Postnatal Care
3 November 2023 న నవీకరించబడింది
గర్భధారణ సమయంలో 9 నెలల పాటు చర్మం పరిమితికి మించి విస్తరిస్తుంది. ముఖ్యంగా పొత్తి కడుపు వద్ద ఈ విస్తరణ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా.. చర్మం దాని మునపటి స్థితికి రాకపోవచ్చు. ఇలా జరగడం వల్ల చర్మం చాలా అందవిహీనంగా కనిపిస్తుంది. అందుకే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొత్త తల్లులు తమ మునుపటి చర్మాన్ని తొందరగా ఎలా పొందాలనే ఆసక్తిని చూపిస్తారు. మరీ ముఖ్యంగా ప్రసవం తర్వాత.. పొత్తి కడుపు వద్ద స్కిన్ ఎలా రికవరీ చేసుకోవచ్చునని చూస్తారు.
గర్భం వల్ల మీ చర్మం అనేక మార్పులకు గురవుతుంది. మీరు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ మార్పులు కనిపించకుండా పోతాయి. కానీ కొన్ని సార్లు మాత్రం మీ చర్మం వదులుగా (సాగిపోయిన) తయారవుతుంది. చర్మం కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ అనే హార్మోన్లను కలిగి ఉంటుంది కనుక శరీరం బరువు పెరిగినపుడు అది బరువుకు అనుగుణంగా మీ చర్మం సాగుతుంది. మీ చర్మం ఒకసారి సాగితే మళ్లీ దాని పూర్వస్థితికి రావడం చాలా కష్టం. గర్భవతిగా ఉన్నపుడు పెరుగుతున్న బంప్‌కు అనుగుణంగా మీ చర్మం సాగుతుంది. ఒక స్త్రీ డెలివరీ అయిన తర్వాత తన చర్మం ఎంత తొందరగా తిరిగి పూర్వ స్థితికి వస్తుందనే విషయం స్త్రీ వయస్సు, బరువు, జన్యువుల (శరీరాకృతి) వంటి అనేక కారకాల మీద ఆధారపడి ఉంటుంది. డెలివరీ తర్వాత వదులైన చర్మం త్వరగా పూర్వస్థితికి రావాలని అనుకునే స్త్రీలు మానసికంగా ఒత్తిడిలో ఉంటారు. వారు కోరుకున్న సమయంలో కోరుకున్న విధంగా చర్మం పూర్వస్థితికి రాకపోతే వారు నిరాశ చెందే అవకాశం ఉంటుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది కానీ ఇది పూర్తవుతుంది.
టోన్డ్ స్కిన్ కోసం మీ ప్రయాణం మీ ప్లేట్లో ఉన్న ఆరోగ్యకరమైన ఆహారంతో ప్రారంభం కావాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారం మీ చర్మం యొక్క ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. డెలివరీ తర్వాత మీ వదులు చర్మాన్ని బిగితుగా చేసుకునేందుకు ఎటువంటి డైట్ తీసుకోవాలి? మీ చర్మాన్ని ఫర్మ్ (బిగితుగా), మరియు టోన్ చేసేందుకు మీరు తినాల్సిన ఆహారాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. చర్మం యొక్క కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ వంటి వాటితో ఉంటుంది. ఎలాస్టిన్ మీ చర్మాన్ని సరిగా చేస్తుంది. కొల్లాజెన్ మీ చర్మాన్ని దృఢపరుస్తుంది. గర్భధారణ సమయంలో చర్మం స్ట్రెచ్ అయ్యే నిష్పత్తి ఈ రెండు భాగాలకు చెంది ఉంటుంది. దీని ఫలితంగా సాగిన గుర్తులతో వదులుగా ఉండే చర్మం ఏర్పడుతుంది. మీ చర్మం దాని స్థితిస్థాపకత మరియు ఫర్మ్నెస్(దృఢత్వం) కొనసాగించేందుకు చర్మానికి కొన్ని పోషకాలు అవసరం. ఈ పోషకాలు కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తద్వారా మీ చర్మం మృదువుగా ఉంటుంది.
కూరగాయలు, పండ్లు, కొవ్వులు, మరియు లీన్ ప్రొటీన్స్ (తక్కువ కొవ్వులు ఉండే ప్రొటీన్లు) తో కూడిన బ్యాలెన్స్డ్ డైట్ అనేది మీ చర్మాన్ని బిగుతుగా చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఇవి మీ చర్మ స్థితిస్థాపకతను పునరుద్ధరిస్తాయి. మీరు మీ బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం మాన్పించే వరకు నియంత్రిత డైట్ తీసుకోకూడదు. ఇలా చేయడం మంచిది కాదు. అంతే కాకుండా మీ పాల ఉత్పత్తికి ఆటకం కలిగించని ఆహారాన్ని తీసుకోవాలని నిర్దారించుకోండి. కెఫిన్ మరియు కార్బోనేటెడ్ డ్రింక్స్ నుంచి దూరంగా ఉండండి. ఇతర ఆహారాలను తక్కువ మోతాదులో తీసుకోండి. స్థితిస్థాపకత మరియు దృఢత్వాన్ని పెంచే కొన్ని రకాల పోషకాలు కింద ఉన్నాయి.
1. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్: సాల్మన్, ట్యూనా, మరియు మాకెరెల్ అనేవి ఒమేగా 3 ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు. మీ శరీరంలో మంటగా ఉంటే ఇవి పోరాడుతాయి. అంతే కాకుండా మీ కొల్లాజెన్‌ను రక్షిస్తాయి. అవిసె గింజలు, చియాగింజలు, సోయాబీన్ గింజల వంటి మొక్కలలో కూడా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు విరివిగా లభిస్తాయి.
2. విటమిన్స్ విటమిన్స్ వివిధ రకాల పోషకాలతో నిండి ఉంటాయి కాబట్టి మీ శరీరానికి ఇవి చాలా మంచివి. విటమిన్ C కొల్లాజెన్ సంశ్లేషణను సులభతరం చేస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే ప్రమాదకరమైన UV కిరణాల నుంచి కాపాడుతుంది. విటమిన్ A నుంచి ఉత్పన్నమయ్యే రెటినోల్ మీ చర్మానికి చాలా అవసరం. ఇది కణాల సంఖ్యను పెంచడంతో పాటుగా.. కొల్లాజెన్ మరియు ఎలాస్టెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మీరు బీఫ్ (జంతు మాంసం), డెయిరీ ఉత్పత్తులు, కాలేయం, మరియు కోడిగుడ్లలో విటమిన్ A అధికంగా ఉంటుంది. విటమిన్ B5 మీ చర్మం స్థితిస్థాపకతను ప్రేరేపిస్తుంది. ఈ విటమిన్ హ్యూమక్టెంట్ (తేమను అలాగే ఉంచేది) కాబట్టి మీ చర్మం తేమను రక్షిస్తుంది. మరియు స్థితిస్థాపకతను పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ B2 చర్మం నిర్మాణ సమగ్రతను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది సెల్ టర్నోవర్ పెంచి.. కొల్లాజెన్ నిర్వహణను ప్రోత్సహిస్తుంది. B కాంప్లెక్స్ అధికంగా ఉండే ఆహారాలలో బచ్చలికూర, డెయిరీ ఉత్పత్తులు, గొడ్డు మాంసం, తృణధాన్యాలు మరియు బ్రెడ్ ఉన్నాయి.
3. ప్రొటీన్: ప్రొటీన్ మరియు కొల్లాజెన్ అనేవి ప్రొటీన్ భాగాలు కాబట్టి మీరు మీ ఆహారంలో ప్రొటీన్‌ను కూడా చేర్చాలి. మీ చర్మంలో అధిక ప్రొటీన్ స్థాయిలు ఉంటే.. మీకు అది దృఢమైన రూపాన్ని ఇస్తుంది. పౌల్ట్రీ, చేపలు, డెయిరీ ఉత్పత్తులు, నట్స్, టోఫు, చిక్కుళ్లు, మరియు బీన్స్ వంటివి లీన్ ప్రొటీన్స్కు మంచి మూలాలు. ఈ పదార్థాల్లో లీన్ ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది.
మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పటికి కూడా మీ లూజ్ స్కిన్ అనేది నివారించబడదు. మీరు సరైన ఆహారం తీసుకోవడంతో పాటుగా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఒక కొత్త తల్లిగా మీకు వ్యాయామం చేయడం కాస్త చాలెంజింగ్గానే ఉంటుంది. అలాగే చాలా రకాల వ్యాయామాలు చేసేందుకు మీ శరీరం సహకరించకపోవచ్చు. అది ఇంకా నయం కాకపోవచ్చు. అయినప్పటికీ మీ శరీరాన్ని టోన్ (సరైన ఆకృతిలోకి మార్చుకోవడం) చేసుకునేందుకు మీరు చేయాల్సిన వ్యాయామాలు ఉన్నాయి. కానీ వెంటనే బరువు తగ్గాలని తొందరపడకండి. అధిక బరువును క్రమంగా తగ్గించుకోవడమే మీ లక్ష్యం. మీ కండరాలు తగిన విధంగా అడ్జస్ట్ అయ్యేందుకు తగినంత సమయం ఇవ్వండి. వేగంగా బరువు తగ్గడం వల్ల మీరు మీ చర్మాన్ని బిగుతుగా చేసుకోవాలనే మీ సమస్య మరింత జఠిలం అవుతుంది. ఇది మీ కండరాలను మరియు బరువును రెండింటినీ కోల్పోయేలా చేస్తుంది. కండరాలు లేకుండా టోన్డ్ టైట్, మంచి శరీరాకృతిని కలిగి ఉండడం అసాధ్యం. వ్యాయామం రక్తప్రసరణను కూడా ప్రోత్సహిస్తుంది. ఇది కణజాలాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. మరియు ఎలాస్టిన్, కొల్లాజెన్ ఏర్పడేందుకు సహాయపడుతుంది. మీరు ఎప్పుడు ప్రసవించారనే దాని మీద ఆధారపడి మీ వ్యాయాయ దినచర్య అనేది కింది విధంగా ఉండాలి.
1. కార్డియో(గుండెకు సంబంధించిన) వ్యాయామాలు: ఈ వ్యాయామాలు మీ కడుపు పై భాగంలో ఉన్న కొవ్వును కరిగించి.. కండరాలను టోన్ చేస్తాయి. మీరు ఏదైనా కొత్త వ్యాయామాన్ని ప్రారంభించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. డాక్టర్ అనుమతించిన తర్వాత కొన్ని సింపుల్ వర్కౌట్లతో మీ వ్యాయామాలను ప్రారంభించండి. అంతే కాకుండా మీ బిడ్డ షెడ్యూల్‌ను బట్టి మీ వ్యాయామ షెడ్యూల్‌ను నిర్ణయించండి. హృదయం కోసం చుట్టపక్కల షికారు చేస్తే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే మీ బిడ్డను కూడా షికారుకు తీసుకెళ్లవచ్చు. మీ శరీరం నయం అయినందువలన మీరు జాగింగ్‌కు లేదా లాంగ్ వాక్స్‌కు పోవడం ప్రారంభించవచ్చు. మీరు ఈతకొట్టడం కూడా ప్రారంభించవచ్చు. ఇది మీ మొత్తం శరీరాన్ని టోన్ చేయడంలో సహాయపడుతుంది. ఏదేమైనా మీ వ్యాయామం మీ సౌకర్యాన్ని మరియు తల్లిపాల సరఫరాలో జోక్యం చేసుకోకూడదు. పాలు నిండిన రొమ్ములతో జంపింగ్ చేయడం సౌకర్యవంతంగా ఉండదు కాబట్టి జంపింగ్ జాక్స్ వంటి వ్యాయామాలను నివారించండి. మీరు వ్యాయామం చేసే ముందు మీ బిడ్డకు పాలు కానీ.. కొంచెం ఆహారం కానీ ఇవ్వాలని నిర్దారించుకోండి.
2. స్ట్రెంత్ ట్రెయినింగ్ వ్యాయామాలు: బరువులు ఎత్తడం వల్ల మీ కండరాలు పెరుగుతాయి. కండరాలను టోన్ చేయవచ్చు. ఇది మీ చర్మాన్ని బిగుతుగా కూడా చేస్తుంది. మీ శరీర బరువు ఎంత ఉందో.. అంత వెయిట్‌తో ప్రారంభించి.. మీరు క్రమంగా పెంచుకుంటూ పోవచ్చు. క్రంచెస్ మరియు లెగ్ రైజ్(యోగాలో చేసే ఆసనాలు) కొన్ని మంచి ఉదాహరణలు. మీరు మీ శిక్షణలో ముందుకు సాగుతున్న కొలదీ కెటిల్‌బెల్స్ వంటి కొన్ని బరువులను యాడ్ చేయండి. మీ శరీరాన్ని సర్దుబాటు చేసేందుకు ముందుకు వెళ్లే సమయంలో తేలికైన వాటితో ప్రారంభించండి. ఇవి మీ శరీరానికి సహాయం చేస్తాయి. డెలివరీ తర్వాత… మీ బొడ్డు వద్ద వదులుగా అయిన మీ చర్మాన్ని బిగుతుగా మార్చుకునేందుకు కొన్ని పుష్-అప్స్ మరియు సిట్ అప్స్ చేయండి. గ్లూటల్ మజిల్స్ (తుంటిలో ఉండే కండరాలు) కోర్, మరియు హిప్(తుంటి)ని టోన్ చేయాలని మీరు అనుకుంటే యోగా మరియు పైలేట్స్ ప్రయత్నించండి. దీర్ఘకాలంలో మీ బాడీని టోన్ చేసుకునేందుకు ప్లాంక్స్ (ఒక రకమైన వ్యాయామం) కూడా సహాయపడతాయి.
3. మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్(చర్మం మీద ఉన్న డెత్ స్కిన్ సెల్స్ తొలగించడం) చేయండి
డెలివరీ తర్వాత వదులుగా ఉన్న చర్మాన్ని సరిచేయడంలో మంచి చర్మ సంరక్షణ తోడ్పడుతుంది. మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడం దీనికి ఒక మార్గం. ఇది డెత్ (చనిపోయిన) మరియు పాత స్కిన్ సెల్స్‌ను తొలగించి.. కొత్త చర్మం పుట్టేలా చేస్తుంది. ఈ చర్మం బిగుతుగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్స్ఫోలియేషన్ అదనంగా సర్క్యులేషన్‌ను(ప్రవాహం) కూడా ప్రోత్సహిస్తుంది. ఇది మీ చర్మ స్థితిస్థాపకతను ప్రోత్సహిస్తుంది. ఇది చర్మరంగును కూడా సమం చేస్తుంది. ఎక్కువగా సాగదీయడం వల్ల బొడ్డు చుట్టూతా ఉన్న చర్మం నలుపు రంగులోకి మారుతుంది. ఇది దాని అసలు రంగును పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. ఎక్స్ఫోలియేట్ చేసేందుకు మీరు ఇంట్లో తయారు చేసిన బాడీ స్క్రబ్‌ను కూడా ఉపయోగించొచ్చు. మీరు సముద్రపు ఉప్పు మరియు నిమ్మకాయలను 50/50 నిష్పత్తిలో కలపొచ్చు. మరియు ఈ మిశ్రమాన్ని సున్నితంగా మీ బొడ్డుపై మసాజ్ చేయాలి. మీరు మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసేందుకు లాఫాను(ఒక రకమైన స్క్రబర్) కూడా ఉపయోగించొచ్చు. స్నానం చేసేటపుడు పొట్ట చుట్టూ వదులుగా ఉన్న చర్మం మీద అదనపు శ్రద్ధ వహించండి. కండీషనర్ ఉపయోగించి లూఫాతో సున్నితంగా స్క్రబ్ చేయండి.
4. స్కిన్ ఫర్మింగ్ (కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ వంటివి ఉండే క్రీమ్) క్రీమ్‌ను ప్రతిరోజు ఉపయోగించండి.
చర్మం యొక్క ఫర్మీనెస్ (దృఢత్వం) అనేది లోపల ఉండే కండరాల మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఆరోగ్యకరమైన ఆహారంతో ఈ కండరాలను బలోపేతం చేయడం చాలా అవసరం. మీ చర్మాన్ని టోన్(సరైన విధంగా మార్చడం) చేసేందుకు మీరు ఇప్పటికీ కూడా బయటి నుంచి పని చేయొచ్చు. స్కిన్ ఫర్మింగ్ లోషన్లు మరియు క్రీమ్స్ ఇలా చేసేందుకు సహాయపడతాయి. ఇది ఒక మార్గం. ఈ ఉత్పత్తులు చర్మం దృఢత్వాన్ని పెంచే సహజ పదార్థాలను కలిగి ఉంటాయి. కొన్ని ఉత్పత్తులు పెప్టైడ్స్‌ను(అమైనో ఆమ్లాలు) కూడా కలిగి ఉంటాయి. ఇవి బిగుతును తగ్గించడంలో మరియు స్థితిస్థాపకతను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. ప్రసవం తర్వాత మీ శరీర ఆకృతిని నిర్మించడంలో కొన్ని ఉత్పత్తులు సహాయం చేస్తాయి.
5. స్కిన్ ఆయిల్స్‌తో మసాజ్ చేయండి
నూనెలతో అద్భతమైన మసాజ్ చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆముదం నూనెను మసాజ్ చేసేందుకు ఉపయోగించొచ్చు. ఎందుకంటే కొవ్వు ఆమ్లాల అధిక సాంద్రత కారణంగా ఇది దృఢమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ను ప్రోత్సహిస్తుంది. మరియు మీ చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. మీరు చేయాల్సిందల్లా కొద్దిగా వేడి చేసిన ఆముదపు నూనెను మీ అరచేతుల్లో వేసుకుని.. మీ పొట్టమీద సున్నితంగా రాయండి.
ఆలివ్ ఆయిల్ కూడా అద్భుతంగా పని చేస్తుంది. వదులుగా ఉండే బొడ్డు లేదా ఇతర చర్మ భాగంలో మసాజ్ చేసేందుకు వాడతారు. ఇందులో విటమిన్ E మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండడం వలన ఈ ఆయిల్ బలమైన యాంటీఆక్సిడెంట్‌గా వర్క్ చేస్తుంది. ఇది మీ చర్మ కణాలలో ఉన్న తేమను తొలగించి.. చర్మాన్ని బిగించేందుకు మరియు కండర కణజాలాలను బలోపేతం చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు వదులుగా ఉన్న మీ బొడ్డును మసాజ్ చేసేందుకు ద్రాక్షగింజల నూనెను కూడా ఉపయోగించొచ్చు. ఇది మీ చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు విటమిన్ E కూడా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ చేసేందుకు మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. మీ చర్మం మొత్తం ఆరోగ్యం కోసం ఇవి చాలా అవసరం.
6. శరీరంలో వచ్చే మార్పుల పట్ల సానుకూలంగా ఉండండి.
మీ కొత్త శరీరాకృతిని మొదటగా అంగీకరించండి. డెలివరీ తర్వాత వదులుగా అయ్యే చర్మాన్ని ఎలా బిగుదుగా మార్చుకోవాలో తెలుసుకునే ముందు గర్భం మరియు డెలివరీ యొక్క పనితీరును అభినందించండి. మీరు గర్భవతిగా ఉన్నపుడు మీ శరీరం సహజ మార్పులకు లోనయినా కానీ సరైన క్రమశిక్షణ, స్థిరమైన పనితనంతో మీరు మీ పూర్వ శరీరాకృతిని పొందొచ్చు. గర్భధారణ తర్వాత వదులుగా అయిన చర్మాన్ని మీరు బిగుతుగా చేసుకునే చిట్కాల కొరకు మీరు చూస్తున్నప్పటికీ మీరు ప్రశాంతమైన మనస్సును కలిగి ఉండండి. సంకోంచించవద్దు. మీరు ఆశించే మార్పులు నిర్దిష్ట వ్యవధిలో కనిపించకపోతే..కంగారు పడకండి. ఓపిక పట్టండి. సమతుల ఆహారం మరియు వ్యాయామం చేయడం కొనసాగించండి. మీ శరీర మార్పుల గురించి సానుకూల దృక్పథంతో ఉండేందుకు కింది చిట్కాలను పాటించండి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో చర్మ సంరక్షణ - అనుసరించాల్సిన చిట్కాలు
డెలివరీ తర్వాత వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా చేసుకోవడం అంటే రాత్రికి రాత్రి జరిగిపోయే ప్రక్రియ కాదు. మీరు ఫలితాలను చూసేందుకు కాస్త ఓపిక పట్టాలి. శరీరంలో మార్పు అనేది జన్యువులు(శరీరాకృతి), బోన్ స్ట్రక్చర్, మీ గర్భధారణకు ముందు మీ పొట్ట సైజ్, మీరు గర్భవతిగా ఉన్నపుడు చేసిన శారీరక శ్రమ, మీరు గర్భవతిగా ఉన్నపుడు పెరిగిన బరువు వంటి వివిధ ఆంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా తింటూ వ్యాయామం చేసినా కానీ.. వదులుగా ఉన్న చర్మాన్ని మీరు పూర్తిగా టైట్ చేసుకోలేరు. అయినా కానీ హోప్(ఆశ) కోల్పోకండి. ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండడం చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి. మీ బిడ్డ ఆరోగ్యం కూడా ముఖ్యం. అందుకే మీరు వ్యాయామం కానీ డైట్ కానీ స్టార్ట్ చేయాలని భావిస్తే.. మీ బిడ్డ అవసరాలను అవి తీరుస్తాయో లేదో ఒకసారి చూసుకోండి.
స్ట్రెచ్ మార్క్ అనేవి ఒక వ్యక్తి చర్మం మీద చారలుగా ఉంటాయి. ఇవి గులాబీ, రెడ్, పర్పుల్ (ఉదా రంగు) లేదా గోధుమ రంగులో ఇవి ఉంటాయి. వ్యక్తి చర్మం రంగును బట్టి ఇవి ఉంటాయి. ఇవి కేవలం గర్భవతిగా ఉన్న సమయంలోనే వస్తాయని ఏం లేదు. ఒక స్త్రీ లేదా పురుషుని శరీరం వేగంగా పెరుగుతూ ఉంటే చర్మం మీద ఇలాంటి చారలు ఏర్పడతాయి. గర్భధారణ సమయంలో మీ పొత్తికడుపు, రొమ్ములు, హిప్ (తుంటి భాగం), తొడలు, పై కాళ్లు, చేతులు మరియు పిరుదుల ప్రాంతంలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. అవి మసకబారినపుడు వేరే రంగులో కనిపిస్తాయి. కొన్ని సార్లు తెలుపు రంగులో వెండి రంగులో మరియు ముదురు రంగులో కూడా కనిపిస్తాయి.
మీ చర్మం కంటే ఎక్కువ వేగంగా మీ బాడీ విస్తరించినపుడు స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. మీ చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడం మరియు తేమతో ఉంచడం దీనికి సహాయపడుతుంది. మీ చర్మం ఎంత మృదువుగా ఉంటే అంత స్ట్రెచ్ మార్క్స్ కనిపించకుండా ఉంటాయి. అయినా కానీ స్ట్రెచ్ మార్క్స్ వదిలించుకునేందుకు ఏ నూనె కూడా సహాయం చేయదు. కానీ మీ శరీరానికి నూనెను పూయడం వలన సహజంగా లిపిడ్(చర్మం మీద ఉండే ఒక రకమైన పొర) అవరోధం లేకుండా చేస్తుంది. చర్మం తేమను నిలుపుకోవడంలో ఇది సహాయపడుతుంది. బాడీ ఆయిల్స్ అనేవి స్ట్రెచ్ మార్క్స్ విషయంలో పెద్దగా ఎటువంటి ప్రభావం చూపకపోయినా.. ఇవి పూర్తి చర్మాన్ని సంరక్షిస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ కోసం పరిగణించాల్సిన కొన్ని చికిత్సలు ఇక్కడ ఉన్నాయి.
చివరగా
గర్భం అనేది మీ చర్మాన్ని అనేక మార్పులకు గురి చేస్తుంది. కొన్ని సార్లు ఈ మార్పులు మీకు కష్టతరంగా ఉంటాయి. ఇది మీ మానసిక శ్రేయస్సుపై ప్రభావాన్ని చూపుతుంది. మీరు సరైన విధంగా ఆలోచిస్తే ఎటువంటి మందులు లేకుండా సహజంగా మీ చర్మాన్ని బిగుతుగా చేసుకునే అనేక చిట్కాలు ఉన్నాయి.
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |