hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Diet & Nutrition arrow
  • ప్రెగ్నెన్సీ సమయంలో సాబుదాన(ఒక రకమైన ఆహారపదార్థం) ఎందుకు తీసుకోవాలి? (Why should you have Sabudana during Pregnancy in Telugu?) arrow

In this Article

    ప్రెగ్నెన్సీ సమయంలో సాబుదాన(ఒక రకమైన ఆహారపదార్థం) ఎందుకు తీసుకోవాలి? (Why should you have Sabudana during Pregnancy in Telugu?)

    Diet & Nutrition

    ప్రెగ్నెన్సీ సమయంలో సాబుదాన(ఒక రకమైన ఆహారపదార్థం) ఎందుకు తీసుకోవాలి? (Why should you have Sabudana during Pregnancy in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    ప్రెగ్నెన్సీ సమయంలో సాబుదాన తల్లి మరియు బిడ్డకు అనేక ప్రయోజనాలు కలిగిస్తుందని మీకు తెలుసా? ప్రెగ్నెన్సీ అనేది స్త్రీలు కేవలం తమ జీవితానికి మాత్రమే కాకుండా పుట్టబోయే బిడ్డ జీవితానికి కూడా బాధ్యత వహించాల్సిన సమయం. చిన్నప్పుడు మన తల్లులు తీసుకున్న జాగ్రత్తల వల్ల మనమంతా ఇప్పటికీ బాగున్నాం. కేవలం ప్రెగ్నెన్సీ సమయంలోనే కాకుండా పోస్ట్ ప్రెగ్నెన్సీ (డెలివరీ తర్వాత) సమయంలో కూడా తల్లులు వారు తీసుకునే ఆహారం మీద దృష్టిపెట్టాలి మరియు ఆ సమయంలో తల్లులు చనుబాలిస్తారు కాబట్టి వారు మరింత పోషకాహారం తీసుకోవాలి. శిశువు ఫుడ్ మరియు అన్ని రకాల విటమిన్ల కోసం తన తల్లి మీద ఆధారపడుతుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు డెలివరీ తర్వాత కూడా హెల్దీ మరియు అనేక పోషకాలు ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవాలి. సగూ ఎందుకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఆహారపదార్థం, ప్రెగ్నెన్సీ సమయంలో దీనిని తినాలా, వద్దా అనేది ఇప్పుడు చూద్దాం.

    సాబుదాన గురించి (About Sabudana in Telugu)

    సాబుదానను సకాక్, సాహు లేదా రబియా అని ఉష్ణమండల దేశాల్లో పిలుస్తారు. ఆసియా దేశాలలో ఇది చాలా ఫేమస్. సాబుదాన లేదా సగూ అనేది ఎన్నో పోషక విలువలు కలిగిన ఆహారం. ఇది తినదగిన పిండిపదార్థం. బియ్యం వంటి పిండిపదార్థాలకు ఇది ప్రత్యామ్నాయంగా ఉంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. సాబుదానను వివిధ వెరైటీల్లో తినొచ్చు. దీనిని స్నాక్​గా మెయిన్ కోర్స్​గా లేదా డెసర్ట్​గా తినేందుకు వీలుంటుంది. టాపియోకాని సగూ అని చాలామంది తికమక పడుతుంటారు. కానీ అవి రెండు వేర్వేరు పదార్థాలు. సగూ ఉష్ణమండల ప్రాంతాల్లో లభిస్తుంది. ఇది తాటిచెట్ల నుంచి తయారవుతుంది. ఇది తినదగిన పిండిపదార్థం. టాపియోకా అనే పిండి పదార్థం కాస్సావా అనే మూలాల నుంచి తయారైంది. టాపియోకాను ప్రధానంగా భారతీయ వంటకాలలో ఉపయోగిస్తారు. సాబుదానతో మీరు అనేక రకాల ఆహార పదార్థాలను తయారు చేయొచ్చు. అందువల్లే సాబుదానను బహుముఖ ప్రజ్ఞశాలి అని అంటారు. దీనిని వండడం చాలా తేలిక. దీని రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఎముకల అభివృద్ధి (ఎముకల బలం, ఎముకల సాంద్రత) కండరాల పెరుగుదల, రోగనిరోధక శక్తి పెరుగుదల, తగినంత శక్తిని అందించడం వంటి లక్షణాలను కలిగి ఉన్నందువల్ల పిల్లలు సాబుదాన వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు.

    ప్రెగ్నెన్సీ సమయంలో సాబుదాన తీసుకోవడం సురక్షితమేనా? (Is Sabudana Safe During Pregnancy in Telugu?)

    అన్నింటికంటే ముఖ్యమైనది మీరు పోషకాలతో కూడిన డైట్​ ప్లాన్​ను రూపొందించుకోవాలి. ఇది మీ శిశువు ఆరోగ్యానికి సురక్షితం. సాబుదాన (సగూ) అనేది ఒక ఉత్తమ ఆహార పదార్థం. ఇది హెల్దీ పిండిపదార్థంగా పిలవబడుతుంది. పిండిపదార్థాలు నిల్వ చేయబడిన శక్తిని మాత్రమే అందజేస్తాయి. కానీ సాబుదాన మాత్రం కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి విటమిన్లను కూడా అందజేస్తుంది. ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్​ను కూడా మీరు పొందుతారు.

    మీరు మీ ఆహారంలో సగోను చేర్చితే మీరు దానిని మైదా లేదా ఆల్​పర్పస్ వంటి పిండితో భర్తీ చేయొచ్చు మరియు అనేక రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. సాబుదానా తో చేసిన వంటకాలు త్వరగా జీర్ణం అయిపోతాయి.. సాబుదాన మీకు రెండు రూపాల్లో లభిస్తుంది. ఒకటి పొడి మరియు ముత్యాలు (సాబుదాన గింజలు ముత్యాల్లా ఉంటాయి) ఈ రెండు రకాలతో మీరు కావాల్సిన వంటకాలను చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ డయాబెటిస్ ఉన్న స్త్రీలు సగూలను తినకూడదు. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కేలరీలను పెంచి మీ బరువు పెరిగేలా చేస్తాయి. మీరు అంతగా తినాలని అనుకుంటే వాటి వాడకాన్ని పరిమితం చేయాలి. సాబుదానను యోగా మరియు వ్యాయామంతో కలిపి తీసుకోవాలి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో వేరుశనగ: సురక్షితమా, కాదా ?

    సాబుదాన వల్ల పోషక ప్రయోజనాలు (Nutritious Benefits of Sabudana in Telugu)

    ప్రజలు సాధారణంగా ఉపవాసం ఉన్న సమయాల్లో ఈ సాబుదానను తింటారు. గోధుమలు మరియు గోధుమ ఉత్పత్తులకు ఇది మంచి ప్రత్యామ్నాయం. మీరు ఆకలితో ఉన్నపుడు ఇది తింటే బాగుంటుంది. సగూ లేదా సాబుదానలో కింది మూలకాలు సమృద్ధిగా ఉంటాయి.

    • పిల్లల్లో కణాలు పెరగడానికి మరియు ఉత్పత్తి అయ్యేందుకు ప్రొటీన్స్ చాలా అవసరం.
    • కార్బోహైడ్రేట్లు– ఇవి శిశువుకు చాలా అవసరం. ఇవి శరీరం అసంకల్పిత చర్యలను నిర్వహించేందుకు శక్తిని పొందగలవు. కార్బోహైడ్రేట్స్ అనేవి నిల్వ శక్తిగా కూడా పని చేస్తాయి.
    • విటమిన్ బి కాంప్లెక్స్
    • రక్తపోటు నియంత్రణకు పొటాషియం చాలా అవసరం. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం.
    • కాల్షియం – ఎముకల పటిష్టత, ఆరోగ్యం కోసం ఇది చాలా అవసరం.
    • మెగ్నీషియం అనేది తల్లి మరియు బిడ్డ ఎముకల సాంద్రతను పెంచడంలో కీలక మూలకం.
    • ఐరన్– మెదడు అభివృద్ధికి ఇవి చాలా అవసరం.
    • డైటరీ ఫైబర్స్ మొదలయినవి.
    • ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి సాబుదానలో పెద్ద మొత్తంలో ఉంటాయి. డెలివరీ సమయంలో ఇవి ఉపయోగపడతాయి.
    • సాబుదాన నాడీవ్యవస్థను కూడా బూస్ట్ చేస్తుంది. (ఉత్తేజపరుస్తుంది). ఫలితంగా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇవి నాడీ వ్యవస్థపై బాగా పని చేస్తాయి.
    • సాబుదాన లేదా సగో అనేవి గర్భిణీ స్త్రీలకు మరియు వారి శిశువులకు కావాల్సిన అన్ని పోషకాలను కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని మీరు ఆహారంలో చేర్చుకోవచ్చు. అంతే కాకుండా మీరు వీటిని స్నాక్స్​గా లేక లంచ్​లో కూడా తినొచ్చు.

    సగూ లేదా సాబుదాన ప్రయోజనాలు (Benefits of Sagoo or Sabudana During Pregnancy in Telugu)

    • ప్రెగ్నెన్సీ సమయంలో సాబుదాన ప్రయోజనాలు అనేకంగా ఉంటాయి. మీరు ఈ పదార్థాన్ని మీ ఫుడ్ డైట్​కు చేర్చుకునేందుకు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
    • పోషకాలు పుష్కలంగా ఉన్నాయి – మనం పైన చదివిన విధంగా సగూలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శిశువు శరీరం పెరగడానికి ఉపయోగపడతాయి.
    • శరీరానికి ప్రశాంతతను అందిస్తుంది–తమ కడుపులో మంటలు వస్తూ అసౌకర్యంగా ఉంటుందని స్త్రీలు తరచూ ఫిర్యాదు చేస్తుంటారు. ఇటువంటి లక్షణాలు ఉంటే సగూ వలన నయం చేయబడతాయి. జీర్ణశక్తిని ఇది పెంపొందిస్తుంది.
    • పుట్టుకతో వచ్చే వైకల్యాలను పరిష్కరిస్తుంది – ప్రెగ్నెన్సీ సమయంలో సాబుదాన తీసుకోవడం వలన ప్రసవ సమయంలో ఏవైనా వైకల్యాలుంటే నయం చేయడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్ మరియు ఫోలిక్ యాసిడ్ వంటివి ఉన్నాయి. ఇవి పిండం అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి.
    • రోజువారి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది– విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ మరియు ఇతర పోషకాలు అందిచబడతాయి. కావున మహిళలు వారి ఆహారంలో సాబుదానను చేర్చడం వలన దినచర్యలో బూస్టప్ వస్తుంది.
    • కండరాల పెరుగుదలను సులభతరం చేస్తుంది– సాబుదానలో ప్రోటీన్ నిల్వలు అధికంగా ఉంటాయి. శిశువు మరియు మీ ఎముకల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది.
    • శిశువు ఎదుగుదలకు అనుకూలం– సాబుదానతో అభివృద్ధికి అవసరమైన అన్ని పోషకాలను మీ బిడ్డ పొందుతుంది. ఇది శరీరం ఆరోగ్యకరమైన పెరుగుదలను సులభతరం చేస్తుంది.
    • జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సహాయపడుతుంది– ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు మలబద్దకాన్ని ఎదుర్కొంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో సాబుదాన ఖిచ్డీ మంచి జీర్ణమయ్యే ఆహారంగా ఉంటుంది. ఇది కడుపులో ఏర్పడే అన్ని రకాల వేడిల నుంచి చల్లబరుస్తుంది.
    • ఫ్రీ మాలిక్యూల్స్​ వల్ల కలిగే సమస్యలను తగ్గిస్తుంది– ముత్యాల్లా చూసేందుకు క్యూట్​గా ఉండే ఈ ఆహారం శరీరంలో ఫ్రీ మాలిక్యూల్స్ వల్ల వచ్చే వ్యాధులను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వ్యాధులను జయించేంత శక్తిని కలిగి ఉంటాయి.
    • ఫ్రీ మాలిక్యూల్స్ సంఖ్య పెరిగితే కణజాలం పాడయ్యేందుకు అది దారితీస్తుంది. ఇది క్యాన్సర్, కార్డియోవాస్​క్యులర్ (హృదయ సంబంధ వ్యాధులు) కు దారితీస్తుంది. సగూలో ఫ్లేవనాయిడ్స్ మరియు టానిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తాయి.
    • ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది– సాబుదాన కాల్షియంకు గొప్ప మూలం. కాల్షియం శిశువు మరియు తల్లి ఎముకలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఆస్టియోపోరోసిస్ వ్యాధి వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
    • రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది – సాబుదానలో పొటాషియం లెవల్స్​ ఎక్కువగా ఉండడం వలన ఇది రక్తపోటును నియంత్రిస్తుంది మరియు ఆరోగ్యకరమైన రక్తప్రసరణకు సహాయపడుతుంది.
    • ఆక్సిజనేటెడ్ మరియు డీఆక్సిజనేటెడ్ రక్తం యొక్క హెల్దీ ఫ్లో ఉంటే మీ రక్తప్రసరణ కంట్రోల్​లో ఉంటుంది. దానివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
    • గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించొచ్చు– సాబుదాన కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ లెవల్స్​ను కూడా తగ్గిస్తుంది. అందువల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అమైలోజ్ అనేది నియంత్రణలోని ఒత్తిడి స్థాయిలకు బాధ్యత వహించే ఒకరకమైన స్టార్చ్. మన శరీరం అమైలేజ్​ను జీర్ణం చేసినపుడు అది చక్కెరను ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు ఆటోమేటిగ్గా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో ఏం తినాలి?

    సగూని తినే సరైన పద్ధతి (The Right Way to Eat Sabudana During Pregnancy in Telugu)

    • వర్సాటిలిటీ అనేది సగూకు మరో పేరు. మీరు సాబుదానతో ఎన్నో రకాల వంటకాలను చేసుకోవచ్చు. ఇది బహుముఖంగా ఉంటుంది. ఉదాహరణకు మీరు దీనితో పాపడ్ టిక్కీ వంటి స్నాక్​ను తయారు చేసుకోవచ్చు లేదా సాబుదాన కీ కీర్, సాబుదాన హల్వా వంటి డెజర్ట్​లను కూడా తయారు చేసుకోవచ్చు.
    • మీరు ఆలూ చపాతితో సాబుదాన సబ్జీ కలుపుకుని లంచ్ మరియు డిన్నర్ చేయొచ్చు. సాబుదాన అనేది భారతీయుల ఇళ్లలో తప్పకుండా ఉంటుంది. దీనిని ఉపవాస సమయాల్లో ఎక్కువగా తింటారు.
    • మీరు మీ వంటకాన్ని మరింత పోషకాహారంగా మార్చాలని అనుకుంటే సాబుదానకు వేరుశనగలు మరియు కూరగాయలు కలపొచ్చు. సాబుదానను మీరు రెండు రకాలుగా ఉపయోగించొచ్చు. పౌడర్ మరియు ముత్యాలు (సాబుదాన గింజలు చూసేందుకు ముత్యాల్లా ఉంటాయి)
    • మీరు దీని నుంచి పిండిని తయారు చేస్తుంటే పౌడర్ రూపంలో ఉపయోగించడం చాలా సులభం. వీటి నుంచి అద్భుతమైన పాపడ్స్ మరియు టిక్కీస్ తయారు చేసుకోవచ్చు. మీరు వాటిని వాడాలని అనుకుంటే ముందుగా నానబెట్టాలి. కాబట్టి మీరు వాటిని నీటిలో ఉపయోగించే ముందు రాత్రంతా బాగా నానబెట్టండి.

    ముగింపు (Conclusion)

    ఇక్కడ మేము సాబుదాన లేదా సగో యొక్క ప్రతి అంశాన్ని వివరించాం. వీటిని తీసుకోవడం చాలా ఉత్తమం మరియు సురక్షితం. ఈ ఆహారం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఎంత తింటున్నారో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వీటిల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. మీరు సులభంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కిరాణా మార్కెట్లలో లభించే సాబుదానను మీరు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. ఎందుకంటే వారు ప్రాసెస్ చేసిన సగోని విక్రయిస్తారు. ప్రాసెస్ చేయని సాబుదాన లేదా సగో చాలా ప్రమాదకరమైనది, విషపూరితమైనది. మీకు కొన్ని అరుదైన సందర్భాల్లో లివర్ డ్యామేజ్, వాంతులు, మరణాలు కూడా సంభవించొచ్చు.
    మేము ఇక్కడ మీకు చివరగా చెప్పొచ్చేదేంటంటే మీరు సాబుదానను మార్కెట్ల నుంచి కొనుగోలు చేసి వండి తినడం ఉత్తమం మరియు సురక్షితం. సాబుదాన వలన అంతులేని ప్రయోజనాలు ఉన్నాయి. మీ శిశువు ఆరోగ్యానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి.

    Tags:

    Sabudana during pregnancy in telugu, Can pregnants eat Sabudana in telugu, Benefits of eating Sabudana during pregnancy in telugu, Sabudana nutritional value in telugu, sabudana recipes for pregnants in telugu

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.