవత్సరం- ఇంకొంతమంది పిల్లలు తడి లేకుండా ఉండడానికి ఇష్టపడతారు.
  • మూడో సంవత్సరం- చాలావరకు పిల్లలు పగలంతా పొడిగా ఉంటారు. పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటున్నప్పుడో, రాత్రిపూట ప్రమాదవశాత్తు మూత్ర విసర్జన చేసే అవకాశం ఉంది.
  • నాలుగో సంవత్సరం- పిల్లలు పగలంతా తడి లేకుండా పొడిగా ఉంటారు.

పిల్లలు రాత్రుల్లో మూత్ర విసర్జనపై నియంత్రణ పొందుతారు. చాలావరకు మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు బెడ్ వెట్టింగ్ అంటే పక్కతడిపే సమస్యను అధిగమిస్తారు. అయితే కొందరికి ఇంకాస్త సమయం పట్టొచ్చు. ఒకవేళ ఆరు సంవత్సరాలు దాటిన పిల్లలు రాత్రులు మంచంపై తడుపుతున్నట్టైతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

పిల్లలకు మలమూత్ర విసర్జన శిక్షణ ఇవ్వాల్సిన సంకేతాలు

పిల్లలు ఉన్నట్టుండి ఈ కింది విధంగా చేస్తున్నట్టయితే వారికి కాలకృత్యాల శిక్షణ అవసరం ఉందని భావించవచ్చు.

  1. పిల్లలు తడిగా ఉన్న తమ డైపర్‌ని కిందికి లాక్కోవడం.
  2. టాయిలెట్ వచ్చినా రానట్టు ప్రవర్తించడం.
  3. పెద్దలు ఎలా వ్యవహరిస్తారనే దానిపై ఆసక్తి చూపడం.
  4. పిల్లలకు వేసిన డైపర్ ఎక్కువ సమయం పొడిగా ఉండటం. అంటే వారు తమ మలమూత్ర విసర్జనపై నియంత్రణ సాధించారని భావించవచ్చు.
  5. డైపర్ తడి కాగానే నిద్రలేవడం.
  6. మూత్ర విసర్జన లేదా మలవిసర్జన చేసిన వెంటనే తల్లిదండ్రులకు చెప్పడం.

పిల్లలకు కాలకృత్యాల శిక్షణ ఎప్పుడు ప్రారంభించాలి?

శిశువుకు కాలకృత్యాల శిక్షణ ఇవ్వడం ఎలా ప్రారంభించాలనే దానిపై రూల్ అంటూ ఏమీ లేదు. పిల్లలు నేర్చుకోవడానికి కొంత సమయం తీసుకుంటారు. డైపర్లను మానెయ్యడానికి సమయం పడుతుంది. అయితే పిల్లలకు కాలకృత్యాల శిక్షణ ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి.

  • పిల్లలు డైపర్ల విషయంలో అయిష్టత చూపించడం ప్రారంభిస్తారు.
  • చాలా మంది పిల్లలు 2 ఏళ్ల నుంచి 2.5 ఏళ్ల మధ్య కాలకృత్యాల శిక్షణకు ఆసక్తి చూపిస్తారు.
  • చల్లగా ఉండే ప్రాంతాల్లో వేసవిలో కాలకృత్యాల శిక్షణ ప్రారంభించాలి. పిల్లల దుస్తులు విప్పేసి, త్వరగా ఆరెయ్యడానికి వీలవుతుంది.
  • కాలకృత్యాల శిక్షణ ప్రారంభించడం మాత్రమే కాదు, స్థిరంగా కొనసాగించాలి.
  • పిల్లలు మూత్రం వస్తోందని చెప్పేంత వరకు కాలకృత్యాల శిక్షణ ప్రారంభించకూడదు. పిల్లలు తమంత తాము మూత్రం వస్తున్నట్టు చెప్పడం ప్రారంభిస్తే ఇక మీరు పాటీ ట్రైనింగ్ ప్రారంభించవచ్చు.
  • పిల్లలు మలమూత్ర విసర్జన చేయడానికి ఉపయోగించే బాత్రూం కుండీలను సౌకర్యవంతంగా ఉంచేలా చూసుకోవాలి.

కాలకృత్యాల శిక్షణకు పిల్లల్ని సిద్ధం చేయడానికి కొన్ని చిట్కాలు

శిశువుకు కాలకృత్యాల శిక్షణ ఎలా ప్రారంభించాలి? చాలా మంది తల్లిదండ్రులకు ఈ ప్రక్రియ ఎలా ప్రారంభించాలన్నదానిపై సందేహాలు ఉంటాయి. పిల్లల్ని కాలకృత్యాల శిక్షణకు సిద్ధం చేయడానికి మార్గాలు ఇవి. పిల్లలు సౌకర్యవంతంగా తేలికగా మలమూత్ర విసర్జనకు శిక్షణ పొందేందుకు కొన్ని చిట్కాలు దోహదపడతాయి:

  • తల్లిదండ్రులు పిల్లల పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలపై బలవంతపు ప్రయోగాలు చేయకూడదు.
  • తల్లిదండ్రులు పిల్లలతో తరచుగా వారి మలమూత్ర విసర్జన పట్ల అవగాహన పెంచేలా మాట్లాడాలి. పిల్లల్లో ఉండే భయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి.
  • పిల్లలు బాత్‌రూమ్ వాడుకునేందుకు వీలుగా ఉంచేలా చూసుకోవాలి.
  • ఇంట్లో పెద్ద పిల్లలు బాత్‌రూమ్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనే విషయం పిల్లలకు చూపిస్తూ, వారిని కూడా బాత్‌రూమ్ ఉపయోగించేలా నేర్పాలి.
  • పిల్లల ఆట బొమ్మలను మోడల్స్‌గా చూపించాలి. వారికి కాలకృత్యాలు తీర్చుకోవడం ఒక అహ్లాదకరమైన చర్యగా అనిపించేలా చేయాలి.
  • బాత్రూంలో పిల్లలు సౌకర్యవంతంగా ఉన్నారా లేదా అనేది చూసుకోవడం లాంటివి చేయాలి. అసౌకర్యంగా ఉన్నట్లయితే సౌకర్యవంతంగా మార్చాలి.
  • న్యాపీ మార్చడం కన్నా ముందు పాటీపై కూర్చునేలా చేయాలి. వారికి సౌకర్యంగా ఉందో లేదో చూడాలి.

2పిల్లలకు కాలకృత్యాల శిక్షణ కోసం టిప్స్

1. బాత్‌రూమ్‌లో పాటీని ఉంచాలి

  • ఒకవేళ రెండు అంతస్తుల ఇల్లు ఉన్నట్టైతే రెండు బాత్‌రూమ్‌లల్లో పాటీని పెట్టాలి. ఇక్కడ తల్లిదండ్రుల లక్ష్యం ఏంటంటే పిల్లలు పాటీపై సౌకర్యవంతంగా కూర్చోవడమే.
  • ఉదాహరణకు ఓ పిల్లాడు ప్రతీ రోజు ఒకే సమయంలో మలవిసర్జనకు వెళ్తున్నాడనుకుందాం. ఆ సమయంలో డైపర్ తీసేసి, టాయిలెట్‌కు వెళ్లాలని సూచన ఇవ్వాలి.
  • ఒకవేళ పిల్లలు మల విసర్జనకు వెళ్లడంలో విజయవంతం కాకపోతే వారిని ఏమీ అనకూడదు.
  • పిల్లల్ని ప్రశంసించి ప్రోత్సహించాలి.

2. పాటీ ట్రైనింగ్ ప్యాంట్స్

  • డిస్పోజబుల్ వాషబుల్ ప్యాంట్స్.
  • పాటీ ట్రైనింగ్ ప్యాంట్స్ పొడిగా ఉంచేలా పిల్లల్ని ప్రోత్సహించాలి.
  • పిల్లలు న్యాపీ మానలేకపోతున్నారంటే, న్యాపీలో టాయిలెట్ పేపర్ పెట్టాలి. దీనివల్ల న్యాపీ ఎక్కువసేపు తడిగా ఉంటుంది. పిల్లలకు తడితడిగా అనిపిస్తుంది.

రాత్రి సమయంలో పాటీ ట్రైనింగ్

పిల్లలు కొన్ని రోజులపాటు ఉదయాన్నే పొడి న్యాపీతో నిద్రలేస్తున్నారంటే.. ఇక వారికి న్యాపీ అవసరం లేదని అర్థం చేసుకోవచ్చు. పిల్లలు నిద్రపోవడానికి ముందే బాత్‌రూమ్‌కు వెళ్లేలా ప్రోత్సహించాలి. తడి పీల్చుకోని షీట్స్ ఉపయోగించడం మంచిది.

ముగింపు

తల్లిదండ్రులకు పాటీ ట్రైనింగ్ పెద్ద సవాలుగా ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు కనీసం 18 నెలలు వచ్చేవరకు ఆగుతుంటారు. పిల్లలు అప్పట్లోగా వారి కండరాల నియంత్రణ పొందుతారు. ఈ ఆర్టికల్‌లో చెప్పిన చిట్కాలన్నీ మీకు ఉపయోగపడి, ఈ పనిలో విజయం సాధిస్తారని భావిస్తున్నాం.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.