hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article continues after adveritsment

Article continues after adveritsment

  • Home arrow
  • Baby Massage arrow
  • పిల్లలకు మసాజ్ చేయడానికి కొత్తగా తల్లైన వారికి ఉపయోగపడే టిప్స్, టెక్నిక్స్ ఇవే (Baby Massaging Tips and Techniques That'll Help All New Moms in Telugu) arrow

In this Article

    Baby Massage

    పిల్లలకు మసాజ్ చేయడానికి కొత్తగా తల్లైన వారికి ఉపయోగపడే టిప్స్, టెక్నిక్స్ ఇవే (Baby Massaging Tips and Techniques That'll Help All New Moms in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    Article continues after adveritsment

    మీ పిల్లలకు మసాజ్ చేయడానికి ముందు మీరు ఏం చేయాలంటే (What to Do Before Starting Massage in Telugu) ?

    బేబీకి మసాజ్ చేయడానికి సరైన స్థలాన్ని ఎంచుకోవడం మీ మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. ఆ ప్రదేశం మీకు, మీ బేబీకి సౌకర్యంగా ఉండాలి. మీ శిశువును టవల్ లేదా దుప్పటి మీద పడుకోబెట్టాలి. గది ఆహ్లాదకరంగా, వెచ్చగా ఉండాలి (మరీ వేడిగా లేదా చల్లగా ఉండకూడదు). మీకు పరధ్యానం కలిగించే పెంపుడు జంతువులు లేదా మొబైల్ ఫోన్స్ లాంటి వాటిని దూరంగా పెట్టడం మంచిది. మసాజ్ చేసే సమయంలో సంగీతం ప్లే చేయాలి లేదా మీరే ఓ మంచి లాలిపాట పాడుతూ ఉండాలి. మసాజ్ చేసే సమయంలో మీ చేతులు సులువుగా జారేలా మంచి ఆయిల్ లేదా లోషన్ ఉపయోగించాలి. ఒకవేళ మీ శిశువుకు తామర లాంటి చర్మసంబంధిత సమస్యలు ఉంటే, మసాజ్ చేసే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

    పిల్లలకు మసాజ్ కోసం ఆవ నూనె, ఏక్వియస్ క్రీమ్, రిఫైన్ చేయని వేరుశెనగ నూనె లాంటి ఆయిల్స్, లోషన్స్ లాంటివి ఉపయోగించకూడదు. ఇవి మృదువైన, సున్నితమైన మీ శిశువు చర్మానికి హానిచేస్తాయి.

    శిశువుకు మసాజ్ ఎలా చేయాలి – దశల వారీగా తెలుసుకోండి (How to do Massage a Baby - Know Step Wise Details in Telugu)

    మీ బేబీని మసాజ్ కోసం సిద్ధం చేసిన తర్వాత, నవజాత శిశువు తల, మొహం, వీపు, రొమ్ము, కడుపు, కాళ్లు, పాదాలకు మర్దన చేయడానికి ఈ మసాజ్ టెక్నిక్స్ ఫాలో కావాలి.

    1. తల (Head)

    మీ అరచేతిలోకి కొంచెం నూనె తీసుకొని, శిశువు తలపై తట్టాలి. చేతితో వృత్తాకారంలో నూనె తల అంతటా అంటేలా మర్దన చేయాలి. శిశువు తలపై ఉండే ఫాంటనెల్ (శిశువు కపాలం ఎముకల మధ్య సున్నితంగా ఉండే ప్రాంతం) భాగంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా నూనెను రాయాలి.

    2. ముఖం (Face)

    మెల్లిగా కొంత నూనెను ముఖంపై రాసి, వేళ్లతో రుద్దాలి. మీ చేతివేళ్లన్నీ ఉపయోగిస్తూ నుదుటి నుంచి గదవ వరకు నూనె రాయాలి. మీ వేళ్లు ముఖం లోపలి నుంచి బయటకు వచ్చేలా కనుబొమ్మలపై నెమ్మదిగా మర్దన చేయాలి. మీ శిశువు చెంపలు, గదవ, ముక్కుపై నెమ్మదిగా రుద్దాలి.

    3. ఉదరానికి ఉపశమనం కోసం (Relief for Stomach)

    బొడ్డు చుట్టూ మసాజ్ చేసిన తర్వాత మీ శిశువు మోకాళ్లు ఉదరానికి తాకేలా మడిచి, పొట్టపై కాస్త ఒత్తిడి కలిగించాలి. ఇదే పొజిషన్‌లో 30 సెకండ్ల పాటు ఉంచాలి. ఇలాగే కొన్ని సార్లు రిపీట్ చేయాలి. మీ శిశువు పొత్తికడుపు నుంచి కిందివైపు మసాజ్ చేయాలి. కడుపులో ఏదైనా గ్యాస్ ఉంటే రిలీజ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

    4. వీపు (Back)

    మీ శిశువును బోర్లా పడుకోబెట్టాలి. మీ బేబీ మెడ నుంచి పిరుదుల వరకు మీ రెండు చేతులతో మసాజ్ చేయాలి. ఇలాగే ముందుకు, వెనక్కు మర్దన చేస్తూ ఉండాలి. శిశువు వెన్నుపూసపై వేళ్లతో వృత్తాకారంలో నెమ్మదిగా మర్దన చేయాలి.

    5. ఛాతి (Chest)

    మీ శిశువు ఛాతి మధ్యలో రెండు చేతులు ఉంచి భుజాల మీదుగా బయటకు మర్దన చేస్తూ ఉండాలి. ఇలాగే కొన్నిసార్లు మర్దన చేయాలి. మీ చేతుల్ని అడ్డంగా ఉంచి కిందివైపు మర్దన చేయాలి.

    6. పొట్ట (Stomach)

    మీ శిశువు పక్కటెముకల కింద మొదలుపెట్టి, మీ చేతివేళ్లను వృత్తాకారంలో తిప్పుతూ మర్దన చేయాలి. మీ వేళ్లను బొడ్డు ప్రాంతానికి తీసుకెళ్లి, క్లాక్‌వైజ్( గడియారం తిరిగే) దిశలో మసాజ్ చేయాలి. మీ శిశువు పొట్టపై చేతిని అడ్డంగా పెట్టి, చేతుల్ని అటువైపు, ఇటువైపు తిప్పుతుండాలి. బొడ్డుతాడు పూర్తిగా ఆరకపోయినా, నయంకాకపోయినా పొత్తికడుపు మసాజ్ చేయకూడదు.

    7. కాళ్లు, పాదాలు (Legs and Feet)

    శిశువు తొడల నుంచి మడిమ వరకు కిందకు ఒత్తిడి కలిగిస్తూ మర్దన చేయాలి. శిశువు తొడ చేతిలో పట్టుకొని వ్యతిరేక దిశలో తిప్పుతూ రెండు చేతులతో మసాజ్ చేయాలి. శిశువు పాదాలను మీ చేతిలోకి తీసుకొని బొటనవేలితో మడమ నుంచి బొటనవేలి వరకు మర్దన చేయాలి. శిశువు పాదాన్ని మీ చేతితో ఒత్తాలి. మర్దన చేసేప్పుడు బొటనవేలిని నెమ్మదిగా లాగాలి. శిశువు మడిమను వృత్తాకారంలో మెల్లిగా తిప్పాలి.

    శిశువుకు మర్దన చేసేప్పుడు పైన చెప్పిన దశలన్నీ అన్నీ ఫాలో కావొచ్చు. అయితే శిశువుకు ఎక్కువ ఒత్తిడి కలిగించకుండా మర్దన చేయాలి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ బిడ్డకు ఎలాంటి బేబీ మసాజ్ ఆయిల్ ఉత్తమం?

    మరిన్ని టిప్స్ (More Tips in Telugu)

    శిశువుకు మర్దన చేసే సమయంలో ఈ బేబీ మసాజ్ టిప్స్ ఫాలో అవండి.

    1. సున్నితంగా ఒత్తిడి కలిగించాలి (Apply Pressure Sensitively)

    శిశువు శరీరం మృదువుగా, సున్నితంగా ఉంటుంది. బయటి నుంచి వచ్చే ఒత్తిడిని ఈ శరీరం తట్టుకోలేదు. కాబట్టి మర్దన చేసేప్పుడు ఎక్కువ బలం ప్రయోగించకూడదు. శిశువు ఏ శరీర భాగం పైనా ఎక్కువగా ఒత్తిడి కలిగించకూడదు. మీరు చేసే మర్దన శిశువుకు హాయిగా ఉండాలి తప్ప హాని కలిగించకూడదు. శిశువు జననాంగాల దగ్గర, గజ్జల చుట్టూ మసాజ్ చేయకూడదు.

    2. మీ శిశువు మంచి మూడ్‌లో ఉండేలా చూసుకోవాలి (Keep Your Baby in Good Mood)

    ఏడుస్తున్న, చిరాకుగా ఉన్నప్పుడు పిల్లలకు మసాజ్ చేయకూడదు. శరీర భాగంలో ఎక్కడైనా మర్దన చేస్తున్నప్పుడు మీ శిశువుకు అసౌకర్యంగా ఉన్నట్టు అనిపిస్తే, ఆ భాగంలో మర్దన చేయకూడదు. మరో భాగంలో మసాజ్ ప్రారంభించాలి. అయినా మీ బేబీ ఏడుస్తూ ఉన్నా, అసౌకర్యంగా ఉన్నట్టు అనిపించినా ఆరోజు మసాజ్ చేయడం ఆపెయ్యాలి.

    3. మీ శిశువుతో మాట్లాడాలి (Talk With Your Baby)

    మసాజ్ చేసే సమయంలో మీ శిశువుతో మాట్లాడుతుండాలి, నవ్వుతుండాలి. ఏదైనా పాట పాడొచ్చు లేదా హమ్ చేయొచ్చు. మీ శిశువును ఎంగేజ్ చేస్తూ, మాట్లాడుతూ ఉంటే మసాజ్ సమయంలో బేబీ ఆనందంగా ఉంటుంది.

    4. ఒకే సమయంలో మసాజ్ (Massage Daily in Same Time)

    రోజూ ఒకే సమయంలో మసాజ్ చేస్తూ ఉండటం మంచిది. మర్దన చేసే వేళల్ని మార్చకూడదు. రోజూ ఒకే షెడ్యూల్‌లో ఉండటం వల్ల పిల్లలు రొటీన్‌కు అలవాటు పడతారు. మసాజ్ చేసే సమయానికి సౌకర్యవంతంగా ఉంటారు.

    5. అదనపు నూనెని తుడవండి (Remove Extra Oils After Massage)

    మసాజ్ పూర్తైన తర్వాత శిశువు అరచేతులు, వేళ్లకు ఉన్న నూనెను తుడవాలి. పిల్లలు చేతుల్ని, వేళ్లని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఇది చేయడం తప్పనిసరి. శిశువుకు సురక్షితంగా ఉండే నూనె మాత్రమే ఉపయోగించాలి. పిల్లలకు మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీ శిశువుతో బంధాన్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మీరు ఎన్ని రోజులైనా మర్దన కొనసాగించవచ్చు. బేబీ మసాజ్‌కు సంబంధించి మీకు ఏవైనా సందేహాలు, సమస్యలు ఉంటే మీ డాక్టర్‌తో మాట్లాడాలి.

    Tags:

    Massage for babies in telugu, Best massage oils in telugu, How to massage newly born baby in telugu, How to give best massage time to your baby in telugu, Baby Massaging Tips and Techniques That'll Help All New Moms in English, Baby Massaging Tips and Techniques That'll Help All New Moms in Tamil, Baby Massaging Tips and Techniques That'll Help All New Moms in Bengali.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.