Browse faster in app
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Bump arrow
  • 10-వారాల ప్రెగ్నెన్సీ పొట్ట పరిమాణం: ఏది సాధారణం? ఏది కాదు? arrow

In this Article

    10-వారాల ప్రెగ్నెన్సీ పొట్ట పరిమాణం: ఏది సాధారణం? ఏది కాదు?

    Pregnancy Bump

    10-వారాల ప్రెగ్నెన్సీ పొట్ట పరిమాణం: ఏది సాధారణం? ఏది కాదు?

    8 February 2023 న నవీకరించబడింది

    ప్రెగ్నెన్సీలో 10 వ వారానికి చేరుకున్న కాబోయే తల్లి తన శరీరంలో కొన్ని ఆకస్మిక మార్పులను అనుభవిస్తుంది. ఒళ్ళు నొప్పులు మరియు బయటకు కనిపించే సిరలు ఈ లక్షణాలలో కొన్ని. 10 వారాల ప్రెగ్నెన్సీలో పొట్ట పరిమాణం పెద్దగా ఉండదు కానీ చుట్టూ ఉన్నవాళ్ళు దీనిని గమనించడం ప్రారంభించే సమయం. కడుపులో ఉన్న పిండం ప్రెగ్నెన్సీ వచ్చిన 10వారాల తర్వాత మాత్రమే పొట్టలో పిండంగా పరిగణించబడుతుంది. అందువల్ల తల్లి, తండ్రి మరియు ఇతర కుటుంబ సభ్యులకు ఇది ఒక మైలురాయిలాంటిది. గర్భం యొక్క మొదటి త్రైమాసికాన్ని పూర్తి చేసిన తరువాత సంభవించే సాధారణ మరియు అసాధారణ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం:

    • 10 వ వారం తర్వాత, డాక్టర్ సాధారణంగా అల్ట్రాసౌండ్ ద్వారా శిశువు యొక్క హృదయ స్పందనను చెక్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంతా బాగానే ఉందని నిర్ధారించుకోవడం కోసం. సోనోగ్రఫీ ద్వారా శిశువును కూడా విజువల్‎గా చెక్ చేస్తారు. ఈ విషయాలు యువ తల్లులను కలవరపెట్టినప్పటికీ, అవి రొటీన్ చెకప్‎లు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
    • 10 వారాల ప్రెగ్నెన్సీ దశను పూర్తి చేసిన తరువాత, అవయవాలు మరియు శరీరంలోని ఇతర భాగాలు అభివృద్ధి చెందడం ప్రారంభించినప్పుడు శిశువు పరిమాణం పెరుగుతుంది. ఎముకలు మరియు మృదులాస్థిలు వాటి నిర్మాణాత్మక దశలో ఉంటాయి. దాంతో తల్లి పొట్ట మరింత వేగంగా పెరుగుతున్న అనుభూతిని పొందుతుంది.
    • బిడ్డకు జన్మనివ్వబోయే తల్లులు మొదటి 20 వారాల తరువాత మాత్రమే మొదటిసారిగా బిడ్డ తన్నడాన్ని అనుభూతి చెందుతారు. శిశువులు 10వ వారం తరువాత తన్నడాన్ని సాధన చేస్తారు. కానీ చిన్నగా ఉండడం వల్ల ఆ తన్నడాలు చాలా అస్పష్టంగా ఉంటాయి. అయితే అల్ట్రాసౌండ్ పరీక్షల సమయంలో వాటిని అనుభూతి చెందే అవకాశం ఉంది.
    • 10 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో, శిశువు పరిమాణం స్ట్రాబెర్రీ పరిమాణాని‎కి సమానంగా ఉంటుంది. ఇది సుమారు 1.2 అంగుళాల పొడవు ఉంటుంది మరియు దీని బరువు 0.14 ఔన్సులుగా ఉంటుంది. రాబోయే మూడు వారాల్లో, శిశువు యొక్క పరిమాణం 10 వారాల ప్రెగ్నెన్సీ శిశువు పరిమాణంకంటే రెండింతలు ఎక్కువగా ఉంటుంది.
    • గర్భం ధరించిన 10వ మరియు 14వ వారాల మధ్య NT (నుచల్ ట్రాన్సులెన్సీ) టెస్ట్ నిర్వహించబడుతుంది. బిడ్డలో ఏవైనా క్రోమోజోమ్ అసాధారణతలు ఉన్నాయా అని చెక్ చేయడం కోసం దీనిని నిర్వహిస్తారు. బిడ్డకు డౌన్ సిండ్రోమ్ ఉన్నదా లేదా అని నిర్ధారించడం అనేది ఈ పరీక్షను నిర్వహించడానికి ప్రధాన కారణాలలో ఒకటి. ఇది రక్త నమూనా మరియు అల్ట్రాసౌండ్ సహాయంతో నిర్వహించబడుతుంది. అందువల్ల ఈ సమయంలో ఏదైనా పరిస్థితి ఉన్నా తట్టుకునే మానసిక శక్తిని బిడ్డని కనబోయే తల్లి పెంపొందించుకోవాలి.
    • ఎదుగుతున్న బిడ్డకు స్థలాన్ని కల్పించడం కోసం మహిళ పొత్తికడుపు నెమ్మదిగా సాగదీయడం ప్రారంభిస్తుంది. అందువల్ల కొంతమంది తల్లులు ఈ కాలంలో తీవ్రమైన నొప్పిని అనుభవించవచ్చు. కొంతమంది తల్లులకు అంత నొప్పికలగకపోవచ్చు. సాధారణంగా కవలలను కలిగి ఉండే తల్లులు ఇతరుల కంటే చాలా ఎక్కువ నొప్పిని అనుభవిస్తారు.
    • 10 వ వారం తరువాత తల్లి యొక్క రొమ్ములు పెరగడం ప్రారంభమవుతాయి. ఇది చాలా సాధారణం.వికారంగా అనిపించడం, అలసట, మానసిక ఆందోళన మరియు యోని ద్రవాల విడుదల పెరగడం అనేవి ఈ కాలంలో తల్లులు అనుభవించే కొన్ని సాధారణ లక్షణాలు. యోని ద్రవాలు స్పష్టంగా మరియు వాసన లేకుండా ఉంటే అంతా సాధారణంగా ఉందని అర్ధం. అయితే రక్తం కారణంగా ద్రవం ఎరుపు లేదా గోధుమరంగు ఛాయను కలిగి ఉంటే, అది అసాధారణంగా ఉందని సూచిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో డాక్టర్‎ని సంప్రదించడం మంచిది.
    • మీ శరీరంపై గణనీయంగా ఎక్కువగా కనిపించే సిరలను మీరు గమనిస్తారు. మీ ఎదుగుతున్న బిడ్డకు మీ శరీరంలో అదనపు రక్త ప్రసరణకు ఇవి సంకేతాలు. ఈ కారణంగా స్పైడర్ సిరలు కనిపించడాన్ని కూడా మీరు గమనించవచ్చు.
    • 10 వారాల ప్రెగ్నెన్సీ పరిమాణం, పొట్ట ఆకారంలో మార్పు కనపడుతుంది. అందువల్ల ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తల్లులు సౌకర్యవంతమైన ప్యాంట్‎లు మరియు అసౌకర్యం కలిగించని ఎక్కువ వదులుగా ఉండే దుస్తులను ధరించాలి.
    • ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడం సాధారణం. కవలలను కలిగి ఉన్న తల్లులకు బరువు పెరగడం ఎక్కువగా ఉండవచ్చు. వికారంగా అనిపించడం వల్ల కొంతమంది తల్లులు కొంత బరువు తగ్గుతారు. ఇవన్నీ సాధారణ లక్షణాలే. అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
    • వికారం లేదా మార్నింగ్ సిక్ నెస్ తగ్గిన తరువాత కూడా కాబోయే తల్లుల బరువు పడిపోతూనే ఉంటే, వారు వెంటనే డాక్టర్‎ని సంప్రదించాలి. వికారంగా అనిపించకుండా ఉండాలంటే, వారు మేల్కొన్న వెంటనే అల్పాహారం తీసుకోవాలి.

    ముగింపు

    ప్రెగ్నెన్సీ పొందిన మొదటి పది వారాలు పూర్తయిన తరువాత తల్లులు మరింత జాగ్రత్తగా మరియు సున్నితంగా ఉండటం సహజం. అయినప్పటికీ వారు మిగిలిన ప్రెగ్నెన్సీ సమయానికి శారీరకంగా మరియు మానసికంగా కూడా తమను తాము సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా 10వ వారం తర్వాత వారు విటమిన్లు మరియు ప్రోటీన్లతో కూడిన సమృద్ధిగా ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలి. ఆహారం, వ్యాయామం మరియు రోజూ ఎలాంటి పని చేయాలనే విషయంలో డాక్టర్లను సంప్రదిస్తూ ఒక చెక్ లిస్ట్ ను సిద్ధం చేసుకోవాలి. చివరగా హార్మోన్లలో వచ్చిన మార్పులను ఎదుర్కొనడానికి తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    kakarlasirisha

    kakarlasirisha

    Read from 5000+ Articles, topics, verified by MYLO.

    Download MyloLogotoday!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    100% Secure Payment Using

    Stay safe | Secure Checkout | Safe delivery

    Have any Queries or Concerns?

    CONTACT US
    +91-8047190745
    shop@mylofamily.com
    certificate

    Made Safe

    certificate

    Cruelty Free

    certificate

    Vegan Certified

    certificate

    Toxic Free

    About Us

    Trusted by 10+ million young parents Mylo is India’s #1 Pregnancy & Parenting App. Mylo app will guide you through your whole parenting journey. Download now

    All trademarks are properties of their respective owners.2017-2023©Blupin Technologies Pvt Ltd. All rights reserved.