hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
 • Home arrow
 • PCOS & PCOD arrow
 • పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్): చికిత్స, నిర్వహణ (Polycystic Ovary Syndrome: Treatment, Management in Telugu) arrow

In this Article

  పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్): చికిత్స, నిర్వహణ (Polycystic Ovary Syndrome: Treatment, Management in Telugu)

  PCOS & PCOD

  పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్): చికిత్స, నిర్వహణ (Polycystic Ovary Syndrome: Treatment, Management in Telugu)

  3 November 2023 న నవీకరించబడింది

  పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే ఏమిటి (పీసీఓఎస్)? (What is Polycystic Ovary Syndrome in Telugu?)

  పునరుత్పాదక వయసులో ఉన్నప్పుడు మహిళల్లో వచ్చే ఒక హార్మోన్ సమస్యే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్). పీసీఓఎస్ ఉన్న మహిళల్లో నెలవారీగా రావాల్సిన రుతుక్రమం ఎక్కువ సమయం తీసుకోవడం లేదా అకాల సమయంలో రావడం వంటి పరిణామాలు ఏర్పడుతాయి.. కొన్నిసార్లు మగ హార్మోన్ (ఆండ్రోజెన్) ఎక్కువగా విడుదల అవుతుంది. అండాలు ఎక్కువ ఫోలికల్స్ రూపంలో అభివృద్ధి చెందుతాయి కానీ అండాల విడుదల మాత్రం జరగదు. పీసీఓఎస్ రావడానికి అసలు కారణమేమిటో తెలియదు. పీసీఓఎస్ లక్షణాలను ముందే గుర్తించి సరైన చికిత్స తీసుకొని వ్యాధి నిర్వహణ ద్వారా దీర్ఘకాలికంగా రాబోయే టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించవచ్చు.

  పీసీఓఎస్ వ్యాధి నిర్ధారణ అంశాలు (PCOS Disease Symptoms in Telugu)

  కింది రెండు లక్షణాల్లో ఏది కనిపించినా పునరుత్పాదక వయసులో ఉన్న మహిళలు వైద్యుడిని కలిసి వ్యాధి నిర్ధారణ చేయించుకోవాలి.

  1. క్రమం తప్పిన పీరియడ్స్ లేదా తరచుగా రాని పీరియడ్స్

  ఈ లక్షణాల అర్థం ఓవరీలు అండాలను సమయానికి విడుదల చేయకపోవడం.

  2. హైపరాండ్రోజెనిజం

  ఈ కేసులో, రక్తంలో అధికస్థాయి టెస్టోస్టిరాన్ కనిపిస్తుంది. పాలీసిస్టిక్ ఓవరీలు అల్ట్రాసౌండ్ మీద కనిపిస్తాయి పాలీసిస్టిక్ ఓవరీస్ ఉండటాన్ని స్కాన్స్ చూపిస్తాయి. ఆమె కండీషన్ నిర్ధారణ అయ్యే వరకు, అల్ట్రాసౌండ్ తీయించాల్సిన అవసరం లేదు

  పీసీఓఎస్‌కు వైద్య పరీక్షలు (Medical Exams to Diagnose PCOS in Telugu)

  పీసీఓఎస్ గుర్తించడానికి కచ్చితమైన పరీక్షలేమీ లేవు. వైద్యులు ఎక్కువగా కుటుంబలోని ఇతర వ్యక్తుల చరిత్ర, వారి రుతుక్రమ చక్రాలు, బరువును తెలుసుకుని వాటి ఆధారంగా చికిత్స ప్రారంభిస్తారు. ఎక్కువ జుత్తు పెరిగిందా, ఇన్సులిన్ నిరోధకం ఉన్నాయా, మొటిమలు ఉన్నాయా తదితర భౌతిక పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వైద్యుడు కిందివాటిని సూచించవచ్చు.

  1. పెల్విక్ పరీక్ష (Pelvic Exam)

  గర్భాశయంలో ఉబ్బిన ఓవరీలు ఉన్నాయేమో పరీక్షిస్తారు.

  2. రక్త పరీక్ష (Blood Test)

  హర్మోన్ స్థాయిలు, గ్లూకోజ్ స్థాయిలు తెలుసుకోవడానికి రక్త పరీక్షలు నిర్వహిస్తారు.

  3. అల్ట్రాసౌండ్ స్కాన్ (Ultrasound Scan)

  ఓవరీలలో సిస్ట్‌లు ఉన్నాయేమో తెలుసుకోవడానికి లేదా గర్భాశయ మందాన్ని తెలుసుకోవడానికి

  మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీలోని మొదటి మూడు నెలలలో అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయించుకోవడం సురక్షితమేనా?

  4. ట్రాన్స్ వజీనల్ అల్ట్రాసౌండ్ (Trans Vaginal Ultrasound)

  ఫోలికల్స్ గురించి ట్రాన్స్ వజీనల్ అల్ట్రాసౌండ్ వివరాలు అందిస్తుంది.

  5. అబ్డామినల్ అల్ట్రాసౌండ్ (Abdominal Ultrasound)

  పొత్తికడుపు మీద చేసే అల్ట్రాసౌండ్ వల్ల పీసీఓఎస్‌తో సంబంధం ఉన్న అధిక ప్రొలాక్టిన్ గురించి వివరాలు తెలుస్తాయి. ఎక్కువగా ప్రొలాక్టిన్ ఉండటం వల్ల రుతుచక్రం క్రమం తప్పుతుంది.

  పీసీఓఎస్‌కు చికిత్స ఎలా ?(How to Treat PCOS in Telugu)

  పీసీఓస్ ఉన్న మహిళలు వివిధ లక్షణాలు కలిగి ఉంటారు.అందుకే ఒక క్రమమైన పీసీఓస్ చికిత్స ఏమీ లేదు. పెళ్లి కాని మహిళలకు పీసీఓస్ చికిత్స ఇలా ఉంటుంది.

  1. జీవనవిధానంలో మార్పు (Change in Life Style)

  పీసీఓస్ ఎదుర్కోవడానికి ఉన్న ఒకానొక ఉత్తమ పద్ధతి ఆరోగ్యకరమైన డైట్. క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం.

  2. పీసీఓఎస్‌కు మెడిసిన్ (Medicine to PCOS)

  వైద్యుడు సూచిస్తే క్లోమిఫీన్, మెట్‌ఫార్మిన్ మందులను అండాలు సరిగా విడుదలవడానికి వాడవచ్చు.

  3. ఫెర్టిలిటీ సమస్యలు (Fertility Issues)

  పీసీఓఎస్, ఫెర్టిలిటీ సమస్యలు ఉన్నవారికి కొద్ది కాలం పాటు క్లోమిఫిన్, లెట్రోజోల్ ఇవ్వడం ద్వారా విజయవంతంగా చికిత్స ఇవ్వవచ్చు.

  4. రుతుక్రమ సమస్యలు (Irregular Periods)

  వైద్యుడు కాంట్రాసెప్టివ్ పిల్స్‌ను రుతుక్రమం సరిగా రావడానికి, ప్రొజెస్టోజెన్ మాత్రలను పీరియడ్స్ వచ్చేందుకు సూచించవచ్చు.

  5. ఓవలేషన్ (Ovulation)

  పీసీఓఎస్ ఉన్న మహిళలకు ఓవలేషన్ జరిగేందుకు కొన్ని మందులు ఇవ్వవచ్చు. క్లోమిఫిన్, టెట్రోజోల్ నోటి ద్వారా తీసుకోవచ్చు, డోనాడోట్రోపిన్ ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు.

  6. జుట్టు ఎక్కువగా పెరగడం (Over Hair Growth)

  జుట్టు తొలగించే ప్రక్రియలైన డీఫిలటోరిస్, ఎలక్ట్రోలైసిస్, లేదా లేజర్ థెరపీ ద్వారా దీనికి చికిత్స అందించవచ్చు.

  7. బరువు పెరగడం (Weight Gain)

  ఒకవేళ మహిళ ఎక్కువ బరువుతో ఉంటే కొన్ని కిలోలు తగ్గాల్సిందిగా వైద్యుడు సూచించవచ్చు.

  8. సర్జరీ (Surgery)

  ఒకవేళ మందులు పని చేయకపోతే ఓవరీల పనితీరు మెరుగుపరిచేందుకు వైద్యులు సర్జరీ నిర్వహించవచ్చు. ఇవే కాకుండా పీసీఓస్ ఆయుర్వేదిక్ చికిత్సను కూడా ఎంచుకోవచ్చు.

  పీసీఓఎస్ చికిత్సకు డైట్ (Diet to Treat PCOS in Telugu)

  ఇన్సులిన్ తో పాటు, పీసీఓఎస్ డైట్ కూడా నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అన్ని రకాల పోషకాలను అందించి ఆరోగ్యకరమైన బరువును నిర్వహించే డైట్ ద్వారా ఇన్సులిన్ కూడా తగిన మోతాదులోనే ఉంటుంది.

  పీసీఓస్ ఉన్నప్పుడు తినాల్సిన ఆహారం గురించి మరింత తెలుసుకోండి

  1. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) డైట్

  తక్కువ జీఐ ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ పెరుగుదలను నియంత్రించవచ్చు. పూర్ణ ధాన్యాలు, తక్కువ పిండి పదార్థాలు ఉన్న ఆహారాలు, లెగుమ్స్ వంటివి తక్కువ జీఐకి ఉదాహరణలు.

  2. యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్

  ఈ డైట్ వల్ల పీసీఓస్‌లో ఇన్‌ఫ్లమేషన్ సంబంధిత సమస్య అయిన అలసటను తగ్గించవచ్చు. ఉదాహరణకు బెర్రీలు, ఆలివ్ ఆయిల్.

  3. హైపర్ టెన్షన్ (డీఏఎస్హెచ్) నివారించేందుకు తగిన ఆహారం

  డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ (డి.ఎ.ఎస్.హెచ్.) డైట్ వల్ల పీసీఓస్ లక్షణాలను నిర్వహించవచ్చు. అది చేపలు, పండ్లు, తక్కువ కొవ్వు ఉన్న డైరీ పదార్థాలు, మాంసం, కూరగాయలు, పూర్ణ ధాన్యాల్లో ఉంటుంది.

  4. పీసీఓస్‌లో తినకూడని పదార్థాలు

  మీకు ఇది కూడా నచ్చుతుంది: స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత అంటే ఏమిటి? దీన్ని ఎలా నయం చేయాలి?

  పీసీఓఎస్ ఉన్న వారు అస్సలు తినకూడనివి ఇవే.. (Avoid These Foods Who Have PCOS)

  1. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్: (Refined Carbohydrates)

  రీఫైన్డ్ చేసిన కార్బోహైడ్రేట్స్‌ను పీసీఓఎస్ ఉన్న మహిళలు తినకూడదు. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మంటను పెంచి ఇన్సులిన్‌ను అడ్డుకుంటాయి.

  2. వేపుళ్లు: (Fried items)

  పీసీఓఎస్ ఉన్నవారిలో ఇవి మంటలను పెంచి బరువు పెంచి, గాస్ట్రిక్ సమస్యలను పెంచుతాయి.

  3. షుగర్ ఉన్న బేవరేజెస్ (Sugar Beverages)

  అధికంగా చక్కెర ఉన్న ద్రవాలు ఇన్సులిన్ విడుదలను పెంచి అసమతుల్యతను పెంచుతాయి. అవి పీసీఓఎస్‌ను ప్రభావితం చేసి దారుణమైన లక్షణాలైన మూడ్ స్వింగ్, బ్లోటింగ్‌లను పెంచుతాయి.

  4. ప్రాసెస్డ్ ఫుడ్: (Processed food)

  అధిక కొవ్వు కలిగిన పదార్థాల వంటి వాటిని పీసీఓఎస్ మహిళలు తినకూడదు. ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.

  5. సాలిడ్ ఫ్యాట్స్ (Solid Fats)

  మార్గరీన్, లార్డ్ వంటివి పీసీఓఎస్ లక్షణాలను మరింత తీవ్రం చేస్తాయి.

  6. అధిక రెడ్ మీట్: (Heavy Red Meat)

  అధికంగా రెడ్ మీట్ (మేక, గొర్రె మాంసం) తీసుకోవడంలో వల్ల శరీరంలో మంట పెరిగి ప్రొజెస్టిరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. పీసీఓఎస్ లక్షణాల తీవ్రతను పెంచుతుంది.

  క్లుప్తంగా (Conclusion)

  పీసీఓఎస్‌లో సహజంగా కనిపించే మరో సమస్య ఇన్ఫెర్టిలిటీ(సంతానోత్పత్తి సమస్యలు) . పీసీఓస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే రోగి వైద్యున్ని కలిసి సూచనలు తీసుకోవాలి. పీసీఓఎస్‌కు సంబంధించిన ఇతర ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు జీవన విధానంలో మార్పులు చేసుకోవడం అవసరం. అలాగే వైద్య చికిత్సలు సహాయపడతాయి.

  Tags:
  PCOS symptoms in telugu, PCOS treatment in telugu, Diet for PCOS patients in telugu, Which foods should PCOS patients need to avoid, Tests required to identify PCOS in telugu, Polycystic Ovary Syndrome: Treatment, Management In English, Polycystic Ovary Syndrome: Treatment, Management in Bengali, Polycystic Ovary Syndrome: Treatment, Management in Hindi

  100% Natural PCOS & PCOD Tea - 30 Tea Bags

  Maintains Regular Menstrual Cycle | Controls Acne | NABL Lab Tested | FSSAI Licensed

  ₹ 699

  4.4

  (122)

  1015 Users bought

  Is this helpful?

  thumbs_upYes

  thumb_downNo

  Written by

  Dhanlaxmi Rao

  Get baby's diet chart, and growth tips

  Download Mylo today!
  Download Mylo App

  RECENTLY PUBLISHED ARTICLES

  our most recent articles

  Mylo Logo

  Start Exploring

  wavewave
  About Us
  Mylo_logo

  At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.