hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article continues after adveritsment

Article continues after adveritsment

  • Home arrow
  • Toys & Gifts arrow
  • శిశువులకు ప్లష్ బాల్ యొక్క టాప్ 5 ప్రయోజనాలు (Top 5 Benefits of Plush Balls for Babies in Telugu) arrow

In this Article

    శిశువులకు ప్లష్ బాల్ యొక్క టాప్ 5 ప్రయోజనాలు (Top 5 Benefits of Plush Balls for Babies in Telugu)

    Toys & Gifts

    శిశువులకు ప్లష్ బాల్ యొక్క టాప్ 5 ప్రయోజనాలు (Top 5 Benefits of Plush Balls for Babies in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    Article continues after adveritsment

    ఈ రోజుల్లో మార్కెట్లో పిల్లల కోసం అనేక రకాల బొమ్మలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బొమ్మలను తీసుకోవాలనుకునేటప్పుడు నేరుగా ఎలక్ట్రానిక్ ఆప్షన్స్ వైపు వారి మొదటి ఆలోచన వెళుతుంది. కొంతమంది తల్లిదండ్రులు, ఎవరైతే వారి పిల్లలకు ఎడ్యుకేషనల్ టాయ్స్ కొనివ్వాలని అనుకుంటారో, వారికి సాఫ్ట్ టాయ్స్ మరియు స్టఫ్ఫ్డ్ యానిమల్ టాయ్స్ కేవలం పాతకాలం నాటివి అనుకుని వాటికి పెద్దగా విలువనివ్వట్లేదు. అయితే, చిన్న పిల్లలకు ఒక సాఫ్ట్ ప్లష్ బాల్ ని కొనుగోలు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్లష్ బాల్స్ పిల్లలకి సోషల్ మరియు ఎమోషనల్ స్కిల్స్ వంటి వంటి ముఖ్యమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. పిల్లలకు ఇమాజినరీ మరియు క్రియేటివిటీని పెంపొందిస్తూ వారికి కంఫర్ట్ మరియు సెక్యూరిటీని అందిస్తాయి. ఒక ప్లష్ బాల్ ని ఎన్నుకునేటప్పుడు, దాని ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అది ఎదుగుతున్న బిడ్డ/ శిశువుకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి.

    పిల్లలకు ప్లష్ బాల్స్ యొక్క ప్రయోజనాలు | సెన్సరీ స్కిల్స్ అభివృద్ధి (Benefits of Plush Balls for Babies | Sensory Skills Development in Telugu)

    శిశువు మెదడు స్పాంజ్ లాంటిది - వారు తమ ఇంద్రియాలని ఉపయోగించి వారి పర్యావరణం మరియు పరిసరాల గురించి తెలుసుకోగలుగుతారు. కొత్త టెక్స్టుర్, కలర్స్ మరియు వాటి సైజులని పరిచయం చేయడంలో వారికి ప్లష్ బాల్ సహాయం చేస్తుంది. పిల్లలు చిన్నవారైనప్పటికీ, వారు తాకిన ప్రతిదాని నుండి నేర్చుకోగలుగుతారు. ఒక పిల్లవాడు చల్లగా, తడిగా, జిగటగా ఉన్న వస్తువుతో తాకిన ప్రతిసారీ లేదా మరొక భిన్నమైన ఆకృతిని తాకినప్పుడు, ఆ లక్షణాలను కలిగి ఉన్న వాటి గురించి వారి మునుపటి జ్ఞానాన్ని పెంచుకుంటారు.

    పిల్లలకు ప్లష్ బాల్స్ యొక్క ప్రయోజనాలు | ఎమోషనల్ డెవలప్మెంట్ (Benefits of Plush Balls for Babies | Emotional Development in Telugu)

    పిల్లలు మిగిలిన వారిలానే భావోద్వేగం మరియు ఒత్తిడికి గురవుతారు. వారు ఇప్పటికీ తమ చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క మార్గాల గురించి నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి వారికి ఒక్కోసారి భయంగానూ, ఉక్కిరిబిక్కిరిగానూ అనిపించడం మాములే. వారు అసౌకర్యంగా లేదా ఒక్కోసారి భయపడుతున్నప్పుడు ప్లష్ బాల్ వారికి కంఫర్ట్ మరియు ఫ్యామిలియారిటీని కలిగిస్తుంది.

    పిల్లలకు ప్లష్ బాల్స్ యొక్క ప్రయోజనాలు | ఫిజికల్ బ్రెయిన్ డెవలప్మెంట్ (Benefits of Plush Balls for Babies | Physical Brain Development in Telugu)

    తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లల యొక్క సెన్సరీ ఎక్స్పీరియన్సెస్ యొక్క ఇంపార్టెన్స్ ని తప్పుగా అర్థం చేసుకుంటారు మరియు వాటిని తమ పిల్లలకు ఆట సమయంగా భావిస్తారు. అయితే, ఈ చర్యలు శిశువులలో ఫిజికల్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా అవసరం! ఒక శిశువు యొక్క మెదడు పుట్టినప్పుడు అనేక న్యూరాన్లతో రూపొందించబడింది. వారు వివిధ ఇంద్రియ స్పర్శల ద్వారా తమ చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క మార్గాలను గురించి తెలుసుకుంటారు మరియు వారి న్యూరాన్ల మధ్య సంబంధాలను అభివృద్ధి చేస్తారు. పిల్లలకి కలిగే విభిన్న అనుభవాలతో ఈ కనెక్షన్‌లు బలపడతాయి. క్రమం తప్పకుండా ఆ కనెక్షన్లు ఉపయోగించకపోతే వాటి మధ్య సంబంధం దురదృష్టకరంగా పూర్తిగా కోల్పోవచ్చు. మెదడు యొక్క మార్గాల్లోని ఈ కనెక్షన్‌లను ఇంద్రియాల ప్రక్రియ ద్వారా బలోపేతం చేయవచ్చు. ఇది పిల్లల వయస్సు పెరిగే కొద్దీ మరింత కాంప్లెక్స్ లెర్నింగ్ టాస్క్స్ పై పట్టు సాధించడానికి దారి తీస్తుంది. ప్లష్ బాల్తో ఆడటం వంటి ఇంద్రియ ప్రక్రియ లో క్రమం తప్పకుండా ఎంగేజ్ అవ్వడం వల్ల, పిల్లలు వారి భవిష్యత్తులో మరింత ఛాలెంజింగ్ టాస్క్స్ మరియు కాన్సెప్ట్స్ ని హేండిల్ చేయడానికి బాగా పనికొస్తుంది.

    పిల్లలకు ప్లష్ బాల్స్ యొక్క ప్రయోజనాలు | ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్ (Benefits of Plush Balls for Babies | Early Childhood Development in Telugu)

    ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్డ్ కి తోడ్పడటానికి ఇంద్రియ ప్రక్రియ అవసరం. దీనిలో కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలు అయినటువంటి భాష, కాగ్నిటివ్ గ్రోత్, గ్రాస్ మరియు ఫైన్ మోటార్ స్కిల్స్, ప్రాబ్లెమ్ -సొల్వింగ్, ఇంకా సోషల్ ఇంట్రాక్షన్స్ చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ఉదాహరణకు, పిల్లలు ఒక ప్లష్ బాల్ ద్వారా ఇంద్రియ కార్యకలాపాలలో ఎంగేజ్ అయినపుడు, వారు తమ సరౌండింగ్స్ గురించి తెలుసుకోవడానికి వారి ఇంద్రియాలను ఉపయోగిస్తారు. ఇది మౌల్డింగ్ లేదా స్ప్లాషింగ్ లేదా షేపింగ్ వంటి శారీరక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.

    పిల్లలకు ఇంద్రియ ప్రక్రియ అవసరం ఎందుకంటే అది కాగ్నిటివ్ డెవలప్మెంట్ మరియు సోషల్ ఇంటరాక్షన్ లో తోడ్పడుతూ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ మరియు లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకోవడానికి సహపడతాయి వారు వివిధ ఉద్దీపనల(different stimuli)కు ఆడుతూ మరియు ప్రతిస్పందించేటప్పుడు, తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు పిల్లల గురించి డీప్ గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వారు వ్యక్తిగత ప్రాధాన్యతలను గుర్తించడం కూడా మొదలుపెట్టవచ్చు మరియు తదనుగుణంగా వారి సంరక్షణను తద్వారా వారి అవసరాలు సాధ్యమైనంత ఉత్తమమైన మార్గంలో ఉండే విధంగా సరిచేయవచ్చు.

    పిల్లలకు ప్లష్ బాల్స్ యొక్క ప్రయోజనాలు | మెమోరీ డెవలప్మెంట్ (Benefits of Plush Balls for Babies | Memory Development in Telugu)

    పిల్లలు ప్లష్ బాల్ వంటి ఇంద్రియ ఆట ద్వారా, వారు తమ భవిష్యత్తు అభివృద్ధికి పునాది వేసే కీలకమైన నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఎన్నో నైపుణ్యాల మాదిరిగానే, వారి జ్ఞాపకశక్తి కూడా ప్రాక్టీస్ ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఒక బిడ్డ ప్లష్ బాల్తో ఆడటం ద్వారా ప్రయోజనం పొందుతూ విభిన్న టెక్స్టుర్, వాసనలు మరియు అభిరుచులతో పరస్పర ప్రాక్టీస్ చేయడం మరియు కాగ్నిటివ్ మరియు మోటారు మెమోరీస్ ని బిల్డ్ చేసుకోగలరు.

    శిశువుకు అన్ని స్థాయిలలో వారి అభివృద్ధి వారి సంరక్షకులపై ఆధారపడి ఉంటుంది. మరియు అంతేగాక ప్లష్ బాల్ వంటి అత్యుత్తమ వనరులు కూడా వారికి అందించాలి. ఇలాంటి మరిన్ని సమాచార కథనాల కోసం, మయిలో ఫ్యామిలీ బ్లాగ్‌ని ఫాలో అవ్వండి.

    Tags

    5 Benefits of Plush Balls for Babies in Telugu, benefits of plush balls, what is plush ball in telugu, Top 5 Benefits of Plush Balls for Babies in English, Top 5 Benefits of Plush Balls for Babies in Hindi, Top 5 Benefits of Plush Balls for Babies in Tamil, Top 5 Benefits of Plush Balls for Babies in Bengali.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.