Diet & Nutrition
12 September 2023 న నవీకరించబడింది
క్వినోవాలో అనేక పోషకాలను ఉన్నాయి. అందుకే అది సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, గర్భిణీ స్త్రీలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందా, సురక్షితమేనా అని అందరిలో సందేహం ఉంటుంది. గర్భధారణ సమయంలో క్వినోవా యొక్క విశ్లేషణ ఇక్కడ ఇవ్వబడింది.
గర్భధారణ సమయంలో క్వినోవా యొక్క విశ్లేషణ ఇక్కడ ఉంది.
మితంగా తింటే స్త్రీలు తమ గర్భధారణ సమయం క్వినోవా తినడం సురక్షితమేనని పోషకాహార నిపుణులు అంగీకరిస్తున్నారు. క్వినోవా అనేది అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, ప్రోటీన్, ఖనిజాలు మరియు ఫైబర్ ఉన్న పూర్తి ప్రోటీన్ కలిగిన శాకాహార ఆహారం. అయినప్పటికీ, ఇది అధిక ఆక్సలేట్ కంటెంటును కలిగి ఉంటుంది. ఆక్సలేట్ ఇనుము మరియు కాల్షియం అరుగుదలను ప్రభావితం చేసే లక్షణాన్ని కలిగి ఉంది. గర్భిణీ స్త్రీలకు ఐరన్ మరియు కాల్షియం చాలా అవసరం.
అంతేకాక, క్వినోవా యొక్క బయటి పొర సాపోనిన్ అనే రసాయనపదార్థంతో కప్పబడి ఉంటుంది, ఇది మొక్కకు సహజ రక్షణ మరియు రోగనిరోధక శక్తిని అందించే విషసమ్మేళనం. సాపోనిన్ ఖనిజాలు మరియు విటమిన్ల అరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాక అతిగా తీసుకుంటే మానవశరీరాలను ప్రభావితం చేసే విష లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే, ఇది కీన్వాలోని బయటిపొరపై మాత్రమే పూత పూయబడుతుంది. కాబట్టి, వంట చేయడానికి ముందు క్వినోవాను బాగా కడగడం ద్వారా దీన్ని తొలగించవచ్చు. అందువల్ల, గర్భధారణలో క్వినోవా తినడం సురక్షితమైనాకూడా, దీన్ని మితంగా తీసుకోవడం, వంట చేయడానికి ముందు నీటితో బాగా కడగడం చేయాలి. మొత్తం మీద వారానికి 2-3 సార్లు తీసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు సిఫార్సు చేస్తారు.
100 గ్రాముల వండిన కీన్వా యొక్క పోషక విలువ క్రింది విధంగా ఉంది:
క్వినోవాలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో తల్లులకు ప్రోటీన్ చాలా అవసరం ఎందుకంటే ఇది శిశువు చక్కగా పెరగడానికి, వారిలో రోగనిరోధకశక్తి మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది. ఇది గర్భధారణ అంతటా ఒక కీలకమైనది. చాలా మంది గర్భిణీ స్త్రీలు మలబద్ధకాన్ని కలిగి ఉంటారు. క్వినోవాలో కరగని ఫైబర్ పెద్ద మొత్తంలో ఉంటుంది, ఇది కరిగే ఫైబర్ కంటే మంచిది. ఇది మలబద్ధకాన్ని నివారించడం ద్వారా మలబద్ధకం వల్ల ఎదురయ్యే అనేక ఇతర సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.
క్వినోవాలోని కార్బోహైడ్రేట్లు పిండం మెదడు పనితీరుకు ఇంధనంగా పనిచేసే గ్లూకోజును అందిస్తాయి. అంతేకాక, ఇది గర్భిణీ తల్లిని శక్తివంతంగా ఉంచుతుంది. గర్భం యొక్క ప్రారంభ నెలల్లో శిశువు పెరుగుదలకు అవసరమైన ఫోలేట్ ను కూడా కార్బోహైడ్రేట్లు సరఫరా చేస్తాయి. కీన్వాలోని జింక్ ముందస్తు జననాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శిశువుకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేయడానికి కావాల్సిన ఇనుము క్వినోవాలో లభిస్తుంది. ఇందులోని మాంగనీస్ శిశువు యొక్క ఎముక మరియు మృదులాస్థి పెరుగుదలకు సహాయపడుతుంది. శిశువు అభివృద్ధికి మరియు పుట్టుకతో వచ్చే వైకల్యాలను నివారించడానికి ఫోలేట్ ను కూడా కీన్వా అందిస్తుంది.
బాగా కడిగినప్పుడు ముడి క్వినోవా తినడంలో ఎటువంటి హాని ఉండదు. కానీ వండని క్వినోవా రుచిగా ఉంటుంది. అంతేకాక, కీన్వాలో అధిక ఫైబర్ కంటెంట్ మరియు మార్పుచెందని ప్రోటీన్లు ఉన్నాయి. అందువల్ల కడుపు ఉబ్బరించడానికి, గ్యాస్ సమస్యలు రావడానికి అవకాశం ఉంది. మొలకెత్తిన క్వినోవా అలా గ్యోస్ ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, సులభంగా జీర్ణం కావడానికి ఉపయోగడుతుంది. గర్భధారణ సమయంలో తిరిగి వేడి చేసిన క్వినోవా తినడం కూడా సురక్షితం. దీన్ని మైక్రోవేవ్ లోగాని, స్టవ్వుపై గాని, మూకుడులో గాని, కుక్కరులో వేడి చేయవచ్చు. వేడి చేసిన కీన్వా త్వరలో ఎండిపోతుంది, కాబట్టి వేడి చేసిన తర్వాత తేమగా మరియు మృదువుగా ఉండేలా చూసుకోవడానికి దీనిపై కొద్దిగా నీటిని చల్లవచ్చు.
పొద్దునపూట తినే అల్పాహారానికి క్వినోవాతో ఆరోగ్యకరమైన చాలా వంటకాలు చేయవచ్చు. దీన్ని పాలలో ఉడికించి, ఉడికించినప్పుడు, గింజలు మరియు విత్తనాలను జోడించి, తాజా పండ్లను కట్ చేసి, కలపడం వల్ల ఆరోగ్యంగా మరియు రుచిగా ఉండే పదార్థాలు చేసుకోవచ్చు.
ఇలా క్వినోవా ను బహుముఖ పదార్ధంగా వాడుకోవచ్చు. అనేక వంటకాల్లో చేర్చవచ్చు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన తృణధాన్యం. కాబట్టి, స్త్రీలు గర్భధారణ సమయంలో మితంగా తినడం ఆరోగ్యకరమైనది.
References
1. Vega-Gálvez A, Miranda M, Vergara J, Uribe E. 2010. Nutrition facts and functional potential of quinoa (Chenopodium quinoa willd.), an ancient Andean grain.
2. Busso D, González A, Santander N, Saavedra F, Quiroz A, Rivera K, González J, Olmos P, Marette A, Bazinet L. 2023. A Quinoa Protein Hydrolysate Fractionated by Electrodialysis with Ultrafiltration Membranes Improves Maternal and Fetal Outcomes in a Mouse Model of Gestational Diabetes Mellitus. Mol Nutr Food Res.
Is Quinoa good in pregnancy in Telugu, Quinoa nutritional value in Telugu, What are the benefits of Quinoa during pregnancy in Telugu, Quinoa During Pregnancy: Benefits & Guidelines in English, Quinoa During Pregnancy: Benefits & Guidelines in Hindi, Quinoa During Pregnancy: Benefits & Guidelines in Tamil, Quinoa During Pregnancy: Benefits & Guidelines in Bengali
Yes
No
Written by
kakarlasirisha
kakarlasirisha
మీ బిడ్డకు హాని కలిగించే ఆహారాలు| Foods Which Can be Harmful for Your Baby in Telugu
శిశువు మొదటి దంతాలు: తల్లిదండ్రులు తెలుసుకోవలసిన 5 వాస్తవాలు (Baby’s First Tooth: 5 Facts Parents Should Know in Telugu)
గర్భధారణ సమయంలో చేపలు: ప్రయోజనాలు మరియు రిస్కులు | Fish in Pregnancy: Benefits & Risks in Telugu
గర్భధారణ సమయంలో రెడ్ వైన్: దుష్ప్రభావాలు & మార్గదర్శకాలు | Red wine during pregnancy: Side Effects & Guidelines in Telugu
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
గర్భధారణ సమయంలో సెటిరిజైన్: అర్థం, ప్రమాదాలు & దుష్ప్రభావాలు |Cetirizine in Pregnancy: Meaning, Risks & Side Effects in Telugu
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Skin - Fertility | By Concern | PCOS | Pregnancy Test Kit | Fertility For Her | Ovulation Test Kit | Fertility For Him | By Ingredient | Chamomile | Shatavari | Ashwagandha | Myo-inositol | Skin - Pregnancy & New Mom | By Concern | Stretch Marks Cream | Maternity Wear | Lactation | Maternity Gear | Shop By Ingredient | Dhanwantaram | Cloth Diaper | Stretch Marks Kit | Stroller |