hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore

Lowest price this festive season! Code: FIRST10

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Journey arrow
  • రెండవ త్రైమాసిక కాలంలో ప్రతి గర్భిణీ మహిళా తప్పనిసరిగా చేయవలసిన పనుల చిట్టా (The List Of Essential Things Every Pregnant Woman Must Do In Their Second Trimester in Telugu) arrow

In this Article

    రెండవ త్రైమాసిక కాలంలో ప్రతి గర్భిణీ మహిళా తప్పనిసరిగా చేయవలసిన పనుల చిట్టా (The List Of Essential Things Every Pregnant Woman Must Do In Their Second Trimester in Telugu)

    Pregnancy Journey

    రెండవ త్రైమాసిక కాలంలో ప్రతి గర్భిణీ మహిళా తప్పనిసరిగా చేయవలసిన పనుల చిట్టా (The List Of Essential Things Every Pregnant Woman Must Do In Their Second Trimester in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భిణీ సమయం ప్రతి మహిళ జీవితంలోనూ ఒక అందమైన అంకం. రెండవ త్రైమాసికంలోకి అడుగు పెడుతుండగా కాస్త స్థిరత్వం వస్తుంది, కొంచెం హాయిగా ఉంటుంది. అసలు రెండవ త్రైమాసికం మొదలయ్యేది ఎప్పుడు అని మీకు సందేహం ఉండవచ్చు. గర్భిణీ సమయంలో మూడవ నెల నుండి మొదలై ఆరవ నెలలో ముగుస్తుంది ఇది. ఈ కాలంలో మహిళలు కొంచెం భిన్నమైన అనుభూతికి లోనవుతారు, కడుపు కనిపించటం ప్రారంభం అవుతుంది.

    మీ శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఎన్నో సంభవిస్తాయి. తినాలనే ఆరాటం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. మొదటి త్రైమాసిక దశలో ఎదురయ్యే ఉదయం పూట వికారం, నొప్పులు, మానసిక కల్లోల స్థితి వంటి సవాళ్ళ పరంపర తర్వాత రెండవ త్రైమాసం చాలా ఊరటనిస్తుంది. పైగా, ఆహారం తినాలనిపించటం విషయంలో వింత వింత పోకడలు కూడా కనిపించవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ ప్రెగ్నెన్సీ రెండో త్రైమాసికంలో మీరు మీ భాగస్వామితో సెక్స్ చేయడం సురక్షితమేనా?

    రెండవ త్రైమాసిక కాలంలో చేయవలసిన ముఖ్యమైన పనులు (Important Things To Do During Your Second Trimester in Telugu)

    మీ రెండవ త్రైమాసిక వారాలు కొంచెం భిన్నంగా ఉండచ్చు. ఎందుకంటే, ఈ దశలో మీ బొజ్జ ప్రస్ఫుటంగా కనిపించటం మొదలవుతుంది. అది కాకుండా, మీ గర్భస్థితిని బట్టి మిమ్మల్ని కొన్ని మందులు, పోషక సప్లిమెంట్లు వాడమనవచ్చు. వారానికి ఒకసారి గర్భాన్ని విశ్లేషణ చేసుకుంటే, అన్ని పరిస్థితులకు సిద్ధంగా ఉండటానికి దోహదపడుతుంది.

    అయితే, రెండవ త్రైమాసిక దశలోకి ప్రవేశించటంతోనే స్త్రీలు తాము చేయవలసిన ముఖ్యమైన పనులతో ఒక జాబితాను తయారుచేసుకోవాలి. గర్భిణీ స్త్రీలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన కాన్పు అయ్యేలా ఇది సహాయం చేస్తుంది.

    కొన్ని ముఖ్యమైన పనులు ఈ క్రింద పేర్కొనబడ్డాయి.

    1. ప్రీనేటల్ విటమిన్స్ తీసుకోవటం కొనసాగించాలి (Taking Prenatal Vitamins)

    ప్రీనేటల్ విటమిన్స్ అంటే గర్భిణీ స్త్రీలకు అందవలసిన విటమిన్స్, మినరల్స్ తయారుచేయబడిన సప్లిమెంట్లు. ఈ దశలో, ప్రతి రెండు వారాలకు ఒకసారి మీ వైద్యులను కలవటం మంచిది. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇవ్వటమో రెండవ త్రైమాసంలో చేయాల్సిన పరీక్షలు చేయటమో చేస్తారు.

    2. ఆరోగ్యంగా దారుఢ్యంతో ఉండటానికి తల్లులు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి (Exercise Regularly for Good Health)

    తల్లి ప్రతిరోజూ వ్యాయామం చేయటం వల్ల గర్భస్థ శిశువు బలంగాను, ఆరోగ్యంగాను పెరుగుతాడు. అయితే, కఠినమైన వ్యాయామాలు చేయకుండా జాగ్రత్తపడాలి. గర్భిణీ సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగించగల ‘కెగెల్ ఎక్సర్సైజులు గానీ, సగం వరకు క్రుంగి లేచే వ్యాయామం గానీ చేస్తే మంచిది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: త్రైమాసికాల(ట్రైమిస్టర్) వారీగా గర్భధారణ వ్యాయామం

    గర్భిణీ సమయంలో కఠినమైన వ్యాయామాలు చేయటం వల్ల మీ కాళ్ళపై చాలా ఒత్తిడి పడుతుంది. దానివల్ల ఇతర కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తలెత్తవచ్చు. కుదిరినంత విశ్రాంతి కూడా తీసుకోవటం మంచిది.

    3. ఆరోగ్యకరమైన సమతుల్యత గల ఆహారాన్ని తినాలి (Eating Balanced Diet)

    గర్భిణీ స్త్రీలు పళ్ళు, కాయగూరలు, పీచు పదార్థాలు, తక్కువ కొవ్వు గల మాంసకృతులతో నిండిన ఆహారాన్ని తీసుకోవాలి. తద్ద్వారా, బిడ్డ ఎదుగుదల సవ్యంగాను, ఆరోగ్యంగాను జరుగుతుంది. పోషక పదార్థాలు మెండుగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల దారుఢ్యం కలిగి, గర్భిణీ సమయంలో ఏర్పడే ఎన్నో సమస్యలతో పోరాడటానికి కావలసిన బలం చేకూరుతుంది.

    ఇది కాక, గర్భిణీ సమయంలో ఎప్పుడూ ఆకలితో ఉండకూడదు. దానివల్ల గర్భస్థ శిశువు ఎదుగుదలకు అందవలసిన ఎన్నో పోషక పదార్థాలు అందకుండాపోతాయి. గర్భిణీ సమయంలో బరువు పెరగటం సాధారణం. అందుకని బరువులో తేడా చూసుకుందామని ఆకలితో ఉండటం, డైటింగ్ చేయటం వల్ల అనర్ధాలు జరిగే అవకాశం ఉంది.

    4. పుష్కలంగా మంచినీరు తాగుతూ ఉండాలి, దానివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి (Drinking Water Regularly)

    పుష్కలంగా మంచినీరు తాగటం వల్ల నిర్జలీకరణాన్ని, ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. రోజుకు కనీసం 9 గ్లాసుల మంచినీరు తాగటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది, నీరు పట్టటం తగ్గుతుంది, చర్మం కోమలంగా తయారవుతుంది, శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది, ముందస్తు ప్రసవం అయిపోయే ప్రమాదం తప్పుతుంది.

    5. రెండవ త్రైమాసంలో మహిళలు ఎక్కువ కేలరీలను తీసుకోవాలి (Taking More Calorie Foods During Second Trimester)

    రెండవ త్రైమాసంలోకి అడుగు పెడుతుంటే, తమలో ఆహారం తినాలనే కోరిక, ఆరాటం పెరుగుతున్నట్టు స్త్రీలు గమనిస్తారు. దానికి కారణం గర్భస్థ శిశువు కూడా ఎదుగుదల కోసం పోషకాలను ఆశించటం. ఆరోగ్యంగా ఉండటానికి, బిడ్డ సరైన ఎదుగుదలకి రెండవ త్రైమాసంలో దాదాపు 2,200 కేలరీలు రోజుకి అవసరమవుతాయి.

    6. దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవాలి (Keeping Gums and Teeth Healthy)

    నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం ద్వారా నోటి ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. రోజుకి రెండుసార్లు పళ్ళను తోముకోవటం, రోజుకి ఒకసారి ఫ్లాస్ చేసుకోవటం వంటివి చేయాలి. నోటి పరిశుభ్రత కొరవడితే, నోటి దుర్వాసన, నోటి జబ్బులు రావటమే కాక, పరోక్షంగా కడుపులోని బిడ్డ ఆరోగ్యం మీద కూడా ప్రభావం ఉంటుంది.

    7. ఎక్కువ కేలరీలు తప్పక తీసుకోవాలి (Take More Calories)

    గర్భధారణ సమయంలో అధిక కేలరీల తీసుకోవడం అనేది శిశువుకు అవసరమైన అన్ని పోషకాలను పొందేలా చేయడానికి అత్యంత ముఖ్యమైన మార్గాలలో ఒకటి. శిశువు సరైన ఎదుగుదలకు అధిక పోషకాహారం అవసరం. తల్లి తినే పోషకాలను శిశువు గ్రహిస్తుంది కాబట్టి, తల్లులు రెండవ త్రైమాసికంలో అధిక క్యాలరీలు మరియు పోషకాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి.

    8. విశ్రాంతి బాగా తీసుకోవాలి (Take Proper Rest)

    అవును! ఇది మీ జాబితాలో ఉండవలసిన ముఖ్యమైన విషయాలలో ఒకటి. విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ శరీరం మరింత హాయిగా ఉంటుంది. అంతేకాకుండా, 8 గంటల పాటు మంచి నిద్రను కలిగి ఉండటం వల్ల, అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఎక్కువ సమయం పని చేయకుండా ఉండటం మంచిది కాదు. విశ్రాంతి తీసుకున్నప్పటికీ, మధ్యమధ్యలో తేలికపాటిగా శారీరక శ్రమ చేయటం మంచి అలవాటు. రెండవ త్రైమాసికంలో వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందేందుకు తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: రెండో త్రైమాసికం ఫీటల్ అనోమలి స్కాన్ టెస్ట్: మీ ప్రెగ్నెన్సీ సమయంలో దీనివల్ల ఏమి తెలుస్తుంది?

    గర్భిణీ సమయంలో మానివేయవలసినవి ఏమిటి (What Need to Stop During Pregnancy in Telugu)?

    గర్భధారణ సమయంలో మీరు నివారించవలసిన కొన్ని అంశాలు ఇవి.

    1. కఠినమైన వ్యాయామాలు చేయడం మానాలి. ఎందుకంటే, కఠినమైన వ్యాయామం వల్ల ఊహించని విధంగా కడుపుకి గాయం అవ్వచ్చు, లేదా కాళ్ళపై చాలా భారం పడవచ్చు.

    2. ధూమపానం, మద్యపానం మానేయాలి. వాటివల్ల గర్భస్థ శిశువులో ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దానివల్ల బలహీనమైన కాలేయం వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు ఆస్కారం పెరుగుతుంది.

    3. కుదిరినంతవరకు కెఫీన్ వాడకం తగ్గించాలి. ఒక కప్పు కాఫీ కంటే ఎక్కువ తీసుకోకపోవటం మంచిది.

    4. మాదకద్రవ్యాలకు గర్భధారణ సమయంలో ఆస్కారమే లేదని ప్రత్యేకించి చెప్పక్కరలేదు. మత్తు పదార్థాలను సేవించటం వల్ల బిడ్డ అవయవాల పనితీరు కుంటుపడుతుంది, స్పష్టమైన అవకరాలు వచ్చే ప్రమాదం ఉంది. గర్భంతో సంబంధం లేకుండా మాదకద్రవ్యాల వాడకం మానివేయటం ఉత్తమం.

    5. పచ్చి మాంసం, పచ్చి చేపలను తీసుకోవద్దు. అలాగే, పాదరసం ఎక్కువగా ఉన్న చేపలను తినకపోవటం చాలా ముఖ్యం. ఉదాహరణకు, సొరచేపలు, మాకేరెల్, వైట్ స్నాపర్ వంటి చేపలలో అధిక మొత్తంలో పాదరసం ఉంటుంది.

    6. జీర్ణ సమస్యలను నివారించాలనుకుంటే పాశ్చరైజ్ చేయని పాలు, కొన్ని ఇతర పాల ఉత్పత్తులను పూర్తిగా నివారించాలి.

    7. బజారులో దొరికే చిరుతిళ్ళను తగ్గించాలి. మీరు మీ కోరికలను తీర్చుకోవడం కోసం చూసేటప్పుడు పరిశుభ్రతకే ధోకా రావచ్చు. మీ ఆహారాన్ని తయారుచేసే వ్యక్తి పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తున్నారో లేదో చూసుకోవటం ఉత్తమం.

    8. గర్భధారణ సమయంలో, ఆక్యుటేన్, ట్రెటినోయిన్, ఐసోట్రెటినోయిన్ వంటి సౌందర్యపోషక మందులను మానేయటం మంచిది. ఏ కొత్త మందులను వాడాలన్నా, కొత్తగా ఏదైనా పనిని మొదలుపెట్టాలన్నా వైద్యుణ్ణి ముందు సంప్రదిస్తే మంచిది.

    9. ఆఫీసు పని ఎక్కువగా చేసి అనవసరమైన ఒత్తిడికి గురికాకండి. అనువైన పనివేళలు పాటించండి. ప్రసూతి సెలవులను వీలుగా ఎంచుకోండి.

    ముగింపు (Conclusion)

    గర్భధారణ సమయంలో ఈ విషయాలను అనుసరించడం వల్ల తల్లులు దృఢంగా ఉండటానికి, సుఖంగా సులభంగా ప్రసవం కావటానికి సహాయపడుతుంది. మీ పిల్లల శ్రేయస్సు విషయానికి వస్తే అన్ని దశలకూ సమాన ప్రాముఖ్యం ఉంది. పైన పేర్కొన్న చిట్కాలను తప్పకుండా అనుసరించడం ద్వారా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రసవానికి అవకాశం ఉంటుంది.

    మీరు ప్రసవానికి సిద్ధమవుతుంటే, ప్రినేటల్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ క్లాసులలో నమోదు చేసుకోవచ్చు. గర్భధారణకి సంబంధించి ఆన్‌లైన్ ద్వారా అవగాహన పెంచుకోవటం కూడా మీ జీవితంలోని అత్యంత విలువైన క్షణమైన ప్రసవం విషయంలో మీరు సిద్ధమవ్వటానికి మీకు సహాయపడుతుంది!

    Tags:

    Breast feeding during pregnancy in telugu, Second trimester to do list in telugu, Second trimester during pregnancy in telugu, What to do during second trimester pregnancy in telugu.

    Also Read In:

    English: The List of Essential Things Every Pregnant Woman Must Do in Their Second Trimester

    Bengali: দ্বিতীয় ত্রৈমাসিকে প্রত্যেক গর্ভবতী মহিলার অবশ্য করণীয় বিষয়গুলির তালিকা

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.