Want to raise a happy & healthy Baby?
Pregnancy Best Foods
3 November 2023 న నవీకరించబడింది
ఒక మహిళ గర్భవతి అయినప్పుడు డాక్టర్లు ఆమె తీసుకునే ఆహారంపై చాలా ఆంక్షలు పెడతారు. అవి తన ఆహారం యొక్క క్యాలరీల సంఖ్య కావచ్చు, ఆహారం రకాలు, రోజూ భోజనం చేసే సమయాలు ఇంకా రోజుకి ఎన్ని సార్లు తినాలి అన్నది కూడా కావచ్చు. కడుపుతో ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండడానికి, పిండాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఒక కఠినమైన రొటీన్ ను పాటించి తీరాలి. తరచుగా, తల్లి కాబోతున్న స్త్రీలు ప్రెగ్నెన్సీ సమయంలో జామ పండ్లు తినడం సురక్షితమేనా అని అడుగుతూ ఉంటారు, ఎందుకంటే అది రుచికరమైన, అత్యంత సాధారణమైన పండ్లలో ఒకటి. జామపండ్లు ఏడాది పొడవునా అందుబాటులోనే ఉన్నా కూడా, దాన్ని సాధారణంగా వసంత కాలం అలాగే ఎండాకాలం రుతువులకి సంబంధించిన పండుగా పరిగణిస్తారు. అందుకనే ప్రెగ్నెన్సీ సమయంలో జామపండ్లు తినటం వలన లాభాల గురించి మరింత తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఈ ఆర్టికల్ ఈ సీజనల్ పండు గురించి, దానివల్ల వచ్చే ప్రభావాల గురించి (ఏవైనా ఉంటే), అలాగే మీ ఆహారంలో దీనిని భాగంగా చేర్చుకోవడానికి చిట్కాల గురించి తెలుపుతుంది.
కడుపుతో ఉన్నప్పుడు జామపండు తినడం వలన వచ్చే శక్తివంతమైన లాభాల్లో ఒకటి, ఈ పండ్లలో టన్నులకొద్దీ విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి. ఈ పండులో విటమిన్లు A,C,B2 ఇంకా E ఉంటాయి. ఇవేకాక, జామపళ్ళలో కాల్షియం, పొటాషియం, మాంగనీస్ సహా చాలా ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఈ పోషక పదార్థాలన్నీ తల్లీబిడ్డల రోగనిరోధక శక్తిని మెరుగుపర్చటంలో సాయపడి, అంటువ్యాధులు, వాపుల వంటి ఇబ్బందులతో పోరాడటానికి శక్తినిస్తాయి.
ఫోలిక్ యాసిడ్లో విటమిన్ B9 లేదా ఫోలేట్ ఉంటుంది. గర్భవతిగా ఉన్న సమయంలో దీని సప్లిమెంట్లను తీసుకోవడం తల్లికి చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది పిండంలో న్యూరల్ ట్యూబ్ ఏర్పడడానికి సహాయపడుతుంది. ఇంతేకాక గర్భవతిగా ఉన్నప్పుడు జామ పండు తినడం ఎందుకు మంచిదంటే, ఫోలిక్ యాసిడ్ పుట్టుక నుంచి వచ్చే ఎనెన్సెఫలీ అలాగే స్పైనా బిఫిడాలాంటి తీవ్రమైన నాడీ సంబంధ జబ్బులను రాకుండా నివారిస్తుంది. చాలామంది డాక్టర్లు మీ ప్రెగ్నెన్సీ డైట్లో ఈ సీజనల్ పండును చేర్చాలని సూచిస్తారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భవతిగా ఉన్నప్పుడు ఆహారంలో చిరుధాన్యాలని తినడం వలన వచ్చే లాభాలు
ఒంట్లో హార్మోన్ల మార్పుల వల్ల గర్భవతిగా ఉన్న మహిళలు తరచుగా జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అవి విరోచనాలు, మలబద్ధకం, పొట్టలో పుండ్లు లేదా ఉబ్బరం కూడా కావచ్చు. అందుకని కడుపుతో ఉన్న సమయంలో జామ పండు తినటం వలన వారికి చాలా మంచి చేకూరుతుంది. ఎందుకంటే, అందులో ఎక్కువ మొత్తంలో పీచు పదార్థం, నీరు ఉన్నందువల్ల పేగుల కదలికలు సరిగ్గా ఉంటాయి ఇంకా అది జీర్ణ సమస్యలు, మలబద్ధక సమస్యల్ని తగ్గించగలదు. ఇది ఆహార పైపులో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియాలను (గట్ ఫ్లోరా) కూడా తిరిగి పెరిగేలా చేస్తుంది. దానివల్ల గర్భవతిగా ఉన్న మహిళలు జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.
ఒంట్లో హార్మోన్ల మార్పుల కారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో రక్త పోటు క్రమ పద్ధతిలో ఉండకపోవడం చాలా సాధారణమైన విషయం. అంతేకాక, రక్తపోటుని పెంచడంలో ప్రీ-పార్టం డిప్రెషన్ కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో జామపండు తినడం మంచిదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, ఈ పండులోని పొటాషియం మొత్తం, రక్తపోటుని సులువుగా నియంత్రించగలదని చెప్పొచ్చు. దాంతోపాటు అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి, రక్తపోటుని ఆరోగ్యకరమైన స్థాయిలో మేనేజ్ చేయగలవు.
ప్రెగ్నెన్సీ సమయంలో జామ పండు తినడం వల్ల వచ్చే ముఖ్యమైన లాభాల్లో ఒకటి, తల్లి అలాగే పిండంతో గర్భవతిగా ఉన్న సమయంలో వచ్చే డయాబెటిస్ ను తగ్గించగల సామర్థ్యం కలిగి ఉండడం. శరీరంలో ఉత్పత్తి చేయబడిన ఇన్సులిన్ కు శరీరం స్పందించకపోవడాన్ని గెస్టేషనల్ డయాబెటిస్ స్థితి అంటారు లేదా రక్తంలో గ్లూకోస్ యొక్క గాఢతని నియంత్రించడానికి ఈ హార్మోన్ కావలసినంతగా స్రవించబడదు. దాని ఫలితంగా, బిడ్డ కూడా పుట్టినప్పటినుంచి డయాబెటిస్ బారిన పడాల్సి వస్తుంది. ఇది భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణలో రక్తంలో చక్కెర స్థాయిల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలేమిటి?
గర్భవతిగా ఉన్నప్పుడు జామ పండ్లు తినడం మంచిదని చెప్పడానికి మరో మంచి కారణం, అందులో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు. ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లలో ఒకటైన విటమిన్ E లేదా టోకోఫెరాల్, శరీరంలో ఆక్సీకరణం వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించి, పిండం ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
గర్భం దాల్చడానికి సంబంధించి జామ పళ్ళతో సంతాన సాఫల్య లాభాలు చాలా ఉన్నాయి. ఈ పండు మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో కొన్ని మార్గాలని కింద చదివి తెలుసుకోండి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: జంటల కోసం ఫెర్టిలిటీ డైట్ ప్లాన్- ఇది ఉపయోగకరంగా ఉంటుందా?
ప్రెగ్నెన్సీ సమయంలో జామ పళ్ళను తినటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేనప్పటికీ, కొన్ని ప్రత్యేక నెగిటివ్ ప్రభావాల గురించి మీకు అవగాహన ఉండి తీరాలి.
కడుపుతో ఉన్నప్పుడు జామపండ్లు తినటం వలన వచ్చే లాభాలు ఇప్పుడు తెలిసాయి కాబట్టి, ఈ రుచికరమైన, రసాలూరే, మెత్తని పండుని మీ డైట్లో చేర్చుకోవటం పెద్ద సమస్య కాదు. అయితే డైట్లో భాగంగా జామపళ్లని తినేముందు డాక్టరుని ఒకసారి సంప్రదిస్తే మంచిది.
Guava during pregnancy in telugu, Benefits of eating Guava during pregnancy in telugu, side effects of eating Guava in telugu, Precautions to take while eating Guava in telugu, Guava nutritional value in telugu.
Yes
No
Written by
Kakarla Sirisha
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Coconut | Skin - Fertility | By Concern | PCOS | Pregnancy Test Kit | Fertility For Her | Ovulation Test Kit | Fertility For Him | By Ingredient | Chamomile | Shatavari | Ashwagandha | Myo-inositol | Skin - Pregnancy & New Mom | By Concern | Stretch Marks Cream | Maternity Wear | Lactation | Maternity Gear | Shop By Ingredient | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |