hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article continues after adveritsment

Article continues after adveritsment

  • Home arrow
  • Food Cravings arrow
  • గర్భధారణ సమయంలో ఐస్ క్రీమ్: ప్రమాదాలు, దుష్ప్రభావాలు (Ice Cream In Pregnancy: Risks & Side Effects in Telugu) arrow

In this Article

    గర్భధారణ సమయంలో ఐస్ క్రీమ్: ప్రమాదాలు, దుష్ప్రభావాలు (Ice Cream In Pregnancy: Risks & Side Effects in Telugu)

    Food Cravings

    గర్భధారణ సమయంలో ఐస్ క్రీమ్: ప్రమాదాలు, దుష్ప్రభావాలు (Ice Cream In Pregnancy: Risks & Side Effects in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    Article continues after adveritsment

    గర్భవతులకు “గర్భధారణ సమయంలో మేము ఐస్ క్రీమ్ తినవచ్చా?” అనే సందేహం ఎప్పుడూ ఉంటుంది. శుభవార్త ఏంటంటే ఐస్ క్రీమ్ మితంగా తినవచ్చు. అయితే, గర్భధారణ సమయంలో ఐస్ క్రీమ్ తినడం వల్ల కలిగే ఇబ్బందులు, దుష్ప్రభావాలు తెలుసుకోవడం చాలా అవసరం. గర్భధారణ సమయంలో ఐస్ క్రీమ్ తినాలనే కోరికను ఆపుకోవడం చాలా కష్టం. గర్భధారణ సమయంలో ఆడవారు తినే ప్రతి ఆహారం, పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం చూపిస్తుందని గుర్తుంచుకోవాలి.

    గర్భధారణ సమయంలో హార్మోన్స్‌లో మార్పులు వస్తుంటాయి. కాబట్టి వాళ్ళు కోరికలను ఆపుకోవడం కష్టంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఐస్ క్రీమ్ తినడం పెద్ద విషయం ఏమీ కాదు, అయినా ఐస్ క్రీమ్ తినడం వలన కలిగే హాని, దుష్ప్రభావాల గురించి కూడా తెలుసుకోవడం అవసరం. గర్భధారణ సమయంలో ఐస్ క్రీమ్ తినాలనే కోరికలకు కారణం, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలు గురించి, దానిలో ఉండే పోషకవిలువలు, ఇతర విషయాల గురించి తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవడం కొనసాగించండి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ కోరికలు (ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్): అవి ఎప్పుడు ప్రారంభమవుతాయి

    ఐస్ క్రీమ్ లో ఉండే పోషకవిలువలు (Ice cream's nutritional value in Telugu)

    ఐస్ క్రీమ్ తయారీకి వాడే పదార్థాలు పాలు, క్రీమ్, కోకో, కూరగాయల కొవ్వులు, చక్కెర, గుడ్లు, గింజలు, పండ్లు, నౌగాట్, కుకీలు, ఇతర అడిటివ్‌లు. 100 గ్రాముల ఐస్ క్రీమ్‌లో ఉండే పోషక విలువల గురించి కింద పేర్కొన్నాము:

    • కేలరీలు: 200-210 కేలరీలు
    • కొవ్వు: 11 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ
    • కొలెస్ట్రాల్: 44 మి.గ్రా
    • కార్బోహైడ్రేట్: 24 గ్రా
    • చక్కెర: 21 గ్రా
    • సోడియం: 80 మి.గ్రా

    కాబట్టి, గర్భవతులు ఐస్ క్రీమ్ తినొచ్చా? అవును, తినొచ్చు. అయితే మితంగా తినాలని గుర్తుంచుకోవాలి. అందులో పంచదార, కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మితంగా తినడం చాలా అవసరం.

    గర్భధారణ సమయంలో ఐస్ క్రీమ్ తినాలనే కోరికకు కారణాలు (Causes of ice cream cravings during pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో ఐస్ క్రీమ్ తినాలనే కోరికకు కారణాలు పూర్తిగా తెలియలేదు. అయినా గర్భధారణ సమయంలో ఐస్ క్రీమ్ తినాలనే కోరికలు ఎందుకు వస్తాయన్న దానిపై కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. హార్మోన్స్ మార్పుల వల్ల గర్భధారణ సమయంలో ఐస్ క్రీమ్ తినాలని కోరిక ఎక్కువ ఉంటుంది అనేది ఒక విశ్లేషణ. శరీరంలో పోషక విలువలు తగ్గటం వలన కూడా ఐస్ క్రీమ్ తినాలని కోరిక కలుగుతోందని ఒక విశ్లేషణ చెబుతుంది. ఐస్ క్రీమ్ తక్కువ మోతాదులో తీసుకోవడం గర్భధారణ సమయంలో మంచిది. ఐస్ క్రీమ్ తింటే గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి, ఆరోగ్యకరమైన కొవ్వును అందిస్తాయి. ఇవి కడుపులో పెరుగుతున్న బిడ్డకి చాలా అవసరం.

    గర్భధారణ సమయంలో ఐస్ క్రీమ్ తినడం వల్ల కలిగే హాని, దుష్ప్రభావాలు (Risks & side effects of ice cream during pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో ఐస్ క్రీమ్ తినడం వల్ల కొంత హాని, దుష్ప్రభావాలు ఉంటాయి. అందులో కొన్ని అత్యంత సాధారణమైనవి కింద పేర్కొనబడ్డాయి:

    • గర్భధారణ మధుమేహం పెరిగే ప్రమాదం: తరచుగా ఐస్ క్రీమ్ తినడం వల్ల గర్భధారణ మధుమేహం పెరిగే ప్రమాదం అధికమవుతుంది అని ఒక శీర్షికలో పేర్కొనబడింది.
    • పోషక ఆహార లోపాలు: ఐస్ క్రీమ్‌లో ఎక్కువ చక్కెర ఉంటుంది. ఎక్కువ మోతాదులో ఐస్ క్రీమ్ తింటే పోషకాల లోపానికి దారితీస్తుంది, అలాగే బరువు పెరగడానికి కారణం కావచ్చు.
    • అలెర్జీ ప్రతిచర్యలు: సాధారణంగా కొంత మందికి ఐస్ క్రీమ్‌లో వాడే పాల పదార్థాలు పడవు. ఇవి అలెర్జీ రియాక్షన్లకు కారణమవుతాయి.
    • రక్తంలో చక్కర స్థాయి తగ్గడం: నవజాత శిశువుకు ప్రసవం తర్వాత రక్తంలో అధిక స్థాయిలో చక్కెర తగ్గుదల కనిపిస్తుంది.
    • ముందస్తు కాన్పు: ఐస్ క్రీమ్, అలాగే ఎక్కువ చక్కెర ఉన్న ఆహారం తినడం వల్ల తొందరగా కాన్పు అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ముందస్తు కాన్పు ప్రమాదం ఉన్న మహిళలకు, అంటే మునుపు గర్భవతిగా ఉన్నప్పుడు సమస్యలు ఎదుర్కొన్న వారికి ముఖ్యంగా ఇది వర్తిస్తుంది.

    గర్భధారణ సమయంలో స్త్రీలు అప్పుడప్పుడు కొంచెం ఐస్ క్రీమ్ తినడం ఆమోదయోగ్యమే. కానీ ఎంత మోతాదులో తింటున్నారు అన్నది దృష్టిలో ఉంచుకోవాలి. అలాంటప్పుడు వాళ్ళు తినే ఇతర ఆహారంతో సమతుల్యం చేసుకోవాలి. మీరు ఊహించని దుష్ప్రభావాలు ఎదుర్కొంటే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కోసం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో కేక్ తరచుగా తినడం సురక్షితమేనా?

    గర్భాధారణ సమయంలో ఐస్‌ క్రీమ్ తినడం గురించిన సూచనలు (Advice on eating ice cream during pregnancy in Telugu)

    “గర్భధారణ సమయంలో ఐస్‌ క్రీమ్ తినొచ్చా?” అని సలహా అడిగితే, దానికి జవాబు తగు మోతాదులో తినచ్చు అని చెప్పవచ్చు. మిగతా ఆరోగ్యకరమైన ఆహారానికి బదులుగా మాత్రం తినకూడదు. గర్భధారణ సమయంలో కాల్షియం వంటి అవసరమైన పోషకాలను ఐస్ క్రీమ్ అందిస్తుంది. అలాగని పోషకాల కోసం కేవలం ఐస్ క్రీమ్‌పై మాత్రమే ఆధారపడటం మంచిది కాదు. 19 నుంచి 50 ఏళ్ల వయసు గల స్త్రీలకు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి రోజూ 1000 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం. ACOG ఈ సిఫార్సును అందించింది. మిగతా వనరుల నుంచి కూడా గర్భధారణ సమయంలో కావాల్సిన పోషకాలు, ఖనిజాలు అందుతాయి. తగిన మోతాదులో ఐస్ క్రీమ్ తినడం మంచిదే, కానీ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు లాంటి ఇతర ఆరోగ్యకరమైన ఆహారానికి బదులుగా కాదు.

    గర్భధారణ సమయంలో ఐస్ క్రీమ్ తినటం గురించి అపోహలు (Myths about eating ice cream while expecting in Telugu)

    పిండానికి హాని కలుగుతుందేమో అని, బరువు పెరుగుతారని మహిళలు వారికి నచ్చిన చల్లటి పదార్థాలు తినకుండా దూరం పెడతారు. ఎక్కువగా ఏం తిన్నా హానికరమే. కాబట్టి, తక్కువ మోతాదులో ఐస్ క్రీమ్ తినడం మంచిది. గర్భధారణ సమయంలో ఐస్ క్రీమ్ తినడం గురించి అపోహలను నివృత్తి చేసుకోవడానికి వైద్యులు లేదా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి. ఆహారం లేదా వ్యాయామ దినచర్యను మార్చే ముందు, ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించండి. అన్నిటికన్నా, ప్రతి స్త్రీ, శిశువు ప్రత్యేకం. కాబట్టి, ఒకరి విషయంలో జరిగినట్లు ఇంకొకరి విషయంలో జరగకపోవచ్చు. సరైన సలహాలు సూచనలు పాటిస్తూ కొద్ది కొద్దిగా ఐస్‌ క్రీమ్ తినడం ఒక సమతుల్య ఆహారవిధానానికి గర్భధారణ సమయంలో సహాయపడుతుంది.

    Tags:

    Ice Cream In Pregnancy: Risks & Side Effects in Telugu, Ice cream's nutritional value in Telugu, Causes of ice cream cravings during pregnancy in Telugu, Risks & side effects of ice cream during pregnancy in Telugu, Advice on eating ice cream during pregnancy in Telugu, Myths about eating ice cream while expecting in Telugu, Ice Cream In Pregnancy: Risks & Side Effects in English, Ice Cream In Pregnancy: Risks & Side Effects in Hindi, Ice Cream In Pregnancy: Risks & Side Effects in Tamil, Ice Cream In Pregnancy: Risks & Side Effects in Bengali.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.