Want to raise a happy & healthy Baby?
Diet & Nutrition
3 November 2023 న నవీకరించబడింది
గర్భధారణ సమయంలో రాగిని తినడం తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ధాన్యాన్ని అనేక దక్షిణాసియా వంటకాల్లో భోజనంలో పోషక విలువలను పెంచేందుకు ఉపయోగిస్తారు. రాగిలో ప్రొటీన్లు, మినరల్స్, కాల్షియం, ఐరన్, సహజ కొవ్వులు ఉంటాయి. ఈ పోషకాలు పిండం యొక్క సరైన పెరుగుదలకు దోహదం చేస్తాయి. తల్లి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.
రాగి భారతదేశంలో ప్రసిద్ధి చెందిన చిరుధాన్యం. దీన్ని వివిధ రకాల వంటలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ చిరుధాన్యం ఆవపిండిని పోలి ఉంటుంది. దీనిని ఆంగ్లంలో ఫింగర్ మిల్లెట్ అంటారు. రాగి పిండిని దోసెలు, ఇడ్లీలు, రాగి అడై, గంజి తయారీకి ఉపయోగిస్తారు. రాగి అనేది పాలిష్ చేయని చిరుధాన్యం. ఎందుకంటే ఇది ప్రాసెస్ చేయడానికి చాలా చిన్నది. రాగిలో అధిక ఐరన్ మరియు కార్బోహైడ్రేట్ కంటెంట్ ప్రతి ఒక్కరికీ ఆదర్శవంతమైన అల్పాహారం.
రాగిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొంతమంది గర్భిణీ స్త్రీలు దీనిని తినకుండా ఉంటారు. ఎందుకంటే గర్భధారణ సమయంలో రాగి తింటే బిడ్డ నల్లబడుతుందని వారు నమ్ముతారు. ఇది అసంబద్ధ పురాణం. ఎందుకంటే రాగి శిశువు యొక్క ఛాయపై ప్రభావం చూపుతుందని ఎటువంటి శాస్త్రీయ రుజువు లేదు. శిశువు యొక్క ఛాయ పూర్తిగా వారు వారసత్వంగా పొందే జన్యు లక్షణాలపై ఆధారపడి ఉంటుంది.
నిజానికి, రాగి ప్రసవానంతరం కూడా తల్లులకు సిఫార్సు చేయబడింది. ఎందుకంటే ఇది మలబద్ధకం నుండి ఉపశమనానికి, పాల సరఫరాను మెరుగుపరచడానికి మరియు నిద్రలేమిని నయం చేయడానికి సహాయపడుతుంది. కాకపోతే ముందుజాగ్రత్త చర్యగా.. గర్భిణీ స్త్రీలు రాగిని తమ ఆహారంలో చేర్చుకునే ముందు వారి వైద్యుడిని సంప్రదించాలి.
అవసరమైన పోషకాలతో నిండినందున రాగిని శక్తివంతమైన పదార్ధంగా పరిగణిస్తారు.
గర్భధారణ సమయంలో రాగి యొక్క ప్రయోజనాలను తక్కువ అంచనా వెయ్యలేము. ఎందుకంటే ఇది తల్లి, బిడ్డలకు అద్భుతమైన సూపర్ ఫుడ్. రాగి యొక్క అధిక పోషక విలువలు తల్లికి అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడతాయి. సరైన పిండం అభివృద్ధిలో సహాయపడతాయి.
గర్భధారణ సమయంలో రాగి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. అవసరమైన పోషకాల మూలం:
రాగిలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు సహజ కొవ్వులు ఉంటాయి. గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడటానికి మరియు పిండం సరిగ్గా అభివృద్ధి చెందుతోందా అని నిర్ధారించడానికి ఈ పోషకాలు చాలా ముఖ్యమైనవి.
2. నిద్రలేమిని నియంత్రిస్తుంది:
రాగిలోని అమినో యాసిడ్లు గర్భిణీ స్త్రీలకు ప్రెగ్నెన్సీ హార్మోన్ల వల్ల కలిగే నిద్రలేమితో పోరాడటానికి సహాయపడతాయి.
3. తల్లిపాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది:
రాగిలో అమినో యాసిడ్లు, కాల్షియం, ఐరన్ అధికంగా ఉన్నందున.. ఇది చనుబాలివ్వడాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఈ పోషకాలు రాగిని ప్రసవానంతర తల్లులకు తమ బిడ్డలకు పాలు పట్టేందుకు అవసరమైన ఆహారంగా చేస్తాయి.
4. గర్భధారణ మధుమేహాన్ని నివారిస్తుంది:
గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న కాబోయే తల్లులకు వైద్యులు రాగిని సిఫార్సు చేస్తారు. ఎందుకంటే రాగిలో పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా తగ్గించడంలో సహాయపడుతుంది.
5. ఒత్తిడిని దూరం చేస్తుంది:
గర్భిణీ స్త్రీలలో ఎక్కువ ఒత్తిడిలో ఉన్నవారు లేదా డిప్రెషన్‌కు గురయ్యే వారు రాగిని తమ ఆహారంలో చేర్చుకోవాలి. రాగిలో ఉండే అమినో యాసిడ్‌లు ఒత్తిడి, డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఒత్తిడిని తగ్గించడం అనేది రాగి అందించే ముఖ్యమైన, కానీ తరచుగా పట్టించుకోని ఆరోగ్య ప్రయోజనం.
6. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది:
గర్భధారణ సమయంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరికీ గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు రక్తపోటు, ఇతర వైద్య సమస్యలకు దారితీయవచ్చు. రాగిలో లెసిథిన్ మరియు మెథియోనిన్ మంచి స్థాయిలో ఉన్నాయి. ఇది తల్లిలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
7. రక్తహీనతను నివారిస్తుంది:
గర్భంలో రక్తహీనతను నివారించడం చాలా అవసరం. ఎందుకంటే ఇది పిండం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. రాగిలో అధిక ఐరన్ మరియు విటమిన్ సి స్థాయులు ఉంటాయి. ఇవి గర్భధారణ సమయంలో రక్తహీనతను నివారిస్తాయి.
రాగి అనేది పోషకాలు అధికంగా ఉండే ఆహారం. దీన్ని ఒక్క రోజులో ఎంత తినాలి అనేదానికి నిర్ణీత మోతాదు లేదు. కాకపోతే.. గర్భిణీ స్త్రీలు వారి ఆహారం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు తీసుకునే ఆహారం వారి ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. గర్భధారణ సమయంలో డాక్టర్ సిఫార్సు చేసిన ఆహార ప్రణాళికను అనుసరించడం చాలా ముఖ్యం.
రాగి ని అధికంగా తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో కడుపు ఉబ్బరం, విరేచనాలు, ఇతర జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. మూత్రపిండాల వ్యాధి లేదా థైరాయిడ్ అసమతుల్యత వంటి ముందస్తు వైద్య పరిస్థితులు ఉన్న గర్భిణీ స్త్రీలు కూడా రాగికి దూరంగా ఉండాలి. రాగిలోని అధిక ప్రోటీన్ కంటెంట్ మరియు గోయిట్రోజెనిక్ సమ్మేళనాలు ఈ వైద్య పరిస్థితులను మరింత పెంచుతాయి. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య సమస్యలను నివారించడానికి రాగి తీసుకునే ముందు తప్పక డాక్టరును సంప్రదించాలి.
ముగింపు
రాగి గర్భిణీ స్త్రీలకు అద్భుతాలు చేసే అద్భుతమైన సూపర్ ఫుడ్. ఇది తల్లి మరియు బిడ్డకు అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. రాగి గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వివిధ వంటకాల్లో దీన్ని ఎలా ఉపయోగించాలో మరింత తెలుసుకోవడానికి మైలో యాప్‌ని సందర్శించండి.
1. Kumar A, Metwal M, Kaur S, Gupta AK; et al. (2016). Nutraceutical Value of Finger Millet [Eleusine coracana (L.) Gaertn.], and Their Improvement Using Omics Approaches. Front Plant Sci.
2. Shobana S, Krishnaswamy K, Sudha V; et al. (2013). Finger millet (Ragi, Eleusine coracana L.): a review of its nutritional properties, processing, and plausible health benefits. Adv Food Nutr Res.
Tags
Ragi During Pregnancy in English, Ragi During Pregnancy in Hindi, Ragi During Pregnancy in Bengali, Ragi During Pregnancy in Tamil
Yes
No
Written by
Kakarla Sirisha
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Diapers & Wipes | Disposable Diapers | Baby Wipes | Cloth Diapers | Diapers & Wipes - Baby Care | Hair | Skin | Bath & Body | Diapers & Wipes - Baby Wellness | Diaper Rash | Mosquito Repellent | Anti-Colic | Diapers & Wipes - Baby Gear | Stroller | Dry Sheets | Bathtubs | Potty Seats | Carriers | Diaper Bags | Carry Nest | Maternity dresses | Stretch Marks Kit |