hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

 • Home arrow
 • Food Cravings arrow
 • ప్రెగ్నెన్సీ సమయంలో ఏం తినాలి? (What To Eat During Pregnancy in Telugu?) arrow

In this Article

  ప్రెగ్నెన్సీ సమయంలో ఏం తినాలి? (What To Eat During Pregnancy in Telugu?)

  Food Cravings

  ప్రెగ్నెన్సీ సమయంలో ఏం తినాలి? (What To Eat During Pregnancy in Telugu?)

  3 November 2023 న నవీకరించబడింది

  Article Continues below advertisement

  పరిచయం (Introduction)

  ఆహారం నిస్సందేహంగా మనుగడకు అత్యంత కీలకమైన విషయాలలో ఒకటి. మీ ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే మీరు తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైన విషయంగా మారుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఏమి తినాలి మరియు ప్రెగ్నెన్సీ సమయంలో ఏమి తినకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

  తల్లిగా మారనున్న మీరు తీసుకునే ఆహారం నెరవేర్చాల్సిన రెండు క్లిష్టమైన విధులు:

  • ఇది మీ శరీరానికి సరిగ్గా పోషణనివ్వాలి.
  • ఇది పిండాన్ని పోషించడానికి మరియు అభివృద్ధి చేయడానికి సహాయపడాలి.

  ప్రెగ్నెన్సీ సమయంలో తినాల్సిన ఆవశ్యక (తప్పనిసరి) ఆహారాలు ఏవి? (Essential Foods to Eat During Pregnancy in Telugu?)

  1. నీరు (Water):

  ప్రెగ్నెన్సీ సమయంలో నీరు తాగడానికి ముందు, క్రిమి రహితం చేసేందుకు కనీసం 15–20 నిమిషాల పాటు మరిగించండి.

  2. పాలు (Milk):

  పిండం యొక్క ఎముకలకు దృఢమైన పునాదిని అందించడంలో ఇది సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం ఒక కప్పు పాలు తీసుకోండి. ఇది బిడ్డ యొక్క సరైన శారీరక, మానసిక మరియు మేధో వికాసానికి దోహదపడుతుంది.

  3. వెన్న, మజ్జిగ, మరియు నెయ్యి (Butter, Buttermilk, Ghee):

  తాజా వెన్న శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. తేజాన్ని, శక్తిని మరియు ఉత్సాహాన్ని పెంచుతుంది. మీ చర్మ ఛాయను పెంచుతుంది మరియు జీర్ణ వ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. చాలా మంది మహిళలు ప్రెగ్నెన్సీ యొక్క చివరి దశలో ‎‎నీటి నిలుపుదల (వాటర్ రిటెన్షన్)ను ఎదుర్కొంటారు. మజ్జిగ కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. నెయ్యి ఇంద్రియాలకు బలాన్ని అందిస్తుంది మరియు జ్ఞాపకశక్తిని నిలుపుకోవడాన్ని పెంచుతుంది. నెయ్యిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బిడ్డ తెలివితేటలు పెరుగుతాయని చెబుతారు.

  Article continues below advertisment

  ఇది మీకు కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో సాబుదాన(ఒక రకమైన ఆహారపదార్థం) ఎందుకు తీసుకోవాలి?

  4. కాల్షియం మరియు ఐరన్ కలిగిన ఆహార పదార్థాలు (Calcium and Iron-Rich Foods):

  ఐరన్ లోపించడం వల్ల అసంపూర్ణ పిండం అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రసవ సమయంలో అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆకుకూరలతో చేసిన ఆహారంపై చల్లిన కొన్ని చుక్కల నిమ్మరసం విటమిన్ సి ని శరీరానికి తగిన మోతాదులో అందిస్తుంది. ఇది ఐరన్ యొక్క సరైన శోషణకు అవసరం. నల్ల ఎండుద్రాక్ష, ఖర్జూరాలు, బీట్ రూట్, దానిమ్మ, ఆపిల్ మరియు కుంకుమపువ్వు కూడా ఐరన్ కంటెంట్‌ను పెంచడానికి సహాయపడతాయి. బెల్లం, గోధుమలు, తేలికగా జీర్ణమయ్యే పప్పుధాన్యాలు (కొన్నిసార్లు వాటి పొట్టుతో పెసరపప్పు మరియు కందిపప్పు వంటివి), కొబ్బరి, ఎండు ఖర్జూరాలు మరియు గసగసాలు సహజంగా ఐరన్ యొక్క మంచి వనరులు.

  5. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు మరియు చిక్కుళ్ళు (Cereals, Pulses & Legumes):

  లంచ్ మరియు డిన్నర్‎లో కనీసం ఒక కప్పు సాదాగా వండిన పప్పుధాన్యాలు మరియు ఒక కప్పు మసాలా దినుసులు ఉండాలి. పసుపు మరియు పెసర రోజువారీ వినియోగానికి మినహాయింపులు. పిండం యొక్క మొత్తం అభివృద్ధి ప్రోటీన్‌పై ఆధారపడి ఉంటుంది. పెసర వంటి తేలికపాటి పప్పుధాన్యాల మొలకలను ఆహారంలో కనీసం రోజుకు ఒక్కసారైనా చేర్చాలి మరీ ముఖ్యంగా మధ్యాహ్న భోజనంతో. తినడానికి ముందు వాటిని స్టీమ్ లేదా ఉడికించండి.

  6. గింజలు (Nuts):

  బియ్యం లేదా ఇతర వండిన ధాన్యాలతో కలిపి పప్పు ధాన్యాలను తింటే తేలికగా జీర్ణం అవుతాయి. గింజలను గ్రైండింగ్ చేయడానికి ముందు వేయించాలి, తద్వారా అవి తేలికగా జీర్ణం అవుతాయి.

  7. తేనె (Honey):

  ప్రతిరోజూ ఒకటి నుండి రెండు టీస్పూన్ల తేనె తీసుకోండి. ఇది తెలివితేటలను మెరుగుపరుస్తుంది మరియు మీ రంగుకు ఒక మెరుపును ఇస్తుంది. ఇది కళ్ళకు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది.

  Article continues below advertisment

  ప్రెగ్నెన్సీ సమయంలో ఎటువంటి కూరగాయలు తినాలి? (What Vegetables to Eat During Pregnancy in Telugu?)

  ఈ క్రింది కూరగాయలు సులభంగా జీర్ణం అవుతాయి మరియు చాలా మంది మహిళలకు తగినవి:

  • సొరకాయ
  • పొట్లకాయ
  • కీరదోస
  • బూడిద గుమ్మడికాయ
  • బెండకాయ
  • ఎరుపు గుమ్మడికాయ
  • బంగాళాదుంపలు (ఆలుగడ్డలు)
  • కాకర కాయ
  • దొండకాయ
  • బచ్చలికూర వంటి ఆకుకూరలు

  కీరదోసకాయ, టమాటాలు, క్యారెట్లు, బీట్ రూట్లను కూడా రోజూ తక్కువ పరిమాణంలో సలాడ్‎గా తీసుకోవచ్చు. వర్షాకాలంలో నీరు చాలా మలినాలను కలిగి ఉంటుంది. ఇది కూరగాయలలో బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి వర్షాకాలంలో ఆకుకూరలను జాగ్రత్తగా శుభ్రం చేసుకుని తినండి.

  ప్రెగ్నెన్సీ సమయంలో ఏ పండ్లు తినాలి? (What Fruits to Eat During Pregnancy in Telugu?)

  మీ ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతిరోజూ ద్రాక్ష, ఆపిల్, దానిమ్మ మరియు నారింజ లాంటి సీజనల్ పండ్లను ఒక్కటైనా తినాలి. సాధారణంగా ప్రెగ్నెన్సీ ఏడవ లేదా ఎనిమిదవ నెలలో అమ్నియోటిక్ ద్రవం అకస్మాత్తుగా తగ్గుతుంది. కాబట్టి తాజా కొబ్బరి నీరు ఈ సమయంలో ఆరోగ్యకరమైన పానీయం. పైనాపిల్, స్ట్రాబెర్రీ, వుడ్ ఆపిల్, కస్టర్డ్ ఆపిల్, జామ, పియర్, పుచ్చకాయ వంటి పుల్లని పండ్లను అప్పుడప్పుడు తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ - ముఖ్యంగా బాదంపప్పులు - గర్భిణీలకు తప్పనిసరి. ఇది అభివృద్ధి చెందుతున్న పిండం యొక్క మెదడుకు పోషణ అందిస్తుంది. ప్రతిరోజూ ఒక పొడి ఖర్జూరాన్ని తినండి. లేదంటే ప్రత్యామ్నాయంగా ఒక టీస్పూన్ ఎండిన ఖర్జూరం పొడిని ప్రతిరోజూ ఒక గ్లాసు పాలతో కలిపి తీసుకోండి. ఎదుగుతున్న బిడ్డకు పోషణ అందించడం కొరకు ఆప్రికాట్(నేరేడు పండ్లు)లను తినండి. అప్పుడప్పుడు వాల్ నట్స్, జీడిపప్పు, పిస్తా పప్పులు తినాలి.

  ప్రెగ్నెన్సీ సమయంలో ఏమి తినకూడదు? (What Not to Eat During Pregnancy in Telugu?)

  • పండిన మరియు ఆకుపచ్చని మామిడి పండ్లను రెండింటినీ నివారించడానికి ప్రయత్నించండి. నాన్ సీజనల్ పండ్లను తినడం మానుకోండి.
  • బొప్పాయి గర్భాశయ సంకోచాలను కలిగిస్తుంది మరియు గర్భస్రావాన్ని కూడా ప్రేరేపిస్తుంది. అందువల్ల వీటిని గర్భిణీ స్త్రీలు ఎన్నడూ తినకూడదు.
  • ఫ్రూట్ సలాడ్‎లు మరియు మిల్క్ షేక్‎లు అధికంగా తీసుకోవడం తగ్గించండి.
  • చిలగడదుంపలు మరియు పుట్టగొడుగులు వంటి కూరగాయలు జీర్ణం కావడం కష్టం. క్యాప్సికమ్, వంకాయ, స్ప్రింగ్ ఉల్లిపాయలు, క్లస్టర్ బీన్స్ కూడా చాలా అరుదుగా తినాలి.
  • క్యారెట్ లేదా టొమాటో జ్యూస్ తీసుకోవడం మంచిది కాదు. కానీ మీరు అప్పుడప్పుడు టొమాటో సూప్ తాగవచ్చు.

  ఇది మీకు కూడా నచ్చుతుంది: అపోహలు – వాస్తవాలు: వేడిచేసే పదార్థాల వల్ల గర్భం పోతుందా?

  ప్రెగ్నెన్సీ సమయంలో వాంతులు అయిన తరువాత ఏమి తినాలి? (What to Eat After Vomiting During Pregnancy in Telugu?)

  చల్లని లేదా గది ఉష్ణోగ్రత వద్ద చాలా తక్కువ వాసన ఉన్న చిన్న మొత్తంలో సాదా ఆహారాన్ని తీసుకోండి. మీరు వైట్ బ్రెడ్ టోస్ట్, గుజ్జుగా చేసిన బంగాళాదుంపలు, పండ్లు, వైట్ రైస్, సాదా వేడి తృణధాన్యాలు మరియు సాదా వైట్ పాస్తా తీసుకోవచ్చు.

  Article continues below advertisment

  ప్రెగ్నెన్సీ సమయంలో రక్తపోటు తగ్గించడం కోసం ఏమి తినాలి? (What to Eat to Reduce BP During Pregnancy in Telugu?)

  ఖనిజాలు మరియు విటమిన్లు అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలను తినండి. ఒకేసారి ఎక్కువ భోజనం తినవద్దు. క్రమం తప్పకుండా స్వల్ప పరిమాణంలో భోజనం చేయండి.

  ప్రెగ్నెన్సీ యొక్క మొదటి మూడు నెలలు మరియు తర్వాత మూడు నెల(మొదటి మరియు రెండో ట్రైమిస్టర్)ల్లో ఏమి తినాలి? (What to Eat in First Trimester & Second Trimester During Pregnancy in Telugu?)

  ప్రెగ్నెన్సీ యొక్క మొదటి ట్రిమ్‎స్టర్‎లో మీరు ఏమి తినాలి మరియు ప్రెగ్నెన్సీ యొక్క రెండవ ట్రిమ్‎స్టర్‎లో ఏమి తినాలి అనే దాని మధ్య చిన్న తేడాలు ఉన్నాయి. నిత్యావసరాల లిస్ట్ ఇక్కడ ఇవ్వబడింది:

  మొదటి ట్రైమిస్టర్: (First Trimester)

  ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాలు, విటమిన్ బి6, పాల ఉత్పత్తులు మరియు ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోండి.

  రెండవ ట్రైమిస్టర్: (Second Trimester)

  మీరు ఐరన్, విటమిన్ సి, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు, కాల్షియం, ఫోలేట్, విటమిన్ డి మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను తీసుకోవాలి. అలాగే తీసుకునే ద్రవాల శాతాన్ని కూడా పెంచాలి.

  ముగింపు: (Conclusion)

  మీ బిడ్డ గర్భంలోని తొమ్మిది నెలల కాలంలో మార్పులకు లోనవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఏమి తినాలో తెలుసుకోవడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అనేది మీ బిడ్డ యొక్క సరైన ఎదుగుదల కొరకు మీరు చేయగలిగే అత్యుత్తమమైన అంశం. ఐరన్, ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాలు, మజ్జిగ, వెన్న మరియు నెయ్యి వంటి పాల ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్ మరియు సీజనల్ ఫ్రూట్స్ మీ ఆరోగ్యానికి మరియు మీ బిడ్డ ఎదుగుదలకు ఎంతో అవసరం. ఈ సమయంలో మీ డైట్‌లో ఉంచాల్సిన మరియు తొలగించాల్సిన ఆహారాల లిస్ట్‌ను మీరు అందుబాటులో ఉంచుకునేలా చూసుకోండి.

  Article continues below advertisment

  Tags:

  Pregnancy diet chart in telugu, diet chart for pregnant ladies in telugu, what to eat during pregnancy in telugu, best food items for pregnant ladies in telugu.

  Is this helpful?

  thumbs_upYes

  thumb_downNo

  Written by

  Swetha Rao

  Get baby's diet chart, and growth tips

  Download Mylo today!
  Download Mylo App

  RECENTLY PUBLISHED ARTICLES

  our most recent articles

  Mylo Logo

  Start Exploring

  wavewave
  About Us
  Mylo_logo

  At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.