Raise A Happy & Healthy Baby
Get baby's growth & weight tips
Join the Mylo Moms community
Get baby diet chart
Get Mylo App
Want to raise a happy & healthy Baby?
Women Specific Issues
13 June 2023 న నవీకరించబడింది
ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) అంటే ఏమిటి?
ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలు పెళుసుగా మారి పగుళ్లకు గురయ్యే పరిస్థితిని కలిగించే వ్యాధి. ఈ పరిస్థితి పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎముకలు కాస్త చిన్నవిగా ఇంకా సన్నగా ఉండటం వల్ల ఆడవారిలో ఈ బోలు ఎముకల వ్యాధి సంభవించడం చాలా సాధారణం.
1. ఒకటో రకం ఆస్టియోపోరోసిస్ (ఒకటో రకం బోలు ఎముకల వ్యాధి): ఇది సహజ వృద్ధాప్య ప్రక్రియలో ఒక భాగం
2. రెండోరకం ఆస్టియోపోరోసిస్ (రెండోరకం బోలు ఎముకల వ్యాధి)
ఇది ఇతర అనారోగ్యాల మూలంగా ఎదురయ్యే పరిస్థితి.
బోలు ఎముకల వ్యాధి ఉన్న స్త్రీలు ఎముకలు బలంగా ఉంచుకొనేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నంత కాలం సాధారణ జీవితాన్ని గడపవచ్చు. అలాంటి జాగ్రత్తలలో, క్రింద పడిపోకుండా నిలదొక్కుకొనే పద్ధతులను తెలుసుకోవడం, ప్రిస్క్రిప్షన్‌లో ఉన్న మందులను క్రమం తప్పక తీసుకోవడం ఇంకా ఆరోగ్యంలో ఏవైనా స్వల్ప మార్పులు గమనిస్తే, వెంటనే వైద్యునికి తెలపడం లాంటివి ఉన్నాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: కవాసాకి వ్యాధి (ధమనుల వాపు): అంటే ఏమిటి, దాని లక్షణాలు, చికిత్స
మహిళల్లో బోలు ఎముకల వ్యాధి ప్రత్యేకంగా వృద్ధాప్యంలోనే మొదలవదు, కానీ ఈ పరిస్థితి వెనుక అనేక అంతర్లీన కారణాలు ఉండవచ్చు. ఈ పరిస్థితి ఎలా కలుగుతుందో ఇంకా దాని పెరుగుదలకు సంబంధించిన కారణాలు మరియు ప్రమాద కారకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
మెనోపాజ్ మరియు బోలు ఎముకల వ్యాధి ఈ రెండింటికి అవినాభావ సంబంధముంది. ఈస్ట్రోజెన్, ఎముక సాంద్రతను సక్రమంగా నిర్వహించడానికి దోహదపడే హార్మోన్, మెనోపాజ్(ముట్లుడిగిన తర్వాత) సమయంలో వీటి ఉత్పత్తి తగ్గిపోతుంది. మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల అది ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది.
ఇది 40 ఏళ్లలోపు సంభవిస్తుంది. ఇది అండాశయాల ద్వారా తగినంత ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కానటువంటి పరిస్థితి, ఇంకా అండాలు సక్రమంగా విడుదల చేయబడవు. తక్కువ ఈస్ట్రోజెన్ స్థాయిల కారణాల వల్ల మహిళలు బోలు ఎముకల వ్యాధి బారిన పడే ఆవకాశముంది.
తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకోవడం మరియు హానికరమైన ఆహారపు అలవాట్ల వల్ల, అవి ఎముకల ఆరోగ్యానికి ఆవశ్యకమైన అనేక హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. అనోరెక్సియా నెర్వోసా మరియు బులిమియా నెర్వోసా వంటి అస్తవ్యస్తమైన ఆహారపుటలవాట్లు లేదా రుగ్మతలు ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్, దైహిక లూపస్ ఎరిథెమాటోసస్ మరియు మల్టిపుల్ స్క్లెరోసిస్ కొన్ని స్వయం ప్రతిరక్షక పరిస్థితులు. ఈ వ్యాధి ఎముకలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి ఇంకా బోలు ఎముకల వ్యాధి పెంపొందే ప్రమాదాన్ని పెంచుతాయి.
శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల అది ఎముకల సాంద్రత ఇంకా నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిశ్చల జీవనశైలి ఈ పరిస్థితికి ఒక ముఖ్యమైన కారణం.
బలమైన ఎముకలను నిర్మించడంలో కాల్షియం పాత్ర ఎంతో ప్రసిద్ధి చెందింది. కాల్షియం తక్కువుగా ఉన్న ఆహారాల వల్ల ఎముకలు పెళుసుగా మారుతాయి ఇంకా తద్వారా వచ్చే పగుళ్లను నిరోదించలేవు.
దీర్ఘకాలంగా, అతిగా మద్యపానం ఇంకా పొగతాగేవారికి బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశాన్ని ప్రేరేపిస్తుంది.
కీళ్లనొప్పులు, ఆస్తమా, లూపస్, థైరాయిడ్ వ్యాధి, స్ట్రోక్, రొమ్ము క్యాన్సర్ ఇంకా ప్రోస్టేట్ క్యాన్సర్‌ల చికిత్సలో వాడే మందులు హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. అవి హార్మోన్ల విడుదల మరియు పంపిణీకి ఆటంకం కలిగిస్తాయి. అంతేకాక, అవి కొన్నిసార్లు బోలు ఎముకల వ్యాధికి కూడా దారితీస్తాయి.
బోలు ఎముకల వ్యాధి తరచుగా గుర్తించగలిగే స్పష్టమైన లక్షణాలను కలిగి లేనందున, ఎముక విరిగిపోయే వరకు ఇది గుర్తించబడదు. అయినప్పటికీ, కింది సంకేతాల గమనిస్తే ఇంకా అవసరమైతే నిపుణుడిని సంప్రదించాలి.
1. ఒరిగివున్న భుజాలు
2. వీపుపై వంపు
3. ఎత్తు తగ్గడం (కొన్ని అంగుళాలు)
4. వెన్నునొప్పి
5. గూని వచ్చినట్లు నడుచుకోవడం
6. కుదించుకుపోయిన వెన్నెముక్క విభాగాల వల్ల శ్వాస ఆడకపోవడం
ప్రయోగశాల విశ్లేషణ, ఎక్స్-రే, DEXA ఎముక సాంద్రత తెలిపే స్కాన్, సంప్రదాయ రేడియోగ్రఫీ, CT స్కాన్లు, MRI, ఎముక స్కాన్ (సింటిగ్రఫీ) మరియు బయాప్సీ ద్వారా సాధారణంగా బోలు ఎముకల వ్యాధి యొక్క పురోగతిని నిర్ధారించడానికి ఇంకా నమోదు చేయడానికి ఉపయోగించే సాంకేతికతలు.
స్త్రీలలో బోలు ఎముకల వ్యాధి నివారణ వివిధ కారణాలపై ఆధారపడి ఉంటుంది. వీటిలో సహ-అనారోగ్యాలు, వైద్య చరిత్రలు, వ్యక్తిగత ప్రాధాన్యతలు మొదలైనవి ఉన్నాయి. వ్యాధికి చికిత్స చేయడానికి కొన్ని ఎంపికలు క్రింద ఇవ్వబడ్డాయి.
ఇందులో ధూమపానం మరియు మద్యపానం నిలిపివేయబడుతుంది. ఇంకా, రోజూ 30 నిమిషాలు, వారానికి మూడు నుండి నాలుగు సార్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎముక ఖనిజ సాంద్రత (BMD) మెరుగుపడేలా చేస్తారు. కాల్షియం ఇంకా విటమిన్ డి తగినంత తీసుకోవడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు సరైన రీతిలో ఉంచేందుకు సహాయపడుతుంది.
అలెండ్రోనేట్ (బినోస్టో, ఫోసామాక్స్), ఇబాండ్రోనేట్ (బోనివా), రాలోక్సిఫెన్ (ఎవిస్టా), రైస్‌డ్రోనేట్ (ఆక్టోనెల్, స్టెవియా) మరియు జోలెడ్రోనిక్ యాసిడ్ (రిక్లాస్ట్, జోమెటా) బోలు ఎముకల వ్యాధి చికిత్స కోసం సాధారణంగా ఉపయోగించే కొన్ని రకాల మందులు.
శస్త్రచికిత్సతో నయం చేసే చికిత్సలు కొన్ని ప్రమాదాలను కూడా కలిగి ఉంటాయి ఇంకా చికిత్సలో వాడిన ఎముక సిమెంట్ లీక్ అయ్యే ప్రమాదం, ఎల్లవేళలా కలిగే అసౌకర్యం, ఎముక సిమెంట్ వల్ల కలిగే అలెర్జీ, ఇన్ఫెక్షన్, పక్షవాతం లేదా పల్మనరీ ఎంబోలిజం వంటి వాటికి దారితీయవచ్చు. కైఫోప్లాస్టీ మరియు వెర్టెబ్రోప్లాస్టీ సాధారణంగా ఈ వ్యాధికి చేసే శస్త్రచికిత్సా విధానాలు.
పోషకాహార లోపం, ఈస్ట్రోజెన్ స్థాయిలు, మెనోపాజ్, జీవనశైలి పద్ధతులు ఇంకా సాధారణ ఆరోగ్యం వంటి అనేక కారణాల వల్ల, బోలు ఎముకల వ్యాధి ముఖ్యంగా మహిళల్లో ప్రబలంగా ఉంటుంది. అందువల్ల, మోనోపాజ్ సమయంలో, ఇంకా వయస్సు పెరుగుతున్నకొద్దీ బోలు ఎముకల వ్యాధి బారిన పడే ప్రమాదాన్ని తగ్గించడానికి, యువతులు వీలైనంత త్వరగా బోలు ఎముకల వ్యాధి నివారణ చర్యలను ప్రారంభించాలి. చికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడానికి, వ్యాధి చికిత్సకు సమాయత్తం అవడం, చికిత్స ప్రక్రియ ఇంకా ఫలితం రాబట్టడం కోసం ఒక అంతరంగిక-శాఖ బృందం అవసరం. ఖర్చులు, ప్రయోజనాలు ఇంకా జరిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత చరిత్రల మరియు ప్రాధాన్యతలను అనుసరించి చికిత్స ప్రణాళికలు నిర్ణయించబడతాయి. అందరితో అనుసంధానం చెందడం వల్ల మహిళల్లో బోలు ఎముకల వ్యాధిని పరిశోధించడం, వాటికి సంబంధిచిన కథనాలు ఇంకా పుస్తకాలు చదవడం, మైలో స్టోర్ నుండి తగిన ఉత్పత్తులను ఎంచుకొని ఉపయోగించడం మరియు వైద్యశాలలను సందర్శించడం వంటివి సమాచారంతో కూడినటువంటి నిర్ణయం తీసుకోవడంలో సహాయపడతాయి.
Yes
No
Written by
nayanamukkamala
nayanamukkamala
గర్భధారణ సమయంలో అజీర్ణానికి గల 5 కారణాలు
గర్భవతులకు బర్త్‌డే గిఫ్ట్స్: కాబోయే తల్లులకు ఉపయోగపడే 10 బహుమతులు
గర్భధారణ లేదా తల్లి పాలిచ్చే సమయంలో సరైన సైజు మరియు ఖచ్చితంగా ఫిట్ అయ్యే మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రా పొందడానికి అనుసరించాల్సిన టాప్ 5 టిప్స్
మీ చర్మాన్ని ఖచ్చితంగా బిగుతుగా మార్చే టాప్ 6 చిట్కాలు
మీ బేబీ కి వింటర్ ఫ్యాషన్ కోసం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు!
ప్రసవానంతర స్టెరిలైజేషన్: విధానం & సమస్యలు
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Rose Water | Skin - Hair | SHOP BY CONCERN | Hairfall | Dry and Damaged Hair | Hair Growth | Shop By Ingredient | Onion | Coconut | Skin - Fertility | By Concern | PCOS | Pregnancy Test Kit | Fertility For Her | Ovulation Test Kit | Fertility For Him | By Ingredient | Chamomile | Shatavari | Ashwagandha | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |