Pregnancy
16 May 2023 న నవీకరించబడింది
నిలబడి మూత్ర విసర్జన చేయడానికి రూపొందించబడిన ఉత్పత్తులు మహిళలు తమ దుస్తులను తీయకుండానే మూత్ర విసర్జన చేయడానికి వీలు కల్పిస్తాయి. మన దేశంలోని మహిళల విషయంలో పారిశుధ్యం ఒక ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే చాలా మందికి శుభ్రమైన, సురక్షితమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవు అనేది మనందరికీ తెలిసిన విషయం.
ఈ ఉత్పత్తులు చాలా కాలం నుండి తయారు చేస్తున్నారు, కానీ నిలబడి మూత్ర విసర్జన చేయడానికి రూపొందించిన ఉత్పత్తులను సాధారణ వస్తువుగా పరిగణించే స్థాయికి మనం ఇప్పటికి చేరుకున్నాం. ఇది నిజం, ఇక మూత్ర విసర్జన చేయడానికి పరిశుభ్రమైన ప్రదేశం దొరికే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు!
ఇప్పుడు మార్కెట్లో వివిధ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి, కాబట్టి ప్రతి ఒక్కరి అవసరాలకు సరిపోయే ఉత్పత్తి ఖచ్చితంగా దొరుకుతుంది. సాధారణ మూత్ర విసర్జన పరికరాల నుండి మొదలు చేతులు ఉపయోగించాల్సిన అవసరం లేని పరికరాల వరకు, ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి అందుబాటులో ఉంది. అన్నింటికంటే మంచి విషయం, ఈ ఉత్పత్తులు మరింత సరసమైన ధరలలో, సులభంగా దొరుకుతున్నాయి.
శుభ్రమైన ప్రదేశం దొరకక మూత్ర విసర్జన ఆపుకోవడం లేదా అపరిశుభ్రమైన అనుభవాన్ని ఎదుర్కోలేక అలసిపోయారా, అయితే నిలబడి మూత్ర విసర్జన చేయడానికి రూపొందించబడిన ఉత్పత్తులను ఈరోజే కొనుగోలు చేయండి! కానీ నిలబడి మూత్ర విసర్జన చేయడానికి రూపొందించిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుందా లేదా అనేది సందేహం.
ఇలాంటి పరికరాలు మూత్ర నాళ సంబంధిత వ్యాధుల (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్-- యూటీఐ)ను నివారించడంలో సహాయపడతాయి. బాక్టీరియా మూత్రనాళంలోకి ప్రవేశించి మూత్రాశయం వరకు ప్రయాణించి ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతున్నప్పుడు యూటీఐలు ఏర్పడతాయి. పురుషుల కంటే స్త్రీలు యూటీఐకి ఎక్కువగా గురవుతారు. ఎందుకంటే వారి మూత్ర నాళం చిన్నగా ఉంటుంది.
నిలబడి మూత్ర విసర్జన చేయడానికి రూపొందించిన ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా మరొక ప్రయోజనం ఏమిటంటే, ఇది వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. చాలా మంది మహిళలకు శుభ్రమైన, సురక్షితమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవు. అందువల్ల వారు అసురక్షిత ప్రదేశాలలో మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. నిలబడి మూత్ర విసర్జన చేయడానికి రూపొందించిన ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా, మహిళలు ఇలాంటి ఆరోగ్య సమస్యల బారిన పడకుండా నివారించవచ్చు.
అయితే డిస్పోజబుల్ ఫిమేల్ యూరినేషన్ డివైజ్‌లను ప్రవేశపెట్టడంతో ఒక విప్లవం ప్రారంభమైంది. ఇవి పబ్లిక్ టాయిలెట్ల ద్వారా అనారోగ్య సమస్యలు కలుగుతాయేమో అనే ఆందోళన నుండి ఉపశమనం పొందాడనికి సహాయపడతాయి.
ఫిమేల్ యూరినేషన్ డివైజ్‌లు (FUDలు) అన్ని వయసుల స్త్రీలు తమ దుస్తులను తీయకుండానే మూత్ర విసర్జన చేయడానికి వీలు కల్పిస్తాయి. మహిళలు ఈ ఉపకరణాలను ఉపయోగించడానికి అత్యంత ముఖ్యమైన కారణం ఏమిటంటే, FUDలు ఎక్కడైనా ఉపయోగించబడవచ్చు. కాబట్టి వారు ఎక్కడ మూత్ర విసర్జన చేస్తున్నారు అనే దాని గురించి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఒక అధ్యయనం ప్రకారం, మహిళలు తమ జీవితంలో సగటున ఆరు నెలలు రెస్ట్‌రూమ్ కోసం లైన్‌లో వేచి ఉంటారట. వారు ఈ సమయాన్ని పని చేయడం లేదా పిల్లలను చూసుకోవడం వంటి ఇతర పనుల కోసం ఉపయోగించుకోవచ్చు.
మైలో కేర్ స్టాండ్ & పీ వంటి నిలబడి మూత్ర విసర్జన చేయడానికి రూపొందించిన డివైజ్, మురికి టాయిలెట్ సీట్ల వినియోగాన్ని నివారించడానికి సహాయపడవచ్చు. ఈ సులభమైన డిస్పోజబుల్ గాడ్జెట్‌తో నిలబడి మూత్ర విసర్జన చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ప్రతి స్త్రీ వారి జీవితంలో వృత్తిపరంగా పని చేసేటప్పుడు ఖచ్చితంగా అపరిశుభ్రమైన ఆఫీసు రెస్ట్‌రూమ్‌లను ఉపయోగించిన అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. 500 మంది ఒకే రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించినప్పటికీ, రోజుకు రెండు సార్లు కంటే తక్కువ శుభ్రం చేయడం వల్ల క్రిములు వృద్ధి చెందుతాయి. వెంట తీసుకెళ్లగల ఈ పరికరం ఉంటే పని చేసే మహిళలు ఇలాంటి చేదు అనుభవాల నుండి తప్పించుకోవచ్చు.
క్యాంపింగ్ టాయిలెట్ అనేది నేటి చరిత్రలో అత్యంత అనుకూలమైన ఆవిష్కరణలలో ఒకటి. ఒక పాటీ లేదా బాత్‌రూమ్‌లో శారీరక వ్యర్థాలను విసర్జించవచ్చు. ఇది అందుబాటులో లేకుంటే, డిస్పోజబుల్ యూరినేషన్ డివైజ్‌లో మూత్ర విసర్జన చేసి, పూర్తయిన తర్వాత దానిని బయట పాతి పెట్టవచ్చు. అలాగే, క్యాంప్‌సైట్‌లో ఇరుక్కుపోవడం, చీకటి పడిన తర్వాత బయటకు వెళ్లడాన్ని నివారించాలనుకోవడం వంటి పరిస్థితులకు ఈ ఉత్పత్తి అద్భుతంగా పని చేస్తుంది.
ఎవరైనా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు, రెస్ట్‌రూమ్‌కి వెళ్లడం ఒక సవాలుగా మారుతుంది. గర్భిణీ లేదా వృద్ధులకు ఇది మరింత క్లిష్టంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు తరచుగా మూత్రం ఆపుకోలేని సమస్యను ఎదుర్కొంటారు. ఇది చాలా ఇబ్బందికరంగా, అసౌకర్యంగా ఉంటుంది. నిలబడి మూత్ర విసర్జన చేయడానికి రూపొందించిన ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా, వారు అలాంటి పరిస్థితులను నివారించవచ్చు. పబ్లిక్ రెస్ట్‌రూమ్‌లలో నీటి సరఫరా పరిమితం చేసినందున, తరచుగా శుభ్రం చేయకపోవడం కారణంగా, వారికి శుభ్రమైన టాయిలెట్‌ను అందించే ప్రత్యామ్నాయం అవసరం.
బలహీనమైన మోకాలు లేదా తుంటి ఎముక కారణంగా వృద్ధులకు కూర్చోవడం కష్టంగా ఉండవచ్చు. అటువంటి సందర్భాలలో, FUDలు వారి దుస్తులను తీసివేయకుండానే మూత్ర విసర్జన చేయడానికి వీలు కల్పిస్తాయి.
మహిళల కోసం నిలబడి మూత్ర విసర్జన చేయడానికి రూపొందించిన ఉత్పత్తులు ప్రయాణికులకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతాయి. కారు లేదా రైలులో సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వస్తే, మూత్ర విసర్జన చేయడానికి శుభ్రమైన, స్వఛ్ఛమైన స్థలాన్ని కనుగొనడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
నిలబడి మూత్ర విసర్జన చేయడానికి రూపొందించిన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి అనుకూలమైనవి, ఉపయోగించడానికి సులభమైనవి, ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకోవడంలో సహాయపడతాయి. ఈ డివైజ్‌లు దేవుడిచ్చిన వరం కావచ్చు. సాంకేతికతకు నిదర్శనమైన ఈ యుగంలో అనేక వినూత్న గాడ్జెట్‌లు రూపొందించబడ్డాయి. వాటిలో ఫిమేల్ యూరినేషన్ డివైజ్‌లు ఒకటి.
మహిళలు మూత్ర విసర్జన చేయడానికి పరిశుభ్రమైన, స్వచ్ఛమైన స్థలాన్ని కనుగొనాలని ఆందోళన చెందాల్సిన రోజులు పోయాయి. FUDలతో, వారు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మూత్ర విసర్జన చేయవచ్చు.
Yes
No
Written by
dhanlaxmirao
dhanlaxmirao
అనెన్స్‌ఫాలీ: కారణాలు, లక్షణాలు, ప్రమాదం & చికిత్స
ఆటిజం స్పెక్ట్రమ్: లక్షణాలు, సమస్యలు & చికిత్స
ప్రెగ్నెన్సీ సమయంలో వాంతి రాకుండా ఉండటానికి కొన్ని వేగవంతమైన, ప్రభావవంతమైన టిప్స్
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్): చికిత్స, నిర్వహణ
పెరిమెనోపాజ్: కారణాలు, లక్షణాలు, ప్రమాదాలు మరియు చికిత్స
గర్భధారణ సమయంలో గజ్జలో నొప్పి: కారణాలు, లక్షణాలు మరియు చికిత్స
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Mylo is a master brand offering solutions through it's subsidiaries - Mylo Care and Mylo Baby.
Mylo Care offers science backed, expert led solutions across multiple health concerns.
Mylo Baby is a one stop solution for young parents for all their baby's needs.
Weight Management | By Ingredient | Wheatgrass | Apple Cider Vinegar | Skin - Fertility | PCOS | By Ingredient | Chamomile | Skin - Hygiene | Intimate Area Rashes | Diapers & Wipes | Disposable Diapers | Cloth Diapers | Baby Wipes | Diapers & Wipes - Baby Care | Hair | Skin | Bath & Body | Diapers & Wipes - Baby Wellness | Diaper Rash |