Raise A Happy & Healthy Baby
Get baby's growth & weight tips
Join the Mylo Moms community
Get baby diet chart
Get Mylo App
Want to raise a happy & healthy Baby?
Postnatal Care
2 June 2023 న నవీకరించబడింది
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. కోలుకోవడం మరియు ప్రీ ప్రెగ్నెన్సీ స్థితికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నపుడు స్త్రీ శరీరం ఒక దశలోకి ప్రవేశిస్తుంది. ఈ దశను ప్రసవానంతర కాలం అని పిలుస్తారు. అనేక రకాల అసౌకర్యాలు ఉంటాయి. ఈ అసౌకర్యాలలో ఒకటి యోని రక్తస్రావం. దీనినే ప్రసవానంతర రక్తస్రావం లేదా లోచియా అని పిలుస్తారు. ఇది తాత్కాలికమైనది మరియు కాలక్రమేణా తగ్గిపోతుంది. కాబట్టి స్త్రీ దాని గురించి భయపడకూడదు. అయినప్పటికీ ఎవరైనా ముందుగా గుర్తించాలని అనుకుంటే.. ప్రసవానంతర రక్తస్రావాన్ని ఎలా వేగంగా ఆపవచ్చో తెలుసుకోవాలి.
ప్రసవానంతర రక్తస్రావాన్ని లోచియా అని కూడా అంటారు. ఇది శ్లేష్మం మరియు రక్తంతో కలిసి ఉంటుంది. ఇది సాధారణంగా జరిగేదే. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం అదనపు రక్తం, శ్లేష్మం, కణజాలాలను కలిగి ఉంటుంది. తర్వాత వాటిని విసర్జిస్తుంది. ఈ రకమైన రక్తస్రావం రుతుచక్రం వల్ల సంభవించే రక్తస్రావం కంటే ఎక్కువ కాలం ఉంటుంది. సాధారణ రుతుచక్ర రక్తస్రావంలో ఉండని కొన్ని పదార్థాలు ఉంటాయి. ప్లాసెంటా అటాచ్ అయి ఉన్న ప్రదేశంలోనే రక్తస్రావం జరుగుతుంది.
ప్రసవానంతర రక్తస్రావం బిడ్డ పుట్టిన మొదటి పదిరోజుల తర్వాత.. ఎక్కువగా ఉంటుంది. క్రమంగా అది తగ్గుతుంది. రక్తస్రావం మచ్చలుగా మారుతుంది. తేలికైన రక్తస్రావం మరియు మచ్చలు డెలివరీ తర్వాత 4 నుంచి 6 వారాల వరకు ఉంటాయి. సమయం గడిచే కొద్దీ ఉత్సర్గ (స్రావం) రంగులో మార్పును గమనించవచ్చు. ఉత్సర్గ మొదట ఎరుపు రంగులో కనిపిస్తుంది. తర్వాత పింక్ కలర్లోకి, తర్వాత గోధుమరంగులోకి, ఆఖరి రోజులలో యెల్లోవిష్గా మారుతుంది. ఏదేమైనప్పటికీ ప్రసవానంతర రక్తస్రావం స్త్రీలలో ఎంత కాలం ఉంటుందో చెప్పడం కష్టం. ఇది ఒక్కో శరీరానికి ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ఎవరూ చెప్పలేరు. బిడ్డ పుట్టిన నుంచి 4 వారాల వరకు లేదా 8 వారాల వరకు ఇది ఉంటుందని ఊహించవచ్చు.
యోని ద్వారా ప్రసవించిన స్త్రీకి మరియు సిజేరియన్ ద్వారా డెలివరీ అయిన స్త్రీకి ప్రసవానంతర రక్తస్రావం రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి. అయితే ఈ రెండురకాల డెలివరీలు జరిగినప్పటికీ ప్రసవానంతర రక్తస్రావం తలెత్తడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
యోని డెలివరీ తర్వాత ప్రసవానంతర రక్తస్రావం జరిగేందుకు కొన్ని సాధారణ కారణాలు..
సిజేరియన్ డెలివరీ తర్వాత రక్తస్రావం జరగేందుకు గల కారణాలు
ప్రసవానంతర రక్తస్రావాన్ని ఆపేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. ఇవి రక్తస్రావానికి కారణం మరియు బ్లీడింగ్ పరిధిపై ఆధారపడి ఉంటాయి. ప్రసవానంతర రక్తస్రావం కోసం కొన్ని రకాల అగ్రవైద్య చికిత్సలు ఇలా ఉన్నాయి-
1. మందులు
గర్భాశయ మందులను ఉపయోగించి ప్రసవానంతర రక్తస్రావాన్ని ఆపొచ్చు. ఈ మందులు సాధారణంగా మొదటి ఎంపిక. ఇవి గర్భాశయ సంకోచాలను ప్రేరేపించడం ద్వారా రక్తస్రావాన్ని ఆపుతాయి.
2. గర్భాశయ మసాజ్
ఆరోగ్య సంరక్షణ నిపుణులు బిడ్డ పుట్టిన తర్వాత రక్తస్రావం జరుగుతుంటే ఆపేందుకు సాధారణంగా ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. గర్భాశయానికి సంకేతం పంపడం ద్వారా అది సంకోచంలో సహాయం చేస్తుంది. చివరికి రక్తస్రావం ఆగిపోతుంది.
3. బలూన్ టాంపపోనేడ్
గర్భాశయం నుంచి రక్తస్రావం ఆపేందుకు వైద్యులు గర్భం లోపల బక్రీ బెలూన్ను సెట్ చేసి.. ఎక్కడి నుంచైతే రక్తం కారుతుందో ఆ ప్రదేశంలో ఒత్తిడిని యాడ్ చేస్తారు.
4. సర్జరీ
పైన పేర్కొన్న పద్ధతులు అన్నీ విఫలమైనపుడు.. రక్తస్రావాన్ని ఆపేందుకు వైద్యులు లాపరోటమీ శస్త్రచికిత్సను చేస్తారు. లాపరోటమీలో మీ పొత్తి కడుపు తెరిచి రక్తస్రావానికి గల కారణాన్ని కనుగొంటారు. అండాశయ ధమనులను బంధించడం, అంతర్గత ఇలియాక్ వంటి వాటిని ఉపయోగించి రక్తస్రావాన్ని తగ్గిస్తారు. అయినా కూడా రక్తస్రావం ఆగకపోతే పూర్తి గర్భాశయాన్ని తొలగించేందుకు హైస్టేరెక్టోమి ఉపయోగిస్తారు.
5. రక్తం ఎక్కించడం
ఈ ప్రక్రియలో కోల్పోయిన రక్తం స్థానంలో కొత్త రక్తం ఎక్కించబడుతుంది.
6. గర్భాశయ ధమని ఎంబోలైజేషన్
ఈ ప్రక్రియలో రక్తస్రావానికి కారణమైన రక్తనాళాన్ని గుర్తించి చిన్న కణాలను దానిలోకి ఇంజెక్ట్ చేసి.. రక్తస్రావాన్ని ఆపుతారు.
7. గర్భాశయ నివారణ
యుటరైన్ క్యూరేట్టేజ్ అనేది గర్భాశయంలోని ప్లాసెంటాలో మిగిలి ఉన్న ముక్కలను తొలగించే ప్రక్రియ.
బిడ్డ పుట్టిన తర్వాత స్త్రీలు కింది లక్షణాలలో దేనినైనా గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ప్రసవానంతర రక్తస్రావం గురించి మరియు దానినివేగంగా ఎలా ఆపాలో తెలుసుకోవడం ముఖ్యం. మరింత సమాచారం కొరకు..వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Yes
No
Written by
dhanlaxmirao
dhanlaxmirao
ప్రసవానంతర కాలం (ప్యూర్పెరియం) దశలు ఏమిటి?
సర్వైకల్ మ్యూకస్ మెథడ్ (గర్భాశయ శ్లేష్మం పద్ధతి) అంటే ఏమిటి & ఎలా తనిఖీ చేయాలి?
గర్భధారణ సమయంలో తులసి తీసుకోవడం సురక్షితమేనా?
గర్భానికి సంబంధించిన వాస్తవాలు : ప్రెగ్నెన్సీలో వీర్యం ఎక్కడికి వెళుతుంది?
ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంట అంటే ఏమిటి: కారణాలు, లక్షణాలు మరియు చికిత్స
ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావం? దీని అర్థం ఏమిటి? మీరు వైద్యుడిని సంప్రదించాలా?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Shop By Ingredient | Onion | Coconut | Skin - Fertility | By Concern | PCOS | Pregnancy Test Kit | Fertility For Her | Ovulation Test Kit | Fertility For Him | By Ingredient | Chamomile | Shatavari | Ashwagandha | Myo-inositol | Skin - Pregnancy & New Mom | By Concern | Stretch Marks Cream | Maternity Wear | Lactation | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |