hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • Pregnancy Journey arrow
  • గర్భధారణ సమయంలో కాఫీ: ప్రభావాలు & తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Coffee During Pregnancy: Effects & Precautions in Telugu) arrow

In this Article

    గర్భధారణ సమయంలో కాఫీ: ప్రభావాలు & తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Coffee During Pregnancy: Effects & Precautions in Telugu)

    Pregnancy Journey

    గర్భధారణ సమయంలో కాఫీ: ప్రభావాలు & తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Coffee During Pregnancy: Effects & Precautions in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    గర్భం దాల్చాక చాలా మంది మహిళలకు కష్టమయ్యే పని... కొన్ని ఆహారాలు తినకుండా ఉండడం. మనకు లభించే అనేక ఆహార పదార్థాలు గర్భిణీ శరీరానికి సరితూగవు. అటువంటి ఒక ఆహారమే కాఫీ. గర్భధారణ సమయంలో కాఫీ తాగడం వలన కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలకు ఏవైనా ఆటంకాలు ఏర్పడతాయా అని ఏళ్ల నుంచి చర్చ నడుస్తోంది. గర్భిణీ స్త్రీలు కాఫీ తాగొచ్చా? ఇప్పుడు తెలుసుకుందాం.

    గర్భధారణ సమయంలో కాఫీ తాగడం సురక్షితమేనా (Is it safe to have coffee in pregnancy in Telugu) ?

    చాలా మంది వ్యక్తులు తమ రోజుని కాఫీతోనే మొదలుపెడతారు. ఎంత చెప్పినా కానీ దానిని తాగడం మాత్రం వదిలేయరు. కానీ మీరు గర్భవతిగా ఉన్నపుడు ఎక్కువగా కాఫీపై ఆధారపడకూడదు. ఇక్కడ శుభవార్త ఏమిటంటే.. కెఫిన్​ను తక్కువ మోతాదులో తీసుకోవడం వలన ఎటువంటి సమస్యలు రావు. గర్భిణీ స్త్రీలు తమకున్న కాఫీ అలవాటును పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేదు. గర్భధారణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని కాఫీ తాగితే మంచిదే. గర్భవతిగా ఉన్నపుడు నేను కాఫీ తాగవచ్చా? గర్భవతిగా ఉన్నపుడు కాఫీ తాగడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. గర్భిణీ స్త్రీలు రోజుకు 1-2 కప్పుల కాఫీని తాగొచ్చు. లేదా రోజుకు 200 గ్రాముల కాఫీని తీసుకోవచ్చు. గర్భధారణ సమయంలో కెఫిన్ తీసుకోవడం వల్ల వచ్చిన సమస్య ఏమిటంటే.. ఇది గర్భస్రావం వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. గర్భధారణ సమయంలో కాఫీ మంచిదే అనే విషయం ఖచ్చితంగా నిజం కావాల్సిన అవసరం లేదు. మరియు చాలా మంది డాక్టర్లు గర్భిణీలు తమ ప్రెగ్నెన్సీ జర్నీలో కెఫిన్ అలవాట్లను వదులుకోవాలని సిఫారసు చేస్తారు. గర్భధారణ సమయంలో కాఫీని చాలా తక్కువ పరిమాణంలో తీసుకున్నంత కాలం సురక్షితంగానే ఉంటుంది.

    గర్భధారణలో కెఫిన్ వల్ల కలిగే ప్రభావాలు (Effects of caffeine in pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో కెఫిన్ ఎందుకు నిషేధించబడింది? దీని వెనకున్న ప్రధాన కారణం ఏమిటంటే.. ఇది గర్భిణీ స్త్రీ శరీరం మీద ప్రభావాలను చూపిస్తుంది. సాధారణంగా చెప్పాలంటే.. కాఫీ నుంచి వచ్చే కెఫిన్ హృదయ స్పందనల రేటును పెంచుతుంది. శరీరంలో ఇది గందరగోళాన్ని కలిగిస్తుంది. ఇది తీవ్రమైన ఆందోళనలకు దారి తీస్తుంది. గర్భిణీ స్త్రీలు కూడా కెఫిన్​ను నెమ్మదిగా జీర్ణం చేసుకుంటారు. (అరగడం) దీని వల్ల కెఫిన్ రక్తంలో ఎక్కువ సేపు ఉంటుంది. కెఫిన్​ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన ఇది స్త్రీ శరీరంలోని ప్లాసెంటాను దాటుకుని శిశువు రక్తంలోకి కూడా చేరుతుంది. ఇది ఎదుగుతున్న శిశువు మీద హానికరమైన ప్రమాదాలను కలిగిస్తుంది. ఈ కారణాల వల్ల గర్భధారణ సమయంలో కెఫిన్​ను తీసుకోకుండా దూరం పెడతారు.

    గర్భవతిగా ఉన్నపుడు ఎంత మోతాదులో కెఫిన్ తీసుకోవడం సురక్షితం (How much caffeine is safe to consume during pregnancy in Telugu)

    కెఫిన్ అనేది పూర్తిగా లేకుండా చేయలేమా? మీరు కొద్ది మోతాదులో కెఫిన్ తీసుకున్న ఎటువంటి సమస్య లేదు. మీరు గర్భవతి అయితే మీ రోజు వారి దినచర్య నుంచి కెఫిన్​ను పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదు. చాలా మందికి కెఫిన్ లేకుండా తమ రోజును ప్రారంభించడం చాలా కష్టంగా ఉంటుంది. వివిధ రకాల అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం.. గర్భవతిగా ఉన్నపుడు కూడా రోజుకు 200 మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. 200 మిల్లీగ్రాములు అంటే 1 లేదా 2 కప్పుల కాఫీకి సమానం. అంటే 6 ఔన్సులన్న మాట. మరీ ముఖ్యంగా గర్భధారణ మొదటి త్రైమాసికంలో ఉన్నపుడు. దీని కంటే ఎక్కువ కెఫిన్ సురక్షితంగా పరిగణించబడదు. ఎందుకంటే ఇది కేవలం గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

    ఎటువంటి ఆహారాలు మరియు పానీయాలలో కెఫిన్ ఉంటుంది (Which foods and beverages contain caffeine in Telugu)?

    కెఫిన్ అనేది కేవలం కాఫీలో మాత్రమే లేదు. కేవలం కాఫీ ఒక్కటే కెఫిన్​ను కలిగి ఉన్న పానీయం కాదు. ఇతర అనేక ఆహారపదార్థాలు మరియు పానీయాలలో కెఫిన్ ఉంది. గర్భవతులు తాము తీసుకునే ఆహారం గురించి అందులో వాడే పదార్థాల గురించి అవగాహన కలిగి ఉండాలి. అలాంటపుడు వారు ఎటువంటి ఆహారాలను తీసుకుంటున్నారు. ఒక వేళ వారు తీసుకునే ఆహారంలో కెఫిన్ ఉంటే.. వారు ఎంత కెఫిన్ తీసుకుంటున్నారు.. అది తినడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? అనే విషయాల మీద అవగాహన కలిగి ఉంటారు. గర్భధారణ సమయంలో కాఫీ తాగడం హానికరం కానప్పటికీ.. అది మనం ఎంత మోతాదులో తీసుకుంటున్నాం అనే విషయాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

    Article continues below advertisment

    కాఫీ కాకుండా తరచూ తినే ఆహారాలు.. పానీయాల్లో కూడా కెఫిన్ ఉంటుంది. అటువంటి పదార్థాలకు గర్భిణీ స్త్రీలు దూరంగా ఉండాలి. లేదా గర్భధారణ సమయంలో అటువంటి పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఈ కింది వాటిలో కెఫిన్ ఉంటుంది

    • సోడాలు
    • గ్రీన్ టీ / బ్లాక్ టీ
    • ఎనర్జీ డ్రింక్స్
    • చాక్లెట్స్
    • సప్లిమెంట్స్
    • గ్వారానా పండు
    • చాక్లెట్ ఉన్న కాల్చిన వస్తువులు
    • కాఫీ లిక్కర్
    • పీనట్ బటర్ బార్స్ (పల్లీల్ల వెన్నతో తయారు చేసిన కడ్డీలు)

    గర్భధారణ సమయంలో కెఫిన్ తీసుకోవడాన్ని తగ్గించేందుకు పద్ధతులు (Methods for reducing caffeine intake during pregnancy In Telugu)

    కాఫీ అలవాటు ఎక్కువగా ఉన్న వారు కెఫిన్​కు దూరంగా ఉండేందుకు ప్రస్తుత రోజుల్లో మార్కెట్​లో డీకేఫినేటెడ్ టీ మరియు డీకేఫినేటెడ్ కాఫీ అందుబాటులో ఉన్నాయి. వారు వాటినే తీసుకుంటే సరిపోతుంది. పొద్దున్నే లేవగానే కాఫీ తాగేందుకు గల ప్రధాన కారణం.. రోజును ఉత్సాహంగా ప్రారంభించడం, శరీర జీవక్రియను పెంచడం మరియు ఉత్పాదకతను మెరుగుపరచడం. డీకేఫినేటెడ్ టీ మరియు కాఫీ అచ్చంగా కాఫీలా ఉన్న పానీయాన్ని ఆస్వాదించేందుకు ఉన్న గొప్ప మార్గం. ఈ కాఫీ తాగడం వలన శరీరానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అధిక మోతాదులో కెఫిన్ కూడా రక్తంలోకి ఎంటరవదు. గర్భధారణ సమయంలో కెఫిన్ తీసుకోవడం తగ్గించేందుకు ఉన్న ఇతర ప్రత్యామ్నాయాలు.. రసం లేదా నీటిని తీసుకోవడం.

    తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Precautions to take in Telugu)

    పైన వివరించిన విధంగా గర్భిణీ స్త్రీ రోజుకు 1-2 కప్పుల కంటే ఎక్కువ మోతాదులో కాఫీ తాగకూడదు. ఎందుకంటే ఇది శిశువు అభివృద్ధికి హానికరం. పుట్టబోయే బిడ్డను ఇది అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా కాఫీ వలన గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది. ముందు జాగ్రత్తగా మీరు గర్భవతిగా ఉన్న సమయంలో తీసుకునే ఆహారాల్లో వాడే పదార్థాల జాబితాను ఒకసారి తనిఖీ చేయండి. ఎందుకంటే నేటి రోజుల్లో మనం తినే లేదా తాగే అనేక ఆహారపదార్థాలు, పానీయాల్లో కెఫిన్ ఉంటుంది. ఉదాహరణకు ఎవరూ కూడా ఎక్కువగా సోడాలు, ఎనర్జీ డ్రింక్స్, గ్రీన్ టీకి కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో కెఫిన్ ఉంటుంది. తక్కువ పరిమాణంలో వాటిని తీసుకుంటే పెద్ద సమస్య ఏం కాదు. మీకు కనుక కెఫిన్ ఎక్కువగా తీసుకున్నారని అనిపిస్తే.. మీ శరీరంలోకి వెళ్లిన కెఫిన్​ను బయటకు తీసేందుకు ఉన్న ఉత్తమ మార్గం ఎక్కువగా నీళ్లు తాగడం. మీ శరీరంలో అతిగా ఉన్న కెఫిన్ బయటకు పోయిందని మీకు అనిపించే వరకు నీరు తాగుతూనే ఉండండి. గర్భధారణ సమయంలో కెఫిన్ ఎంత మోతాదులో తీసుకోవాలనే విషయం మీద మీకు ఏవైనా సందేహాలుంటే.. మీ వైద్యుడిని సంప్రదించండి.

    Tags:

    Coffee during pregnancy in telugu, Can pregnants drink coffee during pregnancy in telugu, tips to reduce coffee during pregnancy in telugu, Effects of coffee during pregnancy in telugu, Coffee During Pregnancy: Effects & Precautions in English, Coffee During Pregnancy: Effects & Precautions in Hindi, Coffee During Pregnancy: Effects & Precautions in Tamil, Coffee During Pregnancy: Effects & Precautions in Bengali.

    Article continues below advertisment

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.