hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article continues after adveritsment

Article continues after adveritsment

  • Home arrow
  • Hair Problems arrow
  • గర్భధారణ సమయంలో జుట్టు రాలడం సహజమేనా? (Is Hair Fall Normal in Pregnancy in Telugu?) arrow

In this Article

    గర్భధారణ సమయంలో జుట్టు రాలడం సహజమేనా?  (Is Hair Fall Normal in Pregnancy in Telugu?)

    Hair Problems

    గర్భధారణ సమయంలో జుట్టు రాలడం సహజమేనా? (Is Hair Fall Normal in Pregnancy in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    Article continues after adveritsment

    మీ జీవితంలో మర్చిపోలేని దశ అయిన గర్భధారణ సమయంలో ఉన్నపుడు అకస్మాత్తుగా జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారా? త్వరలోనే మీ తలపై బట్టతల మచ్చలు కనిపిస్తాయని మీరు ఆందోళన చెందుతున్నారా? మీరు ఇప్పటికే చికిత్సను ప్రయత్నించి సరైన ఫలితాలు అందించే చికిత్స కోసం వెతుకున్నారా? మీ జీవితంలోని ఈ దశలో జుట్టురాలడం అనేది సర్వసాధారణం. ముఖ్యంగా గర్భధారణ దశలో జుట్టురాలడం కామన్. ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని సార్లు ఈ సమస్య రావడం వెనుక కారణాలు సమస్యాత్మకంగా ఉండవచ్చు. అయితే ఈ సమస్యను కొన్ని సార్లు చాలా సులభంగా నివారించుకోవచ్చు. చాలా మంది గర్భవతులు తమ గర్భధారణ సమయంలో చాలా మందంగా ఉండే అందమైన జుట్టుతో ఉంటారు. కానీ వారందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. కొంత మంది గర్భవతిగా ఉన్న సమయంలో జుట్టురాలే సమస్యను గురించి కూడా ఫిర్యాదు చేస్తారు. ఈ సమయంలో జుట్టు పొడిగా మారుతోందని కూడా కొంత మంది ఫిర్యాదు చేస్తారు.

    గర్భధారణ సమయంలో జుట్టు రాలడానికి గల కారణాలు ఏమిటి? (What Are The Reasons For Hair fall During Pregnancy in Telugu?)

    జుట్టు రాలడం అనేది సాధారణం అయినప్పటికీ చాలా మంది మహిళలు దాని గురించి నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ప్రతి రోజు 200 కంటే ఎక్కువ జుట్టు కనుక రాలితే అది తీవ్రమైన సమస్యగా మారుతుంది. గర్భధారణ సమయంలో జుట్టుసన్నబడటం అనేది అతి సాధారణం కానప్పటికీ.. అది కింది కారణాల వల్ల అది సంభవించవచ్చు.

    1. హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance in Telugu)

    మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు సపోర్ట్ కోసం హార్మోన్లు మారుతూ ఉంటాయి. ఈ మార్పుల వల్లే మీ జుట్టు సన్నబడడం లేదా జుట్టు రాలడం సంభవిస్తూ ఉంటుంది. షాక్ మరియు ఒత్తిడితో కూడిన ఈ పరిస్థితిని టెలోజెన్ ఎఫ్లూవియం అని పిలుస్తారు. ఇది మీ జుట్టులోని 30 శాతం భాగాన్ని విశ్రాంతి దశలో ఉంచుతుంది. ఈ దశలో మీ జుట్టు ఎక్కువగా రాలుతుంది. ఈ సమస్యను నివారించేందుకు మీరు మీ వైద్యుడిని సంప్రదించి మరింత తెలుసుకోవాలని మీరు భావించవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటీ? దీన్ని ఎలా నయం చేయాలి?

    2. ఆరోగ్య సమస్యలు (Health Problems)

    థైరాయిడ్ మరియు ఐరన్ లోపం వంటి ఆరోగ్య సమస్యలు కూడా గర్భధారణ సమయంలో టెలోజెన్ ఎఫ్లూవియమ్​కు దారితీస్తాయి. గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత వలన మీరు మీ జుట్టును చాలా వేగంగా కోల్పోతారు. మీరు గర్భధారణ సమయంలో జుట్టు రాలడాన్ని ఎలా ఆపాలో తెలియకపోతే.. మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కారణం మరియు సప్లిమెంట్ల గురించి మరింత తెలుసుకునేందుకు మీరు మీ ఆరోగ్య సంరక్షుడిని సంప్రదించాలి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రసవానంతర థైరాయిడిటిస్: కారణాలు, లక్షణాలు & చికిత్సలు

    గర్భధారణ సమయంలో హెయిర్ ఫాల్​ను అరికట్టడం ఎలా? (How To Prevent Hair Fall In Pregnancy in Telugu?)

    ఫలితాలు అనేవి మీకు జుట్టు రాలడం అనేది మీకు ఏ సమస్య వల్ల వచ్చిందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే మీరు జుట్టు రాలడం మరియు జుట్టు పల్చబడడం తగ్గించుకునేందుకు మీరు ఈ కింది చిట్కాలను వాడొచ్చు.

    1. మీ దృష్టిని రుచికరమైన ఆహారం నుంచి ఆరోగ్యకరమైన ఆహారం వైపుకు మళ్లించుకోండి. మీ శరీరం యొక్క పోషకాహార అవసరాలకు అనుగుణంగా మీరు తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోండి. అంతే కాకుండా జుట్టు పెరుగుదలకు అవసరమైన సప్లిమెంట్లను కూడా తీసుకోవాలి. మీరు మీ ఆరోగ్యసంరక్షణ ప్రదాతను సంప్రదించిన తర్వాత మాత్రమే మీరు సప్లిమెంట్లను తీసుకోవాలి.

    2. మీ జుట్టుతో సున్నితంగా ఉండండి. మీ జుట్టుకు టైట్ హెయిర్ బ్యాండ్స్ వేయడం, లాగి కట్టడం, బిగుతుగా ఉండే స్టైల్స్​ను నివారించుకోవాలి. మీరు ఈ సమయంలో జుట్టును బిగుతుగా వేసుకోవడం లేదా హై పోనీలు వేసుకోవడం మానుకోవాలని అనుకోవచ్చు. అందుకోసం మీరు వదులుగా ఉన్న బ్రెయిడ్స్ లేదా తక్కువ పోనీలను కూడా ట్రై చేయొచ్చు.

    3. మీ జుట్టును తరచుగా హెర్బల్ మరియు న్యాచురల్ షాంపూలతో కడగాలి. అంతే కాకుండా పెద్ద పళ్లు ఉన్న దువ్వెన సహాయంతో మీ జుట్టు చిక్కులను విడదీయండి. జుట్టు రాలే సమస్యలను నివారించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన షాంపూలు నేడు మార్కెట్లో అనేకం దొరుకుతున్నాయి.

    4. మీ జుట్టును బలోపేతం చేసేందుకు ఒక సహజమైన లేదా ఆయుర్వేద యాంటీ హెయిర్ ఫాల్ షాంపూని ఉపయోగించాలి. ఇది మీకు చాలా సహాయకారిగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కొబ్బరినూనె చాలా ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిని తగ్గించుకునేందుకు మీరు అనేక ఇంటి చిట్కాలను (నివారణలు) కూడా ఉపయోగించవచ్చు. మీరు మెంతి గింజలతో కొబ్బరి నూనెను మరిగించి.. మీ జుట్టు కుదుళ్లకు అప్లై చేయవచ్చు. ఆముదం కలపడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో జుట్టు రాలడం: కారణాలు మరియు చికిత్స

    హెయిర్ ఫాల్ కోసం ఉత్తమమైనదిగా ఆర్గానిక్ ఉత్పత్తులు ఉన్న షాంపూ పరిగణించబడుతుంది. అది హానికరమైన రసాయనాలు లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇది సరసమైన ధరకు కూడా లభించాలి. నేడు మనకు మార్కెట్లో అనేక హెయిర్ కేర్ ప్రొడక్టులు అందుబాటులో ఉన్నప్పటికీ నాణ్యతలో రాజీపడని ఉత్పత్తిని మీరు కొనుగోలు చేయడం ఉత్తమం.

    మంచి గర్భధారణ యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్​ను ఎలా ఎంచుకోవాలి? (How to Pick a Good Pregnancy Anti-Hair Fall Hair Oil in Telugu?)

    మీరు ఏదైనా యాంటీ హెయిర్​ఫాల్ షాంపూను వాడాలని అనుకునే ముందు అందులో వాడే పదార్థాలు ఏమిటనే విషయం గురించి తెలుసుకునేందుకు దాని లేబుల్​ను మీరు చదవాల్సి ఉంటుంది. ఉత్తమంగా పని చేసే ప్రెగ్నెన్సీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూలో భృంగరాజ్ మరియు మేతి ఉండాలి. ఈ కింది సహజ నూనెలు కొన్ని అద్భుతమైన యాంటీ హెయిర్ ఫాల్ లక్షణాలను కలిగి ఉంటాయి.

    1. ఉసిరి నూనె (Amla oil): ఇది మీ జుట్టును కుదుళ్ల నుంచి బలపరిచి పటిష్టంగా మారుస్తుంది. చుండ్రును నయం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మీరు దురద సమస్యను తగ్గించుకోవాలని అనుకుంటే.. ఈ నివారణను ప్రయత్నించవచ్చు.

    2. ఆముదం నూనె (Castor Oil): ఇది మీ స్కాల్ప్ యొక్క pH విలువను సమతుల్యం చేస్తుంది. మీ జుట్టు పెంపకాన్ని పెరిగేలా చేస్తుంది. జుట్టు పెరుగుదలను పెంచుకునేందుకు ఆముదం నూనెను కలపడం ఉత్తమం.

    3. సన్​ఫ్లవర్ ఆయిల్ (Sunflower oil): ఇది మీ స్పాల్ప్​ను ఆరోగ్యకరంగా మార్చడంలో చాలా ప్రసిద్ధి చెందింది. మీ జుట్టును మెరిసేలా చేస్తుంది. మీ జుట్టును కొన్ని రకాల క్యారియర్ ఆయిల్స్​తో కలపడం చాలా ముఖ్యం.

    4. ఆర్గాన్ ఆయిల్ (Argan Oil): ఆర్గాన్ ఆయిల్​లో ఉన్న కొవ్వు ఆమ్లాలు మీ జుట్టు మెరిసేతనాన్ని రిస్టోర్ చేసి.. మీ జుట్టును బలంగా మరియు సిల్కీగా తయారు చేస్తుంది. అంతే కాకుండా ఈ ఆయిల్ మీ స్కాల్ప్​లోకి చొచ్చుకుపోయి… మీ జుట్టును కుదుళ్ల నుంచి బలంగా తయారు చేస్తుంది. జుట్టు రాలే సమస్యల నుంచి మిమ్మల్ని విముక్తులను చేస్తుంది.

    5. ఆలివ్ ఆయిల్ (Olive oil): ఆలివ్ ఆయిల్ యొక్క మాయిశ్చరైజింగ్ గుణాలు మీ జుట్టును ఎప్పుడూ లేనంత సాఫ్ట్​గా చేస్తాయి. సన్నని జుట్టు లేదా తక్కువ జుట్టు ఉన్నవారికి ఇది అనువైనది.

    6. ఆనియన్ సీడ్ ఆయిల్ (Onion seed oil): ఆనియన్ హెయిర్ ఆయిల్ జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. స్కాల్ప్​పై దురద లేకుండా ఉంచుతుంది. ఆనియన్ సీడ్ హెయిర్ ఆయిల్​ను నేడు చాలా మంది గర్భిణీ స్త్రీలు సాధారణంగా ఉపయోగిస్తారు.

    ఈ నేచురల్ హెయిర్ ఆయిల్స్ జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. కానీ మీరు వీటిలో ఉత్తమమైన వాటిని ఉపయోగించినపుడు మాత్రమే మంచి మరియు వేగవంతమైన ఫలితాలను పొందుతారు. అంతే కాకుండా కొన్ని రకాలైన స్కాల్ప్​ కొన్ని నిర్దిష్ట హెయిర్ ఆయిల్స్​తో అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు ఒక రకమైన నూనెతో హెయిర్ ఫాల్ ట్రీట్​మెంట్​ను ప్రారంభించిన తర్వాత మీరు కొన్ని రకాలైన నెగటివ్ ఫలితాలను గనుక గమనించినట్లయితే.. మీరు మీ ఆరోగ్యసంరక్షణ ప్రదాత నుంచి తక్షణ సహాయం పొందవచ్చు.

    నేడు మార్కెట్లో అనేక రకాల మంచి స్వభావాలు గల నూనెలు లభిస్తున్నాయి. మీరు సేంద్రియ ఉత్పత్తులను మాత్రమే కలిగి ఉన్న ఉత్పత్తి కోసం చూస్తున్నట్లయితే… కెమికల్ లెవెల్స్ ఎక్కువగా లేని షాంపూను ఉపయోగించుకోవాలని నిర్దారించుకోవాలి. రసాయన స్థాయిలు అధికంగా ఉంటే అవి మీ శిశువు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకోసమే అధిక స్థాయిలో రసాయన స్థాయిలను కలిగి ఉన్న ఉత్పత్తులను నివారించండి. మీ వైద్యుడితో మాట్లాడడం, చికిత్సలను క్రమం తప్పకుండా అనుసరించడం ఉత్తమం.

    చివరగా.. (Conclusion)

    గర్భధారణ సమయంలో జుట్టు పల్చబడడం, జుట్టు రాలడం అనేది సాధారణం కాదు. కానీ మీరు దానిని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఈ సమస్య కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఆరోగ్యకరమైన డైట్ పాటిస్తూ సహజ నూనెలతో ప్రతి రోజు మీ జుట్టుకు క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వలన మీరు మీ అందమైన జుట్టును తిరిగి పొందవచ్చు. మీ ఆరోగ్య సంరక్షకుడిని క్రమం తప్పకుండా సంప్రదించడం వలన జుట్టు రాలే సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది. చాలా సందర్భాలలో జుట్టు రాలే సమస్య అనేది తగ్గిపోపతుంది. చాలా మంది స్త్రీలు తమ మునుపటి జుట్టును పొందుతారు. సాధారణ స్థితికి చేరుకుంటారు.

    Tags:

    Hair fall during pregnancy in telugu, Is hair fall is common during pregnancy in telugu, Why do pregnants face hair fall during pregnancy in telugu, Reasons for hair fall during pregnancy in telugu, Treatment for hair fall during pregnancy in telugu.

    Anti-Hairfall Onion Hair Serum - 50 ml

    Strengthens Hair | Eases Detangling | Keeps Hair Healthy | Nourishes Hair

    ₹ 159

    4.3

    (101)

    6483 Users bought

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.