Want to raise a happy & healthy Baby?
Love, Sex & Relationships
3 November 2023 న నవీకరించబడింది
తల్లి అయినందుకు ముందుగా మీకు అభినందనలు! ప్రస్తుతం మీరు రోజు జనానంగ సమస్యలు, నవజాత శిశువు ఆలనాపాలనతోనే అలసిపోతూ ఉంటారు. ఈ సమయంలో భాగస్వామితో సాన్నిహిత్యాన్ని మీ మనస్సు కోరుకుంటుంది. అదే సమయంలో సెక్స్ అన్నది మీకు ఏ మాత్రం ప్రాధాన్యంగా అనిపించదు.
శిశు జననం తర్వాత పాల్గొనే మొదటి లైంగిక చర్య మీ ఇద్దరి మధ్య పునరుత్తేజం కలిగించడంలో కీలక అడుగు అవుతుంది. ప్రసవానంత సెక్స్‌కు ఎలాంటి టైం లైన్ ఉండదు. మీకు నచ్చిన రీతిలో మీరు తగిన సమయం తీసుకొని మీ భాగస్వామితో కలవచ్చు.
ప్రసవం తర్వాత ఎప్పుడు సెక్స్‌లో పాల్గొనాలనే విషయంలో ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు. కానీ కొందరు డాక్టర్లు గర్భాశయ ఇన్ఫెక్షన్ రాకుండా చూసేందుకు, అలాగే గర్భం సమయంలో వేసిన కుట్లకు ఇబ్బంది రాకుండా చూసేందుకు మూడు నుంచి ఆరు వారాలు ఆగమని సూచిస్తూ ఉంటారు.
ప్రసవానంతరం సంక్లిష్టతలు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. దీనికి అదనంగా ప్రసవించిన తర్వాత మీరు నొప్పిని అనుభూతి చెందవచ్చు, యోని నుండి స్రావాలు విడుదల కావచ్చు. ప్రసవం అనంతరం వచ్చే ఉత్సర్గ, అలసట, సెక్స్ చేయాలనే కోరిక తక్కువగా ఉండటం లాంటివి ఉంటాయి. కొన్ని వారాలు వేచి ఉండటం ద్వారా మీ శరీరం పూర్తిగా కోలుకుంటుంది. అలాగే లైంగిక జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకు మీరు మానసికంగా సిద్ధం కాగలుగుతారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ యొక్క మొదటి 3 నెలల్లో సెక్స్ గురించి అవగాహన
ఒకవేళ మీరు శిశువుకు తల్లిపాలు ఇస్తుంటే హార్మోన్ మార్పుల కారణంగా మీకు మీ జననాంగం ప్రాంతం పొడిబారినట్టు, నాజూకుగ్గా మారినట్టు అనిపిస్తుంది. ఆ అసౌకర్యం నుంచి అధిగమించేందుకు మీరు ఇవి ప్రయత్నించవచ్చు
నొప్పి నుంచి ఉపశమనానికి లేదా నొప్పిని దూరం పెట్టేందుకు మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి. నొప్పి నివారణ మందులు తీసుకోవడంతో పాటు సెక్స్‌కు ముందు మూత్రవిసర్జన చేయడం, కండరాలకు ఉపశమనం కోసం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వంటివి చేయాలి. సెక్స్ తర్వాత, మీ జననాంగం దగ్గర మీకు మంట అనిపించవచ్చు. ఆ అసౌకర్యం నుంచి ఉపశమనం పొందేందుకు మీరు ఒక వస్త్రంలో ఐస్ ఉంచి ఆ ప్రాంతంలో రాయండి.
పొడిబారిన జననాంగం సమస్యల కోసం లూబ్రికెంట్స్ (తడి కోసం వాడే నూనె, జెల్ లాంటిది) ఉపయోగించడం మంచిది.
మీ నొప్పి, అసౌకర్యం గురించి మీ భాగస్వామితో మనస్సు విప్పి మాట్లాడండి. ఓరల్ సెక్స్, పరస్పర హస్తప్రయోగం, ఎక్కువ సేపు ఫోర్ ప్లే, మసాజ్ వంటి ప్రత్యామ్నాయ సెక్స్ ఆప్షన్స్ ప్రయత్నించండి
మీ ఇద్దరికి అలసట లేని సమయంలోనే సెక్స్ కోసం ప్రయత్నించండి. మూడ్స్ ఏర్పరచుకునేందుకు ప్రయత్నించి ఇద్దరి మధ్య ఆ ఉత్తేజం మళ్లీ వచ్చేలా చూసుకోండి.
అయినప్పటికీ మీకు భరించలేని స్థాయిలో తీవ్రమైన లేదా అసాధారణమైన నొప్పి కలిగితే వెంటనే డాక్టరును సంప్రదించి తగిన పరీక్షలు, మందులు తీసుకోండి.
సాధారణ లైంగిక జీవితం గడిపేందుకు మీరు శారీరకంగా సిద్ధమైనప్పటికీ భాగస్వామితో సెక్స్ విషయంలో మీకు కోరిక ఉండదు. లైంగిక కోరిక విషయంలో ప్రసవానంతరం ప్రభావితం చేసే అనేక అంశాలు ఉంటాయి. ఉదాహరణకు
● హార్మోన్ల పరమైన మార్పులు
● అలసట/నీరసం
● చైల్డ్ బర్త్ ట్రామా
● ప్రసవానంతర డిప్రెషన్
● వుల్వార్ లేదా జననాంగ నొప్పి
● భాగస్వామితో భావోద్వేగపరంగా వేరుబడిన ఫీలింగ్
● ప్రసవం తర్వాత శరీరంలో చోటుచేసుకునే మార్పులు
సిజేరియన్ ఆపరేషన్ తర్వాత మహిళలు కోలుకోవడమన్నది భిన్నంగా ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత మిమ్మల్ని అటు ఇటు కదలమని, చిన్న చిన్న పనులు చేయమని మీ డాక్టరు సూచిస్తారు. అలా చేయడం వలన రక్తం గడ్డకట్టే ముప్పు తగ్గుతుంది. అయినప్పటికీ మీరు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల వరకు సెక్స్‌ను ఆనందించేందుకు మీరు శారీరకంగా సౌకర్యవంతంగా అనిపించేంత వరకు సెక్స్‌లో పాల్గొనకుండా వేచి ఉండాలి.
మీది సాధారణ ప్రసవం అయి ఉంటే మీ జననాంగ ప్రవేశ మార్గం బాగా సాగి శిశువు బయటకు వస్తుంది. ఈ కారణంగా జననాంగం దగ్గర గాయాలు, వాపు వంటివి కలుగుతాయి. అయితే ఇవి కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి, నొప్పి కూడా తొలగిపోతుంది.
సాధారణ ప్రసవమైనప్పటికీ మీ జననాంగం తిరిగి గతంలో ఉన్న ఆకృతిలోకి రాదు.అయితే దాని వలన మీ భవిష్యత్ లైంగిక అనుభూతులపై ఎలాంటి ప్రభావమూ ఉండదు.
ప్రసవం తర్వాత తిరిగి మీ పీరియడ్స్ ప్రారంభం కాకపోతే 3 వారాల్లో కూడా తిరిగి గర్భం ధరించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు తిరిగి గర్భం ధరించకూడదు అని అనుకుంటే ప్రసవం తర్వాత సెక్స్‌లో పాల్గొనేటప్పుడు గర్భనిరోధకాలు ఉపయోగించడం మర్చిపోవద్దు.
శారీరకంగా మీరు కోలుకున్నా కానీ మీ భాగస్వామితో సాన్నిహిత్యం విషయంలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ప్రసవానంతర డిప్రెషన్‌లో భాగమైన లక్షణాలు, సంకేతాలు ఏమైనా ఉంటే గమనించండి. మీకు తీవ్రమైన అలసట, తీవ్రమైన మానసిక ఆందోళన, ఆకలి మందగించడం, తీవ్రమైన భావోద్వేగాలు వంటివి కలగవచ్చు. ఈ లక్షణాల్లో ఏవి కనిపించినా వెంటనే మీరు డాక్టరును సంప్రదించండి. సకాలంలో సరైన చికిత్స తీసుకోవడం ద్వారా మీరు వేగంగా కోలుకోగలుగుతారు. ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని తిరిగి ప్రారంభించగలుగుతారు.
Sex After Pregnancy in telugu, Sex After Pregnancy precautions in telugu, pain during sex after pregnancy in telugu, Sex After Pregnancy in English, Sex After Pregnancy in Tamil, Sex After Pregnancy in Bengali, Sex After Pregnancy in Hindi.
Yes
No
Written by
Nayana Mukkamala
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Shop By Ingredient | Dhanwantaram | Shea Butter | Skin - Daily Wellness | By Concern | Digestive Health | Immunity | By Ingredient | Saffron | Wheatgrass | Skin - Weight | By Concern | Weight Management | By Ingredient | Apple Cider Vinegar | Skin - Bath & Body | By Concern | Body Moisturizer | Brightening | Tan Removal | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |