Baby Care
15 May 2023 న నవీకరించబడింది
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది సాధారణంగా చిన్న వయస్సులోనే మొదలయ్యే అవాంఛనీయ పరిస్థితి. ఇది ఒక వ్యక్తి సమాజంతో ఎలా వ్యవహరించాలో ఇంకా మసలుకోవాలనే తీరుని తీవ్రంగా ప్రభావితం చేసే మానసిక స్థితి. వ్యక్తులతో వ్యవహరించడం ఇంకా సంభాషించడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఎన్నో ఆటిజం వల్ల కలుగుతాయి. అయితే.. ఆటిజం లక్షణాలను ఖచ్చితంగా గుర్తించడానికి, ఆటిజం అంటే ఏమిటి ఇంకా అది పిల్లలను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవాలి.
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) లేదా ఆటిజం అనేది నాడుల ఎదుగుదల పరిస్థితుల శ్రేణులను నిర్వచించడానికి ఉపయోగించే ఒక విసృతార్థకం. ఈ పరిస్థితితో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా వారి ప్రవర్తనలో కొన్నిసార్లు ఒకే తీరును పదేపదే ప్రదర్శిస్తారు. ఈ పరిస్థితి అమ్మాయిలలో కంటే అబ్బాయిలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆటిజానికి సరైన అర్థాన్ని వివరించడం డాక్టర్లకు కష్టసాధ్యమవుతుంది. ఇంకా అది ఎందుకు పుడుతుంది అనే ఖచ్చితమైన కారణం, దానిని పూర్తిగా నయం చేయగల ఆటిజం చికిత్స ఇప్పటివరకైతే ఉనికిలో లేదు. అయినప్పటికీ.. కొన్ని చికిత్సలు ఇంకా పద్ధతులు ఇలాంటి పిల్లల పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి కానీ పూర్తిగా నయం చేయలేవు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: చిన్ననాటి రుగ్మతలు అనగానేమి? ఇవి ఎలా ఉంటాయి? వీటికి కారణాలు, చికిత్స ఏమిటి?
కొన్ని సాధారణ సంకేతాలు మరియు ఆటిజం లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి-
శారీరక లేదా రక్త పరీక్షలు చేయనందున ASD నిర్ధారణ ఇతర అనారోగ్యల నిర్ధారణ కన్నా కాస్త భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ.. డాక్టర్ పిల్లలలో కొన్ని ఎదుగుదల లక్షణాలను గమనిస్తారు. పిల్లలకి ఆటిజం ఉందో లేదో తెలుసుకోవడానికి వైద్య నిపుణులు ఈ క్రింది పరీక్షలు చేస్తారు.
ఈ ASD వల్ల కలిగే ప్రధాన సమస్యలను పరిష్కరించగల కీలక పరిచర్యలను గుర్తించడంలో గణనీయమైన పురోగతి ఉంది. అయినప్పటికీ.. ASD ఉన్న వ్యక్తికి ప్రయోజనం చేకూర్చడానికి సరైన సపరిచర్యలు గుర్తించడం కష్టంగా ఉండవచ్చు. మేధోపరమైన చికిత్సలు అందించినపుడు అది ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తుల సామాజిక లోపాలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అనువర్తింపదగిన ప్రవర్తన విశ్లేషణ పద్ధతులు ఇంకా సామాజిక నైపుణ్యాల శ్రేణులు ASD ఉన్న వారు తెలుసుకొనే విషయాలను సులభతరం చేస్తాయి.
ASD ఉన్న చాలా మంది పెద్దలు వారి కౌమారదశ ఇంకా యుక్తవయస్సును ఎంతో కష్టతరంగా దాటి వచ్చినవారే. ASD ఉన్న చాలా మంది యువకులకు వారి ఈ పరిస్థితి కారణంగా వారి తోటివారి కంటే తక్కువ అవకాశాలు పొందుతున్నారు. దీని ఫలితంగా ASD ఉన్న యువకులలో అధిక నిరుద్యోగిత రేటు ఇంకా ఉన్నత విద్యలలో వీరి భాగస్వామ్యం తక్కువగా ఉంటోంది. అంతేకాక.. వీరు పెద్దయ్యాక కూడా వారి కుటుంబ సభ్యులతో జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితితో బాధపడుతున్న కొంతమంది యువకుల ఆరోగ్యంలో మార్పును కూడా గమనించారు. ఇంకా వీరు ఎన్నెన్నో ఆరోగ్య పరిస్థితులను కూడా ఎదుర్కొంటున్నారు. ఇది సమాజంలో వారి భాగస్వామ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
అబ్బాయిలు లేదా అమ్మాయిలలో ఆటిజం సంకేతాలను నిర్ధారించిన తర్వాత వైద్యులు ఉపయోగించే ఒక ప్రసిద్ధ పద్ధతి ప్రవర్తనా విశ్లేషణ. ఇది ఒక వ్యక్తిలో కావలసిన ప్రవర్తనలను ప్రోత్సహించే పద్ధతి. అదే సమయంలో, ASD ఉన్న వ్యక్తిలో సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడానికి అవాంఛనీయ ప్రవర్తనను నిరుత్సాహ పరచబడుతుంది. వివేచనశీల మార్గంలో శిక్షణ(డిస్‌క్రీట్ ట్రైల్ ట్రైనింగ్) ఇంకా పీవోటల్ రెస్పాన్స్ ట్రైనింగ్(కీలక ప్రతిస్పందన శిక్షణ) అనేది ప్రవర్తనా చికిత్సలో రెండు అత్యంత ప్రభావవంతమైన శైలులు.
పసిపిల్లలలో ఆటిజం సంకేతాలను కలిగించే కొన్ని ప్రమాద కారకాలు -
చిన్ననాటి ఆటిజం చూపించే అత్యంత ప్రధాన సంకేతాలలో ఒకటి ఏమిటంటే.. పిల్లవాడు స్వతస్సిద్ధంగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇంకా తరచుగా అది ఏ విషయాన్ని సూచించనిదిగా ఉంటుంది. ఆటిస్టిక్ పిల్లలు తమ పరిసరాల పట్ల నిరాసక్తిగా ఇంకా పరధ్యానంగా ఉంటారు. ఇంకా, వారి తోటివారు అనర్గళంగా ఉచ్చరించగలిగే పదాలను ఉచ్చరించడం కూడా వారికి చాలా కష్టతరంగా ఉంటుంది.
CDC వారి ఆటిజం అండ్ డెవలప్‌మెంటల్ డిజేబిలిటీస్ మానిటరింగ్ (ADDM) నెట్‌వర్క్ నుండి వచ్చిన డేటా ప్రకారం.. నలభై-నాలుగు మంది పిల్లలలో ఒక్కరికి ASD ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రతీ ఒక్కరూ ఆటిజం గురించి తెలుసుకోవలసిన అన్నీ విషయాలు ఇవి. అంతేకాక, ఎవరైనా తమ పిల్లలలో లేదా ఇంకెవరైనా సన్నిహిత మిత్రులు లేదా బంధువులలో పైన పేర్కొన్న ఏవైనా సంకేతాలను గమనించినట్లయితే.. వారు డాక్టరు గారిని సంప్రదించాలి.
Yes
No
Written by
nayanamukkamala
nayanamukkamala
ప్రెగ్నెన్సీ సమయంలో వాంతి రాకుండా ఉండటానికి కొన్ని వేగవంతమైన, ప్రభావవంతమైన టిప్స్
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్): చికిత్స, నిర్వహణ
పెరిమెనోపాజ్: కారణాలు, లక్షణాలు, ప్రమాదాలు మరియు చికిత్స
గర్భధారణ సమయంలో గజ్జలో నొప్పి: కారణాలు, లక్షణాలు మరియు చికిత్స
ప్రెగ్నన్సీ లేత నెలలలో జంపింగ్ చేయడం గర్భస్రావంకు దారి తీస్తుందా?
గర్భధారణలో IUD: కారణాలు, లక్షణాలు & ప్రమాదాలు
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Mylo is a master brand offering solutions through it's subsidiaries - Mylo Care and Mylo Baby.
Mylo Care offers science backed, expert led solutions across multiple health concerns.
Mylo Baby is a one stop solution for young parents for all their baby's needs.
Skin - Fertility | PCOS | By Ingredient | Chamomile | Skin - Hygiene | Intimate Area Rashes | Diapers & Wipes | Disposable Diapers | Cloth Diapers | Baby Wipes | Diapers & Wipes - Baby Care | Hair | Skin | Bath & Body | Diapers & Wipes - Baby Wellness | Diaper Rash | Mosquito Repellent | Anti-colic | Diapers & Wipes - Baby Gear | Carry Nest |