Breast Lump
19 May 2023 న నవీకరించబడింది
ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే రొమ్ము గడ్డ అనేది బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంకేతమని, అందువల్ల దీనిని విస్మరించకూడదని చాలా మంది అనడం మీరు విని ఉంటారు. అందువల్ల ఇలాంటి గడ్డలు ఏ దశలోనైనా రొమ్ముల్లో కనిపిస్తే ఏ స్త్రీకైనా భయం కలుగుతుంది. కానీ రొమ్ము గడ్డ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ లంప్ అనేది అరుదుగా బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంకేతం. అన్నింటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది... గర్భిణీ స్త్రీలలో 35 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చాలా అరుదు. ప్రెగ్నెన్సీ సమయంలో మీ శరీరం అనేక మార్పులకు గురవుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెబుతోంది. ఆ సమయంలో మీ రొమ్ముల్లో కూడా మార్పులు వస్తాయి. అవీ మరింత హెవీగా, గడ్డల వలే మారుతాయి. ఎందుకంటే పాల ఉత్పత్తికి తమను తాము సిద్ధం చేసుకుంటాయి.. కావున వాటిల్లో మార్పులు సహజం. నిజానికి సెకండ్ లేదా థర్డ్ ట్రైమెస్టర్‌లో బ్రెస్ట్ లంప్స్ అనేవి ఎక్కువగా నాళాల్లో పాలు గడ్డ కట్టడం వల్ల వచ్చేవే.
ప్రకృతి ఒక క్రమపద్ధతిలో పనిచేస్తుంది. పుట్టిన తర్వాత మీ బిడ్డ న్యూట్రిషన్, విటమిన్ల కోసం తల్లి పాల మీదనే ఆధారపడుతుంది. మీరు సెకండ్ ట్రైమెస్టర్‌లో ఉన్నపుడే మీ రొమ్ములు తమను తాము సిద్ధం చేసుకోవడం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో మిల్క్ డక్ట్ (పాలవాహిక) మూసుకుపోవడం, పెద్దగా కావడం చాలా కామన్. ఈ అడ్డు పడే పాలనాళాలు చాలా హార్డ్‌గా ఎరుపు రంగు గడ్డలవలే కనిపిస్తాయి. వీటిని తాకినపుడు నొప్పిగా ఉంటాయి. మీ శరీరం మీకు పుట్టబోయే చిన్నారికి పాలిచ్చేందుకు సిద్ధం అవుతోందని చెప్పేందుకు ఇవి చిహ్నం. అంతే కాకుండా ఈ గడ్డలు కొన్ని రోజుల తర్వాత కనబడకుండా పోతాయి. మీకు ఫ్యూచర్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండేందుకు మీరు మీ బిడ్డకు రొమ్ము పాలు ఇవ్వాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది వైద్యులు సూచిస్తున్నారు.
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెప్పిన వివరాల ప్రకారం.. సగటు రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఉన్న మహిళలకు రొటీన్ సెల్ఫ్ పరీక్షలు చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ప్రెగ్నెంట్ లేడీస్ వారి రొమ్ముల ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచాలి. వారి రొమ్ముల్లో తలెత్తే అసాధారణ విషయాల గురించి వారి వైద్యుడికి తెలపడం మంచిది. మీరు మీ రొమ్ములను నిశితంగా గమనిస్తుంటే మీ శరీరంలో ఏది నార్మలో ఏది కాదో ఇట్టే తెలిసిపోతుంది. మీరు మీ రొమ్ముల్లో గడ్డల కోసం చెక్ చేస్తున్నపుడు ప్రాణాంతక గడ్డలు ఫామ్ అయి ఉంటే అవి మొదట్లో ఎర్రగా లేదా పెయిన్‌ఫుల్‌గా ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే అవి గోరువెచ్చని నీటితో లేదా మసాజ్ చేసినా కూడా క్లియర్ కావు. ఏవైనా కొత్తగడ్డలు గుర్తించి, చర్మం థిక్నెస్ అవడం, చర్మం గట్టిపడడం, ఎరుపు రంగులోకి మారడం, ఒకే ప్లేస్‌లో నొప్పి ఏర్పడడం వంటి వాటిని గమనించినట్లయితే అవి మీ వైద్యుడికి వివరించాలి. మీరు ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఉన్నప్పుడు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అవ్వొచ్చు. అందువల్ల మీరు డాక్టర్‌కు చూపించుకునేందుకు డెలివరీ వరకు వెయిట్ చేయకండి. ప్రస్తుతం మీ రొమ్ము అనేది చాలా గట్టిగా మరియు గడ్డలాగ ఉండడం వలన క్యాన్సర్ పరీక్ష చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ సరైన రోగనిర్ధారణ చేసుకునేందుకు వీలవుతంది.
ఒక మహిళ ప్రెగ్నెన్సీ రొమ్ము గడ్డను తన రొమ్ముల్లో గుర్తిస్తే తను వీలైనంత తొందరగా కింది నియమాలను పాటించాల్సి ఉంటుంది.
ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ లంప్‌ను గుర్తిస్తే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. గడ్డ యొక్క సైజు మురియు అది ఏర్పడిన ప్రాంతాన్ని బట్టి అల్ట్రాసౌండ్ లేదా మాగ్నటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ (MRI) వంటి అదనపు పరీక్షలను మీ వైద్యుడు సూచించవచ్చు. మీ గడ్డ అనేది క్లాగ్డ్ డక్ట్ వలన ఏర్పడితే వేడి కంప్రెస్ (లేదా వేడినీటితో స్నానం లేదా వేడి షవర్) ఉపయోగించి ఆ ప్రాంతంలో మసాజ్ చేయడం వలన రిలీఫ్‌గా ఉంటుంది. గడ్డ అలాగే కొనసాగితే పరిస్థితులు మరింత దిగజారకముందే మీ వైద్యుడి వద్ద అపాయింట్మెంట్ తీసుకోండి. రొమ్ము గడ్డల్లోని రకాలు. ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ముల్లో వచ్చే గడ్డల్లో కొన్ని రకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.
బ్రెస్ట్ ఎంగోర్జ్ అనేది రొమ్ములలో చాలా బాధాకరమైన గడ్డలను ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలా మంది తల్లులలో ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇది రొమ్ముల వాపు, కఠినత్వానికి దారి తీయొచ్చు. పాలను చేతులతో లేదా మిషన్‌తో (పంప్‌తో) ఖాళీ చేసినపుడు ఈ గడ్డలు అదృశ్యమవుతాయి. బేబీ క్లియర్‌గా పాలు తాగలేకపోవడం వలన పాలు రావడం ఆగిపోతాయి. ఇటువంటి సందర్భాల్లో గెలాక్టాగోగ్లు మరియు ప్రత్యామ్నాయ టాప్ ఫీడ్లను ఉపయోగిస్తారు. ఇవి ఎక్కువ సాయం చేస్తాయి.
రొమ్ములో పాలు ఒక ప్రాంతంలో నిలిచిపోవచ్చు. ఇన్కరెక్ట్ ఫీడింగ్ పొజిషన్ వలన ఈ సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. చాలా బిగుతుగా ఉండే బ్రాలు నాళాలు మూసుకుపోయేందుకు దారితీయొచ్చు. బ్రెస్ట్ పంప్‌ను తరుచుగా ఉపయోగించడం కూడా బిడ్డ పుట్టిన మొదటి నెలలో వాహిక అడ్డంకికి కారణం కావొచ్చు.
మాస్టైటిస్ అనేది ఇన్ఫెక్షన్ వలన రొమ్ములో ఏర్పడే పెయిన్ఫుల్, అసౌకర్యవంతమైన గడ్డ. దీనికి కనుక మీరు చికిత్స చేయకపోతే పాలు రొమ్ముల వెనకాల పేరుకుపోతాయి. చికాకు వలన సాధారణంగా జ్వరం వస్తుంది.
పాలు బ్లాక్ కావడం వలన సిస్ట్ (తిత్తి) అనేది పాలు మరియు పాలకు సంబంధించిన ఇతర రసాయనాలను సేకరిస్తుంది. చాలా సందర్భాలలో ఇది ఎటువంటి అనారోగ్యాలకు దారి తీయదు. స్త్రీ చనుబాలివ్వడం మానేసిన తర్వాత ఇది అదృశ్యమవుతుంది.
రొమ్ములలో చీము చేరడం వలన రొమ్ము పుండ్లు ఏర్పడతాయి. సరిగ్గా చికిత్స చేయని మాస్టైటిస్ వల్ల ఇది సాధారణంగా వస్తుంది. యాంటీబయాటిక్స్ ఉన్న క్యాథర్ ఆస్పిరేషన్ లేదా సూది ద్వారా గడ్డలను తొలగించాలి. వీటిని అలాగే వదిలేస్తే మరింత నొప్పిని కలిగిస్తాయి. జ్వరానికి దారి తీయొచ్చు.
15 నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్న స్త్రీలలో ఎటువంటి అపాయం లేని బ్రెస్ట్ ట్యూమర్ ఏర్పడే అవకాశం ఉంది. ఇది గ్రంథి మరియు పీచుకణజాలంతో కూడిన ట్యూమర్ (కణతి). నెలవారీ రుతుచక్రంతో కూడా కొన్ని రకాల బ్రెస్ట్ లంప్స్ వస్తూ పోతూ ఉంటాయి. నెలవారీ రుతుచక్రం తర్వాత కూడా మిగిలి ఉన్న గడ్డనే ఫైబ్రోడెనోమా అని పిలుస్తారు. రుతుక్రమం ఆగిపోయిన (పీరియడ్స్ రాని స్త్రీలు) స్త్రీలు దీనిని అనుభవించే అవకాశాలు చాలా తక్కువ.
రొమ్ముల యొక్క పాలనాళాల్లో పెరుగుదలను ఇంట్రాడక్టల్ పాపిల్లోమాస్ అని అంటారు. ఇవి ప్రాణాంతకమైనవి కావు. చనుమొన చుట్టూ ఉన్న మేజర్ పాలవాహికలో ఇంట్రాడక్టల్ పాపిల్లోమా డెవలప్ అవుతుంది. ఇది తల్లులలో అత్యంత సాధారణంగా సంభవించే క్షీర కణతి. కొంత మంది స్త్రీలలో ఇది ఒకటి కంటే ఎక్కువగా కూడా ఉంటుంది. వీటితో బాధపడే వారిలో కొంత మందికి రక్తపు ఉత్సర్గ (స్రావం) కూడా అయ్యే అవకాశం ఉంది.
రొమ్ములలో లేదా ఇంకా ఎక్కడైనా పెరుగుతున్న కొవ్వును లిపోమా అని అంటారు. 2 సెం.మీ. వ్యాసంలో అవి పెరుగుతాయి. ఇవి గుండ్రంగా లేదా ఓవల్ ఆకారంలో ఉంటాయి. తేలికగా నొక్కినపుడు ఇవి సులభంగా కదులుతాయి. వీటిని నొక్కితే రబ్బర్ నొక్కిన ఫీలింగ్ వస్తుంది. ఏకకాలంలో ఇవి అనేకం ఏర్పడొచ్చు.
చాలా సందర్భాలలో ఇది అసౌకర్యాన్ని కలిగించని హార్డ్ లేదా ఫర్మ్ బంప్. నిపుల్ (చనుమొన) లేదా బ్రెస్ట్ మీద ఈ ట్యూమర్ ఏర్పడొచ్చు. పెద్ద ప్రాణాంతక ట్యూమర్స్ సమీపంలోని రొమ్ము కణజాలాన్ని ప్రభావితం చేస్తాయి. లేదా చర్మాన్ని చీలుస్తాయి. ఈ రెండూ విపరీతమైన బాధను కలుగజేస్తాయి.
ఈ గడ్డలు రొమ్ము యొక్క కొవ్వు కణజాలాలు దెబ్బతినడం వలన ఏర్పడతాయి. ఇవి ఎక్కువ కాలంపాటు కొనసాగితే వీటికి చికిత్స చేయాలి. ఇవి ప్రాణాంతకమైనవి కావు. వీటికి విజయవంతంగా చికిత్స చేయొచ్చు.
రొమ్ము గడ్డలు క్యాన్సర్‌కు సంకేతం కానప్పటికీ.. రొమ్ము గడ్డలు నొప్పిని మరియు అసౌకర్యాన్ని కలిగిస్తాయనే వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. వాటిని వదిలించుకునేందుకు రొమ్ము గడ్డలను క్రమం తప్పకుండా వెచ్చని కంప్రెస్ (పదార్థాలను ఒక చోట వేసి ముద్దలా చేసేది)తో తాపడం పెట్టాలి. మీరు ఆ గడ్డలు ఉన్న ప్రదేశాల మీద వేడి నీటిని కూడా పోయొచ్చు. మసాజ్ ఈ గడ్డలను తొలగించుకోవడంలో బాగా సహాయం చేస్తుంది. అండర్ వైర్ బ్రాలు ధరించడం మానుకోండి. గడ్డ క్లియర్ కాకపోతే మీ వైద్యుడిని సంప్రదించండి.
సాధారణ రొమ్ము గడ్డల మాదిరిగా కాకుండా రొమ్ము క్యాన్సర్ కలుగజేసే గడ్డలు ఎటువంటి నొప్పి లేకుండా ఉంటాయి. అవి ఫస్ట్ టైమ్ కనిపించినపుడు ఎర్రగా ఉండవు. బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డలు పైన పేర్కొన్న ఏ చికిత్సలతోనూ నయం కావు. అయినా కానీ వైద్యులకు ఏవి క్యాన్సర్‌ను కలిగించే గడ్డలో ఏవి సాధారణ గడ్డలో తెలుసుకోవడం చాలా కష్టం. అరుదుగా సంభవిస్తున్నప్పటికీ మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్నపుడు రొమ్ము క్యాన్సర్ కలగదని తోసిపుచ్చలేం. కాబట్టి ఏ సందర్భంలోనైనా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
ప్రెగ్నెన్సీ సమయంలో మీ బాడీ అనేక మార్పులకు గురవుతుంది. డెలివరీ, మీ బిడ్డ పుట్టిన తర్వాత తనను తాను సిద్ధం చేసుకునేందుకు మార్పులు చెందుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ము గడ్డలు పెద్ద ప్రమాదకరం కాదు. అవి ఈ మార్పుల్లో భాగంగానే వస్తాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో మీరు రొమ్ము గడ్డలను గుర్తిస్తే ఎక్కువగా కంగారుపడాల్సిన అవసరం లేదు. కానీ సరైన చికిత్స కోసం మీరు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించాలి.
Yes
No
Written by
kakarlasirisha
kakarlasirisha
8 వారాల ప్రెగ్నెన్సీలో రక్తస్రావం - మీరు వైద్యుడిని సంప్రదించాలా?
9 వారాల ప్రెగ్నెన్సీలో బ్రౌన్ డిశ్చార్జ్ - ఇది సాధారణమా?
ప్రెగ్నెన్సీ 6వ నెలకు ఆరోగ్యకరమైన డైట్ మరియు మీల్ ప్లాన్
ఫీటల్ డాప్లర్ స్కాన్.. గుండె స్పందనలు గుర్తించే పరీక్ష గురించి సమగ్ర వివరాలు
9వ వారం గర్భం సమయంలో ఏమి తినకూడదు.
9 వారాల గర్భధారణలో అల్ట్రాసౌండ్: ఏమి ఊహించాలి మరియు చెడు శకునాలు ఏంటి
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Mylo is a master brand offering solutions through it's subsidiaries - Mylo Care and Mylo Baby.
Mylo Care offers science backed, expert led solutions across multiple health concerns.
Mylo Baby is a one stop solution for young parents for all their baby's needs.
Coconut | Neelibrigandi | Skin - Bath & Body | By Ingredient | Skin - Pregnancy & New Mom | Skin - Health & Wellness | Digestive Health | Lactation | Pain management | By Ingredient | Saffron | Shatavari | Nivarini | Skin - Weight | Weight Management | By Ingredient | Wheatgrass | Apple Cider Vinegar | Skin - Fertility | PCOS |