Diet & Nutrition
12 September 2023 న నవీకరించబడింది
ఒక మహిళ తల్లి కావడంతో ఆమె ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఆ ఉత్సాహం ఎంత ఉంటుందో సందేహాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. గర్భవతిగా ఉన్నప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు అని ఆహారం విషయంలో కాబోయే తల్లులకు అన్నీ సందేహాలే. కొబ్బరి విషయంలోనూ పలు సందేహాలు ఉంటాయి. కొబ్బరిని సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తీసుకోవడం గురించి సందేహాలు ఉన్నట్టైతే అనేక అంశాలను ఈ ఆర్టికల్ వివరిస్తుంది.
మానవుడి జీవితంలో ప్రతీ దశలో తీసుకోవాల్సిన పోషకాలు వేర్వేరుగా ఉంటాయి. మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి, కడుపులో బిడ్డ అభివృద్ధికి కావాల్సిన మంచి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటివాటిలో కొబ్బరి కూడా ఒకటి. కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయి. ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలకు నెలవు కొబ్బరి. గర్భవతులు పండ్లు, కూరగాయలు కలిపి తీసుకుంటే కీలకమైన పోషకాలు లభిస్తాయి. గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తినడం విషయానికి వస్తే, కొబ్బరి ఏ రకంగా తీసుకున్నా అనేక ప్రయోజనాలు అందుతాయి. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు సమతుల్యంగా కొబ్బరిని తీసుకోవాలి.
గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తినడం మంచిదే. అయితే సమతుల్యంగా తీసుకుంటే అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. గర్భధారణ సమయంలో కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
అయితే కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలపై కావాల్సినంత సమాచారం లేకపోవడం, వాళ్లూ, వీళ్లూ చెప్పే మాటలు వినడం వల్ల అనేక అపోహలు కలుగుతున్నాయి. గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తినడం వల్ల కలిగే ప్రభావాలపై అనేక అపోహలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తీసుకుంటే బిడ్డ అందంగా పుడుతుందని నమ్ముతుంటారు. ఇది వాస్తవం కాదు. శిశువు యొక్క రంగు జన్యువులపై ఆధారపడి ఉంటుంది తప్ప, తల్లి ఏమి తింటుందనే దానిపై కాదన్న విషయం గుర్తుంచుకోండి.
నవజాత శిశువు భౌతిక లక్షణాలను పోషకాహారం, జన్యువులు నిర్ణయిస్తాయి. అంతే తప్ప కేవలం ఒకే ఆహారంపై జుట్టు ఆకృతి లేదా బలం ఆధారపడి ఉండదు. అది జన్యువులను మార్చదు.
కొబ్బరి నీళ్లు తాగితే ఎసిడిటీ వస్తుందన్న అపోహ ఉంది. కానీ ఎసిడిటీకి కొబ్బరి నీళ్లు కారణం కాదు. గర్భధారణ సమయంలో ఎసిడిటీకి ఇతర కారణాలు ఉంటాయి.
ఇది హాస్యాస్పదం. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. దీనికి ఎలాంటి వివరణ అవసరం లేదు. కొబ్బరికాయ మాత్రమే కాదు. ఏ పండు లేదా కూరగాయ శిశువు తల పెద్దగా పెరగడానికి ఉపయోగపడదు. అదే నిజమనుకుంటే మరి పుచ్చకాయ తింటే శిశువు తల అంత పెద్దగా అవుతుందా? ఇది ఓ అపోహ మాత్రమే.
ముందుగా చెప్పినట్టు గర్భవతిగా ఉన్నప్పుడు లేదా జీవితంలో ఏదైనా దశలో ఉన్నప్పుడు ఆ దశకు కావాల్సిన పోషకాలను సరైన కాంబినేషన్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి వేర్వేరు ఆహార పదార్థాల ద్వారా వస్తాయి. కొబ్బరి నీళ్లు పోషకాలను అందించేవే. ఇది మంచి హెల్తీ డ్రింక్ కూడా. అయితే ఇతర ఆహార పదార్థాల లాగానే మితంగా తీసుకోవడం మంచిది. అంతే తప్ప కొబ్బరి నీళ్లు మనం రోజూ తాగే మంచినీళ్లకు ప్రత్యామ్నాయం కాదు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: చలికాలంలో మీ బిడ్డకు కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలా?
గర్భవతి కావడం, ఆ తర్వాత మాతృత్వాన్ని ఆస్వాదించడం మహిళ జీవితంలో గుర్తుండిపోయే సమయం. మంచి పోషకాలు ఉన్న ఆహారం, మంచి వాతావరణం తల్లి శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మితంగా తీసుకోవడం అవసరం. కొబ్బరి మాత్రమే కాదు ఏ ఆహారాన్ని కూడా అతిగా తీసుకోకూడదు. డైట్‌లో అన్ని రకాల కూరగాయలు, పండ్లు ఉండాలి. గర్భవతి శరీరం ఇచ్చే సూచనల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
References
1. Yong JW, Ge L, Ng YF, Tan SN. (2009). The chemical composition and biological properties of coconut (Cocos nucifera L.) water. Molecules.
2. Gunasekaran R, Shaker MR, Mohd-Zin SW, Abdullah A, Ahmad-Annuar A, Abdul-Aziz NM. (2017). Maternal intake of dietary virgin coconut oil modifies essential fatty acids and causes low body weight and spiky fur in mice. BMC Complement Altern Med.
Coconut good in pregnancy in Telugu, What are the benefits of coconut in pregnancy in Telugu, What are the myths about coconut during pregnancy in Telugu, Coconut in Pregnancy: Benefits & Myths in English, Coconut in Pregnancy: Benefits & Myths in Hindi, Coconut in Pregnancy: Benefits & Myths in Tamil, Coconut in Pregnancy: Benefits & Myths in Bengali
Yes
No
Written by
kakarlasirisha
kakarlasirisha
గర్భధారణ సమయంలో క్వినోవా - ప్రయోజనాలు, మార్గదర్శకాలు | Quinoa During Pregnancy Benefits & Guidelines in Telugu
మీ బిడ్డకు హాని కలిగించే ఆహారాలు| Foods Which Can be Harmful for Your Baby in Telugu
శిశువు మొదటి దంతాలు: తల్లిదండ్రులు తెలుసుకోవలసిన 5 వాస్తవాలు (Baby’s First Tooth: 5 Facts Parents Should Know in Telugu)
గర్భధారణ సమయంలో చేపలు: ప్రయోజనాలు మరియు రిస్కులు | Fish in Pregnancy: Benefits & Risks in Telugu
గర్భధారణ సమయంలో రెడ్ వైన్: దుష్ప్రభావాలు & మార్గదర్శకాలు | Red wine during pregnancy: Side Effects & Guidelines in Telugu
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Skin hydration | Dark Circles | Blackheads & Pimples | Skin Moisturizer | Skin Irritation | Shop By Ingredient | Kumkumadi | Ubtan | Vitamin C | Tea Tree | Aloe Vera | Rose Water | Skin - Hair | SHOP BY CONCERN | Hairfall | Dry and Damaged Hair | Hair Growth | Shop By Ingredient | Onion | Coconut | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |