hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • Pregnancy Journey arrow
  • గర్భధారణ సమయంలో చేపలు: ప్రయోజనాలు మరియు రిస్కులు | Fish in Pregnancy: Benefits & Risks in Telugu arrow

In this Article

    గర్భధారణ సమయంలో చేపలు: ప్రయోజనాలు మరియు రిస్కులు | Fish in Pregnancy: Benefits & Risks in Telugu

    Pregnancy Journey

    గర్భధారణ సమయంలో చేపలు: ప్రయోజనాలు మరియు రిస్కులు | Fish in Pregnancy: Benefits & Risks in Telugu

    3 November 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    గర్భిణీ స్త్రీలు తరచుగా వారు తినే కొన్ని ఆహారాలు, వాటి భద్రత గురించి అయోమయంలో ఉంటారు. అవి ఆరోగ్యకరమా కాదా అనేది వారికి ఖచ్చితంగా తెలియదు. వాటిలో చేపలు ఒకటి. చేపలు నిస్సందేహంగా ఆరోగ్యకరమైనవి, కానీ గర్భధారణ సమయంలో ఇది సురక్షితమైనవేనా, తినడం అనేది ఉపయోగకరమా కాదా అనే వివరాలకోసం ఈక్రింది విశ్లేషణద్వారా తెలుసుకోవచ్చు.

    గర్భధారణ సమయంలో చేపలు తినడం సురక్షితమేనా? (Is eating fish safe during pregnancy in Telugu)

    మనం వండుకొనే చేప సరైనదే అయితే గర్భధారణ సమయంలో చేపలు తినడం సురక్షితమే. చేపలు కాల్షియం, విటమిన్ డి, ఇనుము, జింక్, కోలిన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మరియు అయోడిన్ వంటి అద్భుతమైన పోషకాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా చేపల్లో లీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చేపల్లోని ఐరన్, జింక్ శిశువుల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు శిశువు మెదడు ఎదుగుదలకు తోడ్పడతాయని శాస్త్రీయ ఆధారాలున్నాయి. చేపలు తినడం గుండె ఆరోగ్యానికి మంచిదని కూడా నిరూపించబడింది. చేపలు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటంటే, ఇది ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిచటమే కాక ఊబకాయాన్ని, కోలిన్ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది.

    గర్భధారణ సమయంలో చేపలు తినడం మంచిదే కానీ, కొన్ని చేపల్లో పాదరసం అధికంగా ఉంటుంది. పాదరసం అధికంగా ఉండే చేపలను తరచుగా తినడంవల్ల ఆ పాదరసం వంటి పదార్థం రక్తప్రవాహంలో పేరుకుపోయే అవకాశం ఉంది. పాదరసం చేరడం శిశువు యొక్క నాడీ వ్యవస్థను, మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, చేపలలో పాదరసం తక్కువగా ఉన్నంత వరకు గర్భధారణ సమయంలో చేపలు తినడం మంచిదే. మంచి చేపలను ఎంపికచేసుకుని, వారానికి రెండుమూడుసార్లు తినడం సురక్షితం. అలాగే తల్లికి, పిల్లలకు ఆరోగ్యకరం కూడా. అధిక పాదరసం కంటెంట్ ఉన్న చేపలను నివారించడం చాలా ముఖ్యం.

    గర్భధారణ సమయంలో ఏ చేపలు తింటే మంచిది? (Which fish are good for pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో తినదగిన చేపల వివరాలు:

    1. సాల్మన్ (Salmon)

    100 గ్రాముల సాల్మన్ చేపలో సుమారుగా 2200 మి.గ్రా ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇతర చేపలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఇందులో 526 మిల్లీగ్రాముల విటమిన్ డి, 91 మిల్లీగ్రాముల కోలిన్ ఉంటాయి. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు అభివృద్ధికి మంచిది, విటమిన్ డి ఎముక ఆరోగ్యానికి అవసరం మరియు కోలిన్ శిశువు యొక్క వెన్నుపాము అభివృద్ధికి సాయపడతాయి.

    Article continues below advertisment

    2. రొయ్యలు (Shrimp)

    సాల్మన్ తరవాతి స్థానం రొయ్యలది. 500 మి.గ్రా ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, 81 మి.గ్రా కోలిన్, 48 మి.గ్రా సెలీనియం మరియు 20 మి.గ్రా ప్రోటీన్. సెలీనియం ఉంటాయి. థైరాయిడ్ పనిచేయకపోవడం, ప్రసవానంతర మాంద్యం, గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం ప్రమాదం వంటివాటిని రొయ్యలు తగ్గిస్తాయి. శిశువు యొక్క చర్మం, జుట్టు మరియు కండరాలకు ప్రోటీన్ చాలా అవసరం.

    3. అలాస్కా పోలాక్ (Alaska Pollock)

    వీటిలో 500 మి.గ్రా ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, 92 మి.గ్రా కోలిన్, 51 మి.గ్రా విటమిన్ డి మరియు 44 మి.గ్రా సెలీనియం ఉంటాయి. అలాస్కా పొలాక్ గర్భధారణ సమయంలో తినదగిన ఉత్తమ చేపలలో ఒకటి.

    4. తయారుగా ఉంచిన ట్యూనా (Canned Tuna)

    కేన్లలో తయారుగా ఉన్న ట్యూనాలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఈ కేన్డ్ ట్యూనా (100 గ్రా) చేప గర్భిణీ స్త్రీ యొక్క రోజువారీ ప్రోటీన్ అవసరాలలో 32% అందిస్తుంది. ఇది 197 మి.గ్రా డి.హెచ్.ఏ ను కూడా కలిగి ఉంటుంది, డి.హెచ్.ఏ ఒక రకమైన ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్.

    5. పీత (Crab)

    ఇందులో 400 మి.గ్రా ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, 81 మి.గ్రా కోలిన్ మరియు 36 మి.గ్రా మెగ్నీషియం ఉన్నాయి. పిండం పెరుగుదలకు మెగ్నీషియం అవసరం.

    గర్భవతులు తినడానికి పనికివచ్చే ఇతర చేపలు:

    • క్రా ఫిష్ (Crawfish)
    • క్యాట్ ఫిష్. (Catfish)
    • ఫ్లౌండర్. (Flounder)
    • హెర్రింగ్. (Herring)
    • ఆంకోవీ. (Anchovy)
    • టిలాపియా. (Tilapia)
    • ట్రౌట్. (Trout)
    • సార్డైన్స్ (Sardines)
    • స్కాల్ప్స్. (Scallops)

    గర్భధారణ సమయంలో తినకూడని చేపలు (Fish to avoid during pregnancy in Telugu)

    గర్భిణీ స్త్రీలు అధిక పాదరసం కంటెంట్ ఉన్న చేపలకు దూరంగా ఉండాలి. అధిక పాదరసం కంటెంట్ ఉన్న కొన్ని చేపలు క్రింద పేర్కొనబడ్డాయి.

    Article continues below advertisment

    1. స్వోర్డ్ ఫిష్ (Swordfish)

    ఈ చేప పాదరసం యొక్క అత్యధిక వనరు. ఇది 0.995 పిపిఎమ్ పాదరసం కలిగి ఉంటుంది, మరికొన్నింటిలో ఇది 3.2 పిపిఎం వరకు వెళ్ళవచ్చు.

    2. సొర చేప (Shark)

    షార్క్ లో కనిష్ట పాదరసం స్థాయి 0.979 పిపిఎమ్, మరియు గరిష్ట స్థాయి 4.54 పిపిఎమ్.

    3. టైల్ ఫిష్ (Tilefish)

    ఒక టైల్ ఫిష్ లో సగటు పాదరసం కంటెంట్ 1.123 పిపిఎమ్.

    Article continues below advertisment

    4. కింగ్ మకారేల్ (King Mackarel)

    కింగ్ మకారెల్ లో సగటు 0.73 పిపిఎమ్ మరియు కొన్నిసార్లు 1.67 పిపిఎమ్ కు చేరుకుంటుంది.

    5. బింగే ట్యూనా (Bigeye Tuna)

    ఇది అతి పెద్ద చేప జాతులలో ఒకటి; దాని సగటు పాదరసం కంటెంట్ 0.689 పిపిఎమ్ మరియు కొన్ని చేపలలో 1.816 పిపిఎమ్ వరకు వెళ్ళవచ్చు.

    6. ఆరెంజ్ రఫ్లీ (Orange Roughly)

    Article continues below advertisment

    గర్భిణీ స్త్రీలు దీనిని కూడా వాడకూడదు. ఎందుకంటే ఇది సగటు పాదరసం కంటెంట్ 0.571 పిపిఎం మరియు గరిష్టంగా 1.12 పిపిఎం కలిగి ఉంటుంది.

    7. మార్లిన్ మరియు చిలీ సీ బాస్ (Marlin and Chilean sea bass)

    ఇవి గణనీయంగా అధిక పాదరసం కంటెంటును కలిగి ఉంటాయి. ఇవి కూడా గర్భధారణ సమయంలో నివారించాల్సినవే.

    గర్భధారణ సమయంలో చేపలు తినడంలో జాగ్రత్త లేకపోతే వచ్చే ప్రమాదం (Risk of eating fish during pregnancy in Telugu)

    సరైన చేపలను ఎంచుకుని సరిగ్గా వండుకుంటే చేపలు తినడం ప్రమాదకారి కాదు. కాని సరిగా జాగ్రత్త తీసుకోకపోతే వచ్చే ప్రమాదాలు ఏమిటి?

    • సొరచేపలు, కింగ్ మాకేరెల్, స్వోర్డ్ ఫిష్, టైల్ ఫిష్ మొదలైన పెద్ద చేపలలో పాదరసం శాతం ఎక్కువగా ఉంటుంది. అధిక పాదరసం కంటెంట్ బిడ్డ నాడీ వ్యవస్థను, మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.
    • సుషి, ఓస్టెర్స్ మరియు షెల్ఫిష్ వంటి వండని చేపలను తినడం ప్రమాదకరం, ఎందుకంటే ఇది బ్యాక్టీరియా మరియు వైరల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
    • తక్కువ ఉడికించిన చేపలను తినడం ఫుడ్ పాయిజనింగుకు కారణమవుతుంది. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని నివారించడానికి చేపలను ఉడకబెట్టాలి, కాల్చాలి లేదా బాగా ఆవిరి చేయాలి.
    • చాలా సురక్షితమైనవిగా లెక్కింపబడితే తప్ప స్థానిక జలాల నుండి వచ్చే చేపలను వాడరాదు. నీటిలో హానికరమైన రసాయనాలు ఉంటే, చేపలు కూడా వాటిని కలిగి ఉంటాయి.
    • చేపలను ప్రెగ్నెన్సీ డైట్ లో భాగం చేసుకోవచ్చు. అధిక పాదరసం కలిగిన చేపలు, వండని మరియు తక్కువ వండిన చేపలను నివారించినట్లయితే చేపలు తినడం సురక్షితం.
    • గర్భిణీ స్త్రీలు ఏదైనా ఆహారం, మందులు లేదా కఠినమైన శారీరక కార్యక్రమాలను చేర్చడానికి లేదా మినహాయించడానికి ముందు శిక్షణ పొందిన వైద్య నిపుణుడిని సంప్రదించాలి.

    References

    Article continues below advertisment

    1. Bramante CT, Spiller P, Landa M. (2018). Fish Consumption During Pregnancy: An Opportunity, Not a Risk. JAMA Pediatr.

    2. Taylor CM, Emmett PM, Emond AM, Golding J.(2018). A review of guidance on fish consumption in pregnancy: is it fit for purpose? Public Health Nutr.

    Tags

    Is it safe to eat fish during pregnancy in Telugu, Which fish is good for pregnancy in Telugu, Which fish to avoid during pregnancy in Telugu, What are the risks of eating fish during pregnancy in Telugu, Fish In Pregnancy: Benefits and Risks in English, Fish In Pregnancy: Benefits and Risks in Hindi, Fish In Pregnancy: Benefits and Risks in Tamil, ⁠Fish In Pregnancy: Benefits and Risks in Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.