Early Pregnancy
26 May 2023 న నవీకరించబడింది
మీకు ప్రతినెలా నెలసరి సరిగ్గా వస్తున్నట్లయితే నెలసరి రాకపోవడమే ప్రెగ్నెన్సీ యొక్క మొదటి లక్షణం. గర్భం దాల్చిన మొదటి కొన్ని వారాలలో, కొద్దిగా రక్తస్రావం కావడం, కొద్దిగా స్పాటింగ్ కనిపించడం లాంటి వాటితో కొద్దికాలం పాటు నెలసరి వచ్చినట్లు అనిపించడం జరగవచ్చు. దీనిని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. అయితే ప్రతి ప్రెగ్నెన్సీ ప్రత్యేకమైనదే. అందరికీ ఈ లక్షణాలు ఉండకపోవచ్చు. అంతేకాకుండా కొంతమంది ఆడవాళ్ళకి తమ నెలసరి తప్పడానికి ముందే గర్భం వస్తుంది. అవును నెలసరి తప్పటం అనేది ఒక్కటే ప్రెగ్నెన్సీ వచ్చిందనే సూచన కాదు! కొంతమంది ఆడవాళ్ళకి తమ నెలసరి తప్పడానికి ముందే ప్రెగ్నెన్సీ లక్షణాలు తెలియవచ్చు. ప్రెగ్నెన్సీ రావడం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న ఆడవాళ్ళకి వాటి గురించి మరింత అవగాహన ఉండి ఉండవచ్చు. మీకు నెలసరి తప్పడానికి ముందే ప్రీ ప్రెగ్నెన్సీ లక్షణాలు ఉండవచ్చు. ప్రతి నెలసరిలోను స్త్రీ శరీరం రాబోయే గర్భం కోసం సిద్ధమవుతుంది. ప్రతి నెలా రెండవ భాగంలో వచ్చే కొన్ని మార్పులు గర్భిణీ లక్షణాలలాగానే అనిపించవచ్చు. దీనికి హార్మోన్ల మార్పులు కారణమని చెప్పవచ్చు, ఇది కొంతమంది మహిళలకు మళ్ళీ మళ్ళీ ఉంటూ ఉండవచ్చు. మరి, నెల తప్పడానికి ముందు గర్భధారణ జరిగినట్లు ఎలా గుర్తించాలి?
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రతి స్త్రీ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన గర్భధారణ ఇంప్లాంటేషన్ యొక్క సంకేతాలు
శరీరంలోని హార్మోన్ల హెచ్చుతగ్గులు బ్రెస్ట్ మార్పులకు కారణమవుతాయి. ఫలితంగా చాలా మంది స్త్రీలకు పీరియడ్స్‌కు ముందు బ్రెస్ట్ నొప్పిగా, బరువుగా అనిపించవచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చిన సందర్భంలో ఈ మార్పులు వేగవంతం అవుతాయి. "మీ శరీరంలో హార్మోన్ల మార్పులు మొదలైన కారణంగా మీరు గర్భం దాల్చిన మొదటి కొన్ని వారాలలో మీ రొమ్ములలో జలదరింపు లేదా నొప్పి ఉండవచ్చు" అని దక్షిణ ఢిల్లీలోని సీతారామ్ భారతియా హాస్పిటల్‌లోని ఓబ్స్-జిన్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రీతి అరోరా ధమిజా చెప్పారు.
"ఉదయం పూట వికారంగా ఉండటం గర్భం యొక్క ప్రాథమిక లక్షణాలలో ఒకటి." "వాంతులు ఉన్నా లేకున్నా వికారం ఉండవచ్చు," అని డాక్టర్ ప్రీతి చెప్పారు. ఇంకా "ఇది సాధారణంగా గర్భం దాల్చిన ఒక నెల తర్వాత ప్రారంభమవుతుంది. అయితే స్త్రీలకు పీరియడ్స్ మిస్ అయ్యే ముందు కూడా ఇలా అనిపించవచ్చు."
స్త్రీలు తమ పీరియడ్స్ అంతటా స్పాటింగ్‌తో బాధపడటం విలక్షణమైనది. అయినప్పటికీ ఇది గర్భధారణ మొదట్లో ఉండే లక్షణం అని కొందరు గ్రహించారు. "ఈ స్పాటింగ్‌ని నెలసరి అనుకొని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది." "ఎర్లీ ప్రెగ్నెన్సీ సంకేతాల కోసం చూస్తున్నవారు. రాబోయే ప్రెగ్నెన్సీ గురించి అప్రమత్తంగా ఉండాలి" అని కూడా డాక్టర్ ప్రీతి అన్నారు.
గర్భం దాల్చిన మొదటి కొన్ని వారాలలో, చాలామంది ఆడవాళ్ళు కొన్ని రకాల ఆహారాలు, వాసనల పట్ల విరక్తిని అనుభవించవచ్చు. దీనివల్ల ఇంతకు ముందు మీకు ఎంతో ఇష్టమైన ఆహారపదార్థాల పట్ల కూడా ఆసక్తి తగ్గవచ్చు. కొన్నిసార్లు లాలాజలం ఎక్కువగా వస్తూ కూడా ఉండవచ్చు. "హార్మోన్లలో మార్పులు రుచి పట్ల మీ భావాలను ప్రభావితం చేయవచ్చు," అని డాక్టర్ అన్నారు.
మీరు గర్భం దాల్చినట్లయితే మీరు రెస్ట్‌రూమ్(బాత్‌రూమ్)ను తరచుగా ఉపయోగించవలసి వస్తుండవచ్చు. గర్భధారణ సమయంలో మీ సిస్టమ్‌లో పెరిగిన రక్త పరిమాణం కారణంగా.. మీ మూత్రపిండాలు ఎక్కువ సమయం పాటు పని చేస్తాయి. ఇది గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయవలసిన అవసరాన్ని కలిగిస్తుంది.
ప్రెగ్నెన్సీ మొదట్లో చాలా ప్రబలంగా కనిపించే లక్షణాలలో అలసట ఒకటి. నెలసరి తప్పిన తర్వాత కూడా. "ప్రకృతి మిమ్మల్ని వేగాన్ని తగ్గించమని ప్రోత్సహిస్తుంది. "ప్రొజెస్టెరాన్ హార్మోన్ స్థాయిల పెరుగుదల వల్ల మీ శరీరంలోని ఈ ఆకస్మిక మార్పులు మీ శరీరాన్ని అలసిపోయేలా చేస్తాయి" అని డాక్టర్ ప్రీతి వివరించారు.
ప్రసవించిన తర్వాత మొదటి కొన్ని వారాలలో, స్త్రీలకు గుండెల్లో మంట లేదా మల విసర్జన సమయంలో ఇబ్బంది పడవచ్చు. పెరుగుతున్న హార్మోన్ స్థాయిలు మీ జీర్ణవ్యవస్థను నెమ్మదిస్తాయి. ఫలితంగా జీర్ణ సమస్యలు వస్తాయి. మీరు నెల తప్పడానికి ముందు కూడా ఈ గర్భిణీ లక్షణాలు ఉండవచ్చు. నెలలో వేర్వేరు సమయాల్లో వేర్వేరు ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపిస్తాయి. నెల తప్పడానికి ముందు కొన్ని అసాధారణమైన ప్రెగ్నెన్సీ లక్షణాలు ఉండవచ్చు, స్త్రీ ఆ సంకేతాలను ప్రెగ్నెన్సీ మొదట్లో వచ్చే లక్షణాలుగా పరిగణించకపోవచ్చు.
సాధారణంగా అండోత్సర్గము 28 రోజుల నెలసరిలో 15 వ రోజున జరుగుతుంది. ఒక అండం ఫెలోపియన్ ట్యూబ్‌లో ఫలదీకరణం చెంది, తరువాత గర్భాశయంలోకి వెళ్ళి, సాధారణ గర్భధారణ సమయంలో గర్భాశయ గోడలోకి చేరుతుంది. ఫలదీకరణ చెందిన అండం గర్భాశయంలోనికి అతుక్కున్న వెంటనే ఒక మహిళ శరీరం, ప్లాసెంటా (ఎదుగుతున్న శిశువుకు ఆహారం అందించే కణజాలం)లోని కణాల నుండి hCG ని విడుదల చేయడం ప్రారంభిస్తుంది. అండోత్సర్గము తర్వాత దాదాపు ఎనిమిది రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ ప్రారంభంలో hCG ట్రేస్ పరిమాణాలు కనబడతాయి. అంటే ఒక స్త్రీకి నెలసరి ప్రారంభమయ్యే చాలా రోజుల ముందే అనుకూలమైన ఫలితాలను పొందవచ్చన్నమాట.
పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలో నిర్ణయించడంలో ఇబ్బంది ఏమిటంటే.. ఋతుచక్రంలోని మొదటి సగం రెండవ సగం కంటే అనూహ్యమైనది. నెలసరి అండోత్సర్గము యొక్క మొదటి రోజుల మధ్య తేడా ప్రతి నెలా మారవచ్చు. అండోత్సర్గము జరిగే సమయంలో చేసే లైంగిక కార్యకలాపాలు విడుదలైన అండమును, వీర్యం ఫలదీకరణం చేసే అవకాశాన్ని పెంచుతాయి. ఇంకా ఫలదీకరణం చెందిన అండం ఇంప్లాంట్ చేయడానికి పట్టే సమయం మారుతూ ఉంటుంది. ఇంప్లాంటేషన్ తర్వాత వరకు hCG ఏర్పడదు.అత్యంత ఖచ్చితమైన ఫలితాల కోసం మహిళలు తమ నెలసరి మొదలయ్యే రోజున ఉదయం పరీక్ష చేయించుకోవాలని మేము సూచిస్తున్నాము. దీనివల్ల అండోత్సర్గము, ఫలదీకరణం, ఇంప్లాంటేషన్ సమయంలో ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. ఉదయాన్నే పరీక్షించడం వలన చిక్కని మూత్ర నమూనా లభిస్తుంది. దీనిలో నెల తప్పే ముందే గర్భం యొక్క ప్రారంభ లక్షణాలను గుర్తించడానికి చేసే పరీక్షకు ఉపయోగపడే HCG హార్మోన్‌ను ఎక్కువగా కలిగి ఉండవచ్చు.
Yes
No
Written by
kakarlasirisha
kakarlasirisha
10 వారాల గర్భిణీ పొట్ట ఎలా కనిపిస్తుంది?
ఇంట్రాయుటరైన్ ఇన్సెప్షన్ (IUI) పద్ధతి కోసం స్పెర్మ్ ఎలా పొందాలి?
గర్భస్థ శిశువు గుండె చప్పుడును ఇంట్లోనే పరీక్షించటం ఎలా?
నవజాత శిశువుల్లో చర్మం పొట్టుగా కావడానికి కారణాలు ఏమిటి? దీనికి ఎలా చికిత్స తీసుకోవాలి?
మీ నవజాత శిశువు చర్మాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచాలో తెలుసుకోండి!
గర్భధారణలో ఆముదం: గర్భధారణ సమయంలో ఆముదం ఎందుకు వాడతారు? దీనివల్ల కలిగే ప్రమాదాలేంటి?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Mylo is a master brand offering solutions through it's subsidiaries - Mylo Care and Mylo Baby.
Mylo Care offers science backed, expert led solutions across multiple health concerns.
Mylo Baby is a one stop solution for young parents for all their baby's needs.
Anti-colic | Diapers & Wipes - Baby Gear | Carry Nest | Dry Sheets | Bathtub | Potty Seat | Carriers | Diaper Bags | Stroller | Baby Pillow | Diapers & Wipes - Baby Clothing | Wrappers | Winter Clothing | Socks | Diapers & Wipes - Feeding & Lactation | Feeding Bottle | Grooved Nipple | Fruit Feeder | Manual Breast Pump | Diapers & Wipes - For Mom |