Pregnancy Journey
29 August 2023 న నవీకరించబడింది
వీధి ఆహారాల్లో(స్ట్రీట్ ఫుడ్) కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. అయితే గర్భధారణ సమయంలో దీనిని పూర్తిగా మానేయాలని అర్థం కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు స్ట్రీట్ ఫుడ్స్ ను ఎంజాయ్ చేయవచ్చు.. ప్రెగ్నెన్సీ సమయంలో మీరు ఇష్టమైన వీధి భోజనాన్ని ఆస్వాదించవచ్చు. వీధి ఆహారాల్లో అత్యంత హానికరమైన భాగం పరిశుభ్రత లేకపోవడం. ఆహారం హానికరం కాదు. కానీ అది ఎలా? ఏ వాతావరణంలో? ఏ ప్రదేశంలో తయారు చేశారనేదే ముఖ్యం. ఇవి ఆహార నాణ్యతను ప్రభావితం చేస్తాయి.
ఆరోగ్యకరమైన కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలను వాడినపుడు వీధి ఆహారం అనేది హెల్తీగానే ఉంటుంది. ఆయిల్ (ముఖ్యంగా ఫ్రై చేసే నూనె) తాజాగా, స్వచ్ఛంగా ఉండాలి. (మరలా ఉపయోగించబడకూడదు). వంట కోసం ఉపయోగించే నీరు / ఫిల్టర్ చేసిన వాటర్ (అంటే శుభ్రంగా, స్వచ్ఛమైనదిగా) ఉండాలి. ఉపయోగించిన పాత్రలను పూర్తిగా శుభ్రం చేయాలి.
1. తినే ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోండి (Choose the food joint carefully):
గర్భధారణ ప్రారంభ కోరికల కోసం ఆహార నాణ్యత బాగుండి.. పరిశుభ్రంగా ఉండే రెస్టారెంట్‌ను ఎంచుకోండి. కొన్ని వీధి వ్యాపారాలు అత్యంత పరిశుభ్రంగా ఉంటాయి. పెద్ద పెద్ద రెస్టారెంట్ల కంటే రుచికరమైన భోజనాన్ని అందిస్తాయి. మీ కుటుంబం, స్నేహితుల ద్వారా మీరు కొన్నింటిని గుర్తించవచ్చు. ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు వీధి ఆహారాల మీద ఆధారపడకండి. వీధి వంటకాల విషయానికి వస్తే మీకు బాగా తెలిసిన ప్రాంతంలో అయితే మీకు ఎటువంటి దిగులు ఉండదు.. సురక్షితమైన చోటును ఎంచుకుంటారు.
గర్భవతులకు ఎక్కువగా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉన్నందున వారు బాగా తెలిసిన, శుభ్రమైన ఆహార పదార్థాలు లభించే వీధి బండి వద్దే తినాలి. ఇలాంటి చోట నాణ్యత, శుభ్రత, సర్వీస్ ఎక్కువగా ఉంటుంది. దోమలు, ఈగలు, ఇతర కీటకాలు ఉన్న ప్రదేశాల్లో తినడం మానుకోండి.
2. టాపింగ్స్(ఆహారపదార్థాలను డెకరేట్ చేసేందుకు వాడేవి) లేదా చట్నీలను ఉపయోగించకండి ( Do not use toppings or chutneys)
వీధి వ్యాపారులు విక్రయించే చట్నీలైన పుదీన, చిలీ, ఇమ్లీ వంటివి రోజంతా బహిరంగ ప్రదేశాల్లోనే ఉంటాయి. ఇవి అనేక రకాల సూక్ష్మక్రిములను కలిగి ఉంటాయి. గర్భధారణ సమయంలో కారంగా ఉండే ఆహారాలను తినకూడదు. రీ-ప్యాకేజ్డ్ టొమాటో కెచప్ లేదా సాస్ తినేందుకు అనుకూలం. ఎందుకంటే చట్నీల కోసం వాడే పదార్థాలను బాగా కడిగి శుభ్రం చేయకపోవచ్చు. ఇవి కొందరికి వాంతులు మరియు విరేచనాలను కలిగిస్తాయి. మీరు కొత్తిమీర, పుదీన, అల్లం, ఉల్లిగడ్డలు, కట్ చేసిన నిమ్మకాయలను మొదలయిన వాటికి దూరంగా ఉండాలి. వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే సూక్ష్మక్రిములు వాటిపై ఉండవచ్చు.
3. పచ్చి కూరగాయలు, వండని మాంసాన్ని దూరం పెట్టండి ( Avoid raw or undercooked meats and vegetables):
పూర్తిగా తయారు చేసిన ఆహారాన్ని తినేందుకు ఇది సమయం. సిద్ధం చేయని ఆహారాలను ఆర్డర్ చేయడం మానుకోండి. ముడిపదార్థాలతో తయారు చేసిన ఆహారాలను తినడం మానేయండి. ఎప్పుడో కట్ చేసిన పండ్లు మరియు కూరగాయలకు మీరు దూరంగా ఉండాలి. రోడ్‌సైడ్ బర్గర్లు, సాండ్విజ్లలో పచ్చి కూరగాయలు, ఎగ్స్ ఉంటాయి. ఇవి ఫుడ్ సిక్‌నెస్‌ను కలుగజేస్తాయి. అదనంగా పురుగుమందుల అవశేషాలు, టాక్సోప్లాస్మోసిస్ పూర్తిగా శుభ్రం చేయని ఆహార పదార్థాలు, గర్భవతులు కోరుకునే ఆహారాలలో ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. టైఫాయిడ్, హెపటైటిస్ వైరస్లు తరుచుగా కలుషితమైన ఆహారం ద్వారా సంక్రమిస్తాయి. వండని కోడిగుడ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం మానేయండి. సాల్మోనెల్లా గర్భిణీస్త్రీలకు ప్రమాదాన్ని కలిగిస్తుంది.
Food cravings during pregnancy, Street food cravings during pregnancy in telugu, can pregnants eat street foods during pregnancy in telugu, Can street foods be consumed during pregnancy? What kind of street foods should be eaten? How to control the urge to eat street food? in English, Can street foods be consumed during pregnancy? What kind of street foods should be eaten? How to control the urge to eat street food? in Hindi, Can street foods be consumed during pregnancy? What kind of street foods should be eaten? How to control the urge to eat street food? in Tamil, Can street foods be consumed during pregnancy? What kind of street foods should be eaten? How to control the urge to eat street food? in Bengali
Yes
No
Written by
kakarlasirisha
kakarlasirisha
పీరియడ్స్ దాటిపోవడానికి ముందే తెలిసే ప్రెగ్నెన్సీ లక్షణాలు ఏమిటి (What are the pregnancy symptoms that can be noticed before the period is missed in Telugu)?
మీరు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి పిల్లలు మారాం చేయడానికి కారణాలు ఏమిటి (Reasons why Babies Throw Tantrums When You Get Back From Work in Telugu)
బేబీ బాత్ టైమ్‌ని సరదాగా ఇంకా ఆనందించేలా చేయడానికి 5 మార్గాలు (5 Ways to Make Baby Bath Time Fun & Enjoyable for the Little One in Telugu)
మీ శిశువు కోసం డిస్పోజబుల్ డైపర్ ప్యాంట్లను ఎన్నుకునేటపుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు (Things to Remember While Choosing Disposable Diaper Pants for Your Baby in Telugu)
రొమ్ము పాలిచ్చే సమయంలో బరువు తగ్గుదల– వాస్తవాలు తెలుసుకోండి (Weight Loss During Breastfeeding – Know the Facts in Telugu)
బిడ్డలకు బట్టలు ఎంచుకొనే ముందు గుర్తుంచుకోవలసిన అంశాలు (Points To Remember While Selecting Baby Clothes in Telugu)
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Anti Ageing | Skin brightening | Acne & Blemishes | Skin hydration | Dark Circles | Blackheads & Pimples | Skin Moisturizer | Skin Irritation | Shop By Ingredient | Kumkumadi | Ubtan | Vitamin C | Tea Tree | Aloe Vera | Rose Water | Skin - Hair | SHOP BY CONCERN | Hairfall | Dry and Damaged Hair | Hair Growth | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |