back search

Want to raise a happy & healthy Baby?

  • Get baby's growth & weight tips
  • Join the Mylo Moms community
  • Get baby diet chart
  • Get Mylo App
    ADDED TO CART SUCCESSFULLY GO TO CART
    • Home arrow
    • మీరు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి పిల్లలు మారాం చేయడానికి కారణాలు ఏమిటి (Reasons why Babies Throw Tantrums When You Get Back From Work in Telugu) arrow

    In this Article

      మీరు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి పిల్లలు మారాం చేయడానికి కారణాలు ఏమిటి (Reasons why Babies Throw Tantrums When You Get Back From Work in Telugu)

      Baby Care

      మీరు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి పిల్లలు మారాం చేయడానికి కారణాలు ఏమిటి (Reasons why Babies Throw Tantrums When You Get Back From Work in Telugu)

      3 November 2023 న నవీకరించబడింది

      కొత్తగా పిల్లల్ని కన్న తల్లిదండ్రులు తమకు బిడ్డ పుట్టిన తొలిదశలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదో తెలియని అయోమయంలో ఉంటారు. గర్భం, ప్రసవం, ప్రసవానంతర దశ అన్నీ దాటుకుంటూ వెళ్ళిన వీరు - ఇప్పుడు తమ నవజాత శిశువుతో ఇంటికి వెళ్ళడానికి, తమ బిడ్డతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటారు. బిడ్డతో అనుబంధం ఏర్పడటం అనేది శిశు సంరక్షణలో చాలా ముఖ్యమైన భాగం. సాధారణంగా శిశువుకు, తల్లిదండ్రులకు మధ్య దృఢమైన సంబంధం మొదటి కొన్నిరోజులలోనే ఏర్పడుతుంది. నవజాత శిశువులు తమ తల్లిదండ్రులతో దగ్గర కావడానికి కొన్నిసార్లు బాడీ లాంగ్వేజ్‌ని ఉపయోగిస్తారు. తల్లిదండ్రులతో శిశువుకు ఏర్పడిన అనుబంధం శిశువు అభివృద్ధికి దోహదం చేయడమేకాక, వారి మెదడులో హార్మోన్లను, రసాయనాలను సరిగా విడుదలయ్యేలా చేసి వారి మెదడు వేగంగా పెరిగేలా సహాయపడుతుంది. వారి మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుంది.

      బిడ్డకు చనుబాలు ఇవ్వటం వల్ల తల్లీబిడ్డల మధ్య అతి బలమైన సంబంధం ఏర్పడుతుంది. వారిద్దరి తనువులు నేరుగా స్పృశించడం వల్ల, తల్లి శిశువును దగ్గరగా హత్తుకోవటం వల్ల వారిద్దరి మధ్య సన్నిహిత శారీరక సంబంధం ఏర్పడుతుంది. సీసా పాలు తాగే బిడ్డల కంటే చనుబాలు తాగే పిల్లలు తల్లితో మరింత వాత్సల్యం, అనుభూతి అనుభవిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో పుట్టిన మొదటి సంవత్సరాలలో సన్నిహిత బంధాన్ని ఏర్పరచుకుంటే, అది తర్వాతి కాలంలో పిల్లలలో ఏర్పడే ప్రవర్తనా సమస్యలను, సామాజిక సమస్యలను సులువుగా తగ్గిస్తుంది. పిల్లలతో సరైన అనుబంధం ఏర్పరచుకున్న తల్లిదండ్రులు పిల్లలు ఏ సమయంలో ఎలా ఆలోచిస్తారో, ఏయే సమస్యలకు భయపడుతున్నారో, వాటిని ఎలా పరిష్కరించాలో, వారు తమ నుంచి ఏమి ఆశిస్తున్నారో, వారి భావిజీవితాన్ని ఎలా మలచాలో, వారికి ఏవి ఇష్టమో, ఏవి అయిష్టమో సులభంగా తెలుసుకోగలుగుతారు.

      పిల్లలు ఎందుకు మారాం చేస్తారు (Why Do Tantrums Happen in Telugu)?

      సాధారణంగా పిల్లలు వారి కోపాన్ని, తమకు అనుకూలంగా ఏదైనా జరగలేదన్న నిరాశను వ్యక్తీకరించడానికి ఎంచుకొనే మార్గం మారాం చేయటం. వారు తమ భావాలను మాటల ద్వారా వ్యక్తం చేయలేరు. మారాం చేసే అలవాటు సాధారణంగా 12-18 నెలల వయస్సులో ప్రారంభమవుతుంది. 2-3 సంవత్సరాల వయస్సులో తీవ్రమవుతుంది, మళ్లీ వయసు పెరిగే కొద్దీ క్రమంగా తగ్గుతుంది. పిల్లలు తట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు, అంటే ఆకలి, అలసట, అనారోగ్యం వల్ల మారాం మరింత తీవ్రమవుతుంది. పని చేసే తల్లులు వారి వ్యక్తిగత జీవితం, మానసిక ఆరోగ్యం, వృత్తి జీవితం నుంచి సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు.

      వారి దినచర్య ఉదయమే లేచి ఇంటి పనులు చేసుకోవటం, వారి పిల్లల రోజువారీ పనులు, స్కూళ్లకు సంబంధించిన ప్రణాళికలు వేయడంతో ప్రారంభమవుతుంది. అలాగే ఉద్యోగంలో కూడా సహోద్యోగులతో మీటింగులు, పనులు వంటి వ్యవహారాలవల్ల పనిలో కూడా కష్టపడతారు. వారు మాతృత్వానికి, కెరీర్‌కు ‌ మధ్య సమతుల్యతను పాటించడానికి ఎంతో కష్టపడవలసి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు ఇంటికి వెళ్లేసరికి పిల్లలు తిక్కపెడుతూ, మారాం చేస్తూ ఉంటే, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు వారు వాడే ఆయుధం ఆ పిల్లల మీద అరవడం. కాని అది ఎంతమాత్రం సరైన పని కాదు. అప్పుడే ప్రశాంతంగా ఉండటంద్వారా అసలు పిల్లలు మారాం చేయడానికి ఏంటి కారణం అనేది అర్థం అవుతుంది.

      పిల్లలు మారాం చేయటానికి గల కారణాలు (Reasons for babies' throwing tantrums in Telugu):

      పసిపిల్లలకు తల్లిదండ్రులు తమను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోవడం నచ్చదు. వారిని రోజంతా వదిలేసి ఉండటం వల్ల వారి ప్రేమ కోసం ఎదురుచూసి, వారు రాగానే తమ ఫీలింగ్‌ను ఎలా వ్యక్తం చేయాలో తెలియక ఏడుస్తారు.
      రోజంతా అమ్మానాన్నలు కనబడకపోవడం వల్ల వారికి కలిగిన కోపాన్ని, బాధను పసిపిల్లలు ఏడుపు రూపంలో, తిక్కరూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. అలా ఏడిస్తే తమను తల్లిదండ్రులు వెంటనే పట్టించుకుంటారు అని వారు భావిస్తారు.
      తల్లిదండ్రులు బయటికి వెళ్లినప్పుడు సరిగా పట్టించుకొనేవారు లేకపోవడం వల్ల కూడా వారు రోజంతా బాగా ఏడుస్తూ, తిక్కగా ఉంటారు. అదే తిక్క తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక కూడా కొనసాగుతూ ఉంటుంది.
      ఒక్కోసారి వారు రోజంతా సరైన విశ్రాంతి లేక అలిసిపోయి కూడా ఉండవచ్చు. దానివల్ల వారికి చాలా విసుగ్గా ఉండి, ఏదీ చేయడానికి ఇష్టపడరు. అందువల్ల అప్పుడే ఇంటికి వచ్చిన తల్లిదండ్రులను చూసి బాగా ఏడుస్తారు. వారిని ఊరుకోబెట్టడం చాలా కష్టం అవుతూ ఉంటుంది.


      సాధారణంగా ఏదైనా భయాన్ని కలిగించే విషయాలు, వస్తువులు, శబ్దాలు వల్ల, కొత్త మొహాలు, కొత్త మనుషులు కనబడడం వల్ల పిల్లలు ఏడవడం జరుగుతూ ఉంటుంది. తమను తమ వారి నుంచి వేరు చేసేస్తారేమో అనే భయం పసిపిల్లలను తిక్కపెట్టేలా చేస్తుంది. కొన్నిసార్లు తమను రోజూ చూసుకునే వారి దగ్గర వదిలినా కూడా, భయపడటం, తిక్క పెట్టడం చేస్తూంటారు. ఒక్కోసారి పిల్లలు అనారోగ్యం, శారీరకమైన నొప్పి వంటి ఇబ్బందుల వల్ల కూడా రోజంతా తిక్కను ప్రదర్శిస్తూంటారు. ఆ సమయంలో వారు తల్లిదండ్రుల నుంచి ప్రేమను, ఆప్యాయతను, తమ పట్ల శ్రద్ధను కోరుకుంటారు. అయితే తమ భావాలను ప్రదర్శించడానికి వారికి తెలిసిన ఏకైక మార్గం ఏడుపు, తిక్క. ఒక్కోసారి ఆకలి వేసినా పిల్లలు బాగా మారాం చేస్తూంటారు. వారి ఆలోచనలు, హావభావాలు త్వరగా మారిపోతూంటూయి ఆకలి వల్ల. సరైన ఆహారం దొరక్కపోవడం వల్ల వారు ఏడవటం, అరవటం, అమ్మానాన్నల్ని చూడగానే ఏది దొరికితే దాన్ని విసిరి కొట్టడం చేస్తారు.

      పిల్లలు మారాం చేసినప్పుడు ఏం చేయాలి (How to Deal with the Tantrums in Telugu)?

      • కొన్నిసార్లు పిల్లల ఏడుపును కంట్రోల్ చేయడం తల్లిదండ్రులకు అసాధ్యం అవుతుంది. అటు తమ ఉద్యోగ జీవితాన్ని, ఇటు స్వంత జీవితాన్ని, తమ పిల్లల పెంపకాన్ని సమంగా నడుపుకోవడం కష్టం అనిపిస్తుంది. పిల్లలు పెద్దవుతుంటే వారి పేచీలు పెరుగుతూ, ఆపశక్యం కాకుండా తయారవుతాయి. అప్పుడు వారి పరిస్థితిని వారి మార్గంలోనే అర్థం చేసుకుని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఆ పసిబిడ్డకు తల్లిదండ్రుల మొదటి ప్రాధాన్యత తామే అనిపించేలా వ్యవహరించాలి.
      • వారికి నచ్చేలా సాధ్యమైనంత ప్రశాంతంగా స్పందిస్తూ, పిల్లలతో సత్సంబంధాలను పెంచుకోవాలి. మీరు కోపంగా, పెద్దగా అరవటం, కేకలు వేయడం చేస్తే పిల్లలు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారు. మిమ్మల్ని అనుకరిస్తారు.
      • నెమ్మదైన, ప్రేమపూర్వకమైన స్పర్శ ద్వారా పిల్లలను ఊరుకోబెట్టవచ్చు. వారిని నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్న ప్రదేశానికి తీసుకు వెళ్లడం, వీపు నిమరటం, చిన్నచిన్న జోలపాటలు వంటివి పాడటం చేస్తూ, పిల్లలను ఊరుకోపెట్టవచ్చు.
      • పిల్లలకు చక్కటి సృజనాత్మకమైన దినచర్యను అలవాటు చేయాలి. ఆహారం తినడానికి, నిద్రపోవడానికి, లేవడానికి రోజూ ఒకే సమయాన్ని అలవాటు చేస్తే, మారాం చేసే అలవాటు తగ్గుతుంది. పిల్లలకు తాము భద్రంగా ఉన్నామనే భావం బలపడుతుంది.
      • గడపబోయే రోజును ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల పెద్దగా ఇబ్బందులు పడకుండా సులువుగా తప్పించుకోవచ్చు. పిల్లలకు కూడా ఇది చాలా మంచి ఉపయోగంగా ఉంటుంది. వారు సరైన సమయానికి మంచిగా నిద్రపోవడానికి, తిక్క పేచీలు పెట్టకుండాను ఉపయోగపడుతుంది.
      • పిల్లల పట్ల చక్కని ప్రేమను ప్రదర్శించడం వల్ల వారికి చాలా సంతోషంగా ఉంటుంది. వారు ఏదైనా మంచి పని చేసినప్పుడు మెచ్చుకోవడం, ఆ మంచి పని మనల్ని ఎంతగా ఆనందింప చేసిందో వారికి తెలిసేలా చేయడం చాలా అవసరం. వారిని కౌగలించుకోవడంద్వారా మన ప్రేమను వ్యక్తపరచాలి.
      • పిల్లలు తిక్కగా ఉన్నప్పుడు వారు మామూలు కావడానికి సమయం ఇవ్వాలి. ఒకసారి వారు మామూలు అయ్యాక, వారి ఏడుపుకు కారణం అడిగి, అలా చేయడం ఎందుకు మంచిది కాదో వారికి వివరంగా తెలియచేయాలి.
      • మీరు ఇంటికి వచ్చాక చేయడానికి మీకు వేలాది పనులు ఉన్నా, పిల్లలు మారాం చేయడం మొదలు పెట్టకుండానే ముందుగానే వారిని చేరదీసి వారే మనకు ముఖ్యం అన్నట్లు ప్రవర్తించాలి. వారి పట్ల ప్రేమను ఆప్యాయతను చూపించాలి. వారితో కొంతసేపు మాట్లాడాలి. కనీసం ఒక అరగంట సేపు వారికి కేటాయించి, వారితో గడపాలి. వారితో గడిపే సమయం మనకు లేనట్లు పిల్లలకు అనిపించకూడదు. పిల్లలకు ముఖ్యంగా కావాల్సింది వారి పట్ల మన శ్రద్ధ.
      • వారికోసం చేసిన ఏర్పాట్లను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఆయా ఏర్పాట్లు చక్కగా ఉన్నాయా లేదా అని పరీక్షించుకోవాలి.
      • వారి ఏడుపుకు, పేచీలకు కారణాన్ని పరిశీలించి, తగిన జాగ్రత్తలు వహించడం వారి భావిజీవితానికి చాలా అవసరం.
      • పిల్లలు మారాం చేస్తే వారిని ఎలా ఊరుకోపెట్టాలో అనే విషయానికి సరైన పథకాన్ని ఏర్పరచుకోవాలి. పిల్లల ప్రవర్తనను మనం శాసించలేమని గ్రహించాలి. వారికి సరైన అవగాహన కలిగిస్తే, పేచీలు పెట్టడం, మారాం చేయడం వంటివాటిని మళ్లీ మళ్లీ చేయకుండా ఉంటారు.

      ముగింపు (Conclusion)

      పిల్లలు ఎదిగే క్రమంలో పిల్లలు పేచీలు పెట్టడం, మారాం చేయడం , తిక్క పెట్టడం అనేవి సర్వసాధారణంగా జరిగేవే. ఒక్కోసారి వాటికి అంతం లేదా అని కూడా అనిపిస్తూంటుంది. కాని అవి ఎక్కువకాలం ఉండవు. పిల్లల అవసరాల పట్ల సరైన అవగాహనను కలిగి ఉండటం, వారికి ఏమి కావాలో వీలైనంత త్వరగా తెలుసుకోవడం అత్యవసరం. అయితే అది అంత సులువుగా ఉండదు. ఉద్యోగం నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు తమకు తాము కొంత సమయాన్ని కోరుకుంటారు. అయినా కూడా పిల్లల కోసం ప్రశాంతతను అలవరచుకుని వారి కోపాన్ని, అలకను అర్థం చేసుకుని మొదటి రోజునుంచే సరైన శ్రద్ధను, ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా వారి పేచీలను మారాం చేయడాన్ని తగ్గించవచ్చు. ఒకవేళ పిల్లలు తమను, ఎదుటివారిని గాయపరచడం వంటివి చేస్తూంటే, అవసరమైతే, నిపుణుల సలహాలను కూడా తీసుకోవడం మంచిది.

      Tags

      Crying babies, baby tantrums in telugu, tips to control baby tantrums in telugu, Reasons why Babies Throw Tantrums When You Get Back From Work in English, Reasons why Babies Throw Tantrums When You Get Back From Work in Hindi, Reasons why Babies Throw Tantrums When You Get Back From Work in Tamil, Reasons why Babies Throw Tantrums When You Get Back From Work in Bengali.

      Is this helpful?

      thumbs_upYes

      thumb_downNo

      Written by

      Dhanlaxmi Rao

      Get baby's diet chart, and growth tips

      Download Mylo today!
      Download Mylo App

      RECENTLY PUBLISHED ARTICLES

      our most recent articles

      Start Exploring

      About Us
      Mylo_logo

      At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

      • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
      • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
      • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

      Open in app