hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Travel & Holidays arrow
  • గర్భంతో మొదటి త్రైమాసికంలో ప్రయాణించడం సురక్షితమేనా? (Is It Safe To Travel In The First Trimester Of Your Pregnancy in Telugu?) arrow

In this Article

    గర్భంతో మొదటి త్రైమాసికంలో ప్రయాణించడం సురక్షితమేనా? (Is It Safe To Travel In The First Trimester Of Your Pregnancy in Telugu?)

    Travel & Holidays

    గర్భంతో మొదటి త్రైమాసికంలో ప్రయాణించడం సురక్షితమేనా? (Is It Safe To Travel In The First Trimester Of Your Pregnancy in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    చాలా మంది గర్భిణీ స్త్రీలలో ఈ రకమైన ఆందోళన కలగడం సర్వ సాధారణం. సరైన జాగ్రత్తలు తీసుకొని, మహిళలు తమ గర్భధారణ సమయంలో సురక్షితంగా ప్రయాణించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మీ వైద్య సంబంధిత రికార్డులు ఎల్లవేళలా మీతోనే ఉంచుకోవాలని తెలుసుకోవాలి. గర్భధారణ తర్వాత మీరు ఇంటిపట్టునే ఉండిపోవాలనేది ఏమి లేదు. మీరు విహారయాత్రకు వెళ్లినా లేదా వ్యాపారపరమైన పర్యటనకు వెళ్లినా, గర్భధారణ సమయంలో ప్రయాణించేటప్పుడు మీరు సురక్షితంగా ఇంకా ఆరోగ్యంగా ఉండేందుకు అనేక మార్గాలు కూడా ఉన్నాయి.

    గర్భంతో మొదటి త్రైమాసికంలో ప్రయాణించడం సురక్షితమేనా? (Is It Safe To Travel In Your First Trimester Of Pregnancy in Telugu?)

    అందుకు సమాధానం అవుననే చెప్పవచ్చు. ఆరోగ్యంగా ఉన్నంత కాలం, గర్భధారణ అనంతరం మొదటి త్రైమాసికంలో ప్రయాణాలు సాగించవచ్చు. గర్భధారణ సమయంలో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. చాలా సందర్భాలలో.. మొదటి త్రైమాసికంలో ప్రయాణించడం సురక్షితం. గర్భధారణ అనంతరం మొదటి త్రైమాసికంలో గర్భస్రావం ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఎలివేటెడ్ రిస్క్ ప్రయాణం చేయకపోయినా కూడా ఉంటుంది. మీకు ఎలాంటి సమస్యలు లేకుంటే, మీరు సౌకర్యంగా ఉన్నంత వరకు ప్రయాణం సురక్షితం. వికారం లేదా నీరసంగా ఉన్నట్లయితే, గర్భధారణ తొలి నెలల్లో ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. గర్భం దాల్చిన ఈ దశలో ప్రయాణాన్ని ఇబ్బందులపాలు చేసే మార్నింగ్ సిక్‌నెస్ ఇంకా నీరసం అనేవి సర్వసాధారణం.

    సాధారణంగా, గర్భం దాల్చిన 14 మరియు 28 వారాల మధ్య ప్రయాణానికి అత్యంత సురక్షితమైనదే కాక సరియైన సమయం. ఈ కాలంలో గర్భధారణతో సంబంధం ఉన్న ప్రమాదాలు సంభవించడం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ సిక్‌నెస్ తగ్గి ఉండవచ్చు. మీ పొట్ట కాస్త పెద్దగా ఇంకా అసౌకర్యంగా ఉండకపోగా.. మీరు ప్రయాణాలు చేసేందుకు తగినంత శక్తిని కలిగి ఉంటారు. మీ ప్రయాణం సురక్షితంగా ఉంచుకొనేందుకు తెలుసుకోవాల్సినవి ఇంకా అవగతం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:

    • ట్రిప్ ప్లాన్ చేసేటప్పటికి మీ గర్భధారణ దశ
    • గర్భధారణ సమయంలో, ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే
    • గర్భధారణ సమయంలో ఎంచుకొనే ప్రయాణ సాధనాలు; కారు, బస్సు, రైలు లేదా విమానం
    • గమ్యాన్ని చేరుకొనేందుకు ప్రయాణించాల్సిన దూరం
    • ప్లాన్ చేసిన ప్రయాణానికి ప్రయాణ బీమా కవరేజీని కలిగి ఉన్నారని నిర్ధారించుకోవడం

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నన్సీ లేత నెలలలో జంపింగ్ చేయడం గర్భస్రావంకు దారి తీస్తుందా?

    గర్భధారణ సమయంలో ఎప్పుడు ప్రయాణించకూడదు? (When Can You Not Travel During Pregnancy in Telugu?)

    గర్భధారణ సమయంలో ప్రయాణాలలో ప్రమాదాలు పెంచే కొన్ని నిర్దిష్ట లక్షణాలు, పరిస్థితులు ఇంకా సందర్భాలు ఉన్నాయి, వీటిని పరిగణనలోకి తీసుకోవాలి. వాటిలో కొన్ని ఇక్కడ ఉన్నాయి:

    • యోని నుండి స్రావాలు
    • మునుపు ఎప్పుడైనా జరిగిన గర్భస్రావం లేదా ఎక్టోపిక్ గర్భం
    • గుండె ఆరోగ్య పరిస్థితి లేదా రక్తప్రసరణ లోపంతో గుండె వైఫల్యం
    • ముందస్తు ప్రసవం
    • ఒకరి కన్నా ఎక్కువ శిశువులతో ఉన్న గర్భం
    • తీవ్రమైన రక్తహీనత
    • సజీవ టీకా ఆవశ్యకత, ఇది గర్భధారణ సమయంలో సురక్షితం కాదు
    • వైరస్ సంక్రమణ ఉన్న గమ్యస్థానాలకు ప్రయాణం
    • అనారోగ్యంగా ఇంకా అలసిపోయినట్లు అనిపించినప్పుడు

    మొదటి త్రైమాసికంలో మీ యాత్రను బుక్ చేసుకునే ముందు మీ ప్రయాణ ప్రణాళికల గురించి మీ వైద్యునితో మాట్లాడటం ఎంతో ముఖ్యం. ప్రయాణం సరైన ఎంపికా? కాదా? అని నిర్ణయించుకోవడంలో ఇంకా గర్భధారణ సమయంలో తీసుకోవడానికి సురక్షితమైన టీకాలు తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడంలో వారు సహాయపడగలరు.

    గర్భధారణ తొలినాళ్లలో విమాన ప్రయాణానికి టిప్స్ (Tips For Flying During Early Pregnancy in Telugu)

    ఆరోగ్యకరమైన గర్భాన్ని కలిగివుంటే, సాధారణంగా విమాన ప్రయాణాలు సురక్షితం. అయితే.. ఈ క్రింది చిట్కాలు కూడా సహాయపడవచ్చు:

    • ప్రయాణానికి ముందు హెల్త్ చెకప్ చేయించుకోవాలి: హైపర్‌టెన్షన్, సికిల్ సెల్ వ్యాధి, అకాల ప్రసవ చరిత్ర ఇంకా అసాధారణతలు మాయ లాంటి అధిక-ప్రమాదకర గర్భధారణ పరిస్థితులు ఉన్నవారికి ప్రయాణాలు చేయడం సిఫారసు చేయబడదు. అలాగే, గర్భిణీ స్త్రీలు అంతకు ముందు గుండె జబ్బులు ఉన్నవారు విమాన ప్రయాణం చేసే ముందు వారి వైద్యుడిని సంప్రదించాలి.
    • నడుస్తూ ఉండాలి: విమాన ప్రయాణీకులందరికీ అత్యంత సాధారణ సమస్య రక్తం గడ్డకట్టడం లేదా థ్రాంబోసిస్ ఏర్పడటం, ముఖ్యంగా సుదీర్ఘ విమానాల ప్రయాణాలలో ఇలా జరగవచ్చు. విమాన ప్రయాణాలు చేసే గర్భిణీ స్త్రీలు ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వారు తమ కాళ్లను కదలిస్తూ ఉండాలి. ఇంకా క్యాబిన్‌లో అప్పుడ్డప్పుడు నడుస్తూ షికారు చేయాలని వారికి సిఫార్సు చేస్తారు. ఇంకా డాక్టర్ చేత సిఫార్సు చేయబడ్డ సరైన సపోర్టునిచ్చే మేజోళ్ళు ధరించమని కూడా సూచిస్తారు.
    • సౌకర్యవంతమైన సీటును బుక్ చేసుకోవాలి: విశ్రాంతి గది ప్రయాణాలకు లేదా క్యాబిన్ దారిలో నడిచేందుకు తరచుగా లేవడం సులభం చేసేందుకు నడవ సీటును బుక్ చేయాలి. క్యాబిన్‌ల నడుమ ఉన్న గోడ వెనుక ఉన్న బల్క్‌హెడ్ సీట్లు కాస్త ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటాయి. ఎగుడుదిగుడుగా సాగుతున్న ప్రయాణం గురించి ఆందోళన పడుతుంటే, విమానపు రెక్కపై వచ్చే సీటును ఎంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ఆహ్లాదకరమైన విమాన ప్రయాణానికి దోహదపడుతుంది.
    • పైకి కట్టుకోవాలి: సీట్‌బెల్ట్‌ను నడుముపై ఇంకా పొత్తికడుపు కిందకి కట్టుకోవాలి తద్వారా తీవ్రమైన కుదుపులు సంభవించినప్పుడు, అది ఎలాంటి హాని కలిగించదు. అందువల్ల.. మొత్తం ప్రయాణ సమయంలో బెల్ట్‌ను పెట్టుకొని కూర్చోవడం తెలివైన పని.
    • హైడ్రేటెడ్‌గా ఉండండి: ఎయిర్‌క్రాఫ్ట్ క్యాబిన్ తక్కువ తేమను కలిగి ఉంటుంది. దీని వలన ఎవరికైనా ముక్కు ఇంకా గొంతు పొడిబారవచ్చు. ఇలాంటి డీహైడ్రేషన్ నివారించడానికి, ప్రయాణ సంయమంతటా నీరు తీసుకుంటూ ఉండాలనేది తెలుసుకోవాలి.
    • ఎయిర్ సిక్‌నెస్‌ని నివారించాలి: గర్భంతో ఉన్నప్పుడు సాధారణంగా ఉదయం పూట కాస్త వికారంగా ఇంకా అలసటగా ఉంటుంది. ఈ వికారానికి విరుగుడుగా ఏవైనా టిప్స్ కోసం మీ వైద్యుడిని అడగాలి ఇంకా అవసరమైతే ఏవైనా మందుల గురించి తెలుసుకోవాలి.
    • గ్యాస్‌ను పెంచే ఆహారాన్ని తీసుకోకూడదు: విమాన ప్రయాణానికి ముందు లేదా ప్రయాణ సమయంలో కిరణాలతో శుద్ధి చేసిన ఆహారాలు, కార్బోనేటేడ్ పానీయాలు మరియు క్రూసిఫెరస్ (క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకోలీ లాంటివి) కూరగాయలు వంటి గ్యాస్‌ను పెంచే ఆహారం ఇంకా పానీయాలను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే కడుపులో ఏర్పడిన గ్యాస్ ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు విస్తరిస్తుంది ఇంకా కడుపునొప్పికి కారణమౌతుంది కాబట్టి.
    • జీర్ణసంబంధ సమస్యలకు సన్నద్ధం కావాలి: గర్భధారణ సమయంలో ఉపయోగించడానికి సురక్షితమైన డయేరియా మందులు లేదా నివారణల గురించి వైద్యుడిని సంప్రదించాలి.
    • వ్యాక్సినేషన్‌లను కొనసాగిస్తూనే ఉండాలి: మీరు అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నట్లయితే.. మీరు కొన్ని వ్యాధులకు టీకాలు వేయాల్సి రావచ్చు. అనేక విమానయాన సంస్థలు ఆహారం ద్వారా వచ్చే వ్యాధులకు ఇంకా ఇన్‌ఫ్లుయెంజా వంటి వాటికి టీకాలు వేయగల ప్రయాణ సంబంధిత వ్యాధులను కవర్ చేసే మెడికేషన్ గైడుని అందిస్తాయి.
    • ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలి: ట్రిప్‌ని ప్లాన్ చేసే ముందు, మీరు వెళ్ళే గమ్యస్థానంలో ప్రినేటల్ అపాయింట్‌మెంట్‌ను ముందస్తుగా బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నందున మీ వైద్యుడిని సంప్రదించాలి. ప్రయాణ బీమాను కోనాలి ఇంకా బస చేయబోయే ప్రదేశానికి సమీపంలో ఉన్న ఆసుపత్రుల గురించి తెలుసుకోవాలి.
    • ప్రయాణసంబంధ సలహాలను తనిఖీ చేయాలి: ఎక్కడికైనా ప్రయాణించే ముందు, గర్భిణీ ప్రయాణికులకు ప్రమాదం కలిగించే ఏవైనా ప్రయాణ లేదా ఆరోగ్య సంబంధ సలహాల కోసం చెక్ చేసుకోవడం మంచి విషయమే. ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌లు ప్రయాణ సంబంధ ఆరోగ్య సలహాలతో పాటు ఇతర భద్రతా సమాచారంపై తాజా సమాచారాన్ని సంకలనం చేస్తుంది. ఇందులో మీ గమ్యస్థానాన్ని వెతకవచ్చు. అపాయాలు ఇంకా ఆరోగ్య హెచ్చరికలు ఉన్నాయమో అని తెలుసుకోవాలి.
    • అకాల ప్రసవం వంటి ప్రమాద కారకాలు ఉన్నటువంటి మహిళలు 33 వారాల గర్భం తర్వాత ప్రయాణించడం మానుకోవాలి.

    గర్భధారణ సమయంలో కారు ప్రయాణానికి టిప్స్ (Tips To Travel In a Car During Pregnancy in Telugu)

    మీరు గర్భంతో ఉండి కారులో ప్రయాణించవలసి వస్తే, ఈ టిప్స్ అనుసరించండి:

    • ఎత్తుగా ఉన్న పొట్ట కింద మీ సీట్ బెల్ట్‌ను కట్టుకోవాలి.
    • కాళ్లను చాపి విరుచుకొనేందుకు వాష్‌రూమ్‌ని తరచుగా సందర్శించాలి.
    • ఆకస్మిక కుదుపు మాయను గర్భాశయం నుండి విడిపోయేలా చేయగలదు కాబట్టి ఎత్తు పొట్టకి అడ్డంగా బెల్ట్ ధరించకూడదు.
    • కారులో ముందు సీటులో కూర్చున్నట్లయితే, ఎపుడైనా ఢీకొన్నప్పుడు ఎయిర్‌బ్యాగ్ ఒత్తిడిని తగ్గించడానికి సీటును డాష్‌బోర్డ్ నుండి వెనక్కి నెట్టాలి.
    • మీరు డ్రైవింగ్ చేస్తూంటే, సురక్షితంగా ఇంకా సౌకర్యవంతంగా డ్రైవ్ చేయగలిగేలా ఉన్నప్పుడు, మీ సీటును వీలైనంత వరకు స్టీరింగ్ వీల్ నుండి వెనక్కి జరపాలి. ఇది పొట్ట నుండి దూరంగా స్టీరింగ్ వీల్‌ను క్రిందికి వంచేందుకు సహాయపడవచ్చు.
    • ఏదైనా అపాయం జరిగితే, అది చిన్నదైనప్పటికీ మీ వైద్యుడిని సంప్రదించాలి.
    • ఎక్కువ గంటలు డ్రైవ్ చేయకుండా ప్రయత్నించాలి. ప్రతి రోజు తక్కువ గంటల డ్రైవ్‌తో ట్రిప్‌ని ఎక్కువ రోజులుగా విభజించడానికి ప్రయత్నించాలి.

    గర్భవతిగా ఉన్నప్పుడు ప్రయాణ సమయంలో వేటిపై దృష్టి సారించాలి (What To Watch For During Travel While Pregnant in Telugu)

    మీరు మొదటి త్రైమాసికంలో ప్రయాణించెందుకు ప్లాన్ చేస్తుంటే, మీకెలా అనిపిస్తుందో గమనించాలి ఇంకా ఇతరాత్ర ఏవైనా సమస్యల సంకేతాలున్నాయేమో అని పరిశీలించాలి, ఈ క్రింది వాటితో సహా:

    • ఆగని వాంతులు ఇంకా విరేచనాలు.
    • యోనినుండి రక్తస్రావం
    • మూత్రవిసర్జనలో రక్తపు చారలు
    • సంకోచాలు కలిగి ఉండటం
    • కడుపు నొప్పి లేదా పట్టేయడం
    • తీవ్రమైన తలనొప్పి ఇంకా దృష్టి సమస్యలు
    • మాయసంచి పగలడం
    • డీహైడ్రేషన్

    ఆహారం వల్ల కలిగే వ్యాధులు లేదా ప్రయాణ అనారోగ్యాలను నివారించడానికి ఆహారం ఇంకా నీటిని తీసుకోవడంలో జాగ్రత్త పడటం చాలా అవసరం. ఐస్ క్యూబ్స్ లేనటువంటి వాటర్ బాటిల్స్ తాగాలి. ఇంకా బాగా ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తినాలి. ఒలిచిన లేదా తొక్క తీసిన పండ్లు మరియు కూరగాయలను తినాలి.

    గర్భధారణ సమయంలో సముద్ర ప్రయాణం (Traveling By Sea During Pregnancy in Telugu)

    పడవ కదలిక ఏదైనా మార్నింగ్ సిక్‌నెస్‌ని త్వరగా ప్రేరేపించేలా చేయవచ్చు లేదా మళ్లీ వికారం అనిపించవచ్చు. అయితే, సముద్ర ప్రయాణం సాధారణంగా గర్భిణీ స్త్రీలకు సురక్షితం. అయితే.. ఇక్కడ మీకోసం కొన్ని టిప్స్ ఉన్నాయి:

    • ఏదైనా గర్భధారణ సమస్యలు ఉన్నట్లయితే, క్రూయిజ్ లైన్‌లో ఆరోగ్య సంరక్షణ ప్రదాత ఉన్నారని నిర్ధారించుకోవాలి.
    • సీసీక్‌నెస్ కోసం వాడే మందులు గర్భిణీ స్త్రీలకు ఆమోదించబడిందని ఇంకా వాటితో శిశువుకు ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించుకోవాలి.
    • అవసరమైనప్పుడు ఏదైనా వైద్య సదుపాయాలు పొందేందుకు ప్రాప్యత ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రయాణించే మార్గాన్ని సమీక్షించుకోవాలి.
    • ఉదరసంబంధ సమస్యల నివారించే మందులకు సీసిక్‌నెస్ బ్యాండ్‌లు మంచి ప్రత్యామ్నాయం ఎందుకంటే ఇవి ఆక్యుప్రెషర్ పాయింట్లను ఉపయోగించి సమస్యను నివారిస్తాయి.

    గర్భధారణ సమయంలో ప్రయాణానికి టిప్స్ (Travel Tips During Pregnancy in Telugu)

    మీరు కారు, బస్సు లేదా రైలులో ప్రయాణిస్తున్నా, గర్భవతిగా ఉన్నప్పుడు ప్రయాణం చేయడం సాధారణంగా సురక్షితం. అయితే, మీరు పరిగణించవలసిన చాలా ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి:

    • కారులో ప్రయాణించిన ప్రతిసారీ బెల్టు పెట్టుకోవడం అవసరం. మీకు ఇంకా మీ శిశువుకు ఉత్తమ రక్షణ కోసం, మీరు ల్యాప్ మరియు షోల్డర్ బెల్ట్‌లు రెండింటినీ ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోవాలి.
    • ఎయిర్‌బ్యాగ్‌లను ఆన్ చేయడం గుర్తుంచుకోవాలి. ఎయిర్‌బ్యాగ్ యొక్క భద్రతా ప్రయోజనాలు మీకు ఇంకా మీ బిడ్డకు జరగబోయే ప్రమాద అవకాశాలను తగ్గిస్తాయి.
    • బస్సులకు ఇరుకైన నడవలు ఇంకా కొద్దిగా స్థలాన్ని కలిగి ఉన్నందున బస్సులో ప్రయాణామంటే అది అత్యంత సవాలుగా ఉండే రవాణా విధానం. బస్సు కదులుతున్నప్పుడు కూర్చోవడం సురక్షితం. మీరు తప్పనిసరిగా రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించాల్సి వస్తే, మీ బ్యాలెన్స్‌ను నెలిపుకొనేందుకు ఆసరాగా బోగీని లేదా సీటును పట్టుకోవాలని తెలుసుకోవాలి.
    • రైలు సురక్షితమైనది ఇంకా ముందుకి కదిలెందుకు మరియు నడవడానికి ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది, అయితే ఇది సాధారణంగా చిన్న విశ్రాంతి కూడా గదిని కలిగి ఉంటుంది.
    • కారు, బస్సు, విమానం లేదా రైలులో ఉండే సమయాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించాలి. ప్రయాణ సమయాన్ని ఐదు నుండి ఆరు గంటలకు పరిమితం చేయాలి.
    • రక్త ప్రసరణను సజావుగా కొనసాగేందుకు విశ్రాంతి తీసుకునేటప్పుడు చిన్నపాటి నడకలు ఇంకా స్ట్రెచ్‌లు చేయాలి.
    • వదులుగా ఇంకా సౌకర్యవంతంగా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలి. సౌకర్యవంతమైన బూట్లను వేసుకోవాలి.
    • స్నాక్ ఫుడ్స్ మీతోపాటు తీసుకెళ్లాలి. యాత్రను ఆనందంగా ఆస్వాదించాలి.
    • దూర ప్రయాణం చేస్తున్నట్లయితే, వైద్య రికార్డుల కాపీని తీసుకెళ్లాలని గుర్తుంచుకోవాలి.

    గర్భంతో ఉన్నప్పుడు చేసే ప్రయాణం గర్భస్రావానికి దారితీస్తుందా? (Can Travelling During Pregnancy Lead To Miscarriage in Telugu?)

    డాక్టర్ సూచించనంత వరకు గర్భధారణ సమయంలో ప్రయాణించడం సురక్షితమే. సమస్యాత్మకమైన గర్భం ప్రమాదకరంగా ఉంటుంది. అలా లేకుంటే, ప్రయాణించడం ఖచ్చితంగా సురక్షితం. గర్భం గర్భాశయం లోపల రక్షించబడుతుంది కాబట్టి గురుత్వాకర్షణ దానిని ప్రభావితం చేయదు. ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ గర్భాశయం లోపల గర్భాన్ని సురక్షితంగా ఉంచుతుంది ఇంకా గర్భాశయం యొక్క ముఖద్వారాన్ని బిగుతుగా ఉంచుతుంది. సాధారణ కుదుపులు, మెట్లు ఎక్కడం, ప్రయాణం ఇంకా డ్రైవింగ్ లాంటివాటి వల్ల గర్భం ఏవిధంగానూ ప్రభావితం కాదు. అయితే, గర్భధారణ ప్రారంభంలో అబార్షన్లు జరగడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి.

    • హార్మోన్ల లోపం
    • క్రోమోజోమ్ అసాధారణత
    • అనెంబ్రియోనిక్ గర్భం (గర్భాశయంలో పిండం బదులుగా అండం అభివృద్ధి చెందడం)
    • కొన్నిరకాల అంటువ్యాధులు
    • పొట్టకు ప్రమాదం లేదా ప్రత్యక్ష దెబ్బ లేదా గాయం
    • కొన్ని సందర్భాల్లో, గర్భాశయ ముఖద్వారం బలహీనంగా ఉంటుంది. దీనిని గర్భాశయ అసమర్ధత అంటారు. ఇది అబార్షన్‌కు కారణం కావచ్చు. మూత్రాశయ ఇంకా యోని ఇన్ఫెక్షన్లు కూడా సకాలంలో చికిత్స చేయకపోతే, గర్భధారణ ప్రారంభంలో అబార్షన్‌కు దారితీయవచ్చు.

    మిమ్మల్ని మీరు మరింత సౌకర్యవంతంగా ఉంచుకోవడం (Making Yourself More Comfortable)

    గర్భధారణ సమయంలో ప్రయాణిస్తున్నప్పుడు, మీరు మరింత సౌకర్యవంతంగా ఉండటానికి అనేక మార్గాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు మొదటి త్రైమాసికంలో మీకు కలిగే అలసట, అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. ఇవి సహాయపడగవు:

    • తరచుగా కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవాలి
    • అరటిపండ్లు మరియు గోధుమ రొట్టె వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి
    • ద్రవాలు పుష్కలంగా త్రాగాలి
    • కడుపుని శాంతపరిచే పిప్పరమెంటును తీసుకోవాలి
    • మీ పొట్టను శాంతపరచడానికి కొంచెం పిప్పరమెంటు టీ తీసుకోవాలి
    • వదులుగా ఇంకా సౌకర్యవంతంగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి
    • ఆక్యుప్రెషర్ రిస్ట్‌బ్యాండ్‌లను ధరించాలి.
    • కరకరలాడే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి
    • చిన్న విరామాలతో కూడిన క్రమం తప్పని నిద్రను అలవాటు చేసుకోవాలి
    • ఎండలో జాగ్రత్తగా ఉండాలి
    • ప్రతి రాత్రి మంచి నిద్రను పొందాలి

    గర్భంతో ఉన్నప్పుడు ప్రయాణంలో వేయించుకొనే టీకాలు (Travel Vaccinations When You Are Pregnant in Telugu)

    చాలా వ్యాక్సిన్‌లు బాక్టీరియా లేదా వైరస్‌లతో రూపొందించబడ్డాయి. అవి గర్భంలో ఉన్న శిశువుకు హాని కలిగించగలవు అనే ఆందోళనల కారణంగా అవి గర్భధారణ సమయంలో సిఫారసు చేయబడవు. సంక్రమణ ప్రమాదం ప్రత్యక్ష సంక్రమణ ప్రమాదాన్ని అధిగమిస్తే, గర్భధారణ సమయంలో కొన్ని ప్రత్యక్ష ప్రయాణ వ్యాక్సిన్‌లను వేయించుకోవచ్చు. అయితే.. ప్రయాణ సమయంలో వేయించుకొనే టీకాల విషయంలో వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. మీరు గర్భవతి అయితే, జికా వైరస్ సోకిన ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లడం అస్సలు మంచిది కాదు. ఈ వైరస్ ఎక్కువగా దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఇది చిన్నపాటి అనారోగ్యం కలిగిస్తుందే తప్ప హానికరం కాదు కానీ గర్భిణీ స్త్రీలలో ఇది కొన్ని సమస్యలను కలిగిస్తుంది. మీరోకవేళ ఈ వైరస్ బారిన పడినట్లయితే, అది మీద్వారా శిశువుకు సంక్రమిస్తుంది.

    సారాంశం (Summary)

    గర్భవతిగా ఉన్నప్పుడు చేసే ప్రయాణం సురక్షితంమే అని తెలుస్తోంది. అయితే.. వైద్యపరమైన సమస్యలు ఉన్నట్లయితే, వాటికి నివారణను డాక్టర్ తప్పక సూచించాలి. రెండవ త్రైమాసికంలో ప్రయాణించడం చాలా మంది వైద్యుల అభిప్రాయాల ప్రకారం ప్రయాణాలకు సురక్షితమైన సమయం. అలాగే, గర్భధారణ సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెళ్లడం మానుకోవాలి.

    రైలు, కారు లేదా విమానంలో ప్రయాణించినా ముందుగా మీ భద్రతను చూసుకోవాలి. సౌకర్యవంతమైన బూట్లతో ఎల్లప్పుడూ వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాకలి. ఆహారం ఇంకా నీటిని వెంట తీసుకెళ్లాలి. హైడ్రేటెడ్‌గా ఉండాలి. పోషకాహార మార్గదర్శకాలను అనుసరించాలి. ఇంకా వీధులలో అమ్మే ఆహారాన్ని తీసుకోకూడదు. పచ్చి కూరగాయలు, పండ్లను తినకూడదు. మీరు కారు లేదా విమానంలో ప్రయాణిస్తున్నట్లయితే.. ఎల్లప్పుడూ పొత్తికడుపు కింద సీట్ బెల్ట్‌ను పెట్టుకోవాలి. డాక్టర్ సూచించిన అన్ని మందులను తీసుకోవాలి. చాలామంది మహిళలు ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సరైన జాగ్రత్తలతో గర్భధారణ సమయంలో సురక్షితంగా ప్రయాణం చేస్తారు.

    Tags:

    Traveling during pregnancy in telugu, Traveling tips in telugu, Pregnancy traveling tips in telugu, Is it safe to travel during pregnancy in telugu, Precautions to take while traveling during pregnancy in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.