Raise A Happy & Healthy Baby
Get baby's growth & weight tips
Join the Mylo Moms community
Get baby diet chart
Get Mylo App
Want to raise a happy & healthy Baby?
Pregnancy
6 June 2023 న నవీకరించబడింది
మార్కెటింగ్ ఇండస్ట్రీ చాలా వేగంగా ముందుకెళ్తోంది. పెరుగుతున్న జనాభా మరియు డిమాండ్ వల్ల పోటీతత్వం కూడా పెరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి సంస్థకు సంబంధించిన అమ్మకాలు మరింత ప్రభావవంతంగా, ఆకర్షణీయంగా తయారవుతున్నాయి. దాంతో పాటు అవి జీవితం కంటే ఎక్కువగా మారిపోతున్నాయి.
అదనపు లాభాలతో పాటు అక్కడ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా వస్తోంది. అన్ని ప్రొడక్టులకు పాజిటివ్ వెలుగే వస్తుండటంతో ఏది ఉత్తమమైనదనే అంశంపై అనుమానాలు నెలకొన్నాయి. అత్యంత సురక్షితమే ప్రధానంగా తయారైన ఇంటిమేట్ వాష్ కూడా అలాంటి ఓ ఉత్పత్తి, మహిళల్లో ఇంటిమేట్ హైజీన్ కు సంబంధించి, మీరు ఏదీ ఎంచుకున్నా అది తప్పకుండా బెస్ట్ ఇంటిమేట్ వాష్ ఫర్ విమెన్ అయ్యుండాలి.
సరైన దాన్ని ఎంపిక చేసుకోవాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అది ఉత్పత్తి సురక్షితమైనది అనే దాంతో పాటు అందులో అన్ని సహజ పదార్థాలు ఉండాలి. ఇంటిమేట్ విషపదార్థాలు, ఇంకా ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే అందులో కృత్రిమ పదార్థాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఆ ఉత్పత్తి హైడ్రేటింగ్ చేసేదై ఉండాలి మరియు అందులో సబ్బు ఉండకూడదు. సబ్బు ఉండటం వల్ల పొడిదనం కలిగి తర్వాత అది దురదకు దారి తీస్తుంది. కృత్రిమ సువాసన ఉన్నవాటిని దూరం పెట్టడం కూడా ముఖ్యమైన అంశం. మహిళల కోసం తయారు చేసే ఇంటిమేట్ హైజీన్ వాష్ ప్రధాన లక్ష్యం మంచిగా శుభ్రపరచడమే. అది అన్ని రకాల విషాలను, క్రిములను, చెమటను తొలగించగలగాలి. తద్వారా హైడ్రేటెడ్, మాయిశ్చరైజ్డ్, మరియు శుభ్రమైన సన్నిహిత ప్రదేశాన్ని అందివ్వగలగాలి. మీరు రోజువారీ చేసుకునే శుభ్రతలో భాగంగా అది అదనపు ప్రక్రియ గనుక దాన్ని ఎక్కువగా చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇంటిమేట్ ప్రదేశం పీహెచ్ మరియు ఎసిడిక్ మాంటిల్ ను బాలన్స్డ్ గా ఉంచగలగాలి.
మహిళల కోసం తయారు చేసే ఇంటిమేట్ వాష్ ప్రొడక్ట్ కొనుగోలు చేయడంలో ముఖ్యమైన భాగం కన్సల్టేషన్. అది చాలా సున్నితమైన ప్రాంతం కావడం వల్ల డాక్టర్ ను కలవడం సూచించబడుతోంది. మీరు ఇంటిమేట్ వాష్ ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఏది మంచిదో, దాని వల్ల లభాలు మరియు నష్టాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటారు. ఆన్లైన్లో అలాంటి ప్రొడక్టుల విషయాలు తెలుసుకోవచ్చు. బెస్ట్ ఇంటిమేట్ వాష్ ఫర్ విమెన్ ఏదో మీకు తెలిసిన తర్వాత దానిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుకోవాలి. కొంచెం ద్రవాన్ని తీసుకొని వెలుపలి భాగాలకు రాయండి. ముందునుంచి వెనుకకు రాయాలని సూచన. ఆ తర్వాత దాన్ని శుభ్రంగా కడగాలి. ప్రతిరోజు ఇలా కడగడం లేదా వారంలో కొన్నిసార్లు ఇలా చేయడం మంచి ఆరోగ్యం మరియు ఇంటిమేట్ హైజీన్ కు మంచి మార్గం.
ఈ విషయాల గురించి మీకు తెలిశాక మంచి ఇంటిమేట్ హైజీన్ వాష్, దాని ఉపయోగాల కోసం వెదకండి, దాంతో పాటు అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇందులో భాగంగా మనలో వచ్చే మొదటి ప్రశ్న పీరియడ్స్ లో అది వాడటం సురక్షితమేనా కాదా అని. చాలా మంది సూచించినట్లు, పీరియడ్స్ మధ్యలో ఇంటిమేట్ వాష్ మరియు సోపులు వాడటం మంచిది కాదు. రుతుచక్రంలో మెన్స్టువల్ హైజీన్ కోసం మీరు అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలు ప్రతి నెలలోనూ ఈ పరిస్థితి గుండా వెళ్లాల్సి ఉన్నందున కొన్ని ముఖ్య విషయాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ప్యాడ్లు, టాంపన్స్ మరియు మెన్స్టువల్ కప్స్ మార్చుకోవడం అనేవి మెన్స్టువల్ హైజీన్లో ముఖ్యమైనవి. సోపులు మరియు ఇంటిమేట్ వాష్ లు ఉపయోగించడం ద్వారా సహజమైన ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే మెన్స్టువల్ సైకిల్ తనకంటూ ఓ సహజమైన పరిశుభ్ర ప్రక్రియను అనుసరిస్తుంది, దానికి ఆటంకం కలిగించకూడదు.
క్రమం తప్పకుండా స్నానం చేయడం,ప్రత్యేకించి రుతుచక్రం సమయంలో ఇంటిమేట్ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి సాధారణ లేదా వేడి నీరు మంచి మార్గం. ఒకవేళ ఇంటిమేట్ వాష్ ను పీరియడ్స్ మధ్యలో వాడితే అది బాక్టీరియా పెరగడానికి మరియు ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. కాబట్టి మంచి ఇంటిమేట్ ఆరోగ్యం పొందడానికి తరచుగా ప్యాడ్ష్ మార్చడం మరియు కృత్రిమ ఇంటిమేట్ హైజీన్ వాష్ వాడకుండా ఉండటం ఉత్తమం. వీటితో పాటు రుతుక్రమంలో మరి కొన్ని అంశాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇంటిమేట్ ప్రాంతాన్ని తరచుగా కడుగుతూ పొడిగా మరియు శుభ్రంగా ఉంచుకోవడం మొదటిది. దాని తర్వాత ఆరోగ్యంగా నిద్రించడం మరియు తినే విధానాలు. భోజనం తినకుండా ఉండటం, జంక్ ఫుడ్ తినడం, ప్యాడ్లను సరైన సమయంలో మార్చకపోవడం, ఒకేసారి ఎక్కువ ప్యాడ్లను వాడటం, వుల్వాను అధికసార్లు కడగటం వంటివి పీరియడ్లలో చేయకూడదు. తర్వాత స్పైసీ ఫుడ్స్, ఆల్కహాల్, ఎక్కువ ఉప్పు, చక్కెర, కాఫీ తీసుకోవడం మంచిది కాదు.
పీరియడ్లలో భారీగా హార్మోన్ల తేడాలు ఉంటాయి దాని వల్ల శరీరంలోనూ, మూడ్ లోనూ మార్పులు వస్తాయి. అవి చిరాకును, కోపాన్ని, బాధను, కొన్నిసార్లు కన్ఫ్యూజన్ కూడా కలిగిస్తాయి. కాబట్టి మంచి మద్దతు, బాధ్యత తీసుకునే వారు అవసరం అవుతుంది. చాలా మంది మహిళలు వాటికి అలవాటు పడి ఉన్నప్పటికీ, సరైన కన్సల్టేషన్, మద్దతు, ప్రేమ వల్ల పీరియడ్ ప్రశాంతంగా ముగుస్తుంది.
ముగింపు
రుతుచక్రం సమయంలో సరైన తుల్యతతో, సహజమైన ఇంటిమేట్ వాష్ ఉపయోగించాలనే ఆలోచన సరైందే. కానీ పీరియడ్స్ మధ్యలో ఇంటిమేట్ హైజీన్ వాష్ ఉపయోగించడం వల్ల శరీరం ఉపయోగించే సహజ శుభ్రతా ప్రక్రియ దెబ్బ తింటుంది గనుక దాన్ని ఉపయోగించకపోవడం ఉత్తమం. చివరగా తరచుగా రుతుచక్ర హైజీన్ పాటించడం మరియు మంచి ఆహారం తీసుకోవడం, మంచి నిద్ర అలవాట్లు కలిగి ఉండటం మంచిది. ఇది సంతోషకరమైన, ఆరోగ్యకరమైన పీరియడ్స్ కు సహాయపడుతుంది.
Yes
No
Written by
kakarlasirisha
kakarlasirisha
గర్భధారణ సమయంలో ఏ కాఫ్ సిరప్ సురక్షితమైనది?
ప్రసవానంతర బరువు తగ్గడానికి ప్లాన్ చేసేందుకు ఉత్తమ సమయం ఏది?
ప్రసవానంతర రక్తస్రావం ఎలా ఉంటుంది? దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి?
గర్భధారణ ప్రారంభ దశలో తక్కువ హెచ్‌సిజి స్థాయిలకు కారణం ఏమిటి మరియు ఆహారం ద్వారా గర్భధారణ సమయంలో హెచ్‌సిజి స్థాయిలను ఎలా పెంచాలి
గర్భధారణ సమయంలో టీకాలు: గర్భధారణ సమయంలో TT ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోవాలి
ప్రసవానంతర డిప్రెషన్ ఎంతకాలం ఉంటుంది?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Blackheads & Pimples | Skin Moisturizer | Skin Irritation | Shop By Ingredient | Kumkumadi | Ubtan | Vitamin C | Tea Tree | Aloe Vera | Rose Water | Skin - Hair | SHOP BY CONCERN | Hairfall | Dry and Damaged Hair | Hair Growth | Shop By Ingredient | Onion | Coconut | Skin - Fertility | By Concern | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |