Bathing
29 August 2023 న నవీకరించబడింది
చుట్టూ పరిసరాలను గమనించడం, తమని తాము మెరుగు పరుచుకోవడం మరియు నడక లో ప్రావీణ్యం సంపాదించుకోవడంలో రోజంతా బిజీగా గడిపిన తర్వాత మీ శిశువు ఆనందించే సమయం ఏదైనా ఉంది అంటే అది స్నానం చేసే సమయమే. రాత్రిపూట స్నానం చేయించడం అనేది రాత్రి సమీపిస్తోందని పిల్లలకు తెలిపే ఒక సూక్ష్మమైన రిమైండర్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇది ఆడుకున్న తర్వాత పిల్లలను బాగా శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది.
శిశువుకు మధ్యాహ్న స్నానం చేయించడం స్నానం చేసే సమయాన్ని ఇంద్రియాలను ప్రేరేపించే అనుభవంగా మార్చవచ్చు మరియు పిల్లవాడు బిజీగా ఉన్న సమయంలో సరదాగా గడపడం కోసం స్నానం చేయించవచ్చు. పిల్లల ఆనందానికి కొత్త కోణాన్ని అందించడానికి ఇది ఒక పద్ధతి, మరియు వినోదం. నీటితో ఆటలాడడం కూడా ఫన్ గా మార్చేయండి.
తల్లిదండ్రులు తమ పిల్లలకు చక్కటి చలన నియంత్రణ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నప్పుడు బాత్ టబ్ ని ప్లే ఏరియాగా మార్చేయచ్చు. ఈ స్నాన సమయం తల్లిదండ్రులు మరియు పిల్లలు నాణ్యమైన సమయాన్ని ఒంటరిగా గడపడానికి, వారి మధ్య అనుబంధం ఏర్పరుచుకునేందుకు మరియు ఆనందించడానికి అనువైన సమయం. పిల్లలు తమ కుటుంబంతో గడిపే సమయంలో 10 నిమిషాల పాటు ఈ కార్యకలాపాలను ఆడితే, వేసవి అంతా సరదాగా గడపవచ్చు!
బాత్ టబ్ లో ఐస్ క్యూబ్స్ వేసి వాటిని పట్టుకోమని మీ పిల్లలను ఎంకరేజ్ చేయవచ్చు. అయితే పిల్లలు వాటిని పొరపాటున తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లితండ్రులదే. బాత్‌టబ్ లో పేర్చబడిన సన్నని ఐస్ క్యూబ్స్ కరిగిపోయే ముందు వాటిని కనుగొనడం, పట్టుకోవడం మరియు వాటిని అనుసరించడం చాలా సరదాగా ఉంటుంది. లేదంటే, పిల్లలకి ఇష్టమైన బేబీ బాత్ టాయ్‌లలో ఒకదాన్ని చిన్న బకెట్ నీటిలో వేయవచ్చు. అలాగే, పిల్లలకు చాలా చల్లగా ఉండకుండా చూసుకోవడానికి తల్లిదండ్రులు నీటి ఉష్ణోగ్రతను పర్యవేక్షిస్తూ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు స్నాన సమయంలో వారి తల్లిదండ్రులతో స్నానం చేయడాన్ని ఇష్టపడవచ్చు. తల్లిదండ్రులు స్విమ్‌సూట్‌లను ధరించవచ్చు. స్నాన సమయంలో కలిగే శరీర స్పర్శ తల్లితండ్రులను పిల్లలకు మరింత దగ్గర చేస్తుంది.
పడవ నడిపినట్లు నటించండి. 'పడవ'లో, అనగా బాత్‌టబ్‌లో చేతులను ఆడించడం మరియు పడవను నడిపే యాక్షన్ ను చేతులతో చెయ్యండి . "లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా " అని బాత్‌టబ్‌లో పాటలు పాడండి. "ఇదిగో చల్లు" అని ఒకరిమీద ఒకరు నీటిని చిలకరించి ఆనందం పొందండి. పద్యాలను మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా పదబంధాలు మరియు ప్రవర్తనలకు అలవాటుపడటానికి పిల్లలకి సహాయపడండి.
గిన్నెలు శుభ్రం చెయ్యడం కోసం ఉపయోగించే స్పాంజ్ లను బేబీ స్నానం చేసే క్యాప్‌లో ఉంచండి. పిల్లవాడు బాత్‌టబ్‌లో వీటితో ఆడుకుంటూ ఆనందిస్తాడు. తల్లిదండ్రులు స్పాంజ్ యొక్క రెండు అంచులను కత్తెరతో తీసివేయవచ్చు. అప్పుడు అది యాచ్ లాగా ఉంటుంది. స్పాంజ్ మధ్యలో ఆకారాన్ని కత్తిరించడం మరియు లాలీ పాప్ లోని బార్‌ను పోల్‌గా అటాచ్ చేయడం మరొక పద్ధతి. స్ట్రాతో ఓడలను ఊదడానికి ప్రయత్నించండి; పిల్లవాడు తన నోటిని స్ట్రా చుట్టూ చుట్టి, ఊదడానికి ప్రయత్నిస్తాడు. దీనివలన పిల్లలలో మాట్లాడడానికి అవసరమైన కండరాలు వృద్ధి చెందుతాయి.
ప్లాస్టిక్ బేబీ బాత్ బొమ్మలు ఖరీదైనవి. ఎందుకంటే పిల్లలు ఏడు రోజుల తర్వాత వాటితో విసుగు చెందుతారు కాబట్టి. ఓ వారం తరువాత వాటితో ఆదుకోవడానికి అంత ఆసక్తి చూపరు. కానీ ఒక ఫాబ్రిక్ స్టోర్ నుండి ఫోమ్ పేపర్ల బండిల్ తీసుకువస్తే, వాటితో వారు చాలా వినోదభరితమైన బొమ్మలను తయారు చేయవచ్చు. ఈ ఫోమ్ పేపర్‌లు తడిగా ఉన్నప్పుడు గోడలకు అతుక్కుంటాయి. దానితో వారు ఆటలు ఆడుకుంటారు.
ఒక టైం టేబుల్ ను రూపొందించడానికి, వివిధ రంగుల కాగితాల నుండి వృత్తాలు మరియు దీర్ఘచతురస్రాలను కత్తిరించండి మరియు వాటిని బాత్‌టబ్‌కు ఎదురుగా అతికించండి. అలాగే, వివిధ షేడ్స్ ఉన్న ఐదు కాగితాల మధ్యలో ఒకే నమూనాను కత్తిరించడం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలు రంగులను పోల్చుకునేలా చేయవచ్చు. అంతే కాకుండా, పిల్లలు తమ బాత్ టబ్ లో బుడగలతో ఆదుకునే విధంగా ఫోమ్ పేపర్లను కూడా పెట్టవచ్చు.
'ఇన్సీ విన్సీ స్పైడర్' పాట ఏదైనా బేబీ బాత్ బొమ్మ కోసం ఉపయోగించవచ్చు. "ఇన్సీ విన్సీ స్పైడర్ వెంట్ అప్ ది వాటర్ స్పౌట్ " అని పాడేటప్పుడు బొమ్మను స్నానపు తొట్టి అంచు వరకు తీసుకెళ్లి ఓ చోట నిలిచేలా చేయండి. ఆ తరువాత మీ బేబీని బొమ్మపై పై నుండి నీరు పోయమని చెప్పండి. అప్పుడు అది తిరిగి బాత్‌టబ్‌లోకి జారిపోతుంది. 'హంప్టీ డంప్టీ' కూడా ఈ యాక్టివిటీతో బాగా సూట్ అవుతుంది .
మీకు ఇది కూడా నచ్చుతుంది: శిశువులలో పొడి చర్మం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి?
శిశువులు మరియు చిన్నపిల్లలకు స్నానం చేసే సమయం ఉత్తమ సమయం. బొమ్మలు, బుడగలు మరియు ఇతర వస్తువులతో నిండిన వండర్‌ల్యాండ్ లో ఆడుకునేటప్పుడు వారు వారి తల్లిదండ్రుల దృష్టిని పూర్తిగా కలిగి ఉంటారు. బేబీ బాత్‌ను సరదాగా చేయడానికి ఈ ఆలోచనలను ఉపయోగించడం ద్వారా బాత్‌టబ్ పనులు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోతాయి. అయితే, శిశువు నీటికి దగ్గరగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ వారి భద్రతను మీ దృష్టిలో పెట్టుకోండి!
Baby bathing time, make your baby bath time fun in telugu, baby bathing tips in telugu, 5 Ways to Make Baby Bath Time Fun & Enjoyable for the Little One in English, 5 Ways to Make Baby Bath Time Fun & Enjoyable for the Little One in Hindi, 5 Ways to Make Baby Bath Time Fun & Enjoyable for the Little One in Bengali, 5 Ways to Make Baby Bath Time Fun & Enjoyable for the Little One in Tamil
Yes
No
Written by
nayanamukkamala
nayanamukkamala
మీ శిశువు కోసం డిస్పోజబుల్ డైపర్ ప్యాంట్లను ఎన్నుకునేటపుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు (Things to Remember While Choosing Disposable Diaper Pants for Your Baby in Telugu)
రొమ్ము పాలిచ్చే సమయంలో బరువు తగ్గుదల– వాస్తవాలు తెలుసుకోండి (Weight Loss During Breastfeeding – Know the Facts in Telugu)
బిడ్డలకు బట్టలు ఎంచుకొనే ముందు గుర్తుంచుకోవలసిన అంశాలు (Points To Remember While Selecting Baby Clothes in Telugu)
లోపలి తోడ భాగంలో పగుళ్లు: కారణాలు, లక్షణాలు, చికిత్స | Inner Thigh Chafing: Causes, Symptoms & Treatment in Telugu
అబద్ధపు ప్రెగ్నెన్సీ(ఫాల్స్ ప్రెగ్నెన్సీ) అంటే ఏమిటి? అబద్ధపు ప్రెగ్నెన్సీకి కారణాలు & లక్షణాలు ఏమిటి (What Are the Causes & Symptoms of A False Pregnancy in Telugu)?
అనారోగ్య సిరలు అంటే ఏమిటి? మీ ప్రెగ్నెన్సీ సమయంలో వాటిని ఎలా నివారించాలి (What are varicose veins, and how to prevent them during your pregnancy in Telugu)?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Ashwagandha | Myo-inositol | Skin - Pregnancy & New Mom | By Concern | Stretch Marks Cream | Maternity Wear | Lactation | Maternity Gear | Shop By Ingredient | Dhanwantaram | Shea Butter | Skin - Daily Wellness | By Concern | Digestive Health | Immunity | By Ingredient | Saffron | Wheatgrass | Skin - Weight | By Concern | Cloth Diaper | Stretch Marks Kit | Stroller |